రావి చెట్టు.
అ + శ్వః + స్థః : - స్వః = రేపు,. నస్థః = ఉండనిది. అశ్వత్థము - రేపటివరకు ఉండనిది - రేపటివరకు ఉండునని చెప్పుటకు వీలుకానిది.
శ్వః న తిష్టతీతి అశ్వత్థః. శ్వః తిష్టతీతి శ్వస్థః = రేపటికి ఉండునది; న శ్వస్తిష్ట తతి అశ్వత్థః = రేపటికి ఉండనిది, ముందుకాలములో ఉండనిది.
స్వః స్థాతా స్వత్థః, స్వత్థో న భవతి ఇత్యశ్వత్థః - శ్వో నస్థాస్యతి ఇతి అశ్వత్థః (శ్రీ వేదాంత దేశికః)
(రేపటికి ఉండనిది).
(ఒకే ప్రకారముగా, ఒకే స్థితిలో ఉండనిది, వికారము చెందునది, మార్పు చెందునది).
(ఈ సృష్టిలో ప్రతి వస్తువు క్షణ క్షణమును మార్పు చెందును. క్షణ క్షణమును పొందు ఈ మార్పు సాధారణముగా ప్రతి దినమును చూచువారికి కనబడదు. మొక్క ఎదుగుటలోగల మార్పు ప్రతిక్షణము కనబడదు. కొత్తఆకుగాని, పువ్వుగాని, పింజగాని వచ్చునపుడు అది ఒక్కమారుగా రాదు - కాలక్రమేణ వచ్చును - ఆ మొక్కకు ఈ క్షణమున ఉన్న స్థితి మరుక్షణమందుండదు. అందుచేత అశ్వత్థమనగా క్షణ భంగురము).
(సంసారము ఒక అశ్వత్థవృక్షముతో పోల్చ బడినది - సాధారణముగా చెట్టుకు వ్రేళ్ళు క్రిందను ఉండును, కొమ్మలు చిగుళ్ళు మీదకి ఉండును. కాని సంసారమను ఈ అశ్వత్థవృక్షమునకు వేళ్ళు మీదను, చిగుళ్ళు, ఆకులు క్రిందను వ్యాపించియున్నవి. అనగా సంసారము మీదనుండి - భగవంతునినుండి పుట్టినది - సంసారమను సృష్టికి ఒక కారణము భగవంతుడు - మహామాయా శక్తితోకూడిన పరబ్రహ్మము ఈ వృక్షమునకు కొమ్మలు హిరణ్యగర్భుడు మొదలగువారు - పుణ్యాపుణ్యరూపములగు కర్మలకు కలిగిన ఫలములను నిర్ణయించి చెప్పు కర్మకాండభాగముగల వేదము ఆకులు, దాని చిగుళ్ళు విషయములు. ఇవి త్రిగుణములచేత నలుప్రక్కల వ్యాపించియుండును - సత్వరజస్తమోగుణముల ప్రభావమువలననే ఈ సంసారము వృద్ధిపొంది వ్యాపించుట. ఇందువలన కర్మలు చేయుచు మనుష్యులు వాటిచే బంధింపబడి ఫలమును అనుభవించుచున్నారు. ఈ కర్మఫలానుభవముకొఱకు ఉత్తమ జన్మములో, నీచజన్మములో - మానవజన్మ కన్న ఉత్తమమైన జన్మకాని, పశు పక్షి పన్నగాది జన్మగాని, క్రూరజంతువులుగాగాని పుట్టుట జరుగుచున్నది. దీనికి రూపము కానరాదు. ఎవరును దీనిని తెలుసుకొనలేరు. ఎండమావులవలె కనబడినట్లు ఉండునుగాని కనబడదు. దీనికి ఆదిలేదు - ఈ సంసారవృక్షము ఎప్పుడు పుట్టినదో - ఎప్పుడు ఆరంభమైనదో ఏ ప్రకారముగా. ఏమి కారణముగా వృద్ధి పొందుచున్నదో - పెరుగుచున్నదో -, దీనికి అంతము ఎప్పుడో తెలియదు - మరల మరల పుట్టుచు, చనిపోవుచుండుట ప్రవాహరూపముగా నిత్యమైనదని తోచుచున్నను అశ్వత్థమువలె ఎప్పుడును స్థిరముగా నుండునదికాదు - క్షణ క్షణము మారుచుండును, అందుచేత అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ క్షణమున అంతరించునో తెలియనిదగుటచేత ఈ సంసారమును అశ్వత్థవృక్షమని చెప్పబడినది. ఈ కారణమువలన ఈ సంసారమును దాటుమార్గమును చూచుకొనవలెను - ఈ సంసారము కర్మల ఫలితముకనుక కర్మలను కోరక చేయవలెను. ఇట్లుచేయుటవలన ఈ శస్త్రముతో ఈ వృక్షమును వేళ్ళతో నరికివేయ వలెను - చెట్టుకు వేళ్ళు నరికివేసిన మరిమొలవదు, చిగురించదు. ఇట్లు సంగమువదలి వైరాగ్యము నవలంభించి పునర్జన్మ లేనటువంటి - సంసారమును మరల పొందనటువంటి - స్థితి అయిన పరమపదమును, - మోక్షమును, - వైకుంఠమును - పొంది, ఆ ప్రధమ పురుషుడు, ఆదిపురుషుడు, ఈ సృష్టి అంతటికీ మూలకారణమైనవాడు, ఈ సంసారమును ప్రారంభింప చేసివాడూ అయిన భగవంతుని చేరుచున్నాడు - విముక్తిని పొందుచున్నాడు.)
(శ్రీశంకరః)
(సంసారమునుండి విరక్తుడైనవాడే, సంసారమందాసక్తిలేనివాడే భగవత్తత్వమును తెలుసుకొనుటకు అధికారి. అందుచేత ఈ సంసారము అశ్వత్థమువంటిది అని కల్పించిచెప్పుట ఇట్టి వైరాగ్యము కలుగుటకే).
(కర్మఫలమందాసక్తి లేకుండుటయను ఆయుధముచే వృక్షమును భేదించుట యను కర్మబంధమును తెంచుట అక్షరుడగు భగవంతుని విభూతినిచెప్పుటకు, కర్మబంధమువలననే వ్యాపించినట్లు వాటి ‘అచిత్’ రూపమగు అశ్వత్థరూప వృక్షము చెప్పబడినది).
“అశ్వత్థః సర్వవృక్షాణాం”. (గీత - 10 - 26)
(అశ్వత్థమనగా రావి చెట్టు. దీని మొదలను - వేళ్ళయందు విష్ణువు, స్కందమందు కేశవుడు, కొమ్మలందునారాయణుడు, ఉండునని ప్రతీతి - అనగా చెట్టు ఆమూలాగ్రము భగవంతుడే. సృష్టికి కూడా మూలము మొదలు చివరవరకు బ్రహ్మాది పిపీలికాంతము ప్రపంచము అంతా భగవంతుడే). (వృక్షములలో అశ్వత్థము భగవంతుడే - అతని విభూతియే)
(దీని స్థితి - పరిస్థితి - ఇది ఈ మోస్తరుగా నుండునది అని నిర్ణయించుటకు శక్తి చాలదుకనుక దీనిని - సంసారమును - అశ్వత్థమనిరి).
(కామ్యకర్మలనుగాలిచేత దీపమువలె చలింపచేయబడు స్వభావము కలది).
(పైన 7 లో చెప్పిన శ్రీమద్భగవద్గీతాశ్లోకార్థమే ఉపనిషత్తులో చెప్పబడినది).
rāvi ceṭṭu.
a + śvaḥ + sthaḥ : - svaḥ = rēpu,. nasthaḥ = uṃḍanidi. aśvatthamu - rēpaṭivaraku uṃḍanidi - rēpaṭivaraku uṃḍunani ceppuṭaku vīlukānidi.
śvaḥ na tiṣṭatīti aśvatthaḥ. śvaḥ tiṣṭatīti śvasthaḥ = rēpaṭiki uṃḍunadi; na śvastiṣṭa tati aśvatthaḥ = rēpaṭiki uṃḍanidi, muṃdukālamulō uṃḍanidi.
svaḥ sthātā svatthaḥ, svatthō na bhavati ityaśvatthaḥ - śvō nasthāsyati iti aśvatthaḥ (śrī vēdāṃta dēśikaḥ)
(rēpaṭiki uṃḍanidi).
(okē prakāramugā, okē sthitilō uṃḍanidi, vikāramu ceṃdunadi, mārpu ceṃdunadi).
(ī sṛṣṭilō prati vastuvu kṣaṇa kṣaṇamunu mārpu ceṃdunu. kṣaṇa kṣaṇamunu poṃdu ī mārpu sādhāraṇamugā prati dinamunu cūcuvāriki kanabaḍadu. mokka eduguṭalōgala mārpu pratikṣaṇamu kanabaḍadu. kottaākugāni, puvvugāni, piṃjagāni vaccunapuḍu adi okkamārugā rādu - kālakramēṇa vaccunu - ā mokkaku ī kṣaṇamuna unna sthiti marukṣaṇamaṃduṃḍadu. aṃducēta aśvatthamanagā kṣaṇa bhaṃguramu).
(saṃsāramu oka aśvatthavṛkṣamutō pōlca baḍinadi - sādhāraṇamugā ceṭṭuku vrēḷḷu kriṃdanu uṃḍunu, kommalu ciguḷḷu mīdaki uṃḍunu. kāni saṃsāramanu ī aśvatthavṛkṣamunaku vēḷḷu mīdanu, ciguḷḷu, ākulu kriṃdanu vyāpiṃciyunnavi. anagā saṃsāramu mīdanuṃḍi - bhagavaṃtuninuṃḍi puṭṭinadi - saṃsāramanu sṛṣṭiki oka kāraṇamu bhagavaṃtuḍu - mahāmāyā śaktitōkūḍina parabrahmamu ī vṛkṣamunaku kommalu hiraṇyagarbhuḍu modalaguvāru - puṇyāpuṇyarūpamulagu karmalaku kaligina phalamulanu nirṇayiṃci ceppu karmakāṃḍabhāgamugala vēdamu ākulu, dāni ciguḷḷu viṣayamulu. ivi triguṇamulacēta naluprakkala vyāpiṃciyuṃḍunu - satvarajastamōguṇamula prabhāvamuvalananē ī saṃsāramu vṛddhipoṃdi vyāpiṃcuṭa. iṃduvalana karmalu cēyucu manuṣyulu vāṭicē baṃdhiṃpabaḍi phalamunu anubhaviṃcucunnāru. ī karmaphalānubhavamukoṟaku uttama janmamulō, nīcajanmamulō - mānavajanma kanna uttamamaina janmakāni, paśu pakṣi pannagādi janmagāni, krūrajaṃtuvulugāgāni puṭṭuṭa jarugucunnadi. dīniki rūpamu kānarādu. evarunu dīnini telusukonalēru. eṃḍamāvulavale kanabaḍinaṭlu uṃḍunugāni kanabaḍadu. dīniki ādilēdu - ī saṃsāravṛkṣamu eppuḍu puṭṭinadō - eppuḍu āraṃbhamainadō ē prakāramugā. ēmi kāraṇamugā vṛddhi poṃducunnadō - perugucunnadō -, dīniki aṃtamu eppuḍō teliyadu - marala marala puṭṭucu, canipōvucuṃḍuṭa pravāharūpamugā nityamainadani tōcucunnanu aśvatthamuvale eppuḍunu sthiramugā nuṃḍunadikādu - kṣaṇa kṣaṇamu mārucuṃḍunu, aṃducēta aśāśvatamainadi. eppuḍu ē kṣaṇamuna aṃtariṃcunō teliyanidaguṭacēta ī saṃsāramunu aśvatthavṛkṣamani ceppabaḍinadi. ī kāraṇamuvalana ī saṃsāramunu dāṭumārgamunu cūcukonavalenu - ī saṃsāramu karmala phalitamukanuka karmalanu kōraka cēyavalenu. iṭlucēyuṭavalana ī śastramutō ī vṛkṣamunu vēḷḷatō narikivēya valenu - ceṭṭuku vēḷḷu narikivēsina marimolavadu, ciguriṃcadu. iṭlu saṃgamuvadali vairāgyamu navalaṃbhiṃci punarjanma lēnaṭuvaṃṭi - saṃsāramunu marala poṃdanaṭuvaṃṭi - sthiti ayina paramapadamunu, - mōkṣamunu, - vaikuṃṭhamunu - poṃdi, ā pradhama puruṣuḍu, ādipuruṣuḍu, ī sṛṣṭi aṃtaṭikī mūlakāraṇamainavāḍu, ī saṃsāramunu prāraṃbhiṃpa cēsivāḍū ayina bhagavaṃtuni cērucunnāḍu - vimuktini poṃducunnāḍu.)
(śrīśaṃkaraḥ)
(saṃsāramunuṃḍi viraktuḍainavāḍē, saṃsāramaṃdāsaktilēnivāḍē bhagavattatvamunu telusukonuṭaku adhikāri. aṃducēta ī saṃsāramu aśvatthamuvaṃṭidi ani kalpiṃciceppuṭa iṭṭi vairāgyamu kaluguṭakē).
(karmaphalamaṃdāsakti lēkuṃḍuṭayanu āyudhamucē vṛkṣamunu bhēdiṃcuṭa yanu karmabaṃdhamunu teṃcuṭa akṣaruḍagu bhagavaṃtuni vibhūtiniceppuṭaku, karmabaṃdhamuvalananē vyāpiṃcinaṭlu vāṭi ‘acit’ rūpamagu aśvattharūpa vṛkṣamu ceppabaḍinadi).
“aśvatthaḥ sarvavṛkṣāṇāṃ”. (gīta - 10 - 26)
(aśvatthamanagā rāvi ceṭṭu. dīni modalanu - vēḷḷayaṃdu viṣṇuvu, skaṃdamaṃdu kēśavuḍu, kommalaṃdunārāyaṇuḍu, uṃḍunani pratīti - anagā ceṭṭu āmūlāgramu bhagavaṃtuḍē. sṛṣṭiki kūḍā mūlamu modalu civaravaraku brahmādi pipīlikāṃtamu prapaṃcamu aṃtā bhagavaṃtuḍē). (vṛkṣamulalō aśvatthamu bhagavaṃtuḍē - atani vibhūtiyē)
(dīni sthiti - paristhiti - idi ī mōstarugā nuṃḍunadi ani nirṇayiṃcuṭaku śakti cāladukanuka dīnini - saṃsāramunu - aśvatthamaniri).
(kāmyakarmalanugālicēta dīpamuvale caliṃpacēyabaḍu svabhāvamu kaladi).
(paina 7 lō ceppina śrīmadbhagavadgītāślōkārthamē upaniṣattulō ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.