← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతత్వ్యావృత్తి atatvyāvṛtti

Original — తెలుగు
  1. ‘ఇది కాదు; ఇదికాదు’ అని ప్రకృతికి సంబంధించిన లక్షణములు గల దేహము మొదలగు వాటినన్నింటిని తోసివేసి, ఆ మిగిలినదే పరబ్రహ్మము అని చెప్పుట.

  2. “దేహాద్య నాత్మ వర్గంబుల యుక్తులచేత” నేతి ముఖంబున ద్రోచి ఆత్మ నెఱింగించుటయే అతద్వ్యా వృత్తి లక్షణము (వివేక చింతామణి)

(మాయాకార్యమగు ప్రపంచములోని వస్తువులన్నియు “నేతి”, “నేతి” - ఇది బ్రహ్మము కాదు, ఇది బ్రహ్మముకాదు అని వాటినన్నింటిని విడిచిపెట్టి, ఆఖరికి మిగిలినదేదో అదే పరబ్రహ్మము అని చెప్పుట.)

  1. సతత్ వ్యావృత్తిః అతద్వ్యావృత్తిః - నతత్ అతత్, అవిద్యా, తత్కార్యాత్మకం ఉపాధి ద్వయం ఇతియావత్, తద్వ్యావృత్తిః తత్సరిత్యాగః -

(తత్ కానిది అతత్ - అనగా, అవిద్య. దాని కార్యమైనది ప్రపంచము. దానిని విడిచిపెట్టుట - అనగా, అవిద్య యను మాయచే సృష్టింపబడిన ప్రపంచమును ఇది పరబ్రహ్మము కాదని విడిచిపెట్టుట.)

  1. “దీప ప్రకాశయోరివ తయోరభేద సత్యత్వేపి తద్దీపేతు ఏక మేవాద్వితీయం బ్రహ్మ” ఇత్యుక్త్వా కిమపి ద్వైతభావనా నాస్తి. తధాపి తత్ప్రకాశ ఏవ నామరూపాదిభేద ప్రపంచమవ భాసయతేకిల, తథా మాయయా బహుథా దృశ్యమానేపి న ఏకత్వ పరమాత్మస్వరూప భంగః తత్తు మిధ్యాక కేవలదీపశక్త్యేవ, న సుతరాం ప్రకాశ శక్తిః. తద్దీపాభావేతు తత్ప్రకాశస్వరూప త్వా భావాత్. తధైవ ఏకస్య పరమాత్మ నస్యాపి మాయావశేన నానాత్మ్య దర్శనం భవతి. తధాపి తత్సర్వం దీప వైభవమేవేతి, నప్రకాశ వైభవమే వేతి వ్యజ్యతే, తదన్యత్వాత్ నాస్త్యత్ర అద్వైత భంగ ఇత్యేవాతద్వ్యా వృత్తి రుచ్యతే.

(దీపము, దాని ప్రకాశము- వెలుతురు - వేరు వేరుగా ఉన్నట్లు కనబడినను ఆ రెండును ఒకే పదార్ధము. “ఏకమే వా ద్వితీయం బ్రహ్మ” - ఇదంతా ఒకటే పరబ్రహ్మము, రెండవ పదార్ధమే లేదు - అని చెప్పిన ప్రకారము దీపము, ప్రకాశము అను రెండు పదార్ధములు లేవు. అయినప్పటికీ ఈ ప్రకారమే నామ రూపములతో కూడుకున్న వస్తువులను ప్రకాశింప చేయుచున్నది - అనగా, దాని వెలుతురులో వస్తువులు కనబడుచున్నవి. ఆ ప్రకారముగానే మాయ చేత ప్రపంచము అనేక విధములుగా కనబడుచున్నప్పటికీ పరమాత్మ యొక్క ఏకత్వమునకు - అద్వైతమునకు - భంగములేదు.ఈ ప్రకారము వస్తువులు దీపకాంతిలో కనబడుట దీపశక్తివలననే కాని కేవలము దీపముయొక్క ప్రకాశశక్తి వలన కాదు. ఎందుచేతననగా దీపము లేనపుడు దీపముయొక్క వెలుతురు ఉండదు. ఆ ప్రకారముగానే పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ మాయా వశమువలన ప్రపంచము అనేకముగా కనబడును. ఆ ప్రకారముగానే దీపములో వస్తువులు కనబడుట దీపముయొక్క వైభవమేగాని వెలుతురు యొక్క వైభవముకాదు. దీపము,వెలుతురు ఒకటే గనుక, రెండు వేఱుగా కనబడినప్పటికీ, రెండూ ఒకటే. ఇదియే అతద్వ్యావృత్తి లక్షణము - దీపము లేకున్న దాని వెలుతురు, ఆ వెలుతురులో కనబడు వస్తువులు ఉండవు - అట్లే అంతయు పరమాత్మ అనియే గ్రహించవలెను - ఈ రీతి భావనయే అతద్వ్యావృత్తి లక్షణము.)

Transliteration
  1. ‘idi kādu; idikādu’ ani prakṛtiki saṃbaṃdhiṃcina lakṣaṇamulu gala dēhamu modalagu vāṭinanniṃṭini tōsivēsi, ā migilinadē parabrahmamu ani ceppuṭa.

  2. “dēhādya nātma vargaṃbula yuktulacēta” nēti mukhaṃbuna drōci ātma neṟiṃgiṃcuṭayē atadvyā vṛtti lakṣaṇamu (vivēka ciṃtāmaṇi)

(māyākāryamagu prapaṃcamulōni vastuvulanniyu “nēti”, “nēti” - idi brahmamu kādu, idi brahmamukādu ani vāṭinanniṃṭini viḍicipeṭṭi, ākhariki migilinadēdō adē parabrahmamu ani ceppuṭa.)

  1. satat vyāvṛttiḥ atadvyāvṛttiḥ - natat atat, avidyā, tatkāryātmakaṃ upādhi dvayaṃ itiyāvat, tadvyāvṛttiḥ tatsarityāgaḥ -

(tat kānidi atat - anagā, avidya. dāni kāryamainadi prapaṃcamu. dānini viḍicipeṭṭuṭa - anagā, avidya yanu māyacē sṛṣṭiṃpabaḍina prapaṃcamunu idi parabrahmamu kādani viḍicipeṭṭuṭa.)

  1. “dīpa prakāśayōriva tayōrabhēda satyatvēpi taddīpētu ēka mēvādvitīyaṃ brahma” ityuktvā kimapi dvaitabhāvanā nāsti. tadhāpi tatprakāśa ēva nāmarūpādibhēda prapaṃcamava bhāsayatēkila, tathā māyayā bahuthā dṛśyamānēpi na ēkatva paramātmasvarūpa bhaṃgaḥ tattu midhyāka kēvaladīpaśaktyēva, na sutarāṃ prakāśa śaktiḥ. taddīpābhāvētu tatprakāśasvarūpa tvā bhāvāt. tadhaiva ēkasya paramātma nasyāpi māyāvaśēna nānātmya darśanaṃ bhavati. tadhāpi tatsarvaṃ dīpa vaibhavamēvēti, naprakāśa vaibhavamē vēti vyajyatē, tadanyatvāt nāstyatra advaita bhaṃga ityēvātadvyā vṛtti rucyatē.

(dīpamu, dāni prakāśamu- veluturu - vēru vērugā unnaṭlu kanabaḍinanu ā reṃḍunu okē padārdhamu. “ēkamē vā dvitīyaṃ brahma” - idaṃtā okaṭē parabrahmamu, reṃḍava padārdhamē lēdu - ani ceppina prakāramu dīpamu, prakāśamu anu reṃḍu padārdhamulu lēvu. ayinappaṭikī ī prakāramē nāma rūpamulatō kūḍukunna vastuvulanu prakāśiṃpa cēyucunnadi - anagā, dāni veluturulō vastuvulu kanabaḍucunnavi. ā prakāramugānē māya cēta prapaṃcamu anēka vidhamulugā kanabaḍucunnappaṭikī paramātma yokka ēkatvamunaku - advaitamunaku - bhaṃgamulēdu.ī prakāramu vastuvulu dīpakāṃtilō kanabaḍuṭa dīpaśaktivalananē kāni kēvalamu dīpamuyokka prakāśaśakti valana kādu. eṃducētananagā dīpamu lēnapuḍu dīpamuyokka veluturu uṃḍadu. ā prakāramugānē paramātma okkaḍē ayinappaṭikī māyā vaśamuvalana prapaṃcamu anēkamugā kanabaḍunu. ā prakāramugānē dīpamulō vastuvulu kanabaḍuṭa dīpamuyokka vaibhavamēgāni veluturu yokka vaibhavamukādu. dīpamu,veluturu okaṭē ganuka, reṃḍu vēṟugā kanabaḍinappaṭikī, reṃḍū okaṭē. idiyē atadvyāvṛtti lakṣaṇamu - dīpamu lēkunna dāni veluturu, ā veluturulō kanabaḍu vastuvulu uṃḍavu - aṭlē aṃtayu paramātma aniyē grahiṃcavalenu - ī rīti bhāvanayē atadvyāvṛtti lakṣaṇamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.