← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసత్యము asatyamu

Original — తెలుగు
  1. సత్యముకానిది; అబద్దము, బొంకు -

  2. “జగత్తు సత్యము” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 6 - 1)

(ఎల్లకాలములందు ఉండనిది - అందుచేత అసత్యము).

  1. “అసత్యంబులైన గృహ క్షేత్ర పశు, ధన సుత వధూ బాంధవాది | వివిధ వస్తువులను - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 30 -)

  2. జగదే తత్ సత్య శబ్ద నిర్దిష్ట బ్రహ్మ కార్య తయా బ్రహ్మాత్మకం ఇతి సతత్ అసత్యం.

(సత్యము అనగా మూడుకాలములందు ఉండునది, శాశ్వతముగానుండునది. అట్టిది బ్రహ్మ.బ్రహ్మయొక్క కార్యము ఈ ప్రపంచము బ్రహ్మ సృష్టించినది. అందుచేత ఈ జగత్తుబ్రహ్మాత్మకము - బ్రహ్మరూపమే - అందుచేత అసత్యముకాదు).

(నామరూపములుగలది నశించునదే - జగత్తు నామరూపములు గలది కనుక నశించునదే, అందుచేత అసత్యము).

“ఆ. వారిజాక్షులందు, వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చునఘమునొందడధిప” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 19 - 588)

(ఇది శుక్రనీతి - దీనికి బలిచక్రవర్తి అంగీకరించలేదు.అబద్దము అబద్దమే - హరిశ్చంద్రుడు ఇటువంటి స్థితులలోకూడ అబద్దమాడలేదు).

Transliteration
  1. satyamukānidi; abaddamu, boṃku -

  2. “jagattu satyamu” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 6 - 1)

(ellakālamulaṃdu uṃḍanidi - aṃducēta asatyamu).

  1. “asatyaṃbulaina gṛha kṣētra paśu, dhana suta vadhū bāṃdhavādi | vividha vastuvulanu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 30 -)

  2. jagadē tat satya śabda nirdiṣṭa brahma kārya tayā brahmātmakaṃ iti satat asatyaṃ.

(satyamu anagā mūḍukālamulaṃdu uṃḍunadi, śāśvatamugānuṃḍunadi. aṭṭidi brahma.brahmayokka kāryamu ī prapaṃcamu brahma sṛṣṭiṃcinadi. aṃducēta ī jagattubrahmātmakamu - brahmarūpamē - aṃducēta asatyamukādu).

(nāmarūpamulugaladi naśiṃcunadē - jagattu nāmarūpamulu galadi kanuka naśiṃcunadē, aṃducēta asatyamu).

“ā. vārijākṣulaṃdu, vaivāhikamulaṃdu prāṇa vitta māna bhaṃgamaṃdu jakita gōkulāgra janma rakṣaṇamaṃdu boṃkavaccunaghamunoṃdaḍadhipa” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 19 - 588)

(idi śukranīti - dīniki balicakravarti aṃgīkariṃcalēdu.abaddamu abaddamē - hariścaṃdruḍu iṭuvaṃṭi sthitulalōkūḍa abaddamāḍalēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.