← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసత్సంగతి asatsaṃgati

Original — తెలుగు
  1. దుష్టసహవాసము; సత్పురుషులుగానివారితో పొత్తు.

  2. “వ. --- విద్వాంసులు సంగంబింద్రియార్థాద్య సద్విషయంబుగ నొనరింపబడి జీవునకు నశిధిలంబగు బంధంబునకు గారణంబగుననియు - - - దెలియుదురు”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 25 -874)

(ఇంద్రియములకు విషయములైన భోగాదులసంగము అసత్సంగమని, వాటివలన ఎడతెగని బంధముకలిగి సంసారములో ముంచునని విద్వాంశులు తెలియుదురు).

  1. “సీ. జనయిత్రి! సత్యంబు, శౌచంబు, దయయును, ధృతియు, మౌనంబు, బుద్ధియును, సిగ్గు

క్షమయును, యశమును, దమమును మొదలగుగాగల గుణంబులు నశించు

జనులకసత్సంగమున, నని యెఱిగించి వెండియు నిట్లను - వినుము – మూఢ

హృదయులు, శాంతి విహీనులు, దేహాత్మబుద్ధులు నంగనా మోహపాశ

తే. బద్ధకేళీ మృగంబులపగిది దగిలి

పరవశస్వాంతముల శోచ్య భావులైన

వారిసంగతి విడువంగవలయు నందు

నంగనాసంగమము దోషమండ్రు; గాన”. (పోతన తెలుగుభాగవతం - 3 - 1006)

“తే. రూఢి నామాయ గామినీరూపమునను

బురుషులకునెల్ల మోహంబు బొందజేయు

గాన, బురుషులు సతులసంగంబుమాని

యోగవృత్తి చరించుచునుండవలయు “. (పోతన తెలుగుభాగవతం - 3 -1008)

Transliteration
  1. duṣṭasahavāsamu; satpuruṣulugānivāritō pottu.

  2. “va. --- vidvāṃsulu saṃgaṃbiṃdriyārthādya sadviṣayaṃbuga nonariṃpabaḍi jīvunaku naśidhilaṃbagu baṃdhaṃbunaku gāraṇaṃbagunaniyu - - - deliyuduru”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 25 -874)

(iṃdriyamulaku viṣayamulaina bhōgādulasaṃgamu asatsaṃgamani, vāṭivalana eḍategani baṃdhamukaligi saṃsāramulō muṃcunani vidvāṃśulu teliyuduru).

  1. “sī. janayitri! satyaṃbu, śaucaṃbu, dayayunu, dhṛtiyu, maunaṃbu, buddhiyunu, siggu

kṣamayunu, yaśamunu, damamunu modalagugāgala guṇaṃbulu naśiṃcu

janulakasatsaṃgamuna, nani yeṟigiṃci veṃḍiyu niṭlanu - vinumu – mūḍha

hṛdayulu, śāṃti vihīnulu, dēhātmabuddhulu naṃganā mōhapāśa

tē. baddhakēḷī mṛgaṃbulapagidi dagili

paravaśasvāṃtamula śōcya bhāvulaina

vārisaṃgati viḍuvaṃgavalayu naṃdu

naṃganāsaṃgamamu dōṣamaṃḍru; gāna”. (pōtana telugubhāgavataṃ - 3 - 1006)

“tē. rūḍhi nāmāya gāminīrūpamunanu

buruṣulakunella mōhaṃbu boṃdajēyu

gāna, buruṣulu satulasaṃgaṃbumāni

yōgavṛtti cariṃcucunuṃḍavalayu “. (pōtana telugubhāgavataṃ - 3 -1008)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.