← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవధ్యః avadhyaḥ

Original — తెలుగు
  1. “నవధ్యః ఆత్మా నిరవయత్వాత్, నిత్యత్వాచ్చ - తత్ర అవధ్యో అయం దేహే శరీరే సర్వస్య సర్వగతత్వాత్ స్థావరాదిషు స్థితోపి సర్వస్య ప్రాణి జాతస్య దేహే వధ్యమానే అపి అయందేహే న వధ్యః”. (శ్రీశంకరః)

(చంపుటకు అలవికానిది, ఆత్మ - అవయవములు - భాగములు - లేనిదగుటవల్ల, నిత్యమైనదగుటవల్లనూ.)

(సమస్తవస్తువులందు, అంతట, స్థావరములు మొదలగువాటియందున్నూ, ఉన్నప్పటికీ, ఆత్మ సమస్త ప్రాణుల దేహములు చంపబడినను వాటిలో ఉన్న దేహి - దేహములోనుండు ఆత్మ - చంపబడదు.)

  1. “వధ్యః నభవతి సర్వస్య ప్రాణి జాతస్య దేహే వధ్యమానోపి అయందేహ లింగదేహ ఉపాదిః ఆత్మా వధ్య మానః నభవతి”

(శ్రీమధుసూధనీ వ్యాఖ్యా)

(చంపబడువాడు కాడు - సమస్త ప్రాణులయొక్క దేహము చంపబడినప్పటికీ యీ దేహి - దేహములోనుండు ఆత్మ, లింగదేహమే, అనగా సూక్ష్మదేహమే ఉపాధిగాగల ఆత్మ, చంపబడదు - చంపుటకు వీలు లేనిది.)

  1. “అజో నిత్యః శాశ్వతో(అ)యం పురాణో న హస్యతే, హస్యమానే శరీరే” (శ్రీమద్భగవద్గీత - 2 - 20)

(ఈ ఆత్మ జన్మలేనిది, ఎల్లపుడు ఉండువాడు, శరీరములలో ఉన్నప్పటికీ, శరీరము నశించినను దానితోపాటు నశించనిది, శరీరమునకు జన్మ కలదు కనుక నశించును - ఆత్మకి జన్మలేదు కనుక మరణములేదు, అందుచేత చంపబడనిది - “న జాయతే మ్రియతేవా కదాచిత్”

(శ్రీమద్భగవద్గీత - 3 - 20)

(ఆత్మ పుట్టదు, చనిపోదు.)

  1. తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సం యాతి నవాని దేహీ ” (శ్రీమద్భగవద్గీత - 2 - 22)

(చినిగిపోయినబట్టలు విడిచి, మరొకబట్ట కట్టుకొన్నట్లే - జీర్ణమయిన శరీరములను - రోగమువలనకాని, ఇంకొక విధముగా కాని తాను ఉండుటఖు వీలులేని శరీరములను - విడిచి, ఆత్మ ఇతర శరీరములను పొందును.)

(దేహము కలవాడు కనుక ఆత్మ దేహి. ఒకటే అయిన ఆత్మ అనేకదేహములందు ఒకేకాలమందు పొంది యున్నాడు. దేహములు నశించినను అందులో ఉన్న ఆత్మ నశించక ఇంకొక దేహమును పొందును.)

Transliteration
  1. “navadhyaḥ ātmā niravayatvāt, nityatvācca - tatra avadhyō ayaṃ dēhē śarīrē sarvasya sarvagatatvāt sthāvarādiṣu sthitōpi sarvasya prāṇi jātasya dēhē vadhyamānē api ayaṃdēhē na vadhyaḥ”. (śrīśaṃkaraḥ)

(caṃpuṭaku alavikānidi, ātma - avayavamulu - bhāgamulu - lēnidaguṭavalla, nityamainadaguṭavallanū.)

(samastavastuvulaṃdu, aṃtaṭa, sthāvaramulu modalaguvāṭiyaṃdunnū, unnappaṭikī, ātma samasta prāṇula dēhamulu caṃpabaḍinanu vāṭilō unna dēhi - dēhamulōnuṃḍu ātma - caṃpabaḍadu.)

  1. “vadhyaḥ nabhavati sarvasya prāṇi jātasya dēhē vadhyamānōpi ayaṃdēha liṃgadēha upādiḥ ātmā vadhya mānaḥ nabhavati”

(śrīmadhusūdhanī vyākhyā)

(caṃpabaḍuvāḍu kāḍu - samasta prāṇulayokka dēhamu caṃpabaḍinappaṭikī yī dēhi - dēhamulōnuṃḍu ātma, liṃgadēhamē, anagā sūkṣmadēhamē upādhigāgala ātma, caṃpabaḍadu - caṃpuṭaku vīlu lēnidi.)

  1. “ajō nityaḥ śāśvatō(a)yaṃ purāṇō na hasyatē, hasyamānē śarīrē” (śrīmadbhagavadgīta - 2 - 20)

(ī ātma janmalēnidi, ellapuḍu uṃḍuvāḍu, śarīramulalō unnappaṭikī, śarīramu naśiṃcinanu dānitōpāṭu naśiṃcanidi, śarīramunaku janma kaladu kanuka naśiṃcunu - ātmaki janmalēdu kanuka maraṇamulēdu, aṃducēta caṃpabaḍanidi - “na jāyatē mriyatēvā kadācit”

(śrīmadbhagavadgīta - 3 - 20)

(ātma puṭṭadu, canipōdu.)

  1. tathā śarīrāṇi vihāya jīrṇānyanyāni saṃ yāti navāni dēhī ” (śrīmadbhagavadgīta - 2 - 22)

(cinigipōyinabaṭṭalu viḍici, marokabaṭṭa kaṭṭukonnaṭlē - jīrṇamayina śarīramulanu - rōgamuvalanakāni, iṃkoka vidhamugā kāni tānu uṃḍuṭakhu vīlulēni śarīramulanu - viḍici, ātma itara śarīramulanu poṃdunu.)

(dēhamu kalavāḍu kanuka ātma dēhi. okaṭē ayina ātma anēkadēhamulaṃdu okēkālamaṃdu poṃdi yunnāḍu. dēhamulu naśiṃcinanu aṃdulō unna ātma naśiṃcaka iṃkoka dēhamunu poṃdunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.