(చరాచరరూపమగు ప్రపంచమును - ప్రపంచములోనున్న రూపములన్నింటిని గ్రసించువాడు - తినువాడు - భగవంతుడు తాను సృష్టించిన ప్రతి వస్తువును సంహరించువాడు - అత్తానగా భక్షించువాడు, లేక సంహరించువాడు -.) (చూడుము :- ‘ఆత్మ’)
(సర్వమును తినునది కనుక పరబ్రహ్మ ఆత్మ అని చెప్పబడినది) (చూడుము - 1)
(ప్రళయకాలమందు సృష్టిలోని వస్తువులనన్నింటినీ సంహరించును, తనలో లయము చేసుకొనును - ఇదియే తినుట. ఇదికాక, స్థితి సమయములోకూడ సృష్టించిన ప్రతివస్తువును నశింపచేయువాడు. ప్రతి జీవికి అహారము కావలెను, అనగా ప్రతి జీవి దేహములోనున్న పరమాత్మకు ఆహారము కావలెను. అంతా తన సృష్టే కనుక తను చేసిన సృష్టిలోనున్న వస్తువులను తానే తినును. ఒక జీవికి ఇంకొక జీవియే
జీవువికి జీవుండ జీవిక యగు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 1 - 13 - 323)
(బ్రహ్మ ఈ సర్వ ప్రపంచమును తినుచున్నాడు.)
(ఎల్లపుడు బంధించి ఉండునది - పరమాణువులను ఒక దానితో ఇంకొక దానిని ఆకర్షింపచేసి బంధించి ఉంచునది.)
(ప్రకృతి వికారములన్నింటినీ సంహరించి అన్నింటినీ తినును.)
(సమస్తమైన చరాచరములను సంహరించువాడు - వాటి వాటి జీవితాంతమందు, ప్రళయకాలమందు అన్నింటిని సంహరించువాడు.)
(బ్రహ్మ క్షత్రాది సర్వ చరాచర సంహార్తా.)
(బ్రహ్మ క్షత్రములు రెండును ఎవనికి అన్నమగునో, భుజించు పదార్ధమగునోఅతను బ్రహ్మ. బ్రహ్మ క్షత్రములు అనగా బ్రాహ్మణులు క్షత్రియులు అని రెండుజాతులే చెప్పబడినను అవి అన్ని జాతులకు ఉపలక్షణము - అన్నింటినీ చెప్పినట్లే - అనగా, ఈ సృష్టింపబడిన జాతులన్నియు పరబ్రహ్మమునకు ఆహారము.)
(carācararūpamagu prapaṃcamunu - prapaṃcamulōnunna rūpamulanniṃṭini grasiṃcuvāḍu - tinuvāḍu - bhagavaṃtuḍu tānu sṛṣṭiṃcina prati vastuvunu saṃhariṃcuvāḍu - attānagā bhakṣiṃcuvāḍu, lēka saṃhariṃcuvāḍu -.) (cūḍumu :- ‘ātma’)
(sarvamunu tinunadi kanuka parabrahma ātma ani ceppabaḍinadi) (cūḍumu - 1)
(praḷayakālamaṃdu sṛṣṭilōni vastuvulananniṃṭinī saṃhariṃcunu, tanalō layamu cēsukonunu - idiyē tinuṭa. idikāka, sthiti samayamulōkūḍa sṛṣṭiṃcina prativastuvunu naśiṃpacēyuvāḍu. prati jīviki ahāramu kāvalenu, anagā prati jīvi dēhamulōnunna paramātmaku āhāramu kāvalenu. aṃtā tana sṛṣṭē kanuka tanu cēsina sṛṣṭilōnunna vastuvulanu tānē tinunu. oka jīviki iṃkoka jīviyē
jīvuviki jīvuṃḍa jīvika yagu ---” (śrīmadāṃdhra mahābhāgavatamu- 1 - 13 - 323)
(brahma ī sarva prapaṃcamunu tinucunnāḍu.)
(ellapuḍu baṃdhiṃci uṃḍunadi - paramāṇuvulanu oka dānitō iṃkoka dānini ākarṣiṃpacēsi baṃdhiṃci uṃcunadi.)
(prakṛti vikāramulanniṃṭinī saṃhariṃci anniṃṭinī tinunu.)
(samastamaina carācaramulanu saṃhariṃcuvāḍu - vāṭi vāṭi jīvitāṃtamaṃdu, praḷayakālamaṃdu anniṃṭini saṃhariṃcuvāḍu.)
(brahma kṣatrādi sarva carācara saṃhārtā.)
(brahma kṣatramulu reṃḍunu evaniki annamagunō, bhujiṃcu padārdhamagunōatanu brahma. brahma kṣatramulu anagā brāhmaṇulu kṣatriyulu ani reṃḍujātulē ceppabaḍinanu avi anni jātulaku upalakṣaṇamu - anniṃṭinī ceppinaṭlē - anagā, ī sṛṣṭiṃpabaḍina jātulanniyu parabrahmamunaku āhāramu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.