← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టపురములు aṣṭapuramulu

Original — తెలుగు
  1. “జ్ఞానేంద్రీయపంచకం, కర్మేంద్రియపంచకం, ప్రాణాది పంచకం, నియదాది పంచకం, అంతఃకరణచతుష్టయం, కామ, కర్మ, తమాంసి అష్టపురం” (పైంగలోపనిషత్)

జ్ఞానేంద్రియములు అయిదు, కర్మేంద్రియములైదు, పంచప్రాణములు, పంచభూతములు, మనోబుద్ధి, చిత్తాహంకార ములు. కామము, కర్మము, తమస్సు అను ఎనిమిదిగల పురము శరీరము. వీటియందుండు ఆత్మ పురుషుడు -

(పురిశయనాత్ పురుషః = పురమందు శయనించువాడు పురుషుడు)

దీనిని బట్టి, శరీరములోని ప్రతి అవయవమందును, సూదిమోపినంత ప్రతిమేరను పరమాత్మ కలడు, జీవుడను పేరనున్నాడు - ప్రకృతికి సంబంధించిన ఏ వస్తువులోనైనను భగవంతుడున్నాడు కనుక ప్రతివస్తువు భగవంతునికి పురమే -

  1. “జ్ఞానేంద్రియాణి ఖలు పంచ త ధాపరాణి కర్మేంద్రియాణి మనసాది చతుష్టయం చ ప్రాణాది పంచక మధావి యదాది పంచ, కామశ్చ, కర్మతు తమస్సః పురమష్ట ధాస్యాత్”.

(జ్ఞానేంద్రియములు అయిదు, కర్మేంద్రియములైదు, మనస్సు మొదలగునవి నాలుగు - మనో, బుద్ధి, చిత్త అహంకారములు - పంచప్రాణములు, కామము, కర్మము, తమస్సు - ఈ ఎనిమిది అష్టపురములు - ఆత్మ ఉండు పురములు, స్థానములు).

Transliteration
  1. “jñānēṃdrīyapaṃcakaṃ, karmēṃdriyapaṃcakaṃ, prāṇādi paṃcakaṃ, niyadādi paṃcakaṃ, aṃtaḥkaraṇacatuṣṭayaṃ, kāma, karma, tamāṃsi aṣṭapuraṃ” (paiṃgalōpaniṣat)

jñānēṃdriyamulu ayidu, karmēṃdriyamulaidu, paṃcaprāṇamulu, paṃcabhūtamulu, manōbuddhi, cittāhaṃkāra mulu. kāmamu, karmamu, tamassu anu enimidigala puramu śarīramu. vīṭiyaṃduṃḍu ātma puruṣuḍu -

(puriśayanāt puruṣaḥ = puramaṃdu śayaniṃcuvāḍu puruṣuḍu)

dīnini baṭṭi, śarīramulōni prati avayavamaṃdunu, sūdimōpinaṃta pratimēranu paramātma kalaḍu, jīvuḍanu pēranunnāḍu - prakṛtiki saṃbaṃdhiṃcina ē vastuvulōnainanu bhagavaṃtuḍunnāḍu kanuka prativastuvu bhagavaṃtuniki puramē -

  1. “jñānēṃdriyāṇi khalu paṃca ta dhāparāṇi karmēṃdriyāṇi manasādi catuṣṭayaṃ ca prāṇādi paṃcaka madhāvi yadādi paṃca, kāmaśca, karmatu tamassaḥ puramaṣṭa dhāsyāt”.

(jñānēṃdriyamulu ayidu, karmēṃdriyamulaidu, manassu modalagunavi nālugu - manō, buddhi, citta ahaṃkāramulu - paṃcaprāṇamulu, kāmamu, karmamu, tamassu - ī enimidi aṣṭapuramulu - ātma uṃḍu puramulu, sthānamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.