← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టవిధభక్తి aṣṭavidhabhakti

Original — తెలుగు

“శ్లో ||. మద్భక్త జనవాత్సల్యం పూజాయాంచాను మోదనం |

స్వయమభ్యర్చనం చైవ మదర్ధేడం బవర్జనం |

మత్కథాశ్రవణీ భక్తిః సర్వ నేత్రాంగ విక్రియా |

మామనుస్మరణం నిత్యం యచ్చమాం నోప జీవతి |

భక్తిరష్ట్విధ్యా హ్యేషా యస్మిన్ మ్లేచ్చేపి వర్తతే |

స విప్రేంద్రో మునిః శ్రీమాన్ సయతిస్స సంపితః |

తస్మై దేయం తతోగ్రాహ్యం సచ పూజ్యో యధాహ్యహం ||“. (గారుడే)

(భగవద్భక్తులయడల వాత్సల్యము, భగవంతుని పూజ చేయుటయందు సంతోషము కలిగియుండుట, తాను భగవంతుని స్వయముగా పూజచేయుట, భగవంతుని విషయములో డంబములేకయుండుట, భగవంతుని కథలు వినుటయందు భక్తికలిగియుండుట, కంఠస్వరము, కండ్లు, అంగములు మార్పుచెందుట, ఎల్లపుడు భగవంతుని స్మరించుట, అట్లు చేయలేనపుడు జీవించలేనట్లు బాధపడుట - - ఇవి ఎనిమిది విధముల భక్తి. ఈ ఎనిమిది విధములైన భక్తి ఎవనియందు కలుగునో వాడు మ్లేచ్చుడైనను అతనే విప్రుడు, ముని. శ్రీమంతుడు, యతి, పండితుడు. అట్టివానికేది యిచ్చిననుభగవంతునికిచ్చినట్లే భావించవలెను - అట్టివానినుండి ఏది పరిగ్రహించినను భగవంతునినుండే పరిగ్రహించినట్లే భావించవలెను).

Transliteration

“ślō ||. madbhakta janavātsalyaṃ pūjāyāṃcānu mōdanaṃ |

svayamabhyarcanaṃ caiva madardhēḍaṃ bavarjanaṃ |

matkathāśravaṇī bhaktiḥ sarva nētrāṃga vikriyā |

māmanusmaraṇaṃ nityaṃ yaccamāṃ nōpa jīvati |

bhaktiraṣṭvidhyā hyēṣā yasmin mlēccēpi vartatē |

sa viprēṃdrō muniḥ śrīmān sayatissa saṃpitaḥ |

tasmai dēyaṃ tatōgrāhyaṃ saca pūjyō yadhāhyahaṃ ||“. (gāruḍē)

(bhagavadbhaktulayaḍala vātsalyamu, bhagavaṃtuni pūja cēyuṭayaṃdu saṃtōṣamu kaligiyuṃḍuṭa, tānu bhagavaṃtuni svayamugā pūjacēyuṭa, bhagavaṃtuni viṣayamulō ḍaṃbamulēkayuṃḍuṭa, bhagavaṃtuni kathalu vinuṭayaṃdu bhaktikaligiyuṃḍuṭa, kaṃṭhasvaramu, kaṃḍlu, aṃgamulu mārpuceṃduṭa, ellapuḍu bhagavaṃtuni smariṃcuṭa, aṭlu cēyalēnapuḍu jīviṃcalēnaṭlu bādhapaḍuṭa - - ivi enimidi vidhamula bhakti. ī enimidi vidhamulaina bhakti evaniyaṃdu kalugunō vāḍu mlēccuḍainanu atanē vipruḍu, muni. śrīmaṃtuḍu, yati, paṃḍituḍu. aṭṭivānikēdi yiccinanubhagavaṃtunikiccinaṭlē bhāviṃcavalenu - aṭṭivāninuṃḍi ēdi parigrahiṃcinanu bhagavaṃtuninuṃḍē parigrahiṃcinaṭlē bhāviṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.