← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టాక్షరీమంత్రము aṣṭākṣarīmaṃtramu

Original — తెలుగు
  1. “ఓం నమోనారాయణాయ” అను ఎనిమిది అక్షరములుగల మంత్రము.

(పరబ్రహ్మ అయిన నారాయణుని కొఱకు నమస్కారము అని ఈ మంత్రార్థము).

(నారాయణుడనగా తనలోనుండి (పరబ్రహ్మలోనుండి) పుట్టిన సమస్త వస్తువులలోను నివసించియుండువాడు - అట్టి సమస్త వస్తువులకు మోక్షస్థానమైనవాడు - అందుచేత సృష్టిలోనుండు సమస్తవస్తువులకు పుట్టు చోటు, మోక్షము, లయములు తానే అయినవాడు. అట్టి భగవంతుని కొఱకు నమస్కారము).

  1. “ఓం నమో నారాయణేతి తారకం చిదాత్మక మిత్యుపాసితవ్యం - ‘ఓం’ ఇత్యేకాక్షరం ఆత్మస్వరూపం, ‘నమ’ ఇతిద్వ్యక్షరం ప్రకృతిస్వరూపం;”నారాయణాయ” ఇతి పంచాక్షరం పరబ్రహ్మ స్వరూపం ఇతియ ఏవం వేదసో (అ) మృతో భవతి.

(“ఓం నమో నారాయణాయ”అనునది తారకము - తారకమంత్రము - అనగా, జననమరణరూపమైన సంసారమను మహాసముద్రమును తరింపచేయునది - దాటింపచేయునది - మరల మరల జన్మలేకుండ చేయునది. ఈ మంత్రము చిదాత్మకము, చైతన్యస్వరూపము అగు పరబ్రహ్మమని ఉపాసించ తగినది. ఈ మంత్రములోని ఎనిమిది అక్షరములలోను ‘ఓం’ అను ఒక్క అక్షరము ఆత్మస్వరూపము –

“ఓం తత్సత్ ఇతి నిర్దేశోబ్రహ్మణ స్త్రివిధః స్మృతః |” - (శ్రీమద్భగవద్గీత - 17 - 23)

(‘ఓం’ అని, ‘తత్’ అని, ‘సత్’ అని మూడువిధములుగా పరబ్రహ్మ నిర్దేశింపబడుచున్నాడు - చెప్పబడుచున్నాడు).

“నమః” అను రెండు అక్షరములు ప్రకృతి స్వరూపము.”నారాయణాయ” అను అయిదు అక్షరములు పరబ్రహ్మ స్వరూపము. ఈ ప్రకారముగా ఎవడు తెలుసుకొనునో అతను అమృతుడగును - మరణము లేనివాడగును, మోక్షమును పొందును).

  1. “ఓం” ఇత్యగ్రే వ్యాహ రేత్, ‘నమః’ఇతి పశ్చాత్, “నారాయణాయ” ఇత్యుపరిష్టాత్. ’ఓం’ ఇత్యేకాక్షరం, ‘నమ’ ఇతి ద్వే అక్షరే, “నారాయణాయ” ఇతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణాస్యాష్టాక్షరం పదం. (నారాయణోపనిషత్)

(‘ఓం’ అని మొదట ఉచ్చరించవలెను, తర్వాత “నమః” అని ఉచ్చరించవలెను. అటుతర్వాత “నారాయణాయ”అని ఉచ్చరించవలెను - ‘ఓం’ అనునది ఒక అక్షరము, ‘నమః’ అని రెండక్షరములు, ‘నారాయణాయ’ అని అయిదు అక్షరములు. ఇవి ఈ అష్టాక్షరీలోని ఎనిమిది అక్షరములు. ఈ ఎనిమిది అక్షరములు గలది అష్టాక్ల్షరీమంత్రము - ‘ఓం నమోనారాయణాయ’ అనునది).

“నారాయణాయనమ” ఇత్యయమేవ సత్యః,

సంసార ఘోరవిష సంహరణాయ మంత్రః |

శృణ్వంతు భవ్యమత యో యతయో (అ) స్తరాగాః |

ఉచ్ఛస్త రాముపదిశామ్యహ మూర్థ్వ బాహుః ||“. (శ్రీనరసింహపురాణే)

(“ఓం నారాయణాయ నమః” అను మంత్రము సంసారములోని ఘోరవిషమును పోగొట్టు మంత్రము - ఇదినిజము. భవ్యమైన మనస్సుగలవారు, యతులు, రాగాదులను వదలుకొనినవారు మామాట వినండి. నేను ఈ విషయము చేతులెత్తి, గొంతెత్తి గట్టిగా చెప్పుచున్నాను).

  1. ‘ఓం’ ఇతి బ్రహ్మ భవతి, నకారో విష్ణుర్భవతి, మకారో రుద్రోభవతి, నకారో ఈశ్వరోభవతి, ‘ర’ కారో అండం విరాడ్భవతి, ‘య’ కారః పురుషోభవతి, ‘ణ’ కారో భగవాన్ భవతి, ‘య’ కారః పరమాత్మా భవతి, ఏ తద్వై నారాయణస్యాష్టాక్షరం పరం పరమం పురుషో భవతి, ‘ఓం’ ఇత్యేతదక్షరం పరంబ్రహ్మ తదేవో పాసి తవ్యం, ఏ తత్సూక్ష్మాక్షరం భవతి. తదేవ తదష్టాత్మత్వాత్ అష్టధా భవతి. అకారః ప్రథమాక్షరో భవతి, ఉకారో ద్వితీయాక్షరో భవతి, మకారస్తృతీయాక్షరో భవతి, బిందుః తురీయాక్షరో భవతి, నాదః పంచమాక్షరో భవతి, కళా సష్టాక్షరో భవతి, కలాతీతా సప్తమాక్షరో భవతి, తత్పరశ్చాష్ట మాక్షరో భవతి, తారకత్వాత్ తారకో భవతి, తదావ తారకం బ్రహ్మ త్వం విద్ధి, తదేవో పాసి తవ్యం.

(ఈ “ఓం నమో నారాయణాయ” అను మంత్రములోని ‘ఓం’ అనగా బ్రహ్మ, నకారము విష్ణువు, మకారము రుద్రుడు, నకారము ఈశ్వరుడు రకారము బ్రహ్మాండరూపుడైన విరాట్ (వివిధరూపములతో రాజిల్లువాడు, ప్రకాశించువాడు). యకారము పురుషుడు, ‘ణ’ కారము భగవంతుడు, ‘య’ కారము పరమాత్మ, ఇవియే నారాయణునియొక్క - నారాయణాష్టక్షరీ మంత్రము యొక్క) అష్టాక్షరము పరమ పురుషుడు - ’ఓం’అను ఏకాక్షరము - పరబ్రహ్మము, అదియే ఉపాసించవలసినది. అది సూక్ష్మరూపములో అన్ని అక్షరములు కలది. అదియే అష్టరూపములుగా, ఎనిమిది విధములుగా అగుచున్నది. ఎట్లు అంటే - అకారము మొదటి అక్షరము, ఉ కారము రెండవ అక్షరము, మ కారము మూడవ అక్షరము - బిందువు నాలుగవ అక్షరము, నాదము అయిదవ అక్షరము, కళ ఆరవ అక్షరము, కళాతీతమైనది ఏడవ అక్షరము, దాని పైది - దానికన్న ఉత్కృష్టమైనది ఎనిమిదవ అక్షరము - ఇది జీవులను సంసార సముద్రమును తరింప చేయునది - దాటింప చేయునది కనుక తారకము - తరింపచేయు బ్రహ్మ అనినీవు తెలుసుకొనవలెను. అదియే ఉపాసించతగినది, ఉపాసించవలసినది).

  1. “శ్రీమన్నారాయాణాష్టాక్షరాను స్మరణేన గాయత్ర్యాః శత సహస్రం జప్తం భవతి” (తారసారోపనిషత్)

(శ్రీమన్నారాయణాష్టాక్షరీ మంత్రమును స్మరించుటచేత గాయత్రీ మంత్రమును శతసహస్ర పర్యాయములు జపించిన ఫలము కలుగును).

“యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్పరః |

తధా సర్వేషు మంత్రేషు నాస్తిచాష్టాక్షరాత్ప్రపరం ||“.

(దేవతులందరిలోను శ్రీమన్నారాయణుని కంటె పరమైన ఉత్కృష్టమైన దేవుడు లేనట్లే సమస్త మంత్రములలోను నారాయణాష్టాక్షరీమంత్రముకంటె పరమైనది, ఉత్కృష్టమైన మంత్రము లేదు).

“కిం తద్బహుభిర్మం తైః కింతద్బహు భిత్ర్వై తైః |

నమో నారాయణేతి మంత్రః సర్వార్థ సాధకం ||“.

(అనేక మంత్రములచేత, అనేక వ్రతములచేత ఏమి ప్రయోజనము ? నమో నారాయాణాయ అను మంత్రము సర్వార్థ సాధకము - చతుర్విధ పురుషార్థములను చేకూర్చునది).

  1. “ప్రణవాద్యం, నమో మధ్యం నారాయణ పదాంతం” ఇతి స్మృతాః.

(ముందు ప్రణవము - ఓం కారము, మధ్యను ‘నమో’ అను మాట,, ‘నారాయణ’ అను పదము - మాట - చివరను - ఇట్లు ‘ఓం నమోనారాయణాయ’ అను నారాయణాష్టాక్షరమంత్రము అయినది - అని స్మృతి చెప్పుచున్నది).

  1. “శ్రీరామశ్శరణం మమ” (శ్రీరాముడు నాకు శరణము - అనునదికూడ అష్టాక్షరీమంత్రమే.)

“శ్లో ||. మంత్రశ్చాష్టక్షరో జ్ఞేయం”శ్రీరామశ్శరణం మమ”|

సిద్ధోపాయో అక్షరవిదాం భావనా పరికల్పితః |

ఆత్మాధారం స్వతంత్రం చ సర్వ శక్తిం విచింత్య చ |

చింతయే చ్చేతసా నిత్యం “శ్రీరామశ్శరణం మమ ||”. (బృహదారణ్య సంహితాయాం)

(మంత్రము అక్షరము, లేక, అక్షరముల సముదాయము - అక్షరములవలె నశింపనిది. “శ్రీరామశ్శరణం మమ” అను మంత్రము ఇటువంటిదే, అది యే అక్షరమైన - నశింపని - పరబ్రహ్మమే - ఇది సిద్ధిని పొందుటకు ఉపాయమైనది. అక్షరముల శక్తిసామర్థ్యములను తెలిసినవారియొక్క (అక్షరుడు, నశింపనివాడు అయిన పరబ్రహ్మమును తెలిసినవారియొక్క) - భావనచేత కల్పితమైనది. అక్షరములలో మొదటి అక్షరము ‘అ’ అనగా బ్రహ్మమే- “అ ఇతి బ్రహ్మ” - (‘అ’ అనగా బ్రహ్మమే). మిగిలిన అక్షరములు అకారముయొక్క వికారములే - వాటి అన్నింటిలోను భగవంతుని అంశ ఉన్నది - అకారాంశ ఉన్నది. అందుచేతనే శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో అక్షరాణామకారోస్మి (అక్షరములలో అకారము నేనే, అక్షరములలో ఉన్న భగవదంశ నేనే). అందుచేత అక్షరములు నశింపనివి, శక్తివంతములైనవి. వీటితో కూర్చిన మంత్రములు అట్లే శక్తివంతములైనవి. వీటితో మంత్రము కల్పితమైనది. మహానుభావులైన ఋషులు ఈ అక్షరముల శక్తిని పరిశీలించి మంత్రములను కూర్చిరి. :“శ్రీరామశ్శరణం మమ” అను మంత్రమునకు ఆధారమూఅత్మయే యని స్వతంత్రమైనదని, సమస్తశక్తులు గలదని ఆలోచించి మనస్సులో నిత్యము చింతింప తగినది).

“శ్లో ||. కిం మంత్రైర్బహు భిశ్చ దుష్కర ఫలై రాయాసదైః తద్విదాం |

కించిల్లోప విధాన మాత్ర విఫలైస్సంసార దుఃఖావహైః |

ఏకస్సన్నపి సర్వమంత్రో ఫలదో దోషో జ్ఞితస్సర్వదా |

శ్రీరామశ్శరణం మమేతి పరమో మంత్రో యమష్టాక్షరః ||“. (శ్రీరామ కర్ణామృతం - 4 - 74)

(ఎంతో ప్రయత్నము చేసికాని ఫలము నీయనివిన్నీ, శ్రమకలిగించునట్టివిన్నీ, వాటిలో ఏ కొంచెము అయినను లోపము కలిగినయడల ఫలము కలుగకుండచేయునవియు, జననమరణరూపమగు సంసారములోని దుఃఖములను కలుగచేయునవియు అగూనేకమైన ఇతరములచేత ఏమి ప్రయోజనము ? ఒక్కటే అయినప్పటికీ సమస్తమంత్రముల ఫలము నిచ్చునదిన్నీ, ఎలపుడు ఎట్టిదోషములు లేనిదిన్నీ అయిన “శ్రీరామశ్శరణం మమ” =శ్రీరాముడు నాకు శరణము) అను అష్టాక్షరీమంత్రము పరమ ఉత్కృష్టమైనది).

  1. “ఓం నమో వాసుదేవాయ” - (సమస్త జీవులలోను, సమస్త వస్తువులలోను నివసించియుండు దేవునిగుఱించి నమస్కరించుచున్నాను -) అనునదికూడ ఎనిమిది అక్షరములు కలది - అష్టాక్షరీమంత్రము).

  2. “ఓం నమోమహాదేవాయ” (మహదేవుడైన శివుని కొఱకు నమస్కారము -) అనునది కూడ అష్టాక్షరీమంత్రమే.

  3. “న మంత్రో అష్టాక్షరాత్పరః”.(అష్టాక్షరీమంత్రముకన్న ఉత్కృష్టమైన మంత్రము లేదు).

“సర్వ వేదాంత సారార్థస్సంసారర్ణవ తారకః |

గతిరష్టా క్షరో నృణాం అపునర్భవ కాంక్షిణాం ||“.

(అష్టాక్షరీమంత్రము అన్ని ఉపనిషత్తుల సారము, సంసారమను మహాసముద్రమును దాటింప చేయునది - తిరిగి జన్మ లేకుండ చేయునది).

Transliteration
  1. “ōṃ namōnārāyaṇāya” anu enimidi akṣaramulugala maṃtramu.

(parabrahma ayina nārāyaṇuni koṟaku namaskāramu ani ī maṃtrārthamu).

(nārāyaṇuḍanagā tanalōnuṃḍi (parabrahmalōnuṃḍi) puṭṭina samasta vastuvulalōnu nivasiṃciyuṃḍuvāḍu - aṭṭi samasta vastuvulaku mōkṣasthānamainavāḍu - aṃducēta sṛṣṭilōnuṃḍu samastavastuvulaku puṭṭu cōṭu, mōkṣamu, layamulu tānē ayinavāḍu. aṭṭi bhagavaṃtuni koṟaku namaskāramu).

  1. “ōṃ namō nārāyaṇēti tārakaṃ cidātmaka mityupāsitavyaṃ - ‘ōṃ’ ityēkākṣaraṃ ātmasvarūpaṃ, ‘nama’ itidvyakṣaraṃ prakṛtisvarūpaṃ;”nārāyaṇāya” iti paṃcākṣaraṃ parabrahma svarūpaṃ itiya ēvaṃ vēdasō
    1. mṛtō bhavati.

(“ōṃ namō nārāyaṇāya”anunadi tārakamu - tārakamaṃtramu - anagā, jananamaraṇarūpamaina saṃsāramanu mahāsamudramunu tariṃpacēyunadi - dāṭiṃpacēyunadi - marala marala janmalēkuṃḍa cēyunadi. ī maṃtramu cidātmakamu, caitanyasvarūpamu agu parabrahmamani upāsiṃca taginadi. ī maṃtramulōni enimidi akṣaramulalōnu ‘ōṃ’ anu okka akṣaramu ātmasvarūpamu –

“ōṃ tatsat iti nirdēśōbrahmaṇa strividhaḥ smṛtaḥ |” - (śrīmadbhagavadgīta - 17 - 23)

(‘ōṃ’ ani, ‘tat’ ani, ‘sat’ ani mūḍuvidhamulugā parabrahma nirdēśiṃpabaḍucunnāḍu - ceppabaḍucunnāḍu).

“namaḥ” anu reṃḍu akṣaramulu prakṛti svarūpamu.”nārāyaṇāya” anu ayidu akṣaramulu parabrahma svarūpamu. ī prakāramugā evaḍu telusukonunō atanu amṛtuḍagunu - maraṇamu lēnivāḍagunu, mōkṣamunu poṃdunu).

  1. “ōṃ” ityagrē vyāha rēt, ‘namaḥ’iti paścāt, “nārāyaṇāya” ityupariṣṭāt. ’ōṃ’ ityēkākṣaraṃ, ‘nama’ iti dvē akṣarē, “nārāyaṇāya” iti paṃcākṣarāṇi. ētadvai nārāyaṇāsyāṣṭākṣaraṃ padaṃ. (nārāyaṇōpaniṣat)

(‘ōṃ’ ani modaṭa uccariṃcavalenu, tarvāta “namaḥ” ani uccariṃcavalenu. aṭutarvāta “nārāyaṇāya”ani uccariṃcavalenu - ‘ōṃ’ anunadi oka akṣaramu, ‘namaḥ’ ani reṃḍakṣaramulu, ‘nārāyaṇāya’ ani ayidu akṣaramulu. ivi ī aṣṭākṣarīlōni enimidi akṣaramulu. ī enimidi akṣaramulu galadi aṣṭāklṣarīmaṃtramu - ‘ōṃ namōnārāyaṇāya’ anunadi).

“nārāyaṇāyanama” ityayamēva satyaḥ,

saṃsāra ghōraviṣa saṃharaṇāya maṃtraḥ |

śṛṇvaṃtu bhavyamata yō yatayō (a) starāgāḥ |

ucchasta rāmupadiśāmyaha mūrthva bāhuḥ ||“. (śrīnarasiṃhapurāṇē)

(“ōṃ nārāyaṇāya namaḥ” anu maṃtramu saṃsāramulōni ghōraviṣamunu pōgoṭṭu maṃtramu - idinijamu. bhavyamaina manassugalavāru, yatulu, rāgādulanu vadalukoninavāru māmāṭa vinaṃḍi. nēnu ī viṣayamu cētuletti, goṃtetti gaṭṭigā ceppucunnānu).

  1. ‘ōṃ’ iti brahma bhavati, nakārō viṣṇurbhavati, makārō rudrōbhavati, nakārō īśvarōbhavati, ‘ra’ kārō aṃḍaṃ virāḍbhavati, ‘ya’ kāraḥ puruṣōbhavati, ‘ṇa’ kārō bhagavān bhavati, ‘ya’ kāraḥ paramātmā bhavati, ē tadvai nārāyaṇasyāṣṭākṣaraṃ paraṃ paramaṃ puruṣō bhavati, ‘ōṃ’ ityētadakṣaraṃ paraṃbrahma tadēvō pāsi tavyaṃ, ē tatsūkṣmākṣaraṃ bhavati. tadēva tadaṣṭātmatvāt aṣṭadhā bhavati. akāraḥ prathamākṣarō bhavati, ukārō dvitīyākṣarō bhavati, makārastṛtīyākṣarō bhavati, biṃduḥ turīyākṣarō bhavati, nādaḥ paṃcamākṣarō bhavati, kaḷā saṣṭākṣarō bhavati, kalātītā saptamākṣarō bhavati, tatparaścāṣṭa mākṣarō bhavati, tārakatvāt tārakō bhavati, tadāva tārakaṃ brahma tvaṃ viddhi, tadēvō pāsi tavyaṃ.

(ī “ōṃ namō nārāyaṇāya” anu maṃtramulōni ‘ōṃ’ anagā brahma, nakāramu viṣṇuvu, makāramu rudruḍu, nakāramu īśvaruḍu rakāramu brahmāṃḍarūpuḍaina virāṭ (vividharūpamulatō rājilluvāḍu, prakāśiṃcuvāḍu). yakāramu puruṣuḍu, ‘ṇa’ kāramu bhagavaṃtuḍu, ‘ya’ kāramu paramātma, iviyē nārāyaṇuniyokka - nārāyaṇāṣṭakṣarī maṃtramu yokka) aṣṭākṣaramu parama puruṣuḍu - ’ōṃ’anu ēkākṣaramu - parabrahmamu, adiyē upāsiṃcavalasinadi. adi sūkṣmarūpamulō anni akṣaramulu kaladi. adiyē aṣṭarūpamulugā, enimidi vidhamulugā agucunnadi. eṭlu aṃṭē - akāramu modaṭi akṣaramu, u kāramu reṃḍava akṣaramu, ma kāramu mūḍava akṣaramu - biṃduvu nālugava akṣaramu, nādamu ayidava akṣaramu, kaḷa ārava akṣaramu, kaḷātītamainadi ēḍava akṣaramu, dāni paidi - dānikanna utkṛṣṭamainadi enimidava akṣaramu - idi jīvulanu saṃsāra samudramunu tariṃpa cēyunadi - dāṭiṃpa cēyunadi kanuka tārakamu - tariṃpacēyu brahma aninīvu telusukonavalenu. adiyē upāsiṃcataginadi, upāsiṃcavalasinadi).

  1. “śrīmannārāyāṇāṣṭākṣarānu smaraṇēna gāyatryāḥ śata sahasraṃ japtaṃ bhavati” (tārasārōpaniṣat)

(śrīmannārāyaṇāṣṭākṣarī maṃtramunu smariṃcuṭacēta gāyatrī maṃtramunu śatasahasra paryāyamulu japiṃcina phalamu kalugunu).

“yathā sarvēṣu dēvēṣu nāsti nārāyaṇātparaḥ |

tadhā sarvēṣu maṃtrēṣu nāsticāṣṭākṣarātpraparaṃ ||“.

(dēvatulaṃdarilōnu śrīmannārāyaṇuni kaṃṭe paramaina utkṛṣṭamaina dēvuḍu lēnaṭlē samasta maṃtramulalōnu nārāyaṇāṣṭākṣarīmaṃtramukaṃṭe paramainadi, utkṛṣṭamaina maṃtramu lēdu).

“kiṃ tadbahubhirmaṃ taiḥ kiṃtadbahu bhitrvai taiḥ |

namō nārāyaṇēti maṃtraḥ sarvārtha sādhakaṃ ||“.

(anēka maṃtramulacēta, anēka vratamulacēta ēmi prayōjanamu ? namō nārāyāṇāya anu maṃtramu sarvārtha sādhakamu - caturvidha puruṣārthamulanu cēkūrcunadi).

  1. “praṇavādyaṃ, namō madhyaṃ nārāyaṇa padāṃtaṃ” iti smṛtāḥ.

(muṃdu praṇavamu - ōṃ kāramu, madhyanu ‘namō’ anu māṭa,, ‘nārāyaṇa’ anu padamu - māṭa - civaranu - iṭlu ‘ōṃ namōnārāyaṇāya’ anu nārāyaṇāṣṭākṣaramaṃtramu ayinadi - ani smṛti ceppucunnadi).

  1. “śrīrāmaśśaraṇaṃ mama” (śrīrāmuḍu nāku śaraṇamu - anunadikūḍa aṣṭākṣarīmaṃtramē.)

“ślō ||. maṃtraścāṣṭakṣarō jñēyaṃ”śrīrāmaśśaraṇaṃ mama”|

siddhōpāyō akṣaravidāṃ bhāvanā parikalpitaḥ |

ātmādhāraṃ svataṃtraṃ ca sarva śaktiṃ viciṃtya ca |

ciṃtayē ccētasā nityaṃ “śrīrāmaśśaraṇaṃ mama ||”. (bṛhadāraṇya saṃhitāyāṃ)

(maṃtramu akṣaramu, lēka, akṣaramula samudāyamu - akṣaramulavale naśiṃpanidi. “śrīrāmaśśaraṇaṃ mama” anu maṃtramu iṭuvaṃṭidē, adi yē akṣaramaina - naśiṃpani - parabrahmamē - idi siddhini poṃduṭaku upāyamainadi. akṣaramula śaktisāmarthyamulanu telisinavāriyokka (akṣaruḍu, naśiṃpanivāḍu ayina parabrahmamunu telisinavāriyokka) - bhāvanacēta kalpitamainadi. akṣaramulalō modaṭi akṣaramu ‘a’ anagā brahmamē- “a iti brahma” - (‘a’ anagā brahmamē). migilina akṣaramulu akāramuyokka vikāramulē - vāṭi anniṃṭilōnu bhagavaṃtuni aṃśa unnadi - akārāṃśa unnadi. aṃducētanē śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō akṣarāṇāmakārōsmi (akṣaramulalō akāramu nēnē, akṣaramulalō unna bhagavadaṃśa nēnē). aṃducēta akṣaramulu naśiṃpanivi, śaktivaṃtamulainavi. vīṭitō kūrcina maṃtramulu aṭlē śaktivaṃtamulainavi. vīṭitō maṃtramu kalpitamainadi. mahānubhāvulaina ṛṣulu ī akṣaramula śaktini pariśīliṃci maṃtramulanu kūrciri. :“śrīrāmaśśaraṇaṃ mama” anu maṃtramunaku ādhāramūatmayē yani svataṃtramainadani, samastaśaktulu galadani ālōciṃci manassulō nityamu ciṃtiṃpa taginadi).

“ślō ||. kiṃ maṃtrairbahu bhiśca duṣkara phalai rāyāsadaiḥ tadvidāṃ |

kiṃcillōpa vidhāna mātra viphalaissaṃsāra duḥkhāvahaiḥ |

ēkassannapi sarvamaṃtrō phaladō dōṣō jñitassarvadā |

śrīrāmaśśaraṇaṃ mamēti paramō maṃtrō yamaṣṭākṣaraḥ ||“. (śrīrāma karṇāmṛtaṃ - 4 - 74)

(eṃtō prayatnamu cēsikāni phalamu nīyanivinnī, śramakaligiṃcunaṭṭivinnī, vāṭilō ē koṃcemu ayinanu lōpamu kaliginayaḍala phalamu kalugakuṃḍacēyunaviyu, jananamaraṇarūpamagu saṃsāramulōni duḥkhamulanu kalugacēyunaviyu agūnēkamaina itaramulacēta ēmi prayōjanamu ? okkaṭē ayinappaṭikī samastamaṃtramula phalamu niccunadinnī, elapuḍu eṭṭidōṣamulu lēnidinnī ayina “śrīrāmaśśaraṇaṃ mama” =śrīrāmuḍu nāku śaraṇamu) anu aṣṭākṣarīmaṃtramu parama utkṛṣṭamainadi).

  1. “ōṃ namō vāsudēvāya” - (samasta jīvulalōnu, samasta vastuvulalōnu nivasiṃciyuṃḍu dēvuniguṟiṃci namaskariṃcucunnānu -) anunadikūḍa enimidi akṣaramulu kaladi - aṣṭākṣarīmaṃtramu).

  2. “ōṃ namōmahādēvāya” (mahadēvuḍaina śivuni koṟaku namaskāramu -) anunadi kūḍa aṣṭākṣarīmaṃtramē.

  3. “na maṃtrō aṣṭākṣarātparaḥ”.(aṣṭākṣarīmaṃtramukanna utkṛṣṭamaina maṃtramu lēdu).

“sarva vēdāṃta sārārthassaṃsārarṇava tārakaḥ |

gatiraṣṭā kṣarō nṛṇāṃ apunarbhava kāṃkṣiṇāṃ ||“.

(aṣṭākṣarīmaṃtramu anni upaniṣattula sāramu, saṃsāramanu mahāsamudramunu dāṭiṃpa cēyunadi - tirigi janma lēkuṃḍa cēyunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.