← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అస్మితా asmitā

Original — తెలుగు
  1. అస్మి ఇత్యస్యభావః అస్మితా - దేహే అహం ఇత్యభిమానః.

(‘అస్మి’ = అయితిని అను దాని భావము. అస్మితా - శరీరమందు తానే అను అభిమానము).

  1. బుద్ధ్యాత్మనోః అవివేకేన అభేధ ధీః అస్మితా -

(ఆత్మ ఏది, బుద్ధి ఏదో - ఈ రెండింటికిని భేదములేదని అవివేకమువలన తలచుట, - ఈ రెండు ఒకటే అని తలచుట).

‘ఇయమేవ సామాన్యాహంకారః ఇత్యుచ్యతే -’

(ఇదియే సామాన్యాహంకారమని చెప్పబడుచున్నది). (విచారసాగరము)

  1. “దృక్ దర్శన శక్త్యోరేకాత్మతా వాస్మితా”. (పతంజలి - యోగసూత్రములు - 2 - 6)

(చూచువాడు - అనగా, ఆత్మ -, చూడబడునది, అనగా ప్రపంచము - దానిలో కనబడు వస్తువులు -ఈ రెండును ఒకటే అనుకొనుట -)

  1. “సంపన్నాస్మి, కృశాస్మి, స్నేహోత్తారో అస్మి, మోదమానో (అ) స్మి, ప్రాణిమి, శూన్యోస్మి ఇతి షట్సు పదేష్వస్మితా దృష్టా” (విరూపాక్ష పంచశిఖాయాః).

“సంపత్ గృహ క్షేత్రాదేః విషయస్య ధర్మః, కార్శ్యం దేహస్య స్నేహః చక్షురాదేరింద్రియస్య, మోదో (అ) o తః కరణస్య ప్రాణనం వాయోః శూన్యతా, సుషుప్త పదస్య మాయా పర్యాయ పదస్య ఏషు విషయాదిషు షట్సు, అస్మితా దృష్టా అహం అభిమానః స్వానుభవ సిద్ధః -

(నేను సంపన్నుడను, గృహము, భూములు మొదలగు సంపత్తి గలవాదను, అనగా విషయభోగములు గలవాడననిన్నీ నా శరీరము శుష్కించిపోయినది, నీరసించిపోయినదనిన్నీ. కన్ను మొదలగు ఇంద్రియములవలన కలుగు స్నేహము కలిగియున్నాననిన్నీ, మనస్సులో సంతోషముకలిగి కలిగియున్నాడననిన్నీ ప్రాణముకలవాడననిన్నీ, (జీవించియున్నవాడననిన్నీ) మాయవలన ఏదీ లేదు అనువాడననిన్నీ, - ఈ విధముగా మనసు కలిగియుండుట అస్మితా) - (అనగా విషయధర్మములకు, దేహధర్మములకు, మనో ధర్మములకు వశుడైయుండుట అస్మిత).

Transliteration
  1. asmi ityasyabhāvaḥ asmitā - dēhē ahaṃ ityabhimānaḥ.

(‘asmi’ = ayitini anu dāni bhāvamu. asmitā - śarīramaṃdu tānē anu abhimānamu).

  1. buddhyātmanōḥ avivēkēna abhēdha dhīḥ asmitā -

(ātma ēdi, buddhi ēdō - ī reṃḍiṃṭikini bhēdamulēdani avivēkamuvalana talacuṭa, - ī reṃḍu okaṭē ani talacuṭa).

‘iyamēva sāmānyāhaṃkāraḥ ityucyatē -’

(idiyē sāmānyāhaṃkāramani ceppabaḍucunnadi). (vicārasāgaramu)

  1. “dṛk darśana śaktyōrēkātmatā vāsmitā”. (pataṃjali - yōgasūtramulu - 2 - 6)

(cūcuvāḍu - anagā, ātma -, cūḍabaḍunadi, anagā prapaṃcamu - dānilō kanabaḍu vastuvulu -ī reṃḍunu okaṭē anukonuṭa -)

  1. “saṃpannāsmi, kṛśāsmi, snēhōttārō asmi, mōdamānō (a) smi, prāṇimi, śūnyōsmi iti ṣaṭsu padēṣvasmitā dṛṣṭā” (virūpākṣa paṃcaśikhāyāḥ).

“saṃpat gṛha kṣētrādēḥ viṣayasya dharmaḥ, kārśyaṃ dēhasya snēhaḥ cakṣurādēriṃdriyasya, mōdō (a) o taḥ karaṇasya prāṇanaṃ vāyōḥ śūnyatā, suṣupta padasya māyā paryāya padasya ēṣu viṣayādiṣu ṣaṭsu, asmitā dṛṣṭā ahaṃ abhimānaḥ svānubhava siddhaḥ -

(nēnu saṃpannuḍanu, gṛhamu, bhūmulu modalagu saṃpatti galavādanu, anagā viṣayabhōgamulu galavāḍananinnī nā śarīramu śuṣkiṃcipōyinadi, nīrasiṃcipōyinadaninnī. kannu modalagu iṃdriyamulavalana kalugu snēhamu kaligiyunnānaninnī, manassulō saṃtōṣamukaligi kaligiyunnāḍananinnī prāṇamukalavāḍananinnī, (jīviṃciyunnavāḍananinnī) māyavalana ēdī lēdu anuvāḍananinnī, - ī vidhamugā manasu kaligiyuṃḍuṭa asmitā) - (anagā viṣayadharmamulaku, dēhadharmamulaku, manō dharmamulaku vaśuḍaiyuṃḍuṭa asmita).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.