← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టపాశములు aṣṭapāśamulu

Original — తెలుగు
  1. “యేన ఇదం సర్వం పాశ్యతే బధ్యతే ఇతి పాశః |”.

(దేనిచేత ఈ జగత్తు అంతయు బంధింపబడుచున్నదో - కట్టివేసినట్లు అగుచున్నదో అది పాశము - అనగా, బంధమునకు కారణమై సంసారములో త్రిప్పునది).

  1. పాశ్యతే బధ్యతే యేన సః పాశః - దేహేంద్రియాది సం యోగ వియోగలక్షణం.

(బధించునది పాశము - దేహమును ఇంద్రియములను కలుపుచూ, విదదీయుచునుండు లక్షణముగలది).

  1. పాశ్యతే, బధ్యతే స్వాజ్ఞే ఇతి పాశః, స్వాతిరిక్తా స్తిత బుద్ధి వృత్తి రూపాః పాశాః -

(తన నిజరూపమును తెలియని అజ్ఞానమందు బంధించునది పాశము. ప్రమాత్మకాక ఇతరము ఉన్నదని భావించుట పాశము).

“చతుర్విం శతి తత్వాని మాయా కర్మగుణా ఇతి |

విషయా అపి కీర్యంతే పాశా ఇతి నిబంధనాత్ |

(ఇరువదినాలుగు తత్వములు మాయవలన కలిగిన గుణములు ఇవి విషయములని చెప్పబడుచున్నవి. ఇవి జీవులను బంధించుచున్నవికనుక పాశములని చెప్పబడుచున్నవి).

  1. పాశములు ఎనిమిది విధములు : -

“ఘృణా, శంకా, స్పృహా లజ్జా జుగుప్సా చేతి పంచమీ |

కులం శీలం తథా జాతి రష్టౌ పాశాః ప్రకీర్తితాః ||.

(“క. దయయు జుగుప్సయు మోహము

భయమును సంశయము, గులము, బలశీలముల

న్నియు గూడ నష్టపాశము

లయి వెలయును; వాని నాత్ముడంటకయుండున్“.)

  1. అణవమలం, మాయికమలం, కార్మికమలం ఇతి మలత్రయ రూపాః పాశాః.

(అణవమలము, మాయికమలము, కార్మికమలము అని మూడువిధములగు మలములు మూడు పాశములనిచెప్పబడినవి).

  1. పాశము అనగా త్రాడు, కట్టివేయునది - విషయములతోకూడిన సంసారము జీవుని ఆకర్షించి త్రాడుతో కట్టివేసినట్లు బంధించును.
Transliteration
  1. “yēna idaṃ sarvaṃ pāśyatē badhyatē iti pāśaḥ |”.

(dēnicēta ī jagattu aṃtayu baṃdhiṃpabaḍucunnadō - kaṭṭivēsinaṭlu agucunnadō adi pāśamu - anagā, baṃdhamunaku kāraṇamai saṃsāramulō trippunadi).

  1. pāśyatē badhyatē yēna saḥ pāśaḥ - dēhēṃdriyādi saṃ yōga viyōgalakṣaṇaṃ.

(badhiṃcunadi pāśamu - dēhamunu iṃdriyamulanu kalupucū, vidadīyucunuṃḍu lakṣaṇamugaladi).

  1. pāśyatē, badhyatē svājñē iti pāśaḥ, svātiriktā stita buddhi vṛtti rūpāḥ pāśāḥ -

(tana nijarūpamunu teliyani ajñānamaṃdu baṃdhiṃcunadi pāśamu. pramātmakāka itaramu unnadani bhāviṃcuṭa pāśamu).

“caturviṃ śati tatvāni māyā karmaguṇā iti |

viṣayā api kīryaṃtē pāśā iti nibaṃdhanāt |

(iruvadinālugu tatvamulu māyavalana kaligina guṇamulu ivi viṣayamulani ceppabaḍucunnavi. ivi jīvulanu baṃdhiṃcucunnavikanuka pāśamulani ceppabaḍucunnavi).

  1. pāśamulu enimidi vidhamulu : -

“ghṛṇā, śaṃkā, spṛhā lajjā jugupsā cēti paṃcamī |

kulaṃ śīlaṃ tathā jāti raṣṭau pāśāḥ prakīrtitāḥ ||.

(“ka. dayayu jugupsayu mōhamu

bhayamunu saṃśayamu, gulamu, balaśīlamula

nniyu gūḍa naṣṭapāśamu

layi velayunu; vāni nātmuḍaṃṭakayuṃḍun”.)

  1. aṇavamalaṃ, māyikamalaṃ, kārmikamalaṃ iti malatraya rūpāḥ pāśāḥ.

(aṇavamalamu, māyikamalamu, kārmikamalamu ani mūḍuvidhamulagu malamulu mūḍu pāśamulaniceppabaḍinavi).

  1. pāśamu anagā trāḍu, kaṭṭivēyunadi - viṣayamulatōkūḍina saṃsāramu jīvuni ākarṣiṃci trāḍutō kaṭṭivēsinaṭlu baṃdhiṃcunu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.