← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అత్యశ్నత atyaśnata

Original — తెలుగు

ఆత్మ సమ్మితం అన్న పరిమాణం అతీత్య అశ్నతః. అత్యశ్నతః - యోగినః యోగశాస్త్రే పరిపరితాత్ అన్న పరిమాణాత్ అతిమాత్రం అశ్నతః యోగః నాస్తి.

“శ్లో||. అర్ధం సవ్యం జనాన్నస్యతృతీయ ముదకస్య చ |

వాయోః సంచరణార్ధంతు చతుర్ధమవ శేషయేత్ ||”

ఇత్యాది పరిమాణం. (శ్రీ శంకరః)

(తనకు ఇష్టమైన అన్నము శాస్త్రములో చెప్పిన పరిమాణమునుమించి తినుట - అట్లు చేయువానికి యోగశాస్త్రము ప్రకారము యోగము కుదరదు - శాస్త్రములో అన్న పరిమాణము ఈ క్రింద విధముగా చెప్పబడినది: - ఉదరములో సగభాగము అన్నము చేతను, పావు భాగము నీటి చేతను నింపి, మిగిలిన పావు భాగము గాలి సంచరించుకొఱకు ఖాళీగా ఉంచివేయవలెను. - ఊపిరి తీయునపుడు, పైకి వదలునపుడు ఊపిరి తిత్తులు నిండుట, అణగిపోవుట కలదు. ఊపిరి తిత్తులు నిండునపుడు అవి అన్న కోశమును నొక్కును. కడుపు కొంచెమైనను ఖాళీగానుండని యెడల అయాసము కలుగును, కడుపులోని ఆహారము అరుగు దలకు వచ్చుటలో అవాంచనీయమైన మార్పులు కలుగును. ఇది ఆరోగ్యమునకు భంగము.)

Transliteration

ātma sammitaṃ anna parimāṇaṃ atītya aśnataḥ. atyaśnataḥ - yōginaḥ yōgaśāstrē pariparitāt anna parimāṇāt atimātraṃ aśnataḥ yōgaḥ nāsti.

“ślō||. ardhaṃ savyaṃ janānnasyatṛtīya mudakasya ca |

vāyōḥ saṃcaraṇārdhaṃtu caturdhamava śēṣayēt ||”

ityādi parimāṇaṃ. (śrī śaṃkaraḥ)

(tanaku iṣṭamaina annamu śāstramulō ceppina parimāṇamunumiṃci tinuṭa - aṭlu cēyuvāniki yōgaśāstramu prakāramu yōgamu kudaradu - śāstramulō anna parimāṇamu ī kriṃda vidhamugā ceppabaḍinadi: - udaramulō sagabhāgamu annamu cētanu, pāvu bhāgamu nīṭi cētanu niṃpi, migilina pāvu bhāgamu gāli saṃcariṃcukoṟaku khāḷīgā uṃcivēyavalenu. - ūpiri tīyunapuḍu, paiki vadalunapuḍu ūpiri tittulu niṃḍuṭa, aṇagipōvuṭa kaladu. ūpiri tittulu niṃḍunapuḍu avi anna kōśamunu nokkunu. kaḍupu koṃcemainanu khāḷīgānuṃḍani yeḍala ayāsamu kalugunu, kaḍupulōni āhāramu arugu dalaku vaccuṭalō avāṃcanīyamaina mārpulu kalugunu. idi ārōgyamunaku bhaṃgamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.