← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతర్క్యం atarkyaṃ

Original — తెలుగు
  1. తర్కా గోచరం. (తర్కించుటచే గోచరముకానిది, తెలియబడనిది, ఊహింప శక్యముకానిది.)

  2. అనిర్వాచ్య త్వాదతర్క్యం.

(వాక్కుచే చెప్పడానికి - వచించడానికి - వీలుకానిది, నిర్వచించుటకు వీలుకానిది.)

  1. స్వబుద్ధ్యూ హ విషయం (తన బుద్ధిచేత అలోచించుటకు, ఊహించుటకు వీలు పడనిది.)

  2. “యతః అణోరప్యణీయానాత్మా అతః తత్స్వరూపం తర్కా గోచరం” (శ్రీరంగరామానుజః)

(ఆత్మ అణువుకన్న - అన్నింటికన్న, చిన్నదానికన్న చిన్నదియగుటవలన దాని స్వరూపము తర్కము చేత గోచరముకాదు, తెలియబడదు.)

  1. “అణు ప్రమాణో నతర్క్యః స్వబుద్ధ్యభ్యూహేన కేనలేన. తర్క్యమాణే అణుపరిమాణే కేనచిత్ స్తాపితే ఆత్మని తతో అణుతరం అన్యోభ్యూహతి, తతోప్యణుతరమితి నహి తర్కస్య నిష్ఠాక్వచిత్ విద్యతే” (శ్రీ శంకరః)

(అణుప్రమాణము తర్కింప శక్యముకానిది. ఒకవేళ బుద్ధిచేత తర్కింపబడిననూ, దానికంటె చిన్నది, ఇంకా దాని కన్న చిన్నది - ఈ ప్రకారముగా తర్కమునకు అంతము కానరాదు. అందుచేత తర్కమువలన తెలియ బడనిది.)

  1. “న తదీదృగితి జ్ఞేయం, నవాచ్యం, నతర్క్యతే |

పశ్యం తోపి న పశ్యంతి మేరోః రూపం విపశ్చితః ||”

(అది ఇటువంటిది అని తెలియబడదు, నోటితో చెప్పుటకు వీలుకానిది. పండితులైనను మేరు పర్వతముయొక్కరూపమును చూచుచున్నప్పటికీ దానిని స్పష్టముగాచెప్పలేరు. ఆ ప్రకారముగానే ఆత్మ అతర్క్యము.)

  1. బుద్ధిచేత నూహింప శక్యముకానిది కనుకనే ఒక్కొక్క మతము వారు ఆత్మ అనగా ఒక్కొక్క రీతిగా అభిప్రాయ పడిరి. “తస్మాత్ న తర్కగమ్య మాత్మ తత్వం. కింతు ఉపనిష దేక సమధి గమ్యం” (అందుచేతనే ఆత్మ తత్వము తర్కించి తెలుసుకొనుటకు వీలుకానిది. ఉపనిషత్తుల ద్వారానే తెలియ శక్యమైనది.) “శ్రుత్యనుకూల తర్కస్యాత్మజ్ఞానోప యోగిత్వ ముక్తం. శ్రుతివిరుద్ధ తర్కస్య ప్రత్యవాయ హేతుత్వం చోక్తం” (శ్రుతికి అనుకూలమైన తర్కము ఆత్మ జ్ఞానమునకుపయోగించును. శ్రుతికి విరోధమైన తర్క వాక్యములు ప్రత్యవాయము కూడ కలుగ చేయును.)
Transliteration
  1. tarkā gōcaraṃ. (tarkiṃcuṭacē gōcaramukānidi, teliyabaḍanidi, ūhiṃpa śakyamukānidi.)

  2. anirvācya tvādatarkyaṃ.

(vākkucē ceppaḍāniki - vaciṃcaḍāniki - vīlukānidi, nirvaciṃcuṭaku vīlukānidi.)

  1. svabuddhyū ha viṣayaṃ (tana buddhicēta alōciṃcuṭaku, ūhiṃcuṭaku vīlu paḍanidi.)

  2. “yataḥ aṇōrapyaṇīyānātmā ataḥ tatsvarūpaṃ tarkā gōcaraṃ” (śrīraṃgarāmānujaḥ)

(ātma aṇuvukanna - anniṃṭikanna, cinnadānikanna cinnadiyaguṭavalana dāni svarūpamu tarkamu cēta gōcaramukādu, teliyabaḍadu.)

  1. “aṇu pramāṇō natarkyaḥ svabuddhyabhyūhēna kēnalēna. tarkyamāṇē aṇuparimāṇē kēnacit stāpitē ātmani tatō aṇutaraṃ anyōbhyūhati, tatōpyaṇutaramiti nahi tarkasya niṣṭhākvacit vidyatē” (śrī śaṃkaraḥ)

(aṇupramāṇamu tarkiṃpa śakyamukānidi. okavēḷa buddhicēta tarkiṃpabaḍinanū, dānikaṃṭe cinnadi, iṃkā dāni kanna cinnadi - ī prakāramugā tarkamunaku aṃtamu kānarādu. aṃducēta tarkamuvalana teliya baḍanidi.)

  1. “na tadīdṛgiti jñēyaṃ, navācyaṃ, natarkyatē |

paśyaṃ tōpi na paśyaṃti mērōḥ rūpaṃ vipaścitaḥ ||”

(adi iṭuvaṃṭidi ani teliyabaḍadu, nōṭitō ceppuṭaku vīlukānidi. paṃḍitulainanu mēru parvatamuyokkarūpamunu cūcucunnappaṭikī dānini spaṣṭamugāceppalēru. ā prakāramugānē ātma atarkyamu.)

  1. buddhicēta nūhiṃpa śakyamukānidi kanukanē okkokka matamu vāru ātma anagā okkokka rītigā abhiprāya paḍiri. “tasmāt na tarkagamya mātma tatvaṃ. kiṃtu upaniṣa dēka samadhi gamyaṃ” (aṃducētanē ātma tatvamu tarkiṃci telusukonuṭaku vīlukānidi. upaniṣattula dvārānē teliya śakyamainadi.) “śrutyanukūla tarkasyātmajñānōpa yōgitva muktaṃ. śrutiviruddha tarkasya pratyavāya hētutvaṃ cōktaṃ” (śrutiki anukūlamaina tarkamu ātma jñānamunakupayōgiṃcunu. śrutiki virōdhamaina tarka vākyamulu pratyavāyamu kūḍa kaluga cēyunu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.