← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవాచ్యము avācyamu

Original — తెలుగు
  1. నోటితో వచింపరానిది, చెప్ప శక్యముకానిది.

  2. ఈ దృగతి సాకల్యేన న పస్యంతి, అపితు ఈక్షణీ యత్వాత్ వాచ్యమేవ.

(ఇటువంటిది అని చూచి చెప్పుటకు వీలులేనిది - చూచుటకు వీలు అయినదానిని చెప్పవచ్చునుగాని చూచుటకు వీలు లేనిదానిని చెప్ప శక్యముకాదు.)

  1. “శ్లో||. నతదీదృగితి జ్ఞేయం నవాచ్యం న తర్క్యతే |

పశ్యంతోపి నపశ్యంతి మేరో రూపం ని పశ్చితః ||

(అది ఇటువంటిది అని తెలియరానిది, చెప్పుటకు అలవికానిది, తర్కింప శక్యముకానిది. మేరూపర్వతమునువలె ఎంత చూచినను విద్వాంసులకుకూడ తెలియరానిది.)

  1. “యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ”.

(దేనిని పొందలేక వాక్కు మనస్సు మరలివచ్చుచున్నవో |అనగా, ఎంతప్రయత్నించినను వాక్కుచే చెప్పుటకుగాని, మనసుతో ఆలోచించుటకుగాని వీలులేనిది.)

Transliteration
  1. nōṭitō vaciṃparānidi, ceppa śakyamukānidi.

  2. ī dṛgati sākalyēna na pasyaṃti, apitu īkṣaṇī yatvāt vācyamēva.

(iṭuvaṃṭidi ani cūci ceppuṭaku vīlulēnidi - cūcuṭaku vīlu ayinadānini ceppavaccunugāni cūcuṭaku vīlu lēnidānini ceppa śakyamukādu.)

  1. “ślō||. natadīdṛgiti jñēyaṃ navācyaṃ na tarkyatē |

paśyaṃtōpi napaśyaṃti mērō rūpaṃ ni paścitaḥ ||

(adi iṭuvaṃṭidi ani teliyarānidi, ceppuṭaku alavikānidi, tarkiṃpa śakyamukānidi. mērūparvatamunuvale eṃta cūcinanu vidvāṃsulakukūḍa teliyarānidi.)

  1. “yatōvācō nivartaṃtē aprāpya manasā saha”.

(dēnini poṃdalēka vākku manassu maralivaccucunnavō |anagā, eṃtaprayatniṃcinanu vākkucē ceppuṭakugāni, manasutō ālōciṃcuṭakugāni vīlulēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.