← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసంగః asaṃgaḥ

Original — తెలుగు
  1. సంగరహితః, కమలపత్ర తోయవత్ ఇత్యర్థః.

(అంటనివాడు - తామరాకు నీటిలో ఉన్నను దానిని నీరు అంటనట్లు - అత ఏవ ఉదాసీనః (అందువలననే ఉదాసీనుడు - తటస్థుడు - వలెనుండువాడు - ఏ పనిని చేయనట్లు, దేనితోను సంబంధములేనట్లు ఉండువాడు).

  1. అనాసక్తః.

(సంగమనగా దృశ్యపదార్థములందు ఆసక్తికలిగియుండుట, తగులము కలిగియుండుట. ఆసక్తి లేనివాడు తగులము లేనివాడు అనంగుడు - దేనియందును రాగములేనివాడు).

  1. ఇంద్రుయార్ధేషు ఆసక్తి రహితః, సంసారిజన సంగరహితోవా.

(ఇంద్రియార్థములందు - విషయములందు- ఆసక్తిలేనివాడు - సంసారములో ఉన్న జనులతో కలియనివాడు.

  1. ఆకాశవ దసంగః -(అకాశము అంతటను, అన్నింటిలోను వ్యాపించియున్నను దేనిని అంటకయుండునట్లు ఉండువాడు).

  2. ఉపాధి సత్వే అపి అసంగః -

(తనకు ఉపాధియైన ప్రతివస్తువునకు తను దానిలోనుండి, తను దానికి తనసత్తాస్ఫూర్తి నిచ్చినప్పటికీ దానిని అంటనివాడు).

  1. నిష్కామః(కోరికలేనివాడు).

  2. నిస్పృహః, విషయా నాసక్తః -(ఆశలేనివాడు, విషయములందాసక్తి లేనివాడు).

  3. సంబంధరహితః, నిర్లేప మిత్యర్థః.

(దేనితోను, ఏ విధమైనసంబంధము లేనివాడు, అనగా, నిర్లేపుడు అని అర్థము - ఏ వస్తువులోనున్నను, దాని గుణములు మొదలగునవి తనకు మైపూతవలె అంటనివాడు).

  1. ఆత్మనః నజాతీయేన ఆత్మనా సంబంధోనాస్తి - ఆత్మని కల్పితేన విజాతీయేన అనాత్మనా సంబంధో ఆత్మనః నాస్తి.ఆత్మా నిరవయవః తస్మాత్ స్వగతేన సంబంధో నాస్తి. ఇత్థం సజాతీయ విజాతీయ స్వగత సంబంధః ఆత్మనః నాస్తి. తస్మాత్ ఆత్మా అసంగః.

(ఆత్మకు సజాతీయ విజాతీయ స్వగతిభేదములు లేవు - ఎట్లనగా తనవలె సృష్టిస్థితిలయములు మొదలగునవి చేయుశక్తి గలిగిన మఱియొక ఆత్మలేదు. అందుచేత ఆత్మకు సజాతీయభేదములేదు - ఆత్మ వస్తువుకాని - అనాత్మ అయిన - ఇతరవస్తువులేనందున ఆత్మకు విజాతీయ సంబంధములేదు, ఆత్మ అవయవములు లేనిది. చెట్టుకు వేళ్ళు, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, కాయలు వలె తనలోనే వేఱు వేఱు భేదమున్నట్లు ఆత్మకు తనలో వేఱు భాగములులేవు, - అట్లు భాగములే ఉన్నయడల ఒకదానికి ఇంకొక దానికి భేదముండును - అట్టి భేదము స్వగతభేదము. ఆత్మకు అవయవములు లేకపోవుటచేత అట్టి స్వగతభేదములేదు. ఈ విధముగా ఆత్మకు సజాతీయ, విజాతీయ, స్వగత భేదములేదు. అందుచేత ఆత్మ అసంగుడు).

  1. “నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా |” (శ్రీమద్భగవద్గీత - 4 - 14)

“కర్మాణి విశ్వసృష్ట్యాదీన్య నహంకార మీశ్వరం |

దేహాద్యారంభకత్వేన నమాం బధ్నంతి చిద్ఘనం |

న వామ మాప్త కామస్య తృష్ణా కర్మఫలేయతః |

కర్తృత్వాభి నివేశేన తదైవ ఫల తృష్ణయా |

లింపం త్యజ్ఞాం స్తు కర్మాణి తదభావాన్నమాం హరిం ||“. (గీతాభావ ప్రకాశము - 4 - 93 to 94)

(చైతన్యఘనుడు, ఈశ్వరుడు, అహంకారము లేనివాడు అయిన నన్ను ఈ ప్రపంచసృష్టి మొదలగుకర్మలు జన్మజరామరణములు కలుగచేయునట్లుగా నన్ను బంధించవు. నేను అవాప్త కాముడను - కోరికలు తీరినవాడను, కోరవలసినది లేనివాడను. అందుచేత నేను చేయుకర్మలందు ఫలము కలుగవలెనను ఆశనాకు లేదు - నేనే ఈ కర్మచేయుచున్నాను అను అభినివేశము లేదు - కర్మ ఫలము కోరిచేయుటవలన ఆ కర్మలు అజ్ఞానులను అంటును - కాని నాకుకర్మయందు ఫలాపేక్షలేకుండుటచేత అవి నన్ను అంటవు. అందుచేత నేను అనంగుడను).

  1. యధాఖం సర్వగతమపి న సజ్జతే, యథా సవితా జలే ప్రత్రిబింబితోపి తస్మిన్ జలే న సజ్జతే, యధా అనిలః సర్వత్ర సంచలన్నపి న సజ్జతే, తథా విద్వాన్ ప్రకృతి స్థోపి అసంగేన (వైరాగ్యేణ) భిన్న సంశయస్సన్ నానాత్వాత్ - దేహాది ప్రపంచాత్ - వి నివర్తతే.

(ఆకాశము అన్నింటిలోను వ్యాపించియున్నప్పటికీ వాటిని అంటియుండనట్లు, సూర్యుడు నీటిలో ప్రతిబింబించినను ఆ నీటిని అంటనట్లు, వాయువు అంతట సంచరించు చున్నను దేనికీ అంటనట్లు విద్వాంసుడు ప్రకృతిలో ఉండినను దేనియందును ఆసక్తిలేక, వైరాగ్యము కలిగియుండి ఈ ప్రపంచములో దేనిని అంటక,ముట్టక ఉండును - అట్టివాడు అసంగుడు).

“సర్వమాత్మే దమ త్రాహం కిం వాంచామి, వ్రజామి కిం |

ఇత్యనుగ స్థితిం విద్ధి జీవన్ముక్తి తనుస్థితాం |

నాహమస్మి నచాన్యోస్మి, న చాయం నచ నేతరః |

సో (అ) సంగ ఇతి ప్రోక్తో బ్రహ్మస్మీ త్యేవ సర్వదా |

నాభినం దతి నైష్కర్మ్యం న కర్మ స్వను సజ్జతే |

సునమోయః పరిత్యాగీ సోహి (అ) సంసక్తో ఇతి స్మృతః |

సర్వకర్మ ఫలాదీనాం మనసైవ న కర్మణా |

నిపుణోయః పరిత్యాగీ సో (అ) సంసక్త ఇతి స్మృతిః (అన్నపూర్ణోపనిషత్)

(ఈ పరపంచమంతా ఆత్మయే. నేను కోరునదేముండును ? నాకు అక్కరలేదని విడిచిపెట్టుటకేముంది ? ఈ ప్రకారము దేనియందును ఆసక్తిలేక ఉండుటయే అసంగుడై యుండుట జీవన్ముక్తి. నేను లేను, ఇంకెవరూ లేరు, ఇది లేదు అది లేదు అని ఈ రీతిగానుండువాడు నేను బ్రహమము అయి ఉన్నాను - అని యుండువాడు అసంగుడు. కర్మచేయకుండుటచే సంతోషింపడు, కర్మలయందు ఫలాభిలాష కలిగి వాటియందు మునిగియుండడు - అన్నింటియందును సమముగా నుండువాడు అసం సక్తుడు - సర్వ కర్మలయందు వాటిని తను చేయుచున్నాడు అను మనసులేనివాడు.అసంగుడు).

“మ. భువనశ్రేణి నమోఘలీలుడగుచున్ బుట్టించు, రక్షించు, నం

త విధింజేయు మునగండందు - - -“. (శ్రీమదాంధ్రమాహాభాగవతము- 1 - 3 - 32)

  1. “అతండు మనోభూత సూక్ష్మేంద్రీయంబుల తోడంగూడి, గుణమయంబులైన భావంబులం దనచేత నిర్మితంబైన భూతంబులందు దగులువడక తద్గుణంబులనుభవంబు సేయు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)
Transliteration
  1. saṃgarahitaḥ, kamalapatra tōyavat ityarthaḥ.

(aṃṭanivāḍu - tāmarāku nīṭilō unnanu dānini nīru aṃṭanaṭlu - ata ēva udāsīnaḥ (aṃduvalananē udāsīnuḍu - taṭasthuḍu - valenuṃḍuvāḍu - ē panini cēyanaṭlu, dēnitōnu saṃbaṃdhamulēnaṭlu uṃḍuvāḍu).

  1. anāsaktaḥ.

(saṃgamanagā dṛśyapadārthamulaṃdu āsaktikaligiyuṃḍuṭa, tagulamu kaligiyuṃḍuṭa. āsakti lēnivāḍu tagulamu lēnivāḍu anaṃguḍu - dēniyaṃdunu rāgamulēnivāḍu).

  1. iṃdruyārdhēṣu āsakti rahitaḥ, saṃsārijana saṃgarahitōvā.

(iṃdriyārthamulaṃdu - viṣayamulaṃdu- āsaktilēnivāḍu - saṃsāramulō unna janulatō kaliyanivāḍu.

  1. ākāśava dasaṃgaḥ -(akāśamu aṃtaṭanu, anniṃṭilōnu vyāpiṃciyunnanu dēnini aṃṭakayuṃḍunaṭlu uṃḍuvāḍu).

  2. upādhi satvē api asaṃgaḥ -

(tanaku upādhiyaina prativastuvunaku tanu dānilōnuṃḍi, tanu dāniki tanasattāsphūrti niccinappaṭikī dānini aṃṭanivāḍu).

  1. niṣkāmaḥ(kōrikalēnivāḍu).

  2. nispṛhaḥ, viṣayā nāsaktaḥ -(āśalēnivāḍu, viṣayamulaṃdāsakti lēnivāḍu).

  3. saṃbaṃdharahitaḥ, nirlēpa mityarthaḥ.

(dēnitōnu, ē vidhamainasaṃbaṃdhamu lēnivāḍu, anagā, nirlēpuḍu ani arthamu - ē vastuvulōnunnanu, dāni guṇamulu modalagunavi tanaku maipūtavale aṃṭanivāḍu).

  1. ātmanaḥ najātīyēna ātmanā saṃbaṃdhōnāsti - ātmani kalpitēna vijātīyēna anātmanā saṃbaṃdhō ātmanaḥ nāsti.ātmā niravayavaḥ tasmāt svagatēna saṃbaṃdhō nāsti. itthaṃ sajātīya vijātīya svagata saṃbaṃdhaḥ ātmanaḥ nāsti. tasmāt ātmā asaṃgaḥ.

(ātmaku sajātīya vijātīya svagatibhēdamulu lēvu - eṭlanagā tanavale sṛṣṭisthitilayamulu modalagunavi cēyuśakti galigina maṟiyoka ātmalēdu. aṃducēta ātmaku sajātīyabhēdamulēdu - ātma vastuvukāni - anātma ayina - itaravastuvulēnaṃduna ātmaku vijātīya saṃbaṃdhamulēdu, ātma avayavamulu lēnidi. ceṭṭuku vēḷḷu, kommalu, ākulu, ciguḷḷu, kāyalu vale tanalōnē vēṟu vēṟu bhēdamunnaṭlu ātmaku tanalō vēṟu bhāgamululēvu, - aṭlu bhāgamulē unnayaḍala okadāniki iṃkoka dāniki bhēdamuṃḍunu - aṭṭi bhēdamu svagatabhēdamu. ātmaku avayavamulu lēkapōvuṭacēta aṭṭi svagatabhēdamulēdu. ī vidhamugā ātmaku sajātīya, vijātīya, svagata bhēdamulēdu. aṃducēta ātma asaṃguḍu).

  1. “namāṃ karmāṇi liṃpaṃti namē karmaphalē spṛhā |” (śrīmadbhagavadgīta - 4 - 14)

“karmāṇi viśvasṛṣṭyādīnya nahaṃkāra mīśvaraṃ |

dēhādyāraṃbhakatvēna namāṃ badhnaṃti cidghanaṃ |

na vāma māpta kāmasya tṛṣṇā karmaphalēyataḥ |

kartṛtvābhi nivēśēna tadaiva phala tṛṣṇayā |

liṃpaṃ tyajñāṃ stu karmāṇi tadabhāvānnamāṃ hariṃ ||“. (gītābhāva prakāśamu - 4 - 93 to 94)

(caitanyaghanuḍu, īśvaruḍu, ahaṃkāramu lēnivāḍu ayina nannu ī prapaṃcasṛṣṭi modalagukarmalu janmajarāmaraṇamulu kalugacēyunaṭlugā nannu baṃdhiṃcavu. nēnu avāpta kāmuḍanu - kōrikalu tīrinavāḍanu, kōravalasinadi lēnivāḍanu. aṃducēta nēnu cēyukarmalaṃdu phalamu kalugavalenanu āśanāku lēdu - nēnē ī karmacēyucunnānu anu abhinivēśamu lēdu - karma phalamu kōricēyuṭavalana ā karmalu ajñānulanu aṃṭunu - kāni nākukarmayaṃdu phalāpēkṣalēkuṃḍuṭacēta avi nannu aṃṭavu. aṃducēta nēnu anaṃguḍanu).

  1. yadhākhaṃ sarvagatamapi na sajjatē, yathā savitā jalē pratribiṃbitōpi tasmin jalē na sajjatē, yadhā anilaḥ sarvatra saṃcalannapi na sajjatē, tathā vidvān prakṛti sthōpi asaṃgēna (vairāgyēṇa) bhinna saṃśayassan nānātvāt - dēhādi prapaṃcāt - vi nivartatē.

(ākāśamu anniṃṭilōnu vyāpiṃciyunnappaṭikī vāṭini aṃṭiyuṃḍanaṭlu, sūryuḍu nīṭilō pratibiṃbiṃcinanu ā nīṭini aṃṭanaṭlu, vāyuvu aṃtaṭa saṃcariṃcu cunnanu dēnikī aṃṭanaṭlu vidvāṃsuḍu prakṛtilō uṃḍinanu dēniyaṃdunu āsaktilēka, vairāgyamu kaligiyuṃḍi ī prapaṃcamulō dēnini aṃṭaka,muṭṭaka uṃḍunu - aṭṭivāḍu asaṃguḍu).

“sarvamātmē dama trāhaṃ kiṃ vāṃcāmi, vrajāmi kiṃ |

ityanuga sthitiṃ viddhi jīvanmukti tanusthitāṃ |

nāhamasmi nacānyōsmi, na cāyaṃ naca nētaraḥ |

sō (a) saṃga iti prōktō brahmasmī tyēva sarvadā |

nābhinaṃ dati naiṣkarmyaṃ na karma svanu sajjatē |

sunamōyaḥ parityāgī sōhi (a) saṃsaktō iti smṛtaḥ |

sarvakarma phalādīnāṃ manasaiva na karmaṇā |

nipuṇōyaḥ parityāgī sō (a) saṃsakta iti smṛtiḥ (annapūrṇōpaniṣat)

(ī parapaṃcamaṃtā ātmayē. nēnu kōrunadēmuṃḍunu ? nāku akkaralēdani viḍicipeṭṭuṭakēmuṃdi ? ī prakāramu dēniyaṃdunu āsaktilēka uṃḍuṭayē asaṃguḍai yuṃḍuṭa jīvanmukti. nēnu lēnu, iṃkevarū lēru, idi lēdu adi lēdu ani ī rītigānuṃḍuvāḍu nēnu brahamamu ayi unnānu - ani yuṃḍuvāḍu asaṃguḍu. karmacēyakuṃḍuṭacē saṃtōṣiṃpaḍu, karmalayaṃdu phalābhilāṣa kaligi vāṭiyaṃdu munigiyuṃḍaḍu - anniṃṭiyaṃdunu samamugā nuṃḍuvāḍu asaṃ saktuḍu - sarva karmalayaṃdu vāṭini tanu cēyucunnāḍu anu manasulēnivāḍu.asaṃguḍu).

“ma. bhuvanaśrēṇi namōghalīluḍagucun buṭṭiṃcu, rakṣiṃcu, naṃ

ta vidhiṃjēyu munagaṃḍaṃdu - - -“. (śrīmadāṃdhramāhābhāgavatamu- 1 - 3 - 32)

  1. “ataṃḍu manōbhūta sūkṣmēṃdrīyaṃbula tōḍaṃgūḍi, guṇamayaṃbulaina bhāvaṃbulaṃ danacēta nirmitaṃbaina bhūtaṃbulaṃdu daguluvaḍaka tadguṇaṃbulanubhavaṃbu sēyu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.