← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశోచ్యాః aśōcyāḥ

Original — తెలుగు
  1. న శోచ్యాః (విచారించ తగనివి).

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ బాషసే |

గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||. (శ్రీమద్బ్గవద్గీత - 2 - 11)

(శోకింపతగని వాటిని గుఱించి శోకించుచున్నావు. శోకింపతగనివి ఏవి అనగా : - “గతా సూన గతాసూంశ్చనాను శోచంతి పండితాః” (మరణించినవాటి గుఱించిగాని, జీవించియున్నవాటి గుఱించిగాని పండితులు జ్ఞానులు శోకించరు. ఎందుచేతననగా “అంతవంత ఇమే దేహాః” (శ్రీమద్భగవద్గీత - 2 - 18)

(ఈ దేహములు నిత్యములుకావు, నశించునవియే).

“వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో (అ) పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సం యాతి నవాని దేహీ ||” (శ్రీమధగవద్గీత - 2 - 22)

(నరుడు చినగిన బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను దాల్చినట్లు, జీర్ణమయిన దేహమును - అనగా, జీవుడు నివసించియుండుటకుతగిన స్థితిలోలేని దేహమును -విడిచి మఱియొక కొత్తదేహమును పొందును. అందుచేత ఈ దేహమును విడిచిపెట్టుట గుఱించి దుఃఖించవలసిన అవసరములేదు - బ్రతికియుండగాకూడ ఈ దేహమును గుఱించి విచారించవలసిన అవసరములేదు - ఎందుచేతననగా ఈ దేహమునకు శీతోష్ణములు, సుఖదుఃఖములు వచ్చుచు పోవుచుండును).

“యధా స్వప్నేమృతో బంధుః జీవన్వా శోచ్యతాం గతః |

నతన్నిమిత్తకో మోహో జాగరే (అ) ప్యనువర్తతే |

ఏవమజ్ఞాన జ భ్రాంత్యా కల్పితా బంధవోమృతాః |

జీవంతోవా న తే బోధే శోకమోహప్రదాః సతాం |

దేహాదేర్నశ్వరత్మాత్వాత్ నిత్తత్వా త్ప్రత్యగాత్మనః |

న శోచ్యాః ప్రాణినః సర్వేస్వాత్మ తత్వవిదాం సతాం||“. (గీతాభావప్రకాసము - 2 - 98 to 100)

(కలలోగన్న ఒక బంధువు చనిపోయినను జీవించియున్నను అతనిగుఱించి విచారించినను, మేలుకొనినతర్వాత అతని నిమిత్తమైన మోహము ఉండదు - ఈ ప్రకారముగానే అజ్ఞానమను మోహమువలన కల్పించబడిన బంధువులు జీవించియున్నను, చనిపోయినను, వారిగుఱించి జ్ఞానవంతులు - సత్పురుషులు - మోహముచెందరు - శోకము, మోహము మొదలగునవి నశించు స్వభావము కలవియగుటవలనను జీవాత్మ - ప్రత్యగాత్మ - నశించనివాడగుటచేతను, ఈ దేహము గుఱించి ఆత్మతత్వజ్ఞానముగలవారు శోకింపరు).

“ఉ. - - - దేహి పుట్టుచు |

జచ్చుచునుంట జూచెదరు, చావకమానెడి వారిభంగి, నీ |

చచ్చినవానికేడ్చెదరు చావునకొల్లక డాగవచ్చునే ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 2 - 46)

అందుచేత అశోచ్యములు.

  1. “మాయాగుణ ప్రపంచంబు నెఱుంగెడు తత్వజ్ఞులు నిత్యానిత్యంబుల గూర్చి సుఖదుఃఖంబులం జెందరు. అజ్ఞులు కొందఱు యోగవయోగంబులకు సుఖదుఃఖంబుల నొందుదురు” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 7 - 2 - 56)

“ఉ. - - - మీరు చచ్చుతఱిగానరు చచ్చి ధరిత్రిబడ్డ ధా

త్రీవిభుదేహముం గదిసి దీనత నేడువనేల ? పొండు, చిం

తావతులార ! వత్సర శతంబులకైన నిజేశు చక్కికిం

బోవుట దుర్లభంబు; మృతిబొందినవారలు సేరవత్తురే“. (శ్రీమదాంధ్ర,మహాభాగవతము - 7 - 2 - 67)

“తే. కర్మవశమున నెందు సుఖంబులేక

దేవతిర్యఙ్నృ యోనుల దిరుగు నాకు

వెలయ నే జన్మమందునో నీరు తల్లి

దండ్రులయినారు చెప్పవే తాపసేంద్ర”. (పోతన తెలుగు భాగవతం – 6-462)

“తే. బాంధవ జ్ఞాతిసుతులును బగతు రాత్మ

వరులుదాసీన మధ్యస్థవర్గములును

సరవి గనుచుందురోక్కొక్క జన్మమునను

నెఱయ బ్రాణికి నొకవావి నిజము గలదె“. (పోతన తెలుగు భాగవతం – 6-463)

(ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు తల్లి, తండ్రి అగుచున్నారు. ఈ బాంధవ్యము శరీరమునకే, అందులోఉన్న జీవునికి కాదు - అతడు పరమాత్ముని అంశ. జీవుడు వదలిన శరీరము నశించునదే - అందుచేత శరీరము గుఱించి, నశించు వస్తువులగుఱించి, శోకింప తగదు).

  1. “జనకుండెవ్వడు, జాతుడెవ్వడు జనిస్థానంబు లెచ్చోటులు - - - ఇంతయు విష్ణుమాయ - - జాయా విన్నబోనేటికిన్ ||”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము- --)

Transliteration
  1. na śōcyāḥ (vicāriṃca taganivi).

aśōcyānanvaśōcastvaṃ prajñāvādāṃśca bāṣasē |

gatāsūnagatāsūṃśca nānuśōcaṃti paṃḍitāḥ ||. (śrīmadbgavadgīta - 2 - 11)

(śōkiṃpatagani vāṭini guṟiṃci śōkiṃcucunnāvu. śōkiṃpataganivi ēvi anagā : - “gatā sūna gatāsūṃścanānu śōcaṃti paṃḍitāḥ” (maraṇiṃcinavāṭi guṟiṃcigāni, jīviṃciyunnavāṭi guṟiṃcigāni paṃḍitulu jñānulu śōkiṃcaru. eṃducētananagā “aṃtavaṃta imē dēhāḥ” (śrīmadbhagavadgīta - 2 - 18)

(ī dēhamulu nityamulukāvu, naśiṃcunaviyē).

“vāsāṃsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti narō (a) parāṇi |

tathā śarīrāṇi vihāya jīrṇā nyanyāni saṃ yāti navāni dēhī ||” (śrīmadhagavadgīta - 2 - 22)

(naruḍu cinagina baṭṭalanu viḍicipeṭṭi kotta baṭṭalanu dālcinaṭlu, jīrṇamayina dēhamunu - anagā, jīvuḍu nivasiṃciyuṃḍuṭakutagina sthitilōlēni dēhamunu -viḍici maṟiyoka kottadēhamunu poṃdunu. aṃducēta ī dēhamunu viḍicipeṭṭuṭa guṟiṃci duḥkhiṃcavalasina avasaramulēdu - bratikiyuṃḍagākūḍa ī dēhamunu guṟiṃci vicāriṃcavalasina avasaramulēdu - eṃducētananagā ī dēhamunaku śītōṣṇamulu, sukhaduḥkhamulu vaccucu pōvucuṃḍunu).

“yadhā svapnēmṛtō baṃdhuḥ jīvanvā śōcyatāṃ gataḥ |

natannimittakō mōhō jāgarē (a) pyanuvartatē |

ēvamajñāna ja bhrāṃtyā kalpitā baṃdhavōmṛtāḥ |

jīvaṃtōvā na tē bōdhē śōkamōhapradāḥ satāṃ |

dēhādērnaśvaratmātvāt nittatvā tpratyagātmanaḥ |

na śōcyāḥ prāṇinaḥ sarvēsvātma tatvavidāṃ satāṃ||“. (gītābhāvaprakāsamu - 2 - 98 to 100)

(kalalōganna oka baṃdhuvu canipōyinanu jīviṃciyunnanu ataniguṟiṃci vicāriṃcinanu, mēlukoninatarvāta atani nimittamaina mōhamu uṃḍadu - ī prakāramugānē ajñānamanu mōhamuvalana kalpiṃcabaḍina baṃdhuvulu jīviṃciyunnanu, canipōyinanu, vāriguṟiṃci jñānavaṃtulu - satpuruṣulu - mōhamuceṃdaru - śōkamu, mōhamu modalagunavi naśiṃcu svabhāvamu kalaviyaguṭavalananu jīvātma - pratyagātma - naśiṃcanivāḍaguṭacētanu, ī dēhamu guṟiṃci ātmatatvajñānamugalavāru śōkiṃparu).

“u. - - - dēhi puṭṭucu |

jaccucunuṃṭa jūcedaru, cāvakamāneḍi vāribhaṃgi, nī |

caccinavānikēḍcedaru cāvunakollaka ḍāgavaccunē ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 2 - 46)

aṃducēta aśōcyamulu.

  1. “māyāguṇa prapaṃcaṃbu neṟuṃgeḍu tatvajñulu nityānityaṃbula gūrci sukhaduḥkhaṃbulaṃ jeṃdaru. ajñulu koṃdaṟu yōgavayōgaṃbulaku sukhaduḥkhaṃbula noṃduduru” (śrīmadāṃdhramahābhāgavatamu- 7 - 2 - 56)

“u. - - - mīru caccutaṟigānaru cacci dharitribaḍḍa dhā

trīvibhudēhamuṃ gadisi dīnata nēḍuvanēla ? poṃḍu, ciṃ

tāvatulāra ! vatsara śataṃbulakaina nijēśu cakkikiṃ

bōvuṭa durlabhaṃbu; mṛtiboṃdinavāralu sēravatturē”. (śrīmadāṃdhra,mahābhāgavatamu - 7 - 2 - 67)

“tē. karmavaśamuna neṃdu sukhaṃbulēka

dēvatiryaṅnṛ yōnula dirugu nāku

velaya nē janmamaṃdunō nīru talli

daṃḍrulayināru ceppavē tāpasēṃdra”. (pōtana telugu bhāgavataṃ – 6-462)

“tē. bāṃdhava jñātisutulunu bagatu rātma

varuludāsīna madhyasthavargamulunu

saravi ganucuṃdurōkkokka janmamunanu

neṟaya brāṇiki nokavāvi nijamu galade”. (pōtana telugu bhāgavataṃ – 6-463)

(okkokka janmalō okkokkaru talli, taṃḍri agucunnāru. ī bāṃdhavyamu śarīramunakē, aṃdulōunna jīvuniki kādu - ataḍu paramātmuni aṃśa. jīvuḍu vadalina śarīramu naśiṃcunadē - aṃducēta śarīramu guṟiṃci, naśiṃcu vastuvulaguṟiṃci, śōkiṃpa tagadu).

  1. “janakuṃḍevvaḍu, jātuḍevvaḍu janisthānaṃbu leccōṭulu - - - iṃtayu viṣṇumāya - - jāyā vinnabōnēṭikin ||”.

(śrīmadāṃdhramahābhāgavatamu- --)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.