← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టసిద్ధులు aṣṭasiddhulu

Original — తెలుగు

“అణిమా, మహిమా మూర్తేః లఘిమా ప్రాప్తిరింద్రియైః |

స్రాకామ్యం శ్రూత దృష్టేషు శక్తి ప్రేరణ మేశితా |

గుణశేష సంగోవశితా యత్కామస్త దవస్యతి |

ఏతేమే సిద్ధ యస్సౌమ్య అష్టైవోత్పత్తి కామతాః |

ఔత్పత్తికాః = (స్వాభాభావికాః), నరతిశయాశ్చ ఇత్యర్థః -

“అణిమా మహిమా లఘమా చ మూర్తేః దేహస్య తిస్రః సిద్ధయః. ప్రాప్తిర్నామ సిద్ధిః సర్వప్రాణినాం ఇంద్రియైః సహ తత్తధిష్ఠాతృ దేవతా రూపేణ సంబంధిమిత్యర్థః. శృత దృష్టేషు = శ్రితేషు పార లౌకికేషు,దృషేషు దర్శన యోగ్యేషు అపి సర్వేషు. భూవిపరాది విహి తేష్వపి. ప్రాకామ్యా నామ భోగదర్శన సామర్థ్య సిద్ధిః శక్తిః నామ మాయా తదంశ భూతానాం ప్రేరణం. తత్రేశ్వరే మాయాయాః అన్యేషు తదంశ భూతానాం ప్రేరణం. ఈశితా నామ సిద్ధిః. ఏతే భగవత్ప్రథానాః అష్ట సిద్ధయః”.

(భగవంతుని శక్తులు ఎనిమిది : - అణిమ, మహిమ, లఘిమా - అన్నింటికంటె చిన్నదగుట. (అణోరణీయాన్ = పరమాణువుకంటె చిన్నదగుట) అణిమ.మహిమా అనగా అన్నింటికంటె పెద్దదగుట - మహత్తత్తముకంటె పెద్దదగుట. లఘిమ అనగా అన్నింటికంటె తేలిక యగుట. ప్రాప్తియనగా సమస్త జీవ సమూహముయొక్క ఇంద్రియములద్వారా వాటి వాటి అధిష్టాన దేవతా రూపముతో సంబంధము కలిగియుండుట. ప్రాకామ్యము అనగా పరలోకవిషయములందు, ఈ లోకములోని విషయములందుగల సుఖమును పొందించు శక్తి. వశిత్వవము అనగా మాయను దాని అంశములైన భూతములను ప్రేరేపించుట. ఈశితా. వశిత్వమనగా గుణముల సంగములేకుండుట - సకల జంతువులను వశము చేసుకొనుట).

(అణిమా, మహిమా, లఘిమా - ఈ మూడు సిద్ధులు దేహమునకు సంబంధించినవి. అణిమ యనగా చిన్నదానికంటె చిన్నదియగుట. అణువుకంటె చిన్నది - ఆత్మ అణువులో కూడనున్నది కనుక దానికన్న చిన్నది. మహిమ - అనగా చాలపెద్దది యగుట - (వామనావతారము), లఘిమ - అనగా చాలా తేలికయగుట - (శ్రీకృష్ణతులాభారములో శ్రీకృష్ణుడు తులసిదళముకంటె తేలిక యగుట). దూదికన్న తేలికయగుట. ఇట్టి పదార్థములను లభింప చేసుకొనుట ప్రాప్రి. ఆకాశగమనశక్తి ప్రాకామ్యము - సూర్య చంద్రాదులను, దేవతలను వారి వారి పనులలో నియమించుట ఈ శత్వము. సకల జంతువులను వశముచేసుకొనుట వశత్వము -

  1. సిద్ధి అనగా సిద్ధించుట, ప్రాప్తించుట, చేసినపని సఫలమగుట.

  2. అష్టసిద్ధులు ఈ క్రింద విధముగా కూడా చెప్పబడినవి : -

  1. అంజన సిద్ధి : - అంజనము పూసికొనిన కోరిక సిద్ధించుట. ప్రవరాఖ్యుడు కాలికి లేపము- రసము - పూసుకొని హిమవత్పర్వతమున కేగుట. (2) ఘటకౌసిద్ధి - ఔషధము మొదలగు వాటివలన కలుగునది. (3) పాదుకాసిద్ధి - పాదుకలు తొడుగుకొని ఎక్కడికి వెళ్ళవలెనని కోరుకుంటే అక్కడికి వెళ్ళుట. (4) పరకాయ ప్రవేశసిద్ధి - ఇతర శరీరములో తాను జీవముతో ప్రవేశించుట, దానికి జీవివలె చైతన్యము కలిగించుట - శంకరాచార్యులువారు రాజ శరీరములో ప్రవేశించినట్లు. (5) దూరశ్రవణసిద్ధి - దూరమున కలుగు శబ్దమును వినగలుగుట. దూరమునుండి శతృ సైన్యము వచ్చుచున్నట్లు తెలుసుకొనుట. (6) దూరదృష్టి - కంటికి కనబడనంత దూరములోనున్న దానిని చూడకలుగుట. (7) కాలజ్ఞానము - త్రికాలములందు కలిగెడు విషయములను తెలుసుకొనుట - వ్యాసమహర్షి భూతకాలములలో జరిగిన విషయములను తెలుసుకొని పురాణములు వ్రాసెను - తనకాలములో జరుగుచున్నవి వ్రాసెను - (భారతము). రాబోవు కాలము లందలి స్థితిగతులు - (భవిష్యద్రాజేతి హాసవర్ణన). (8) ఆకాశగమనము - లేపము మొదలగునవి లేకుండగనే ఆకాశమందు సంచరించగలుగుట - (నారదుడు త్రిలోక సంచారి).

“అణిమా, మహిమా, చైగ గరిమా, లఘిమా తథా |

ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః ||”

(అమరము).

(అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము).

Transliteration

“aṇimā, mahimā mūrtēḥ laghimā prāptiriṃdriyaiḥ |

srākāmyaṃ śrūta dṛṣṭēṣu śakti prēraṇa mēśitā |

guṇaśēṣa saṃgōvaśitā yatkāmasta davasyati |

ētēmē siddha yassaumya aṣṭaivōtpatti kāmatāḥ |

autpattikāḥ = (svābhābhāvikāḥ), naratiśayāśca ityarthaḥ -

“aṇimā mahimā laghamā ca mūrtēḥ dēhasya tisraḥ siddhayaḥ. prāptirnāma siddhiḥ sarvaprāṇināṃ iṃdriyaiḥ saha tattadhiṣṭhātṛ dēvatā rūpēṇa saṃbaṃdhimityarthaḥ. śṛta dṛṣṭēṣu = śritēṣu pāra laukikēṣu,dṛṣēṣu darśana yōgyēṣu api sarvēṣu. bhūviparādi vihi tēṣvapi. prākāmyā nāma bhōgadarśana sāmarthya siddhiḥ śaktiḥ nāma māyā tadaṃśa bhūtānāṃ prēraṇaṃ. tatrēśvarē māyāyāḥ anyēṣu tadaṃśa bhūtānāṃ prēraṇaṃ. īśitā nāma siddhiḥ. ētē bhagavatprathānāḥ aṣṭa siddhayaḥ”.

(bhagavaṃtuni śaktulu enimidi : - aṇima, mahima, laghimā - anniṃṭikaṃṭe cinnadaguṭa. (aṇōraṇīyān = paramāṇuvukaṃṭe cinnadaguṭa) aṇima.mahimā anagā anniṃṭikaṃṭe peddadaguṭa - mahattattamukaṃṭe peddadaguṭa. laghima anagā anniṃṭikaṃṭe tēlika yaguṭa. prāptiyanagā samasta jīva samūhamuyokka iṃdriyamuladvārā vāṭi vāṭi adhiṣṭāna dēvatā rūpamutō saṃbaṃdhamu kaligiyuṃḍuṭa. prākāmyamu anagā paralōkaviṣayamulaṃdu, ī lōkamulōni viṣayamulaṃdugala sukhamunu poṃdiṃcu śakti. vaśitvavamu anagā māyanu dāni aṃśamulaina bhūtamulanu prērēpiṃcuṭa. īśitā. vaśitvamanagā guṇamula saṃgamulēkuṃḍuṭa - sakala jaṃtuvulanu vaśamu cēsukonuṭa).

(aṇimā, mahimā, laghimā - ī mūḍu siddhulu dēhamunaku saṃbaṃdhiṃcinavi. aṇima yanagā cinnadānikaṃṭe cinnadiyaguṭa. aṇuvukaṃṭe cinnadi - ātma aṇuvulō kūḍanunnadi kanuka dānikanna cinnadi. mahima - anagā cālapeddadi yaguṭa - (vāmanāvatāramu), laghima - anagā cālā tēlikayaguṭa - (śrīkṛṣṇatulābhāramulō śrīkṛṣṇuḍu tulasidaḷamukaṃṭe tēlika yaguṭa). dūdikanna tēlikayaguṭa. iṭṭi padārthamulanu labhiṃpa cēsukonuṭa prāpri. ākāśagamanaśakti prākāmyamu - sūrya caṃdrādulanu, dēvatalanu vāri vāri panulalō niyamiṃcuṭa ī śatvamu. sakala jaṃtuvulanu vaśamucēsukonuṭa vaśatvamu -

  1. siddhi anagā siddhiṃcuṭa, prāptiṃcuṭa, cēsinapani saphalamaguṭa.

  2. aṣṭasiddhulu ī kriṃda vidhamugā kūḍā ceppabaḍinavi : -

  1. aṃjana siddhi : - aṃjanamu pūsikonina kōrika siddhiṃcuṭa. pravarākhyuḍu kāliki lēpamu- rasamu - pūsukoni himavatparvatamuna kēguṭa. (2) ghaṭakausiddhi - auṣadhamu modalagu vāṭivalana kalugunadi. (3) pādukāsiddhi - pādukalu toḍugukoni ekkaḍiki veḷḷavalenani kōrukuṃṭē akkaḍiki veḷḷuṭa. (4) parakāya pravēśasiddhi - itara śarīramulō tānu jīvamutō pravēśiṃcuṭa, dāniki jīvivale caitanyamu kaligiṃcuṭa - śaṃkarācāryuluvāru rāja śarīramulō pravēśiṃcinaṭlu. (5) dūraśravaṇasiddhi - dūramuna kalugu śabdamunu vinagaluguṭa. dūramunuṃḍi śatṛ sainyamu vaccucunnaṭlu telusukonuṭa. (6) dūradṛṣṭi - kaṃṭiki kanabaḍanaṃta dūramulōnunna dānini cūḍakaluguṭa. (7) kālajñānamu - trikālamulaṃdu kaligeḍu viṣayamulanu telusukonuṭa - vyāsamaharṣi bhūtakālamulalō jarigina viṣayamulanu telusukoni purāṇamulu vrāsenu - tanakālamulō jarugucunnavi vrāsenu - (bhāratamu). rābōvu kālamu laṃdali sthitigatulu - (bhaviṣyadrājēti hāsavarṇana). (8) ākāśagamanamu - lēpamu modalagunavi lēkuṃḍaganē ākāśamaṃdu saṃcariṃcagaluguṭa - (nāraduḍu trilōka saṃcāri).

“aṇimā, mahimā, caiga garimā, laghimā tathā |

prāptiḥ prākāmyamīśatvaṃ vaśitvaṃ cāṣṭa siddhayaḥ ||”

(amaramu).

(aṇima, mahima, garima, laghima, prāpti, prākāmyamu, īśatvamu, vaśitvamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.