అర్థములను కోరువాడు, కోరికలను కోరువాడు, ప్రయోజనము నాశించువాడు.)
ధనకాయః (శ్రీశంకరః)
(సంపదను, ధనమును కోరువాడు.)
అప్రా ప్తై శ్వైర్యతయా ఐశ్వర్య కామః. (ఐశ్వర్యములేనివాడగుటచేత ఐశ్వర్యమును కోరినవాడు.)
ఒకప్రయోజనము నాశించి భగవంతుని ఆరాధించువాడు. శ్రీమద్భగద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పిన నాలుగు విధముల భక్తులలో నొకడు: -
“చతుర్విదా భజంతేమాం జనాః సుకృతినోర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ || ” (7 - 16)”
పరత్ర దేహభోగార్థమర్థార్థీసాధనేప్సుకః |
విభీషణశ్చ సుగ్రీవో యధాముత్ర ధ్రువో య నా |
సకామాశ్చ త్రయోప్యేతే భగవ్ద్భజనేనచ తరంతి మాయాం - - || “. (గీతాభావప్రకాశము - 7 - 100, 101)
(పరలోకమున గాని, ఈ లోకమునగాని భోగములను అర్థించువాడు – భగవంతుని వలన కోరి భగవంతుని భజించువాడు అర్థార్థీ. సుగ్రీవుడు, విభీషణుడు ఈ లోకములకు సంబంధించిన కోరికలను కోరినవారు. సుగ్రీవుడు వాలివధ, వానరరాజ్యపట్టాభిషేకము కోరినవాడు. విభీషణుడు రావణునుండు రక్షించమని కోరినవాడు - శరణువేడినవాడు. ధృవుడు పరలోకఫలమును కోరినవాడు. ఈ ముగ్గురు అర్థార్థులే - అనగా, ఏదో ఒక కోరికతో భగవంతుని కొలిచినవారు. వారు కోరికగలవారైనను భగవద్భక్తులగుటవలన మాయను తరించిరి.)
(కోరికలను కోరువారికి కల్ప వృక్షమువలె కోరికలనిచ్చువాడు.)
arthamulanu kōruvāḍu, kōrikalanu kōruvāḍu, prayōjanamu nāśiṃcuvāḍu.)
dhanakāyaḥ (śrīśaṃkaraḥ)
(saṃpadanu, dhanamunu kōruvāḍu.)
aprā ptai śvairyatayā aiśvarya kāmaḥ. (aiśvaryamulēnivāḍaguṭacēta aiśvaryamunu kōrinavāḍu.)
okaprayōjanamu nāśiṃci bhagavaṃtuni ārādhiṃcuvāḍu. śrīmadbhagadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppina nālugu vidhamula bhaktulalō nokaḍu: -
“caturvidā bhajaṃtēmāṃ janāḥ sukṛtinōrjuna |
ārtō jijñāsurarthārthī jñānīca bharatarṣabha || ” (7 - 16)”
paratra dēhabhōgārthamarthārthīsādhanēpsukaḥ |
vibhīṣaṇaśca sugrīvō yadhāmutra dhruvō ya nā |
sakāmāśca trayōpyētē bhagavdbhajanēnaca taraṃti māyāṃ - - || “. (gītābhāvaprakāśamu - 7 - 100, 101)
(paralōkamuna gāni, ī lōkamunagāni bhōgamulanu arthiṃcuvāḍu – bhagavaṃtuni valana kōri bhagavaṃtuni bhajiṃcuvāḍu arthārthī. sugrīvuḍu, vibhīṣaṇuḍu ī lōkamulaku saṃbaṃdhiṃcina kōrikalanu kōrinavāru. sugrīvuḍu vālivadha, vānararājyapaṭṭābhiṣēkamu kōrinavāḍu. vibhīṣaṇuḍu rāvaṇunuṃḍu rakṣiṃcamani kōrinavāḍu - śaraṇuvēḍinavāḍu. dhṛvuḍu paralōkaphalamunu kōrinavāḍu. ī mugguru arthārthulē - anagā, ēdō oka kōrikatō bhagavaṃtuni kolicinavāru. vāru kōrikagalavārainanu bhagavadbhaktulaguṭavalana māyanu tariṃciri.)
(kōrikalanu kōruvāriki kalpa vṛkṣamuvale kōrikalaniccuvāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.