(సూక్ష్మారుంధతీ నక్షత్రమును - చిన్నదైన అరుంధతీ నక్షత్రమును - చూపుటకు ఉద్యుక్తుడైనవాడు మొట్టమొదటే సూక్ష్మమైన అరుంధతీ నక్షత్రమును చూపుట శక్యముకాదని, దాని సమీపముననున్న స్థూలనక్షత్రమును చూపి ఇదియే అరుంధతీ నక్షత్రము అని చూపును - ఆట్లు చెప్పగా వినినవాడికి ఆ స్థూలనక్షత్రమే అరుంధతీ నక్షత్రమని దృఢమైన నమ్మకము కలిగినతర్వాత దాని దగ్గరనున్న ఆ సూక్ష్మనక్షత్రమైన అసలు అరుంధతీ నక్షత్రమును చూపించి ఇదియే యదార్థముగా అరుంధతీ నక్షత్రమని చూపించును - ఇదియే అరింధతీన్యాయము, లేక, స్థూలారుంధతీన్యాయము.)
అరుంధతియొక్క దర్శనమువంటి దర్శనముకలదానిని చూపించున్యాయము. ముందు స్థూలమగు పదార్థమును చూపించి దాని మూలమున సూక్ష్మమగు పదార్థమును చూపించుట. అరుంధతీ నక్షత్రము చిన్నదగుటచేత దానిని చూపించుటకు దాని ప్రక్కనున్న పెద్ద నక్షత్రమును చూపించి మొదట అదియే అరుంధతీ నక్షత్రమని గ్రహింపచేసి, తర్వాత అది అరుంధతీ నక్షత్రముకాదు అని చెప్పి ఆ పెద్దనక్షత్రముపక్కనున్న చిన్ననక్షత్రమును చూపి అరుంధతీ నక్షత్రమని తెలియచేయుట.)
ఆకాశాదేరన్నమయ శబ్దిత స్తూల శరీరపర్యంతస్య బ్రహ్మైవాత్మా ఉపాదానం చేత్తుక్త్వా స ఆత్మా క ఇత్యపేక్షా యాం ఆనందమయ ఏవ స ఆత్మేతి దర్శయితుం స్తూలారుంధతీ న్యాయేన స్తూలదేహాంతర్వర్తినం ప్రాణమయాత్మత్వేన దర్శయతి.
(ఆకాశము మొదలు అన్నమయమని చెప్పబడిన స్థూలశరీరము వఱకు గల అన్నింటికీ బ్రహ్మమే ఉపాదానము కూడా అని చెప్పి, ఆ ఆత్మ ఎవరు ఎక్కడ ఉన్నాడు అనగా ఆనందమయుడే ఆ ఆత్మ అని చెప్పుటకు స్థూలారుంధతీన్యాయము ననుకరించి స్థూలదేహములోపలనున్న ప్రాణమయుడే అని బోధించెదరు.)
అరుంధతీ నక్షత్రమువలె సూక్ష్మముగానుండి సాధారణముగా కానరాని - తెలియరాని వస్తువులను తెలియచేయుటకు ఉపయోగించు న్యాయము - సాధారణమైన స్థూలపదార్థమును ముందుచూపి దాని ద్వారా సూక్ష్మపదార్థమును తెలియచేయుట.
“న పస్యతి న నక్షత్రాం యస్తు దేవీ మరుంధతీం |
ధృవమాకాశగంగాం చ తం వదంతి గతా యుషం ||“.
(ఆకాశగంగను – పాలసముద్రమును (Milky Way), అరుంధతీనక్షత్రమును ఎవడు చూడలేడో అట్టివాని ఆయుర్దాయము చెల్లినట్లేయని పెద్దలు చెప్పుదురు.)
(sūkṣmāruṃdhatī nakṣatramunu - cinnadaina aruṃdhatī nakṣatramunu - cūpuṭaku udyuktuḍainavāḍu moṭṭamodaṭē sūkṣmamaina aruṃdhatī nakṣatramunu cūpuṭa śakyamukādani, dāni samīpamunanunna sthūlanakṣatramunu cūpi idiyē aruṃdhatī nakṣatramu ani cūpunu - āṭlu ceppagā vininavāḍiki ā sthūlanakṣatramē aruṃdhatī nakṣatramani dṛḍhamaina nammakamu kaliginatarvāta dāni daggaranunna ā sūkṣmanakṣatramaina asalu aruṃdhatī nakṣatramunu cūpiṃci idiyē yadārthamugā aruṃdhatī nakṣatramani cūpiṃcunu - idiyē ariṃdhatīnyāyamu, lēka, sthūlāruṃdhatīnyāyamu.)
aruṃdhatiyokka darśanamuvaṃṭi darśanamukaladānini cūpiṃcunyāyamu. muṃdu sthūlamagu padārthamunu cūpiṃci dāni mūlamuna sūkṣmamagu padārthamunu cūpiṃcuṭa. aruṃdhatī nakṣatramu cinnadaguṭacēta dānini cūpiṃcuṭaku dāni prakkanunna pedda nakṣatramunu cūpiṃci modaṭa adiyē aruṃdhatī nakṣatramani grahiṃpacēsi, tarvāta adi aruṃdhatī nakṣatramukādu ani ceppi ā peddanakṣatramupakkanunna cinnanakṣatramunu cūpi aruṃdhatī nakṣatramani teliyacēyuṭa.)
ākāśādērannamaya śabdita stūla śarīraparyaṃtasya brahmaivātmā upādānaṃ cēttuktvā sa ātmā ka ityapēkṣā yāṃ ānaṃdamaya ēva sa ātmēti darśayituṃ stūlāruṃdhatī nyāyēna stūladēhāṃtarvartinaṃ prāṇamayātmatvēna darśayati.
(ākāśamu modalu annamayamani ceppabaḍina sthūlaśarīramu vaṟaku gala anniṃṭikī brahmamē upādānamu kūḍā ani ceppi, ā ātma evaru ekkaḍa unnāḍu anagā ānaṃdamayuḍē ā ātma ani ceppuṭaku sthūlāruṃdhatīnyāyamu nanukariṃci sthūladēhamulōpalanunna prāṇamayuḍē ani bōdhiṃcedaru.)
aruṃdhatī nakṣatramuvale sūkṣmamugānuṃḍi sādhāraṇamugā kānarāni - teliyarāni vastuvulanu teliyacēyuṭaku upayōgiṃcu nyāyamu - sādhāraṇamaina sthūlapadārthamunu muṃducūpi dāni dvārā sūkṣmapadārthamunu teliyacēyuṭa.
“na pasyati na nakṣatrāṃ yastu dēvī maruṃdhatīṃ |
dhṛvamākāśagaṃgāṃ ca taṃ vadaṃti gatā yuṣaṃ ||“.
(ākāśagaṃganu – pālasamudramunu (Milky Way), aruṃdhatīnakṣatramunu evaḍu cūḍalēḍō aṭṭivāni āyurdāyamu cellinaṭlēyani peddalu ceppuduru.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.