(సత్ అనగా భూతభవిష్యత్ వర్తమానములను మూడుకాలములందు ఉండునది - ఆత్మ. అదికానిది అసత్. కుందేటికొమ్ము, వంధ్యాపుత్రుడు, ఆకాశపుష్పమువలె లేనిది అసత్ అని చెప్పబడుచున్నది. లేనిది ఉన్నట్లు తోచునది).
(మూడుకాలములందు ఉండనది, కనబడనిది, కుందేటికొమ్మువలె మిక్కిలి అసంభవమైనది. కుందేటికి కొమ్ము ఉండదు, సంభవింపదు - ఆ ప్రకారముగానే గొడ్రాలికి కలుగుట సంభవింపదు,ఆకాశము ప్రష్టించుట అసంభవము. ఇట్లే సంభవించుటకు వీలులేనిది అంతయు అసత్).
(చీకటిలో త్రాడును చూచి అది పామువలె గోచరించుట అసత్).
(ఆత్మకి వ్యతిరేరిక్తమైనది - ఆత్మాకానిది - కుందేటికొమ్మువలె ఉండుట అసంభవమైనది అసత్తే).
అవిద్యమానం (కనబడనిది, లేనిది).
సద్రూపయాత్యక్తం శూన్యం అసదేవ.
(భగవంతుని సత్తాస్ఫూర్తిలేనిది అసత్, శూన్యమైనది అసత్ -).
(కార్యావస్థను పొందినది - ఒక కారణవస్తువునుండి పుట్టినది - కార్యవస్తువంతయు అసత్తే - చిద్వవస్తువుకానిది, చైతన్యములేనిది).
ఆత్మనః అన్యం; ఆత్మ వ్యతిరిక్తం. (ఆత్మకంటె వేరైనది, ఆత్మకానిది).
అపరిచ్ఛిన్నం వా యద్వస్తు దేశతః కాలతో అర్థతః తజ్జస్మమనాశ శీలత్వాత్ అసద్రజ్జు భుజంగపతౌ -
(ఒక స్థలమందుండి ఇంకొక స్థలమందుండనిది, ఒకకాలమందుండి ఇంకొక కాలమందుండనిది అయిన వస్తువుజన్మ వినాశములు గల స్వభావముగలదికనుకాసత్ - చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనునపుడు లేనిపాము అసత్).
(స్వప్నావస్థయందు లోపలి మనస్సుచేత (అంతరింద్రియముచేత) కల్పించబడినది అసత్).
(ఏది యధార్త్ఝజ్ఞానముచేత తొలగిపోవునో అది అసత్ అని చెప్పబడుచున్నది - చీకటిలో త్రాడునుచూచి అది పాము అనుకొని, అది పాముకాదు త్రాడు అని యధార్థజ్ఞానమువలన పాము అను అభిప్రాయము తొలగిపోవును -అప్పుడు ఆ తొలగిపోయిన పాము అసత్).
(నిత్యము నశించుచుండునది శరీరము - ఎల్లపుడు అవస్థలతో మార్పు చెందునది అగుటవలన - ఇప్పుడున్నట్లు ఉత్తరక్షణమునందుండక ఏదో ఒక విధమైన మార్పు కలిగియుండునది కనక నిత్యవినాశి - అందుచేత శరీరము అసత్).
(దేహము మొదలగు ద్వైతవస్తువులన్నియు అసత్).
(మిధ్య అయినది అసత్ - పాము కాని త్రాడును పాము అనుకొనుట మిధ్య).
(జగత్తు - అహంకారము మొదలగు ఈ ప్రపంచమంతయు - ఈ ప్రపంచములోనున్న వస్తువులన్నియు. జగత్తు ఉన్నట్లు కనబడుచున్నను లేనిదే, అంతా పరబ్రహ్మమే. అందుచేత జగత్తు అనునది అసత్).
“మాయా లక్షణములలో నొకటి - శశవిషాణకంబె అసద్రూపంబు” (వివేకచింతామణి)
అపరం బ్రహ్మ.
(అపరబ్రహ్మ అసత్ - పరబ్రహ్మముకన్న అన్యము, వేరైనది. నామరూపాత్మకమైన జగత్తు).
(పృధివీ, ఆపః, తేజస్సు, వాయువు, ఆకాశము అను పంచభూతములలో రూపముగలిగి, స్థూలమై, కంటికి కనబడు - భూమి, నీరు, అగ్ని - ఈ మూడు అసత్).
(గడిచిపోయినది, ఇటుపైన రానున్నది - ఈ రెండును మూడు మూడుకాలములందు ఉండనివి కనుక అసత్).
(వ్యక్తముకాక - కంటికి కనబడక సూక్ష్మస్థితిలోనే ఉన్నటువంటి నామరూపములుగల ఈ ప్రపంచము – ఈ ప్రపంచములోని వస్తువులన్నియు).
(అసత్ అనగా కారణము - అసత్ అనునది వ్యక్తముకానిది యగుటవలనకారణమని చెప్పబడినది).
ఇత్యాది శ్రుతిః.
(ఇది, వీడు, నీవు, నేను, అది, ఇది, వాడు, నేను - ఇదంతా అసత్. నావారు, నీవారు, నాది, నీది, నాకొఱకు, నీకొఱకు, నాచేత, నీచేత అనుభావము అసత్).
(తనంతట తానే ప్రకాశించునదికాదుకనుక అపరోక్షము).
(ప్రారంభములోను అంతములోను లేనిది వర్తమానకాలములో కూడా లేనిదే. అదే అసత్తు).
(ప్రకృతి వికారరూపములన్నియు నామమాత్రములే. అందుచేత ఇవన్నియు అసత్).
(నామరూపములు గలవిగా మారుటకుముందు వాటియొక్క సూక్ష్మమై అవ్యాకృతమైన స్థితి - అదియే బ్రహ్మమని చెప్పబడుచున్నది - అనగా చతుర్ముఖబ్రహ్మ - సృష్టికి ఉన్ముఖముగా అప్పటికి లేకయుండు మాయాశక్తి, అవ్యక్తము. ఇది పూర్తిగా అసత్ కాదు - ఎందుచేతననగా అసత్ నుండి సత్పదార్థము పుట్టదు. కాని దీనిలోనుండియే భావి కాలములో కలుగు సృష్టి - సృష్టిలో కలుగు వస్తువులన్నియు, కలుగును - అందుచేత అసత్ అనగా వ్యక్తముకానటువంటి నామరూపములతో ముందుకాలములో వ్యక్తమగు ప్రపంచమంతయు సూక్ష్మరూపములో దీనిలోనే అవ్యక్తముగా - కనబడకుండా - అణగి యున్నది. కనుక ఇది ఈ స్థితిలో అసత్ - ముందు పుట్టబోవు ప్రపంచమునకు కారణమైనది).
(ఇప్పుడు అనేకనామరూపములతో కనబడు ఈ జగత్తు అంతా సృష్టికి పూర్వము ‘అసత్’ గానే ఉండెను. చాందోగ్యోములో ఈ ప్రకారము చెప్ప్బడినది : -"స్యగ్రోధ ఫలమిది ఆహార, ఇదం భగవః, తాసామంగ ఏకాం భింది; ‘భిన్నా భగవః 'కిమత్రవశ్యసి;’ న కించ భగవః; తం హోతాచ - యం వైసౌమ్యఏతమణిమానం న నిభాలయసే, ఏతస్యైవ ఖలుసోమ్య, వైపాణిమ్నః ఏవం మహాన్ న్య గ్రోధస్తష్టతీతి"
(ఛాందోగ్యోపనిషత్ - 6 - 12 - 1)
(ఈ రావి పండు ఇటు తీసుకొని రమ్ము, “ఇదిగో తెచ్చితిని”, “బద్దలు కొట్టుము”, “కొట్టితిని”, దానిలో ఏమిటి ఉన్నది. దేనిని చూచుచున్నావు? “అణువు అంత చిన్న గింజలను చూచుచున్నాను”, “వాటిలో ఒకదానిని బ్రద్దలు చేయుము”, “బద్దలు కొట్టితిని”. “అందులో ఏమి ఉన్నది”, “ఏమియును లేదు”. కనబడని ఆ సూక్ష్మమునందే ఈ పెద్ద చెట్టు సూక్ష్మరూపములో నున్నది“.ఈ విధముగా గురువుకు రావిపండు విషయమై శిష్యునికి జరిగిన సంభాషణ బట్టి ముందు పెద్దదిగా పెరగబోయే చెట్టు యొక్క విత్తనము - కారణము - దాని పండులోనే ఉన్నది - విత్తనము లేనిదే చెట్టు ఉండదు - విత్తనము సూక్ష్మరూపములో ఉండును - అది సాధారణులకు కనబడదు - కనబడకపోయినంత మాత్రమున అది లేదు - ఏమీ లేని దానినుండే - అసత్ - నుండే - చెట్టు పుట్టుచున్నది అని అనుకొనుట తప్పు.అట్లే ‘అసత్’ - ఏమియులేనిది - శూన్యము - దాని నుండి సత్పదార్థము పుట్టినది అని చెప్పుట తప్పు - చెట్టు పుట్టకముందు లేదు అనుకొనుట తప్పు - అది సూక్ష్మరూపములో ఉన్నది - అదియే సత్తు,”కధమ సతస్స జ్జాయతే” ? అసత్తునుండిసత్తు - సత్పదార్థము ఎట్లు కలుగును - ఏమీ లేదు అను శూన్యమునుండి ఏది పుట్టును - ఏదియు పుట్టదు - అందుచేత సృష్టికిముందు అసత్తే - శూన్యమే - ఉండెను అనుట కుదరదు. కుండ పుట్టుటకుముందు - చేయబడుటకుముందు - అది దాని కారణమైన మట్టి రూపములో ఉండెను. మట్టి ఉండెనుకనుక దానితో కుండ చేయబడెను. మొదటిలో మట్టియే లేనియడల కుండ ఎట్లు చేయబడును - అందుచేత ఏమియు లేనిదానినుండి - శూన్యమునుండి - అసత్తునుండి - ఏదియు పుట్టదు - అందుచేత సృష్టికిపూర్వము ‘అసత్’ ఉండెను అను వాదము కుదరదు. కారణము లేనిదీ కార్యము కలుగదు - “అసద్వా ఇదమగ్ర ఆసీత్” అని ఆఖరున మొదట చెప్పినప్పటికి “తత్సదాసీత్” అని సిద్ధాంతము చేయబడినది. “అసద్వా ఇదమగ్ర ఆసీత్, తతోవై సదజాయత, తదాత్మానం స్వయ మకురుత” అని శ్రుతి చెప్పుచున్నది. “అసతో అభావత్ కార్యోత్పత్తిర్న యుక్తా, కుతః ? అదృష్టత్వాత్, నిరుపాఖ్యాత్, నరవషాణాదేః కార్యోత్పత్తే రభావాత్”. (అసత్ అనగా అభావము - అసత్తునుండి, లేనిదానినుండి, కార్యము పుట్టుట యుక్తముకాదు - ఎందుచేతననగా ఎక్కడను ఈ ప్రకారముగా కనబడలేదు -
(కుందేటికి కొమ్ము పుట్టుటయనుట, అసద్వస్తువులవలన సత్ ఉత్పత్తియగుట, ఎక్కడను కనబడుటలేదు. బంగారము మొదలగు వస్తువులవల్ల, బంగారు ఆభరణములు మొదలగు సద్వస్తువులు సంభవించుట చూచుచున్నాము - కనుక అభావమునుండి - అసత్ నుండి - సత్ - సంభవించుట ఉపపన్నముకాదు).
(విస్తరింపని అవస్థలోనున్నది, సూక్ష్మాతి సూక్ష్మరూపములోనున్నది - ప్రకృతి సృష్టి ప్రారంభమునకు ముందు ఉన్న స్థితి - సత్ అనగా బ్రహ్మ).
(ఈశానాశ్యోపనిషత్), (తైత్తిరీయోపనిషత్)
(బ్రహ్మను అసత్తుగా - లేనివానినిగా - తెలిసికొనినవాడు అసత్తే యగును, లేనివాడే యగును. ఒకచోట సత్ నుండియు, ఒకచోట అసత్తు నుండియు, ఒక చోట స్వభావమునుండియు జగత్తు పుట్టినట్లు చెప్పబడి నట్లు కనబడుచున్నది - కాని, “అసన్నేవస భవతి, అసద్బ్రహ్మేతి చేత్ వేద” అని చెప్పుటవలన అసత్ బ్రహ్మము అని చెప్పినది త్రోసివేయబడినది. “అస్తి బ్రహ్మేతి చేద్వేద” అని చెప్పుటచేత సత్తే బ్రహ్మమని నిర్ధారణ చేయబడినది. “సో అకామయత” అని చెప్పుటచేత ‘సత్’ నుండియే ప్రపంచము సృష్టింపబడి నది అని చెప్పబడినది. “తత్సత్యమిత్యా దక్షతే” అని సత్తు గుఱించి చెప్పనది స్పష్టముచేసి నిర్ధారణ చేయబడినది).
(పై దానిని బట్టి - ‘అసత్’ గుఱించి చెప్పిన వేదవాక్యములు ఈ రీతిగా గ్రహించవలసియున్నది - సూక్ష్మ రూపములోనుండి సృష్టికి ఉన్ముఖముగానున్న ప్రకృతియొక్క అవస్థ, లేక అవ్యక్తము, లేక చతుర్ముఖ బ్రహ్మ - అంతేగాని అసత్ అనగా శూన్యమని అర్థముకాదు).
(ఈ ప్రపంచమంతటికీ కారణమనునది కలదు. కారణములేక ఈ ప్రపంచకము అనే కార్యము కలుగదు - బ్రహ్మజ్ఞానము లేకపోవుటవలన కల్పితమైనది, నిజముగా ప్రపంచములేదు, అంతా బ్రహ్మమే. అట్టి బ్రహ్మ మందు కల్పితమైన ఈ ప్రపంచము బ్రహ్మజ్ఞానము కలిగినయడల నశించును - అనగా, అంతయు బ్రహ్మమే అను జ్ఞానము కలుగును. చీకటిలో త్రాడును చూచి అది పాము అనుకొనినట్టి (కల్పితము) అజ్ఞానము, అది నిజముగా త్రాడేగాని పాముకాదు అను జ్ఞానము కలుగగనే నశించును - త్రాడులో పాము కల్పితము అయినట్లు బ్రహ్మలో ప్రపంచము కల్పితము. అందుచేత అదంతా అసత్. త్రివిధపరిచ్ఛేదము కలది - అనగా దేశము వలన, కాలము వలన పరిచ్ఛిన్నమైనది - పుట్టుక, చావు కలది అగుటవలన - త్రాడు, పామువలె - అసత్, నిజమైనవికావు, కల్పితములు. కలలో కన్నవస్తువులువలె సర్వము మృషయే. వీటివలె అధ్యస్తమైన వస్తువువేదియును సత్ కాదు, అది అసత్తే. కారణము కలవియగుటవలనను, ప్రమాణము లేనిదగుటవల నను, వికారము - పుట్టుట, పెరుగుట, నశించుట మొదలగుమార్పులు - లేనిదగుటవలనను, చంచల మైనది - స్థిరముగా ఒకేరీతిగా, ఒకే చోట, ఒకే వస్తువునందు ఉండకపోవునవి - అగుటవలనను, ఘటము, అంకురము మొదలగు అసద్వస్తువులన్నింటికి కారణము సత్ పదార్థము. కార్యమగు ఈ ప్రపంచము అంతా అసత్తే అయిన యడల ఇదంతయు అసత్తుచేనిండి వ్యాపించి యుండవలెను. కాని, అసత్తు ఆత్మకాదు, ఆత్మ గుణములు లేనిది. అందుచేత అసత్తు కారణముకాదు. సత్తే కారణము. అదియే శాశ్వతమైనది. అదియే ఈ ప్రపంచమునంతటిని - దానిలోని వస్తువులన్నింటినీ, పుట్టించునది.)
(బంధమును కలిగించు దేహము మొదలగువాటికి వాటికారణమనునది వేఱొకటి యుండుటచేత సత్య త్వము లేదు - అది శాశ్వతముగా నుండుటలేదు - అందుచేత అవి అసత్. ఆ ప్రకారముగానే చిదానందము, అపరిచ్ఛిన్నము అయిన- సద్వస్తువునకు - సత్తుకు - అభావము - లేకుండుట, - అసత్యత, ఎల్లపుడు లేకపోవుట అనునది - లేదు; అందుచేత అది సత్).
(ఓం అనినను, తత్ అనినను, సత్ అనినను - ఈ మూడువిధముల పరబ్రహ్మమే నిర్దేశింపబడినది. అందు చేత సత్ అనగా బ్రహ్మ. ఇది కానిది అసత్).
(సద్భావమునను - అనగా భగవద్ధ్యానము చేయునపుడు, మంచిది అను భావము కలిగినపుడును - సత్ అనుమాట ఉపయోగింపబడుచున్నది. ప్రశస్తమైన కర్మ చేయునపుడును, అది సత్కర్మ - అని చెప్పుటకలదు - యజ్ఞము, తపస్సు, దానము మొదలగుకర్మలు చేయుచు వీటియందు నిష్టకలిగియుండుట సత్ అని చెప్పబడు చున్నది. సదుద్దేశముతో - మంచి ఉద్దేశముతో చేయబడు కర్మలన్నియు, పరమాత్మ ప్రీతికొఱకు చేయబడు చున్నవి కనుక అవన్నియు ‘సత్’ అనియే చెప్పబడుచున్నవి - ఉదా - సత్కార్యము, సత్పురుషుడు, సదభి ప్రాయము, సత్సంగము మొదలగునవి. ఈ పైన ‘సత్’ అని చెప్పబడినవాటికి వ్యతిరేకమైనవి అసత్).
(‘సత్’ అనగా ఆత్మ, ‘ఆత్మనః అన్యం, ఆత్మవ్యతిరిక్తం’ ఆత్మకానిది, ఆత్మకు వ్యతిరిక్తమైనది ‘అసత్’).
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 28)
(అశ్రద్ధతో చేసిన హోమము, దానము, తపస్సు ‘అసత్’ అని చెప్పబడుచున్నది. అట్టి క్రియ ఈ లోకమునగాని, పరలోకమునగాని ఏమియు ఫలము నొసగదు)
“యస్మాత్ సర్వత్ర శ్రద్ధాప్రాధాన్యతయాసర్వం సంపాద్యతే తస్మాత్ అశ్రద్ధయా హుతం - హవనం కృతం -. అశ్రద్ధయాదత్తం బ్రాహ్మణేభ్యః, అశ్రద్ధయా తపస్తప్తం - అనుష్ఠితం - తథా అశ్రద్ధయా ఏవకృతం చ యత్ స్తుతి నమస్కారాది, తత్సర్వం అసత్ ఇత్యుచ్యతే - మత్ప్రాప్తి సాధనమార్గ బాహ్యత్వాత్,న చ తత్బహుళాయ సమపి ప్రేత్య ఫలాయనో అపి ఇహార్థం సాదుభిః నిందితత్వాత్ " (శ్రీశంకరః)
(అన్నింటిలోను - అన్ని పనులలోను శ్రద్ధ ప్రధానముగా నుండుటవలననే అన్నియు ప్రాప్తించు చుండుటచేత,అశ్రద్ధతో చేసిన హోమము, బ్రాహ్మణులకొఱకు ఇచ్చిన ధనము మొదలగు దానము, చేసిన తపస్సు, భగవంతుని గుఱించి చేసిన నమస్కారము, స్తోత్రము - ఇవన్నియు అసత్తే అని చెప్పబడుచున్నవి - ఎందుచేతననగా ఇట్టివి అన్నియు భగవత్ప్రాప్తి సాధనములుకావు - అందుచేత, వాటియందు శ్రద్ధలేక చేయుటవల్ల అవి ఎంత ఆయాసముతో చేసినను అవి ఫలము నివ్వవు).
నామరూప ప్రకాశములేక సూక్ష్మావస్థలోనున్న ప్రపంచమే శూన్యమువలె తోచుటచేత ఔపచారకముగా ‘అసత్’ అని చెప్పబడుచున్నది.
మాయతోకూడిన పదార్థము శాశ్వతముగా ఉండునదికాదు అందుచేత అది అసత్ - సత్ అనునది ఆదిలేనిది, అంతములేనిది, అందుచేత నాశములేనిది. ఈ సత్పదార్థమునకు విపరీతమైనది అసత్..
“సదసచ్చాహమర్జున” (శ్రీమద్భగవద్గీత - 9 - 19)
(సృష్టిలోని సద్వస్తువులు, అసద్వస్తువులు, ఆత్మ, అనాత్మ వస్తువులన్నియు నేనే అని శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు. సత్ అనగా పరబ్రహ్మము. అసత్ అనగా బ్రహ్మకానివి - అనగా, అవ్యక్తము - ప్రకృతి, చతుర్ముఖబ్రహ్మ - అపరం బ్రహ్మ దానిలోనుండిన వస్తువులన్నియు భగవతుడే –
“తతృష్ట్యా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చ, త్యచ్చ అభవత్” -
(భగవంతుడు లోకములను సృష్టించి, అందులోని ప్రతివస్తువు సత్, త్యత్ - ఆత్మ అనాత్మ వస్తువులన్నియుతానే ఆయెను. ఈ సృష్టిలోని సమస్త వస్తువులు పరబ్రహ్మలోనుండి - ఒకదానిలోనుండి ఒకటిగా - పుట్టినవి.బంగారముతో చేసిన వస్తువులన్నియు బంగారపు వస్తువులే అయనట్లు భగవంతునిలోనుండి పుట్టిన వస్తువువులన్నియు భగవంతుని రూపములే. అందుచేత అన్ని వస్తువులూ అతనే. కుమ్మరివాడు కుండలు, కూజాలు చేయుటకు మట్టి కావలసినట్లు భగవంతుడు ప్రపంచమును సృష్టించుటకు ప్రకృతిని (raw material) సృష్టించెను - ప్రకృతి జడము - (inert) స్వయముగా ఏపనిని చేయలేదు - భగవంతుడు - తన చైతన్యశక్తితో దానిలో ప్రవేశించి, దానిలో పూర్తిగా వ్యాపించి, దానిచేత సృష్టిలోని వస్తువులను చేయించు చున్నాడు - అందుచేత సృష్టిలోని ప్రతివస్తువులోను ప్రకృతి అంశ భగవంతుని అంశ ఉన్న ప్రకృతి అంశ, చిచ్ఛక్తి అతనే - అందుచేత సద్వస్తువు, అసద్వస్తువు - ఆత్మ, అనాత్మ, చిత్, అచిత్ అన్నియు అతనే. ప్రపంచములోని వస్తువులన్నియు పరబ్రహ్మమే - ఇంకొక వస్తువేదియును లేదు - అందుచేతనే పరబ్రహ్మ అద్వయుడు).
(sat anagā bhūtabhaviṣyat vartamānamulanu mūḍukālamulaṃdu uṃḍunadi - ātma. adikānidi asat. kuṃdēṭikommu, vaṃdhyāputruḍu, ākāśapuṣpamuvale lēnidi asat ani ceppabaḍucunnadi. lēnidi unnaṭlu tōcunadi).
(mūḍukālamulaṃdu uṃḍanadi, kanabaḍanidi, kuṃdēṭikommuvale mikkili asaṃbhavamainadi. kuṃdēṭiki kommu uṃḍadu, saṃbhaviṃpadu - ā prakāramugānē goḍrāliki kaluguṭa saṃbhaviṃpadu,ākāśamu praṣṭiṃcuṭa asaṃbhavamu. iṭlē saṃbhaviṃcuṭaku vīlulēnidi aṃtayu asat).
(cīkaṭilō trāḍunu cūci adi pāmuvale gōcariṃcuṭa asat).
(ātmaki vyatirēriktamainadi - ātmākānidi - kuṃdēṭikommuvale uṃḍuṭa asaṃbhavamainadi asattē).
avidyamānaṃ (kanabaḍanidi, lēnidi).
sadrūpayātyaktaṃ śūnyaṃ asadēva.
(bhagavaṃtuni sattāsphūrtilēnidi asat, śūnyamainadi asat -).
(kāryāvasthanu poṃdinadi - oka kāraṇavastuvunuṃḍi puṭṭinadi - kāryavastuvaṃtayu asattē - cidvavastuvukānidi, caitanyamulēnidi).
ātmanaḥ anyaṃ; ātma vyatiriktaṃ. (ātmakaṃṭe vērainadi, ātmakānidi).
aparicchinnaṃ vā yadvastu dēśataḥ kālatō arthataḥ tajjasmamanāśa śīlatvāt asadrajju bhujaṃgapatau -
(oka sthalamaṃduṃḍi iṃkoka sthalamaṃduṃḍanidi, okakālamaṃduṃḍi iṃkoka kālamaṃduṃḍanidi ayina vastuvujanma vināśamulu gala svabhāvamugaladikanukāsat - cīkaṭilō trāḍunu cūci pāmu anukonunapuḍu lēnipāmu asat).
(svapnāvasthayaṃdu lōpali manassucēta (aṃtariṃdriyamucēta) kalpiṃcabaḍinadi asat).
(ēdi yadhārtjhajñānamucēta tolagipōvunō adi asat ani ceppabaḍucunnadi - cīkaṭilō trāḍunucūci adi pāmu anukoni, adi pāmukādu trāḍu ani yadhārthajñānamuvalana pāmu anu abhiprāyamu tolagipōvunu -appuḍu ā tolagipōyina pāmu asat).
(nityamu naśiṃcucuṃḍunadi śarīramu - ellapuḍu avasthalatō mārpu ceṃdunadi aguṭavalana - ippuḍunnaṭlu uttarakṣaṇamunaṃduṃḍaka ēdō oka vidhamaina mārpu kaligiyuṃḍunadi kanaka nityavināśi - aṃducēta śarīramu asat).
(dēhamu modalagu dvaitavastuvulanniyu asat).
(midhya ayinadi asat - pāmu kāni trāḍunu pāmu anukonuṭa midhya).
(jagattu - ahaṃkāramu modalagu ī prapaṃcamaṃtayu - ī prapaṃcamulōnunna vastuvulanniyu. jagattu unnaṭlu kanabaḍucunnanu lēnidē, aṃtā parabrahmamē. aṃducēta jagattu anunadi asat).
“māyā lakṣaṇamulalō nokaṭi - śaśaviṣāṇakaṃbe asadrūpaṃbu” (vivēkaciṃtāmaṇi)
aparaṃ brahma.
(aparabrahma asat - parabrahmamukanna anyamu, vērainadi. nāmarūpātmakamaina jagattu).
(pṛdhivī, āpaḥ, tējassu, vāyuvu, ākāśamu anu paṃcabhūtamulalō rūpamugaligi, sthūlamai, kaṃṭiki kanabaḍu - bhūmi, nīru, agni - ī mūḍu asat).
(gaḍicipōyinadi, iṭupaina rānunnadi - ī reṃḍunu mūḍu mūḍukālamulaṃdu uṃḍanivi kanuka asat).
(vyaktamukāka - kaṃṭiki kanabaḍaka sūkṣmasthitilōnē unnaṭuvaṃṭi nāmarūpamulugala ī prapaṃcamu – ī prapaṃcamulōni vastuvulanniyu).
(asat anagā kāraṇamu - asat anunadi vyaktamukānidi yaguṭavalanakāraṇamani ceppabaḍinadi).
ityādi śrutiḥ.
(idi, vīḍu, nīvu, nēnu, adi, idi, vāḍu, nēnu - idaṃtā asat. nāvāru, nīvāru, nādi, nīdi, nākoṟaku, nīkoṟaku, nācēta, nīcēta anubhāvamu asat).
(tanaṃtaṭa tānē prakāśiṃcunadikādukanuka aparōkṣamu).
(prāraṃbhamulōnu aṃtamulōnu lēnidi vartamānakālamulō kūḍā lēnidē. adē asattu).
(prakṛti vikārarūpamulanniyu nāmamātramulē. aṃducēta ivanniyu asat).
(nāmarūpamulu galavigā māruṭakumuṃdu vāṭiyokka sūkṣmamai avyākṛtamaina sthiti - adiyē brahmamani ceppabaḍucunnadi - anagā caturmukhabrahma - sṛṣṭiki unmukhamugā appaṭiki lēkayuṃḍu māyāśakti, avyaktamu. idi pūrtigā asat kādu - eṃducētananagā asat nuṃḍi satpadārthamu puṭṭadu. kāni dīnilōnuṃḍiyē bhāvi kālamulō kalugu sṛṣṭi - sṛṣṭilō kalugu vastuvulanniyu, kalugunu - aṃducēta asat anagā vyaktamukānaṭuvaṃṭi nāmarūpamulatō muṃdukālamulō vyaktamagu prapaṃcamaṃtayu sūkṣmarūpamulō dīnilōnē avyaktamugā - kanabaḍakuṃḍā - aṇagi yunnadi. kanuka idi ī sthitilō asat - muṃdu puṭṭabōvu prapaṃcamunaku kāraṇamainadi).
(ippuḍu anēkanāmarūpamulatō kanabaḍu ī jagattu aṃtā sṛṣṭiki pūrvamu ‘asat’ gānē uṃḍenu. cāṃdōgyōmulō ī prakāramu ceppbaḍinadi : -"syagrōdha phalamidi āhāra, idaṃ bhagavaḥ, tāsāmaṃga ēkāṃ bhiṃdi; ‘bhinnā bhagavaḥ 'kimatravaśyasi;’ na kiṃca bhagavaḥ; taṃ hōtāca - yaṃ vaisaumyaētamaṇimānaṃ na nibhālayasē, ētasyaiva khalusōmya, vaipāṇimnaḥ ēvaṃ mahān nya grōdhastaṣṭatīti"
(chāṃdōgyōpaniṣat - 6 - 12 - 1)
(ī rāvi paṃḍu iṭu tīsukoni rammu, “idigō teccitini”, “baddalu koṭṭumu”, “koṭṭitini”, dānilō ēmiṭi unnadi. dēnini cūcucunnāvu? “aṇuvu aṃta cinna giṃjalanu cūcucunnānu”, “vāṭilō okadānini braddalu cēyumu”, “baddalu koṭṭitini”. “aṃdulō ēmi unnadi”, “ēmiyunu lēdu”. kanabaḍani ā sūkṣmamunaṃdē ī pedda ceṭṭu sūkṣmarūpamulō nunnadi”.ī vidhamugā guruvuku rāvipaṃḍu viṣayamai śiṣyuniki jarigina saṃbhāṣaṇa baṭṭi muṃdu peddadigā peragabōyē ceṭṭu yokka vittanamu - kāraṇamu - dāni paṃḍulōnē unnadi - vittanamu lēnidē ceṭṭu uṃḍadu - vittanamu sūkṣmarūpamulō uṃḍunu - adi sādhāraṇulaku kanabaḍadu - kanabaḍakapōyinaṃta mātramuna adi lēdu - ēmī lēni dāninuṃḍē - asat - nuṃḍē - ceṭṭu puṭṭucunnadi ani anukonuṭa tappu.aṭlē ‘asat’ - ēmiyulēnidi - śūnyamu - dāni nuṃḍi satpadārthamu puṭṭinadi ani ceppuṭa tappu - ceṭṭu puṭṭakamuṃdu lēdu anukonuṭa tappu - adi sūkṣmarūpamulō unnadi - adiyē sattu, “kadhama satassa jjāyatē” ? asattunuṃḍisattu - satpadārthamu eṭlu kalugunu - ēmī lēdu anu śūnyamunuṃḍi ēdi puṭṭunu - ēdiyu puṭṭadu - aṃducēta sṛṣṭikimuṃdu asattē - śūnyamē - uṃḍenu anuṭa kudaradu. kuṃḍa puṭṭuṭakumuṃdu - cēyabaḍuṭakumuṃdu - adi dāni kāraṇamaina maṭṭi rūpamulō uṃḍenu. maṭṭi uṃḍenukanuka dānitō kuṃḍa cēyabaḍenu. modaṭilō maṭṭiyē lēniyaḍala kuṃḍa eṭlu cēyabaḍunu - aṃducēta ēmiyu lēnidāninuṃḍi - śūnyamunuṃḍi - asattunuṃḍi - ēdiyu puṭṭadu - aṃducēta sṛṣṭikipūrvamu ‘asat’ uṃḍenu anu vādamu kudaradu. kāraṇamu lēnidī kāryamu kalugadu - “asadvā idamagra āsīt” ani ākharuna modaṭa ceppinappaṭiki “tatsadāsīt” ani siddhāṃtamu cēyabaḍinadi. “asadvā idamagra āsīt, tatōvai sadajāyata, tadātmānaṃ svaya makuruta” ani śruti ceppucunnadi. “asatō abhāvat kāryōtpattirna yuktā, kutaḥ ? adṛṣṭatvāt, nirupākhyāt, naravaṣāṇādēḥ kāryōtpattē rabhāvāt”. (asat anagā abhāvamu - asattunuṃḍi, lēnidāninuṃḍi, kāryamu puṭṭuṭa yuktamukādu - eṃducētananagā ekkaḍanu ī prakāramugā kanabaḍalēdu -
(kuṃdēṭiki kommu puṭṭuṭayanuṭa, asadvastuvulavalana sat utpattiyaguṭa, ekkaḍanu kanabaḍuṭalēdu. baṃgāramu modalagu vastuvulavalla, baṃgāru ābharaṇamulu modalagu sadvastuvulu saṃbhaviṃcuṭa cūcucunnāmu - kanuka abhāvamunuṃḍi - asat nuṃḍi - sat - saṃbhaviṃcuṭa upapannamukādu).
(vistariṃpani avasthalōnunnadi, sūkṣmāti sūkṣmarūpamulōnunnadi - prakṛti sṛṣṭi prāraṃbhamunaku muṃdu unna sthiti - sat anagā brahma).
(īśānāśyōpaniṣat), (taittirīyōpaniṣat)
(brahmanu asattugā - lēnivāninigā - telisikoninavāḍu asattē yagunu, lēnivāḍē yagunu. okacōṭa sat nuṃḍiyu, okacōṭa asattu nuṃḍiyu, oka cōṭa svabhāvamunuṃḍiyu jagattu puṭṭinaṭlu ceppabaḍi naṭlu kanabaḍucunnadi - kāni, “asannēvasa bhavati, asadbrahmēti cēt vēda” ani ceppuṭavalana asat brahmamu ani ceppinadi trōsivēyabaḍinadi. “asti brahmēti cēdvēda” ani ceppuṭacēta sattē brahmamani nirdhāraṇa cēyabaḍinadi. “sō akāmayata” ani ceppuṭacēta ‘sat’ nuṃḍiyē prapaṃcamu sṛṣṭiṃpabaḍi nadi ani ceppabaḍinadi. “tatsatyamityā dakṣatē” ani sattu guṟiṃci ceppanadi spaṣṭamucēsi nirdhāraṇa cēyabaḍinadi).
(pai dānini baṭṭi - ‘asat’ guṟiṃci ceppina vēdavākyamulu ī rītigā grahiṃcavalasiyunnadi - sūkṣma rūpamulōnuṃḍi sṛṣṭiki unmukhamugānunna prakṛtiyokka avastha, lēka avyaktamu, lēka caturmukha brahma - aṃtēgāni asat anagā śūnyamani arthamukādu).
(ī prapaṃcamaṃtaṭikī kāraṇamanunadi kaladu. kāraṇamulēka ī prapaṃcakamu anē kāryamu kalugadu - brahmajñānamu lēkapōvuṭavalana kalpitamainadi, nijamugā prapaṃcamulēdu, aṃtā brahmamē. aṭṭi brahma maṃdu kalpitamaina ī prapaṃcamu brahmajñānamu kaliginayaḍala naśiṃcunu - anagā, aṃtayu brahmamē anu jñānamu kalugunu. cīkaṭilō trāḍunu cūci adi pāmu anukoninaṭṭi (kalpitamu) ajñānamu, adi nijamugā trāḍēgāni pāmukādu anu jñānamu kalugaganē naśiṃcunu - trāḍulō pāmu kalpitamu ayinaṭlu brahmalō prapaṃcamu kalpitamu. aṃducēta adaṃtā asat. trividhaparicchēdamu kaladi - anagā dēśamu valana, kālamu valana paricchinnamainadi - puṭṭuka, cāvu kaladi aguṭavalana - trāḍu, pāmuvale - asat, nijamainavikāvu, kalpitamulu. kalalō kannavastuvuluvale sarvamu mṛṣayē. vīṭivale adhyastamaina vastuvuvēdiyunu sat kādu, adi asattē. kāraṇamu kalaviyaguṭavalananu, pramāṇamu lēnidaguṭavala nanu, vikāramu - puṭṭuṭa, peruguṭa, naśiṃcuṭa modalagumārpulu - lēnidaguṭavalananu, caṃcala mainadi - sthiramugā okērītigā, okē cōṭa, okē vastuvunaṃdu uṃḍakapōvunavi - aguṭavalananu, ghaṭamu, aṃkuramu modalagu asadvastuvulanniṃṭiki kāraṇamu sat padārthamu. kāryamagu ī prapaṃcamu aṃtā asattē ayina yaḍala idaṃtayu asattucēniṃḍi vyāpiṃci yuṃḍavalenu. kāni, asattu ātmakādu, ātma guṇamulu lēnidi. aṃducēta asattu kāraṇamukādu. sattē kāraṇamu. adiyē śāśvatamainadi. adiyē ī prapaṃcamunaṃtaṭini - dānilōni vastuvulanniṃṭinī, puṭṭiṃcunadi.)
(baṃdhamunu kaligiṃcu dēhamu modalaguvāṭiki vāṭikāraṇamanunadi vēṟokaṭi yuṃḍuṭacēta satya tvamu lēdu - adi śāśvatamugā nuṃḍuṭalēdu - aṃducēta avi asat. ā prakāramugānē cidānaṃdamu, aparicchinnamu ayina- sadvastuvunaku - sattuku - abhāvamu - lēkuṃḍuṭa, - asatyata, ellapuḍu lēkapōvuṭa anunadi - lēdu; aṃducēta adi sat).
(ōṃ aninanu, tat aninanu, sat aninanu - ī mūḍuvidhamula parabrahmamē nirdēśiṃpabaḍinadi. aṃdu cēta sat anagā brahma. idi kānidi asat).
(sadbhāvamunanu - anagā bhagavaddhyānamu cēyunapuḍu, maṃcidi anu bhāvamu kaliginapuḍunu - sat anumāṭa upayōgiṃpabaḍucunnadi. praśastamaina karma cēyunapuḍunu, adi satkarma - ani ceppuṭakaladu - yajñamu, tapassu, dānamu modalagukarmalu cēyucu vīṭiyaṃdu niṣṭakaligiyuṃḍuṭa sat ani ceppabaḍu cunnadi. saduddēśamutō - maṃci uddēśamutō cēyabaḍu karmalanniyu, paramātma prītikoṟaku cēyabaḍu cunnavi kanuka avanniyu ‘sat’ aniyē ceppabaḍucunnavi - udā - satkāryamu, satpuruṣuḍu, sadabhi prāyamu, satsaṃgamu modalagunavi. ī paina ‘sat’ ani ceppabaḍinavāṭiki vyatirēkamainavi asat).
(‘sat’ anagā ātma, ‘ātmanaḥ anyaṃ, ātmavyatiriktaṃ’ ātmakānidi, ātmaku vyatiriktamainadi ‘asat’).
asadityucyatē pārtha na ca tatprētya nō iha ||“. (śrīmadbhagavadgīta - 17 - 28)
(aśraddhatō cēsina hōmamu, dānamu, tapassu ‘asat’ ani ceppabaḍucunnadi. aṭṭi kriya ī lōkamunagāni, paralōkamunagāni ēmiyu phalamu nosagadu)
“yasmāt sarvatra śraddhāprādhānyatayāsarvaṃ saṃpādyatē tasmāt aśraddhayā hutaṃ - havanaṃ kṛtaṃ -. aśraddhayādattaṃ brāhmaṇēbhyaḥ, aśraddhayā tapastaptaṃ - anuṣṭhitaṃ - tathā aśraddhayā ēvakṛtaṃ ca yat stuti namaskārādi, tatsarvaṃ asat ityucyatē - matprāpti sādhanamārga bāhyatvāt,na ca tatbahuḷāya samapi prētya phalāyanō api ihārthaṃ sādubhiḥ niṃditatvāt " (śrīśaṃkaraḥ)
(anniṃṭilōnu - anni panulalōnu śraddha pradhānamugā nuṃḍuṭavalananē anniyu prāptiṃcu cuṃḍuṭacēta,aśraddhatō cēsina hōmamu, brāhmaṇulakoṟaku iccina dhanamu modalagu dānamu, cēsina tapassu, bhagavaṃtuni guṟiṃci cēsina namaskāramu, stōtramu - ivanniyu asattē ani ceppabaḍucunnavi - eṃducētananagā iṭṭivi anniyu bhagavatprāpti sādhanamulukāvu - aṃducēta, vāṭiyaṃdu śraddhalēka cēyuṭavalla avi eṃta āyāsamutō cēsinanu avi phalamu nivvavu).
nāmarūpa prakāśamulēka sūkṣmāvasthalōnunna prapaṃcamē śūnyamuvale tōcuṭacēta aupacārakamugā ‘asat’ ani ceppabaḍucunnadi.
māyatōkūḍina padārthamu śāśvatamugā uṃḍunadikādu aṃducēta adi asat - sat anunadi ādilēnidi, aṃtamulēnidi, aṃducēta nāśamulēnidi. ī satpadārthamunaku viparītamainadi asat..
“sadasaccāhamarjuna” (śrīmadbhagavadgīta - 9 - 19)
(sṛṣṭilōni sadvastuvulu, asadvastuvulu, ātma, anātma vastuvulanniyu nēnē ani śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu. sat anagā parabrahmamu. asat anagā brahmakānivi - anagā, avyaktamu - prakṛti, caturmukhabrahma - aparaṃ brahma dānilōnuṃḍina vastuvulanniyu bhagavatuḍē –
“tatṛṣṭyā tadēvānu prāviśat, tadanu praviśya sacca, tyacca abhavat” -
(bhagavaṃtuḍu lōkamulanu sṛṣṭiṃci, aṃdulōni prativastuvu sat, tyat - ātma anātma vastuvulanniyutānē āyenu. ī sṛṣṭilōni samasta vastuvulu parabrahmalōnuṃḍi - okadānilōnuṃḍi okaṭigā - puṭṭinavi.baṃgāramutō cēsina vastuvulanniyu baṃgārapu vastuvulē ayanaṭlu bhagavaṃtunilōnuṃḍi puṭṭina vastuvuvulanniyu bhagavaṃtuni rūpamulē. aṃducēta anni vastuvulū atanē. kummarivāḍu kuṃḍalu, kūjālu cēyuṭaku maṭṭi kāvalasinaṭlu bhagavaṃtuḍu prapaṃcamunu sṛṣṭiṃcuṭaku prakṛtini (raw material) sṛṣṭiṃcenu - prakṛti jaḍamu - (inert) svayamugā ēpanini cēyalēdu - bhagavaṃtuḍu - tana caitanyaśaktitō dānilō pravēśiṃci, dānilō pūrtigā vyāpiṃci, dānicēta sṛṣṭilōni vastuvulanu cēyiṃcu cunnāḍu - aṃducēta sṛṣṭilōni prativastuvulōnu prakṛti aṃśa bhagavaṃtuni aṃśa unna prakṛti aṃśa, cicchakti atanē - aṃducēta sadvastuvu, asadvastuvu - ātma, anātma, cit, acit anniyu atanē. prapaṃcamulōni vastuvulanniyu parabrahmamē - iṃkoka vastuvēdiyunu lēdu - aṃducētanē parabrahma advayuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.