← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్థపంచకము arthapaṃcakamu

Original — తెలుగు
  1. “శ్లో||. జ్ఞేయం ప్రాప్తస్య రామస్య రూపం ప్రాప్తస్త దేఇవచ |

ప్రాప్తుపాయం ఫలం చైవ తథా ప్రాప్తి విరోధిచ |

అర్థపంచకమే తత్తు సంక్షేపేణ సదామితే |

రామస్యనామరూపేచ లీలా ధామ పరాత్పరం |

ఏ తచ్చ తుష్టయం నిత్యం సచ్చిదానంద విగ్రహం ||” (సుదర్శన సంహితాయాం)

(1.) ప్రాప్యము - పొంద తగినది - శ్రీరాముని స్వరూపము.

(2.) పొందవలసిన ఉపాసకుని నియమాదులు.

(3.) ప్రాప్త్యుపాయము

(4.) ప్రాప్తించెడు ఫలము

(5.) ప్రాప్తికి విందాధము. ఇది అర్థపంచకము - శ్రీరాముని స్వస్వరూపము నాలుగు విధములు - శ్రీరామనామ, రూప, లీలా ధామములు ప్రాప్యము - పొందతగినది - శ్రీరాముని పరబ్రహ్మస్వరూపము - ప్రాప్తుడు - పొందవలసినవాడు జీవుడు - ప్రాప్తికి ఉపాయము - ప్రాప్తించెడు స్తలము - మోక్షము - ప్రాప్తికి విరోధి - అడ్డు - సంసారము.)

(పరబ్రహ్మ యొక్క స్వస్వరూపము, పరస్వరూపము, ఉపాయస్వరూపము, పరమ పురుషార్థస్వరూపము మోక్షస్వరూపము -, దానికి ఆటంకము పెట్టు సంసార స్వరూపము.)

  1. “ప్రాప్తస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః |

ప్రాస్త్యుపాయం, ఫలంప్రాప్తేః తథాప్రాప్తి విరోధిచ |

వదంతి సకాలా వేదాః సేతిహాస పురాణ కాః |

మునయశ్చ మహాత్మానః వేద వేదాంత సారగాః ||“.

(ప్రాప్యము = పొందతగినది - పరబ్రహ్మరూపము, పొందుటకు తగినవాడు, జీవుడు, బ్రహ్మమును పొందుటకు ఉపాయము, ప్రహ్మ ప్రాప్తివలన కలుగు ఫలము - మోక్షము, బ్రహ్మమును పొందుటలో కలుగు ఆటంకములు. ఈ అయిదు తెలియవలసిన విషయములు అని వేదములు, ఇతిహాసములు, పురాణములు, మునులు, మహాత్ములు, వేదములను ఉపనిషత్తులను సాంతముగా తెలిసినవారు చెప్పుచున్నారు.)

Transliteration
  1. “ślō||. jñēyaṃ prāptasya rāmasya rūpaṃ prāptasta dēivaca |

prāptupāyaṃ phalaṃ caiva tathā prāpti virōdhica |

arthapaṃcakamē tattu saṃkṣēpēṇa sadāmitē |

rāmasyanāmarūpēca līlā dhāma parātparaṃ |

ē tacca tuṣṭayaṃ nityaṃ saccidānaṃda vigrahaṃ ||” (sudarśana saṃhitāyāṃ)

(1.) prāpyamu - poṃda taginadi - śrīrāmuni svarūpamu.

(2.) poṃdavalasina upāsakuni niyamādulu.

(3.) prāptyupāyamu

(4.) prāptiṃceḍu phalamu

(5.) prāptiki viṃdādhamu. idi arthapaṃcakamu - śrīrāmuni svasvarūpamu nālugu vidhamulu - śrīrāmanāma, rūpa, līlā dhāmamulu prāpyamu - poṃdataginadi - śrīrāmuni parabrahmasvarūpamu - prāptuḍu - poṃdavalasinavāḍu jīvuḍu - prāptiki upāyamu - prāptiṃceḍu stalamu - mōkṣamu - prāptiki virōdhi - aḍḍu - saṃsāramu.)

(parabrahma yokka svasvarūpamu, parasvarūpamu, upāyasvarūpamu, parama puruṣārthasvarūpamu mōkṣasvarūpamu -, dāniki āṭaṃkamu peṭṭu saṃsāra svarūpamu.)

  1. “prāptasya brahmaṇō rūpaṃ prāptuśca pratyagātmanaḥ |

prāstyupāyaṃ, phalaṃprāptēḥ tathāprāpti virōdhica |

vadaṃti sakālā vēdāḥ sētihāsa purāṇa kāḥ |

munayaśca mahātmānaḥ vēda vēdāṃta sāragāḥ ||“.

(prāpyamu = poṃdataginadi - parabrahmarūpamu, poṃduṭaku taginavāḍu, jīvuḍu, brahmamunu poṃduṭaku upāyamu, prahma prāptivalana kalugu phalamu - mōkṣamu, brahmamunu poṃduṭalō kalugu āṭaṃkamulu. ī ayidu teliyavalasina viṣayamulu ani vēdamulu, itihāsamulu, purāṇamulu, munulu, mahātmulu, vēdamulanu upaniṣattulanu sāṃtamugā telisinavāru ceppucunnāru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.