← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతలము atalamu

Original — తెలుగు
  1. న తలస్య స్పర్శో యత్ర

(అడుగు భాగములేనిది, అనగా, చాల లోతైనది. అడుగు భాగము ఉన్నదోలేదో, ఎంత అడుగున ఉన్నదో తెలియనిది.)

  1. తెల్లని కాంతిగలది. ఇందులో పన్నగములు నివసించునని చెప్పబడియున్నది.

  2. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల పాతాళములు అను సప్త పాతాళములలో మొదటిది.

  3. “మ. బహు పాదోరు భుజాననేక్షణ శిరః పాలశ్రవోపేతుడై

విహరించున్ బహు దేహి దేహగతుడై; విద్వాంసులూహించి త

ద్బహురూపావయవంబులన్ భువనపంక్తిన్ విచారింతురు - - - ||”

“వ. --- చతుర్దశ లోకంబులందును మీది ఏడులోకంబులు శ్రీ మహావిష్ణువునకు కటి ప్రదేశంబున నుండి యూర్ధ్వదేహంబనియును, క్రిందిఏడు లోకంబులు జఘనంబుననుండి యధోదేహమనియు బలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతునికి - - - కటిప్రదేశంబతలంబు.” (శ్రీ మదాంధ్రమహాభాగవతము- 2 - 5 - 89)

(శ్రీ పంచమంతయు - అందులోనున్న వస్తువులన్నియు - ఒకే చోట కలిసియున్నట్టు ఊహించిన అది భగవంతుని స్థూలరూపము. ఇదే అతని విశ్వరూపము - విశ్వమే, ప్రపంచమేఅతని రూపముగా గలది. ఈ విశ్వరూపమును ఒక మహా మానవరూపముతో పోల్చి, ఆ విశ్వమానవరూపములోని భాగములను - వేఱు వేఱు అవయవములను- వేఱు వేఱు లోకములనిన్నీ, ఆ లోకములలో ఆ విశ్వరూపములోని గటిప్రదేశమునుండి - దేహమధ్య భాగమునుండి క్రింద ఏడులోకములు సప్త పాతాళలోకములని, ఆ పాతాళ లోకములలో కటి ప్రదేశమైన మొదటిది అతలమని ఊహించి విద్వాంసులు - అనగా బ్రహ్మ వేత్తలు - చెప్పుదురు.)

  1. సాటిలేనివాడు.
Transliteration
  1. na talasya sparśō yatra

(aḍugu bhāgamulēnidi, anagā, cāla lōtainadi. aḍugu bhāgamu unnadōlēdō, eṃta aḍuguna unnadō teliyanidi.)

  1. tellani kāṃtigaladi. iṃdulō pannagamulu nivasiṃcunani ceppabaḍiyunnadi.

  2. atala, vitala, sutala, rasātala, talātala, mahātala pātāḷamulu anu sapta pātāḷamulalō modaṭidi.

  3. “ma. bahu pādōru bhujānanēkṣaṇa śiraḥ pālaśravōpētuḍai

vihariṃcun bahu dēhi dēhagatuḍai; vidvāṃsulūhiṃci ta

dbahurūpāvayavaṃbulan bhuvanapaṃktin vicāriṃturu - - - ||”

“va. --- caturdaśa lōkaṃbulaṃdunu mīdi ēḍulōkaṃbulu śrī mahāviṣṇuvunaku kaṭi pradēśaṃbuna nuṃḍi yūrdhvadēhaṃbaniyunu, kriṃdiēḍu lōkaṃbulu jaghanaṃbunanuṃḍi yadhōdēhamaniyu balukuduru. prapaṃca śarīruṃḍagu bhagavaṃtuniki - - - kaṭipradēśaṃbatalaṃbu.” (śrī madāṃdhramahābhāgavatamu- 2 - 5 - 89)

(śrī paṃcamaṃtayu - aṃdulōnunna vastuvulanniyu - okē cōṭa kalisiyunnaṭṭu ūhiṃcina adi bhagavaṃtuni sthūlarūpamu. idē atani viśvarūpamu - viśvamē, prapaṃcamēatani rūpamugā galadi. ī viśvarūpamunu oka mahā mānavarūpamutō pōlci, ā viśvamānavarūpamulōni bhāgamulanu - vēṟu vēṟu avayavamulanu- vēṟu vēṟu lōkamulaninnī, ā lōkamulalō ā viśvarūpamulōni gaṭipradēśamunuṃḍi - dēhamadhya bhāgamunuṃḍi kriṃda ēḍulōkamulu sapta pātāḷalōkamulani, ā pātāḷa lōkamulalō kaṭi pradēśamaina modaṭidi atalamani ūhiṃci vidvāṃsulu - anagā brahma vēttalu - ceppuduru.)

  1. sāṭilēnivāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.