సర్వం వ్యాప్య అవస్థి తస్యాపి వ్యాప్య వస్తుగత దోషాస్పర్శే దృష్టాంతం - “జ్యోతి రాకాశ మివ విస్తృత మితి - విస్తృతం ఆకాశ ఇవ, జ్యోతిః సూర్యాదిరివ ఇతి దృష్టాంత ద్వయం. అభిప్రేతం. తథాహి ఉభయం దృష్టాంతీకృతం అభియుక్తైః - ఆకాశమేకం హి యథా ఘటాదిషు పృథక్ తథా ఆత్మా ఏకోహి, అనేకస్థో జాలాధారేషు ఇవ అంశుమాన్ ఇతి, అయం అభిప్రాయః - ఘటకరకాదిషు యథా వృద్ధి హ్రాస భాక్షు పృధక్ పృధక్ సం యుజ్యమానం అపి ఆకాశం | దోష హేత్వ భావాత్ వృద్ధిహ్రాసాది దోషై ర్నస్పృశ్యతే తద్వత్. యథా చ జలాధారేషు విషమేషు వస్తుతః అవస్థితః తత్రదృశ్య మానోపి అంశు మాన్ దోషహేత్వభావాత్ తత్తద్గత వృద్ధి హ్రాసాది భిః నస్పృశ్యతే తద్వదితి. (భగవంతుడు అన్నివస్తువులలోను వ్యాపించియున్నను ఆ ప్రకారము తాను వ్యాపించియున్న వస్తువుల దోషములను అంటడు - ఆ వస్తువుల దోషము భగవంతుని అంటవు - ఈ విషయమై దృష్టాంతము - అన్నింటిలోను వ్యాపించియున్న ఆకాశమువలెనూ, అన్నింటినీ ప్రపకాశింప చేయు సూర్యుని వలెను - అని రెండు దృష్టాంతములు బ్రహ్మజ్ఞానులచేత చెప్పబడినవి. ఆకాశము ఒకటే అయినప్పటికీ అనేక ఘట ములందు ఉంటూ అనేకముగా వేఱు వేఱుగా కనబడును - ఆ ప్రకారముగానే ఆత్మ ఒకటే అయినప్పటికీ అది యున్న ఉపాధులనబట్టి వేఱు వేఱుగా అనేకముగా కనబడును - సూర్యుడు ఒకడే అయినను అనేక జలాధారములలో ప్రతిబింబించుచు అనేకములుగా కనబడును - దీని భావమేమనగా - ఘటము మొద లగునవి చిన్నవి అయినను, పెద్దవి అయినను పలువిధముల భేదములతో నున్నవైనను, అందులోనుండు ఆకాశమునకు ఆ ఘటముల దీర్ఘ హ్రస్వ దోషములు - పెద్దది, చిన్నది అనుమొదలగు దోషములు - అంటవు. ఆ ప్రకారముగానే నీటితోనిండియున్న అనేకమైన జలాధారములలో వాస్తవముగా నుండక పోయినను ఉన్నట్లు ప్రతిబింబించియున్న సూర్యుడు వాటి దోషములులేనివాడగుటవలన, పెద్దది, చిన్నది మొదలగు దోషములనంటడు - అట్టి విధమైన దోషములు సూర్యుని అంటవు. ఆ ప్రకారముగానే - ఈ రెండు దృష్టాంతముల ప్రకారము పరమాత్మ కూడ వేఱు వేఱు ఉపాధులలోనుండి వేఱు వేఱుగా కన బడినను ఆయా ఉపాధులయొక్క దోషములు అతనిని అంటవు - అందుచేత భగవతుడు అస్పర్శుడు).
sarvaṃ vyāpya avasthi tasyāpi vyāpya vastugata dōṣāsparśē dṛṣṭāṃtaṃ - “jyōti rākāśa miva vistṛta miti - vistṛtaṃ ākāśa iva, jyōtiḥ sūryādiriva iti dṛṣṭāṃta dvayaṃ. abhiprētaṃ. tathāhi ubhayaṃ dṛṣṭāṃtīkṛtaṃ abhiyuktaiḥ - ākāśamēkaṃ hi yathā ghaṭādiṣu pṛthak tathā ātmā ēkōhi, anēkasthō jālādhārēṣu iva aṃśumān iti, ayaṃ abhiprāyaḥ - ghaṭakarakādiṣu yathā vṛddhi hrāsa bhākṣu pṛdhak pṛdhak saṃ yujyamānaṃ api ākāśaṃ | dōṣa hētva bhāvāt vṛddhihrāsādi dōṣai rnaspṛśyatē tadvat. yathā ca jalādhārēṣu viṣamēṣu vastutaḥ avasthitaḥ tatradṛśya mānōpi aṃśu mān dōṣahētvabhāvāt tattadgata vṛddhi hrāsādi bhiḥ naspṛśyatē tadvaditi. (bhagavaṃtuḍu annivastuvulalōnu vyāpiṃciyunnanu ā prakāramu tānu vyāpiṃciyunna vastuvula dōṣamulanu aṃṭaḍu - ā vastuvula dōṣamu bhagavaṃtuni aṃṭavu - ī viṣayamai dṛṣṭāṃtamu - anniṃṭilōnu vyāpiṃciyunna ākāśamuvalenū, anniṃṭinī prapakāśiṃpa cēyu sūryuni valenu - ani reṃḍu dṛṣṭāṃtamulu brahmajñānulacēta ceppabaḍinavi. ākāśamu okaṭē ayinappaṭikī anēka ghaṭa mulaṃdu uṃṭū anēkamugā vēṟu vēṟugā kanabaḍunu - ā prakāramugānē ātma okaṭē ayinappaṭikī adi yunna upādhulanabaṭṭi vēṟu vēṟugā anēkamugā kanabaḍunu - sūryuḍu okaḍē ayinanu anēka jalādhāramulalō pratibiṃbiṃcucu anēkamulugā kanabaḍunu - dīni bhāvamēmanagā - ghaṭamu moda lagunavi cinnavi ayinanu, peddavi ayinanu paluvidhamula bhēdamulatō nunnavainanu, aṃdulōnuṃḍu ākāśamunaku ā ghaṭamula dīrgha hrasva dōṣamulu - peddadi, cinnadi anumodalagu dōṣamulu - aṃṭavu. ā prakāramugānē nīṭitōniṃḍiyunna anēkamaina jalādhāramulalō vāstavamugā nuṃḍaka pōyinanu unnaṭlu pratibiṃbiṃciyunna sūryuḍu vāṭi dōṣamululēnivāḍaguṭavalana, peddadi, cinnadi modalagu dōṣamulanaṃṭaḍu - aṭṭi vidhamaina dōṣamulu sūryuni aṃṭavu. ā prakāramugānē - ī reṃḍu dṛṣṭāṃtamula prakāramu paramātma kūḍa vēṟu vēṟu upādhulalōnuṃḍi vēṟu vēṟugā kana baḍinanu āyā upādhulayokka dōṣamulu atanini aṃṭavu - aṃducēta bhagavatuḍu asparśuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.