“న శోషయతి మారుతః” (శ్రీమద్భగవద్గీత - 2 - 23)
“అచ్ఛేద్యో (అ) యమదాహ్యో (అ) యమక్లేద్యో (అ) శోష్య ఏవ చ |”. (శ్రీమద్భగవద్గీత - 2 - 24)
(వాయువు ఆత్మను నీరసింపచేయలేదు. ఎందుచేతననగా –
(వాయువు బలవంతమైనదైనను ఆత్మను నీరసింప చేయలేదు - శస్త్రములు, అగ్ని, నీరు, గాలి - ఇవి ఇతరవస్తువులను నాశము చేయగలవు అని లోకములో ప్రసిద్ధిగలవైనను వాటిలో ఉన్నది ఆత్మయే. వాటిలో అంతరాత్మగా ఆత్మ ఉండి వాటికి వాటి వాటి శక్తిని కలిగించకపోయిన యడల అవి ఏమియు చేయలేవు. )
(శస్త్రములు, అగ్ని, వాయువు, జలము - ఈ మూడింటికి వాటి వాటి పనులు చేయుటకు - వృత్తులు చేయుటకుకావలసిన సత్తా - సత్తువు, శక్తి, చైతన్యము - కలుగచేయునదియే ఆత్మ. వాటిలో అంతర్యామిగానుండి వాటిని వాటి వాటి పనులలో ప్రేరేపించునది ఆత్మ. వాటిలోపల ఆత్మ లేకపోయిన యడల అవి ఆ పనులు ఎట్లు చేయగలవు ? ప్రాణము పోయిన మనిషి ఏ పనినైనను చేయగలడా ? చనిపోయిన చెట్టు చిగురించునా).
(ఆత్మలో ద్రవ్యము - ద్రవము - లేకుండుటచేత వాయువు ఆత్మను నీరసింపచేయలేదు).
“na śōṣayati mārutaḥ” (śrīmadbhagavadgīta - 2 - 23)
“acchēdyō (a) yamadāhyō (a) yamaklēdyō (a) śōṣya ēva ca |”. (śrīmadbhagavadgīta - 2 - 24)
(vāyuvu ātmanu nīrasiṃpacēyalēdu. eṃducētananagā –
(vāyuvu balavaṃtamainadainanu ātmanu nīrasiṃpa cēyalēdu - śastramulu, agni, nīru, gāli - ivi itaravastuvulanu nāśamu cēyagalavu ani lōkamulō prasiddhigalavainanu vāṭilō unnadi ātmayē. vāṭilō aṃtarātmagā ātma uṃḍi vāṭiki vāṭi vāṭi śaktini kaligiṃcakapōyina yaḍala avi ēmiyu cēyalēvu. )
(śastramulu, agni, vāyuvu, jalamu - ī mūḍiṃṭiki vāṭi vāṭi panulu cēyuṭaku - vṛttulu cēyuṭakukāvalasina sattā - sattuvu, śakti, caitanyamu - kalugacēyunadiyē ātma. vāṭilō aṃtaryāmigānuṃḍi vāṭini vāṭi vāṭi panulalō prērēpiṃcunadi ātma. vāṭilōpala ātma lēkapōyina yaḍala avi ā panulu eṭlu cēyagalavu ? prāṇamu pōyina maniṣi ē paninainanu cēyagalaḍā ? canipōyina ceṭṭu ciguriṃcunā).
(ātmalō dravyamu - dravamu - lēkuṃḍuṭacēta vāyuvu ātmanu nīrasiṃpacēyalēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.