ఆసక్తి రహితః, అనాసక్తః. (దేనియందును ఆసక్తి లేనివాడు, అపేక్ష లేనివాడు, తగులము లేనివాడు).
సంగ వర్జితః (సంగము - ఫలాపేక్ష - లేనివాడు).
ఫలాసక్తి శూన్యః; ఫలాసక్తి వర్జితః; ఫలకామనా రహితః; ఫలసంగ రహితః; ఫలాభిలాష శూన్యః.
(కర్మఫలమందు ఆసక్తి లేనివాడు; కర్మ ఫలమందు అభిలాష లేనివాడు; ఫలముకోరనివాడు).
(సక్తి, ఆసక్తి అనగా సంగనిమిత్తమైన విషయములందు ప్రీతి, అదిలేకుండుట అసక్తి, అదిలేనివాడు అసక్తుడు).
విషయేషు అనాసక్త చిత్తః. (విషయములందు ఆసక్తిలేని మనస్సు గలవాడు).
“ఫలాదిషు అసక్త బుద్ధిః” (శ్రీరామానుజః)
(కర్మఫలములందు ఆసక్తి లేని మనస్సు కలవాడు).
(ఇంద్రియములను విషయముల మీదికి పోనీయక మనసుచేత తన స్వాధీనములో ఉంచుకొని, కర్మలవలన కలుగు ఫలమును ఆసించక కర్మలను చేయువాడు - అసక్తుడు).
(విధిగా చేయవలసినవి అని శ్రుతిలో చెప్పబడినకర్మలను వాటియందు ఫలాసక్తిలేక చేయవలెను - కర్మ ఫలాసక్తి లేక కర్మలు చేసినవాడు పరమపదమును - మోక్షమును - పొందును. ఫలాపేక్షరహితుడై భగవదారాధన చేసిన చిత్తశుద్ధికలిగి, అందువలన బ్రహ్మ జ్ఞానము కలిగి, బ్రహ్మజ్ఞానముద్వారా (“జ్ఞానాదేవతు కైవల్యం”అని చెప్పబడియుండుటవలన) మోక్షమును పొందును).
(తామే కర్తలమని అభ్నివేసముగల అజ్ఞానులు కర్మ కర్మఫలమందాసక్తి గలవారై తమ తమ కర్మలను ఎట్లు చేయుచున్నారో - కర్మఫలమందాసక్తిగలవారగుటవలన వాటిని ఎంత శ్రద్ధతో చేయుచున్నారో ఆ ప్రకారముగానే లోకసంగ్రహము - లోకులకు క్షేమము - కలుగచేయ నుద్దేశించిన ఆత్మజ్ఞానులు, వారుచేయు కర్మలవలన కలుగు ఫలమందాసక్తిలేనివారై కర్మలను తామే చేయుచున్నామను అభినివేశము లేనివారై కర్మలను చేయవలెను. అట్లు చేసినయడల ఫలాపేక్షలేని కర్మలు చేయుటవలన చిత్తశుద్ధికలిగినవారు క్షతిని పొందరు - తనే కర్త అని కర్మచేయుట, కర్మఫలమందాసక్తి గలిగియుండుట - బంధమునకు కారణము - అందుచేత ఈ రెండును విడిచి కర్మ చేయుటచే అట్టి కర్మలచేత బంధము కలుగదు, వాటి ఫలము ననుభవించవలసిన అవసరము లేదు).
(అమోఘ లీలలుగల భగవంతుడు ఈ ప్రపంచమును సృష్టించును, సంహరించును, కాని దానిలో మునగడు - అనగా, దానియందు ఆసక్తి కలిగి దానిని అంటి ఉండడు - భూతములన్నింటిలోను అంతరాత్మగానుండి, దూరముగానుండి ఇంద్రియములచేత - తటస్థుడుగానుండి - పని చేయించు చుండును).
(భగవంతుడు సృష్టి స్థితి లయములు చేయుచు, ప్రతివస్తువులోను అంతరాత్మగానుండి, ఇంద్రియములచేత వాటి వాటి పనులు చేయించుచు ఉన్నప్పటికీ ఆ పనులందు ఫలాభిలాష లేకయుండుటవలన అసక్తుడు).
(ఇవ్విధంబున సంగవిరహితుండైన కంసారి సంసారి కైవడి విహరింప నజ్ఞాన విలోకులైన లోకులు లోక సామాన్యమనుష్యుండని తలంతురు) - (చూడుము - అసంగుడు).
(నేను ప్రకృతిలో కలిసియుండి ఈ భూతములన్నింటిని మరల మరల ఆ ప్రకృతినుండి పైని విరజిమ్ముచున్నాను - పుట్టించుచున్నాను - ఉదాసీనుడూ - తటస్తుడు - వలెనున్న నన్ను ఈ కర్మలు బంధించవు - ఆ కర్మలయందు నాకు ఆసక్తిలేదు కనుక).
āsakti rahitaḥ, anāsaktaḥ. (dēniyaṃdunu āsakti lēnivāḍu, apēkṣa lēnivāḍu, tagulamu lēnivāḍu).
saṃga varjitaḥ (saṃgamu - phalāpēkṣa - lēnivāḍu).
phalāsakti śūnyaḥ; phalāsakti varjitaḥ; phalakāmanā rahitaḥ; phalasaṃga rahitaḥ; phalābhilāṣa śūnyaḥ.
(karmaphalamaṃdu āsakti lēnivāḍu; karma phalamaṃdu abhilāṣa lēnivāḍu; phalamukōranivāḍu).
(sakti, āsakti anagā saṃganimittamaina viṣayamulaṃdu prīti, adilēkuṃḍuṭa asakti, adilēnivāḍu asaktuḍu).
viṣayēṣu anāsakta cittaḥ. (viṣayamulaṃdu āsaktilēni manassu galavāḍu).
“phalādiṣu asakta buddhiḥ” (śrīrāmānujaḥ)
(karmaphalamulaṃdu āsakti lēni manassu kalavāḍu).
(iṃdriyamulanu viṣayamula mīdiki pōnīyaka manasucēta tana svādhīnamulō uṃcukoni, karmalavalana kalugu phalamunu āsiṃcaka karmalanu cēyuvāḍu - asaktuḍu).
(vidhigā cēyavalasinavi ani śrutilō ceppabaḍinakarmalanu vāṭiyaṃdu phalāsaktilēka cēyavalenu - karma phalāsakti lēka karmalu cēsinavāḍu paramapadamunu - mōkṣamunu - poṃdunu. phalāpēkṣarahituḍai bhagavadārādhana cēsina cittaśuddhikaligi, aṃduvalana brahma jñānamu kaligi, brahmajñānamudvārā (“jñānādēvatu kaivalyaṃ”ani ceppabaḍiyuṃḍuṭavalana) mōkṣamunu poṃdunu).
(tāmē kartalamani abhnivēsamugala ajñānulu karma karmaphalamaṃdāsakti galavārai tama tama karmalanu eṭlu cēyucunnārō - karmaphalamaṃdāsaktigalavāraguṭavalana vāṭini eṃta śraddhatō cēyucunnārō ā prakāramugānē lōkasaṃgrahamu - lōkulaku kṣēmamu - kalugacēya nuddēśiṃcina ātmajñānulu, vārucēyu karmalavalana kalugu phalamaṃdāsaktilēnivārai karmalanu tāmē cēyucunnāmanu abhinivēśamu lēnivārai karmalanu cēyavalenu. aṭlu cēsinayaḍala phalāpēkṣalēni karmalu cēyuṭavalana cittaśuddhikaliginavāru kṣatini poṃdaru - tanē karta ani karmacēyuṭa, karmaphalamaṃdāsakti galigiyuṃḍuṭa - baṃdhamunaku kāraṇamu - aṃducēta ī reṃḍunu viḍici karma cēyuṭacē aṭṭi karmalacēta baṃdhamu kalugadu, vāṭi phalamu nanubhaviṃcavalasina avasaramu lēdu).
(amōgha līlalugala bhagavaṃtuḍu ī prapaṃcamunu sṛṣṭiṃcunu, saṃhariṃcunu, kāni dānilō munagaḍu - anagā, dāniyaṃdu āsakti kaligi dānini aṃṭi uṃḍaḍu - bhūtamulanniṃṭilōnu aṃtarātmagānuṃḍi, dūramugānuṃḍi iṃdriyamulacēta - taṭasthuḍugānuṃḍi - pani cēyiṃcu cuṃḍunu).
(bhagavaṃtuḍu sṛṣṭi sthiti layamulu cēyucu, prativastuvulōnu aṃtarātmagānuṃḍi, iṃdriyamulacēta vāṭi vāṭi panulu cēyiṃcucu unnappaṭikī ā panulaṃdu phalābhilāṣa lēkayuṃḍuṭavalana asaktuḍu).
(ivvidhaṃbuna saṃgavirahituṃḍaina kaṃsāri saṃsāri kaivaḍi vihariṃpa najñāna vilōkulaina lōkulu lōka sāmānyamanuṣyuṃḍani talaṃturu) - (cūḍumu - asaṃguḍu).
(nēnu prakṛtilō kalisiyuṃḍi ī bhūtamulanniṃṭini marala marala ā prakṛtinuṃḍi paini virajimmucunnānu - puṭṭiṃcucunnānu - udāsīnuḍū - taṭastuḍu - valenunna nannu ī karmalu baṃdhiṃcavu - ā karmalayaṃdu nāku āsaktilēdu kanuka).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.