← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసంభూతిః asaṃbhūtiḥ

Original — తెలుగు
  1. “సంభవనం సంభూతిః, సా యస్య కార్యస్య సా సంభూతిః, తస్యా అన్యా అసంభూతిః, ప్రకృతిః, కారణం అవిద్యా, అవ్యాకృతాఖ్యా, కామకర్మ బీజ భూతా అదర్శనాత్మికా” (శ్రీశంకరః)

(సంభూతి యనగా సంభవము, పుట్టుట, దానియొక్క నివృత్తి, అదికానిది అసంభూతి, - ప్రకృతి. ఒక వస్తువు యొక్క పుట్టుక సంభవమనియు - సంభూతియనియు చెప్పబడును, దానికంటె వేఱగునది ప్రకృతి. దానికి పుట్టుకలేదు =సంభవము లేదు). అందుచేత అది అసంభూతియని చెప్పబడును, ఇదియే అవిద్య, అవ్యాకృతము. కామకర్మలకు బీజమగుటవలన ప్రకృతియని చెప్పబడుచున్నది.

  1. అసంభూతి అనగా మాయాతత్వము - కుమ్మరివాడు కుండలు మొదలగువాటినిచేయుటకు మట్టి (material) ఉపయోగపడునట్లు పరబ్రహ్మ ఈ మాయ లేక ప్రకృతిలో తానుండి దానిని ఉపయోగించుకొని సృష్టిలోని వస్తువులను అన్నింటినీ దానితో చేయుచున్నాడు).

  2. ప్రపంచములోని వస్తువులవలె దేనిలోనుండి అయినను పుట్టినదికాదు.

Transliteration
  1. “saṃbhavanaṃ saṃbhūtiḥ, sā yasya kāryasya sā saṃbhūtiḥ, tasyā anyā asaṃbhūtiḥ, prakṛtiḥ, kāraṇaṃ avidyā, avyākṛtākhyā, kāmakarma bīja bhūtā adarśanātmikā” (śrīśaṃkaraḥ)

(saṃbhūti yanagā saṃbhavamu, puṭṭuṭa, dāniyokka nivṛtti, adikānidi asaṃbhūti, - prakṛti. oka vastuvu yokka puṭṭuka saṃbhavamaniyu - saṃbhūtiyaniyu ceppabaḍunu, dānikaṃṭe vēṟagunadi prakṛti. dāniki puṭṭukalēdu =saṃbhavamu lēdu). aṃducēta adi asaṃbhūtiyani ceppabaḍunu, idiyē avidya, avyākṛtamu. kāmakarmalaku bījamaguṭavalana prakṛtiyani ceppabaḍucunnadi.

  1. asaṃbhūti anagā māyātatvamu - kummarivāḍu kuṃḍalu modalaguvāṭinicēyuṭaku maṭṭi (material) upayōgapaḍunaṭlu parabrahma ī māya lēka prakṛtilō tānuṃḍi dānini upayōgiṃcukoni sṛṣṭilōni vastuvulanu anniṃṭinī dānitō cēyucunnāḍu).

  2. prapaṃcamulōni vastuvulavale dēnilōnuṃḍi ayinanu puṭṭinadikādu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.