← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్ట ప్రకృతులు aṣṭa prakṛtulu

Original — తెలుగు
  1. మూల ప్రకృతిః, మహదహంకారౌ, పంచతన్మాత్రాణి చ ఇత్యష్టౌ.

  2. అవ్యక్తం, మహదహంకారౌ, పంచతన్మాత్రాణి చేత్యష్ట ప్రకృతయః - శేషాః షోడశ వికారాః.

(ప్రకృతులు ఎనిమిది - అవి పాఠభేదమువలన వేఱు వేఱుగా చెప్పబడినవి - మూల ప్రకృతి - లేక అవ్యక్తము -, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు - అనగా పంచీకరణముగాని పంచభూతములు. ఈ ఎనిమిది అష్టప్రకృతులు - ఇరువదినాలుగు తత్వములలోఈ ఎనిమిదికాక మిగిలినవి ప్రకృతియొక్క వికారములు.)

“భూమిరాపో (అ) నలో వాయుః ఖం, మనో బుద్ధిరేవ చ |

అహంకార ఇతీయం మేభిన్నా ప్రకృతిరష్టధా ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 4)

(పంచభూతములూయిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మనస్సు, బుద్ధి - ఈ ప్రకారముగా నాయొక్క ప్రకృతి (భగవంతుని శక్తి అయిన ప్రకృతి) ఎనిమిది విధములుగా విభజింపబడియున్నవి - ఎనిమిది రూపములుగా ఉన్నది).

“శ్లో ||. భూమ్యాది పంచభూతాని సూక్ష్మావస్థాత్మకానిచ |

తన్మాత్రాణ్యేవ లక్ష్యంతే, మనో (అ) హంకార ఉచ్యతే |

బుద్ధి శబ్దాన్మహత్తత్వ మహంకారస్య కారణం |

అవిద్యాత్మకమవ్యక్తం వాసనానంత్య వాసితం |

అహంకార పదేనోక్తం సర్వకారణకారణం |

ఇత్యేవముక్తరీత్యేయం సాక్షి భాస్యతయాష్టగా |

శక్తిః పరమ ధర్మాభ్యా అనిర్వా చ్యా త్రిగుణాత్మికా |

ప్రకారై రష్ట భిర్చేధమా గతా పారమేశ్వరీ |

అంతర్భూతో (అ) త్ర సర్వోపి జడవర్గః ప్రపంచగః ||” (గీతాభావప్రకాశము - 7 - 28 to 32)

(భూమి మొదలుగాగల పంచభూతములు - అనగా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము - ఇవి సూక్ష్మావస్థలో ఉన్నవాటిని (శబ్దాదులను) తన్మాత్రలందురు. ఇచ్చట మనస్సు అనగా అహంకారమనియర్థము - అహంకారమునకు కారణమైన మహత్తత్వము బుద్ధి యని ఇచ్చట చెప్పబడినది. అహంకారమనగా అవ్యక్తమని గ్రహించ వలెను - పైన చెప్పబడిన ప్రకారముగా ప్రకృతి ఎనిమిది విధములుగా నున్నది. ఈ ప్రకృతి సత్వరజస్తమోగుణములను త్రిగుణములతో కూడి యుండునది. ఇది అనిర్వాచ్యము - ఇది ఇట్టిది అని చెప్పుటకు అలవికానిది. ఇది పరమేశ్వరుని శక్తియే. సమస్తమైన జడప్రపంచము దీనిలో నిమిడియున్నది.)

  1. “మూల ప్రకృతి రవికృతిర్మహ దాద్యాః ప్రకృతి వికృతయః సప్త; షోడశకశ్చ వికారో, నప్రకృతిర్నవికృతిః పురుషః” (కాపిల సాంఖ్యా కారికా).

(మూల ప్రకృతి అవికృతి - వికృతులు, మార్పులు లేనిది, మహత్తత్త్వము మొదలగు ఏడున్నూ ప్రకృతియొక్క వికృతులు. 24 తత్వములలో మిగిలిన 16 తత్వములు వికారములు - 25వ తత్వము అయిన పురుషుడు ప్రకృతికాడు, వికృతికాడు).

  1. పైనచెప్పిన ఎనిమిది తత్వములు ఇంద్రియములకు గోచరించునవికావు - సూక్ష్మతత్వములు
Transliteration
  1. mūla prakṛtiḥ, mahadahaṃkārau, paṃcatanmātrāṇi ca ityaṣṭau.

  2. avyaktaṃ, mahadahaṃkārau, paṃcatanmātrāṇi cētyaṣṭa prakṛtayaḥ - śēṣāḥ ṣōḍaśa vikārāḥ.

(prakṛtulu enimidi - avi pāṭhabhēdamuvalana vēṟu vēṟugā ceppabaḍinavi - mūla prakṛti - lēka avyaktamu -, mahattatvamu, ahaṃkāramu, paṃcatanmātralu - anagā paṃcīkaraṇamugāni paṃcabhūtamulu. ī enimidi aṣṭaprakṛtulu - iruvadinālugu tatvamulalōī enimidikāka migilinavi prakṛtiyokka vikāramulu.)

“bhūmirāpō (a) nalō vāyuḥ khaṃ, manō buddhirēva ca |

ahaṃkāra itīyaṃ mēbhinnā prakṛtiraṣṭadhā ||“. (śrīmadbhagavadgīta - 7 - 4)

(paṃcabhūtamulūyina bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu, ahaṃkāramu, manassu, buddhi - ī prakāramugā nāyokka prakṛti (bhagavaṃtuni śakti ayina prakṛti) enimidi vidhamulugā vibhajiṃpabaḍiyunnavi - enimidi rūpamulugā unnadi).

“ślō ||. bhūmyādi paṃcabhūtāni sūkṣmāvasthātmakānica |

tanmātrāṇyēva lakṣyaṃtē, manō (a) haṃkāra ucyatē |

buddhi śabdānmahattatva mahaṃkārasya kāraṇaṃ |

avidyātmakamavyaktaṃ vāsanānaṃtya vāsitaṃ |

ahaṃkāra padēnōktaṃ sarvakāraṇakāraṇaṃ |

ityēvamuktarītyēyaṃ sākṣi bhāsyatayāṣṭagā |

śaktiḥ parama dharmābhyā anirvā cyā triguṇātmikā |

prakārai raṣṭa bhircēdhamā gatā pāramēśvarī |

aṃtarbhūtō (a) tra sarvōpi jaḍavargaḥ prapaṃcagaḥ ||” (gītābhāvaprakāśamu - 7 - 28 to 32)

(bhūmi modalugāgala paṃcabhūtamulu - anagā, bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu - ivi sūkṣmāvasthalō unnavāṭini (śabdādulanu) tanmātralaṃduru. iccaṭa manassu anagā ahaṃkāramaniyarthamu - ahaṃkāramunaku kāraṇamaina mahattatvamu buddhi yani iccaṭa ceppabaḍinadi. ahaṃkāramanagā avyaktamani grahiṃca valenu - paina ceppabaḍina prakāramugā prakṛti enimidi vidhamulugā nunnadi. ī prakṛti satvarajastamōguṇamulanu triguṇamulatō kūḍi yuṃḍunadi. idi anirvācyamu - idi iṭṭidi ani ceppuṭaku alavikānidi. idi paramēśvaruni śaktiyē. samastamaina jaḍaprapaṃcamu dīnilō nimiḍiyunnadi.)

  1. “mūla prakṛti ravikṛtirmaha dādyāḥ prakṛti vikṛtayaḥ sapta; ṣōḍaśakaśca vikārō, naprakṛtirnavikṛtiḥ puruṣaḥ” (kāpila sāṃkhyā kārikā).

(mūla prakṛti avikṛti - vikṛtulu, mārpulu lēnidi, mahattattvamu modalagu ēḍunnū prakṛtiyokka vikṛtulu. 24 tatvamulalō migilina 16 tatvamulu vikāramulu - 25va tatvamu ayina puruṣuḍu prakṛtikāḍu, vikṛtikāḍu).

  1. painaceppina enimidi tatvamulu iṃdriyamulaku gōcariṃcunavikāvu - sūkṣmatatvamulu
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.