← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవరోహమార్గము avarōhamārgamu

Original — తెలుగు
  1. ఊర్థ్వలోకములకు పుణ్యఫలముగా పోయినవారు తిరిగి క్రిందకు దిగి వచ్చు మార్గము - వారికి పునర్జన్మ ఏ రీతి కలుగునో యది కలుగు రీతి, మార్గము.

  2. అవరోహమార్గం ఇత్థం శ్రూయతే - ” తస్మిన్ యావత్స ంపాత ముషిత్వా, అధైతమేన మధ్వానం పునర్ని వర్తంతే - యదే తమాకాశం, ఆకాశాద్వాయుం, హయర్భూత్వా ధూమోభవతి, ధూమో భూత్వా అభ్రం భవతి, అభ్రం భూత్వా మేఘో భవతి, మేఘో భూత్వా ప్రవర్షతి, త ఇహ వ్రీహి, యనా, ఔషధి- వనస్ప తయః తిలమాషా ఇతి జాయంతే - అతోవైఖలు దుర్నిష్ప్రదతరం యో యో హ్నన్నమత్తి, యోరేతస్సించతి, తద్భూయ ఏవ భవతి. తద్య ఇహ రమణీయ చరణా రమణీయాం యోని మ పద్యంతే ” ఉక్త రీత్యాధూమాద్య ధ్వానం పునర్నివర్తంతే.

(ధూమాది మార్గమున పోయినవారు ఆ మార్గముననే తిరిగి వత్తురు - చంద్రలోకమును చెందిన తర్వాత అక్కడ అనుభవించవలసిన వాటిని అనుభవించి, చాలవరకు, వెళ్ళినమార్గమునే అనుసరించి ఈ క్రింద చెప్పబడిన విధముగా భూలోకమునకు వత్తురు - చంద్రమనడలమునుండి ఆకాశమునకును, ఆకాశము నుండి వాయువును పొందుదురు, వాయురూపము పొంది పొగ యగుదురు, తర్వాత జలమాత్రమున కాధార భూతమగు పదార్థమగుదురు తర్వాత మేఘమై వర్షింతురు. ఆ వర్షముద్వారాభూమిని చేరుదురు.” అని శ్రుతియందు అవరోహమార్గము - క్రిందకు, భూలోకమునకుదిగివచ్చు మార్గము -వర్ణింపబడియున్నది.

(పై విషయము ఈ క్రిందవిధముగా స్పష్టము చేయబడినది - తత్రకిం స్వర్గాదవరోహం తః జీవాః ఆకాశాది స్వరూపః ప్రతి పద్యంతే, ఉత, తత్సామ్యమితి విషయే ఆకాశాది స్వరూపమితి పూర్వః పక్షః, సిద్ధాం తస్తు జీవానాం తైః ఆకాశాదిభిః సాభా వ్యాపత్తిః (సమానోభావః రూపం యే షాంతే సభావాః, తద్భావః సాభావ్యం సాదృశ్యం, తస్యాపత్తిః ప్రాప్తిః.)

(స్వర్గమునుండి క్రిందకు భూలోకమునకు తిరిగి వచ్చుజీవులు ఆకాశము మొదలగువాటి స్వరూప మును పొందుదురు, లేక వాటి సామ్యమును పొందుదురు - ఈ విషయములో వారు ఆకాశము మొదలగు వాటి స్వరూపమును పొందుదురు అని పూర్వపక్షముయొక్క అభిప్రాయము. కాని జీవులు ఆకాశము మొదలగువాటి సాభావ్యమునే పొందుదురు అని సిద్ధాంతపక్షము.సాభావ్యమనగా సాదృశ్యము, వాటితో సదృశమైనది, సమానమైనది, అగును అని అభిప్రాయము.)

  1. నివృత్తాశ్చాను శాయినః కర్మాంతే ధృతదేహాః ఆకాశం గతాః అకాశసదృశాభవంతి. అకాశ సాదృశా నంతరం విందీకృతాతి సూఖ్స్మలింగోపహితాః వాయునేతస్త తశ్చనీయమానాః వాయుసమా భవంతి. సో అనుశాయీ సంఘో వాయుసమోభూత్వా ధూమం గతః, తత్సమోభవతి - (ఆపోభిభర్తీత్యభ్రం మేఘం) - (మేఘాః నించతీతి వృష్టికర్తా మేఘః) - తత్సమోభూత్వా వర్షధారా ద్వారా పృధివీం ప్రవిశ్య వ్రీహి యవాది రూపో భవతి. ఇతి సిద్ధాంతరీత్యా శ్రుత్యర్థః -.

(కర్మఫలమనుభవించిన తర్వాత దేహము పొందినవారై ఆకాశమును పొంది, ఆకాశసదృశులు - ఆకాశముతో సమానమైనవారగుదురు. ఆకాశముతో సమానమైనవారైన తర్వాత, కుద్ధించిన సూక్ష్మ శరీరముతో కూడినవారై, గాలిచే ఇటు అటు తీసుకొనిపోబడినవారై వాయువుతో సమానమైన వార గుదురు. వాయువుతో సమానమైనవారై ధూమముతో సమానమైనవారగుదురు. ధూమ సమానులైన తర్వాత అభ్రముతో సమానులగుదురు. అభ్రము అనగా జలమును భరించునది, మేఘము, వర్షము కురియునది. మేఘముతో సమానమగును. ఆ మేఘముతో సమానమై వర్షధార ద్వారా భూమిమీదపడి లోపలికి ప్రవేశించి వ్రీహియవాదులుగా (ధాన్యములుగా) అగును. అని పైన చెప్పిన శ్రుతికి ఈ రీతిగా సిద్ధాంతము చేసి అర్థము చెప్పబడినది.)

(పైదానిని బట్టి చూడ తిరిగి ంహూలోకమునకు జన్మ నిమిత్తము వచ్చు జీవులు పంచభూతముల ఉత్పత్తి ప్రకారము, ఆ వరుసనే అవలంభించి, వాటిలో ఒక్కొక్కదానివలె పరిణమిస్తూ, చివరకు పంచభూతమయమైన స్థూలదేహమును భూమిమీద ధరించుదురు.)

” జీవో నాతి చిరేణ అల్పం అల్పకాలమేవ ఆకాశాది వర్షాం తైః సాదృశ్యే నావ స్థాయ వర్షధార ద్వారా పృధివీం ప్రవిశతి. తత్రవ్రీ హ్యాకాశా దౌ జీవస్య ప్రతీయమానే సుఖ దుఃఖే చిరకాలావస్థానల్పకాలావస్థానే భవతః నముఖ్యే. తదానీం వినా స్థూలశరీరం లింగశరీర మాత్రేణ. సుఖ దుఃఖరూప భోగాసంభవాత్. అతో వ్రీహ్యాది ప్రవేశాత్ పూర్వమల్స మల్స మేవకాలం తత్సాదృశ్యేనావస్థానమితి సిద్ధం “.

(జీవుడు తక్కువకాలము ఆకాశము, వాయువు, అగ్ని, జలములతో సదృశమైనదిగా - సమానమైనదిగానుండి, వర్షధార రూపముతో భూమిని ప్రవేశించును. ఈ ప్రకారము ఆకాశాది సదృశరూపములుగా చాలకాలముగ ఉండి వ్రీహి యవాదులుగా (ధాన్యములుగా) తక్కువకాలముండును. సుఖ దుఃఖములననుభవించుటకు ఈ జన్మములు ముఖ్యములుకావు. ఎందుచేతననగా స్థూల శరీరములేకనే, సూక్ష్మశరీరముతోనే సుఖ దుఃఖములననుభవించుట జరుగదు. అందుచేత వ్రీహియవాదులు మొదలగు వాటియందు జన్మ అల్పకాలమే యనునది సిద్ధమే.)

  1. “తే ఇవ వ్రీహి యదా ఓషధివనస్పతయస్తిల మాషా ఇతి జాయంతే” ఇతి శ్రుతిః.

(కర్మము కొంతమిగిలియున్న ఆ జీవులు భూమిని చేరి, వ్రీహియవాదులవంటి సస్యములు - ధాన్యములుగాను - ఔషధులుగాను, చెట్లుగాను, మహావృక్షములుగాను జనింతురు.)

  1. “యో యోహ్యన్నమత్తి, యోరేతస్సించతి తద్భూయ ఏవ భవతి” ఇతి శ్రుతిః.

(చంద్రలోకమునుండి పైన చెప్పిన ప్రకారము తిరిగివచ్చు జీవులు ఈ వ్రీహి మొదలగు ఆహారపదార్థములను భుజించువానివలన ఏర్పడిన రేతస్సును, స్త్రీరూపాగ్నియందు (పంచాగ్నివిద్య ప్రకారము)

హోమము చేయగనే అప్పుడా జీవుడు స్థూలదేహమును పొందినవాడై పుట్టును.)

Transliteration
  1. ūrthvalōkamulaku puṇyaphalamugā pōyinavāru tirigi kriṃdaku digi vaccu mārgamu - vāriki punarjanma ē rīti kalugunō yadi kalugu rīti, mārgamu.

  2. avarōhamārgaṃ itthaṃ śrūyatē - ” tasmin yāvatsa ṃpāta muṣitvā, adhaitamēna madhvānaṃ punarni vartaṃtē - yadē tamākāśaṃ, ākāśādvāyuṃ, hayarbhūtvā dhūmōbhavati, dhūmō bhūtvā abhraṃ bhavati, abhraṃ bhūtvā mēghō bhavati, mēghō bhūtvā pravarṣati, ta iha vrīhi, yanā, auṣadhi- vanaspa tayaḥ tilamāṣā iti jāyaṃtē - atōvaikhalu durniṣpradataraṃ yō yō hnannamatti, yōrētassiṃcati, tadbhūya ēva bhavati. tadya iha ramaṇīya caraṇā ramaṇīyāṃ yōni ma padyaṃtē ” ukta rītyādhūmādya dhvānaṃ punarnivartaṃtē.

(dhūmādi mārgamuna pōyinavāru ā mārgamunanē tirigi vatturu - caṃdralōkamunu ceṃdina tarvāta akkaḍa anubhaviṃcavalasina vāṭini anubhaviṃci, cālavaraku, veḷḷinamārgamunē anusariṃci ī kriṃda ceppabaḍina vidhamugā bhūlōkamunaku vatturu - caṃdramanaḍalamunuṃḍi ākāśamunakunu, ākāśamu nuṃḍi vāyuvunu poṃduduru, vāyurūpamu poṃdi poga yaguduru, tarvāta jalamātramuna kādhāra bhūtamagu padārthamaguduru tarvāta mēghamai varṣiṃturu. ā varṣamudvārābhūmini cēruduru.” ani śrutiyaṃdu avarōhamārgamu - kriṃdaku, bhūlōkamunakudigivaccu mārgamu -varṇiṃpabaḍiyunnadi.

(pai viṣayamu ī kriṃdavidhamugā spaṣṭamu cēyabaḍinadi - tatrakiṃ svargādavarōhaṃ taḥ jīvāḥ ākāśādi svarūpaḥ prati padyaṃtē, uta, tatsāmyamiti viṣayē ākāśādi svarūpamiti pūrvaḥ pakṣaḥ, siddhāṃ tastu jīvānāṃ taiḥ ākāśādibhiḥ sābhā vyāpattiḥ (samānōbhāvaḥ rūpaṃ yē ṣāṃtē sabhāvāḥ, tadbhāvaḥ sābhāvyaṃ sādṛśyaṃ, tasyāpattiḥ prāptiḥ.)

(svargamunuṃḍi kriṃdaku bhūlōkamunaku tirigi vaccujīvulu ākāśamu modalaguvāṭi svarūpa munu poṃduduru, lēka vāṭi sāmyamunu poṃduduru - ī viṣayamulō vāru ākāśamu modalagu vāṭi svarūpamunu poṃduduru ani pūrvapakṣamuyokka abhiprāyamu. kāni jīvulu ākāśamu modalaguvāṭi sābhāvyamunē poṃduduru ani siddhāṃtapakṣamu.sābhāvyamanagā sādṛśyamu, vāṭitō sadṛśamainadi, samānamainadi, agunu ani abhiprāyamu.)

  1. nivṛttāścānu śāyinaḥ karmāṃtē dhṛtadēhāḥ ākāśaṃ gatāḥ akāśasadṛśābhavaṃti. akāśa sādṛśā naṃtaraṃ viṃdīkṛtāti sūkhsmaliṃgōpahitāḥ vāyunētasta taścanīyamānāḥ vāyusamā bhavaṃti. sō anuśāyī saṃghō vāyusamōbhūtvā dhūmaṃ gataḥ, tatsamōbhavati - (āpōbhibhartītyabhraṃ mēghaṃ) - (mēghāḥ niṃcatīti vṛṣṭikartā mēghaḥ) - tatsamōbhūtvā varṣadhārā dvārā pṛdhivīṃ praviśya vrīhi yavādi rūpō bhavati. iti siddhāṃtarītyā śrutyarthaḥ -.

(karmaphalamanubhaviṃcina tarvāta dēhamu poṃdinavārai ākāśamunu poṃdi, ākāśasadṛśulu - ākāśamutō samānamainavāraguduru. ākāśamutō samānamainavāraina tarvāta, kuddhiṃcina sūkṣma śarīramutō kūḍinavārai, gālicē iṭu aṭu tīsukonipōbaḍinavārai vāyuvutō samānamaina vāra guduru. vāyuvutō samānamainavārai dhūmamutō samānamainavāraguduru. dhūma samānulaina tarvāta abhramutō samānulaguduru. abhramu anagā jalamunu bhariṃcunadi, mēghamu, varṣamu kuriyunadi. mēghamutō samānamagunu. ā mēghamutō samānamai varṣadhāra dvārā bhūmimīdapaḍi lōpaliki pravēśiṃci vrīhiyavādulugā (dhānyamulugā) agunu. ani paina ceppina śrutiki ī rītigā siddhāṃtamu cēsi arthamu ceppabaḍinadi.)

(paidānini baṭṭi cūḍa tirigi ṃhūlōkamunaku janma nimittamu vaccu jīvulu paṃcabhūtamula utpatti prakāramu, ā varusanē avalaṃbhiṃci, vāṭilō okkokkadānivale pariṇamistū, civaraku paṃcabhūtamayamaina sthūladēhamunu bhūmimīda dhariṃcuduru.)

” jīvō nāti cirēṇa alpaṃ alpakālamēva ākāśādi varṣāṃ taiḥ sādṛśyē nāva sthāya varṣadhāra dvārā pṛdhivīṃ praviśati. tatravrī hyākāśā dau jīvasya pratīyamānē sukha duḥkhē cirakālāvasthānalpakālāvasthānē bhavataḥ namukhyē. tadānīṃ vinā sthūlaśarīraṃ liṃgaśarīra mātrēṇa. sukha duḥkharūpa bhōgāsaṃbhavāt. atō vrīhyādi pravēśāt pūrvamalsa malsa mēvakālaṃ tatsādṛśyēnāvasthānamiti siddhaṃ “.

(jīvuḍu takkuvakālamu ākāśamu, vāyuvu, agni, jalamulatō sadṛśamainadigā - samānamainadigānuṃḍi, varṣadhāra rūpamutō bhūmini pravēśiṃcunu. ī prakāramu ākāśādi sadṛśarūpamulugā cālakālamuga uṃḍi vrīhi yavādulugā (dhānyamulugā) takkuvakālamuṃḍunu. sukha duḥkhamulananubhaviṃcuṭaku ī janmamulu mukhyamulukāvu. eṃducētananagā sthūla śarīramulēkanē, sūkṣmaśarīramutōnē sukha duḥkhamulananubhaviṃcuṭa jarugadu. aṃducēta vrīhiyavādulu modalagu vāṭiyaṃdu janma alpakālamē yanunadi siddhamē.)

  1. “tē iva vrīhi yadā ōṣadhivanaspatayastila māṣā iti jāyaṃtē” iti śrutiḥ.

(karmamu koṃtamigiliyunna ā jīvulu bhūmini cēri, vrīhiyavādulavaṃṭi sasyamulu - dhānyamulugānu - auṣadhulugānu, ceṭlugānu, mahāvṛkṣamulugānu janiṃturu.)

  1. “yō yōhyannamatti, yōrētassiṃcati tadbhūya ēva bhavati” iti śrutiḥ.

(caṃdralōkamunuṃḍi paina ceppina prakāramu tirigivaccu jīvulu ī vrīhi modalagu āhārapadārthamulanu bhujiṃcuvānivalana ērpaḍina rētassunu, strīrūpāgniyaṃdu (paṃcāgnividya prakāramu)

hōmamu cēyaganē appuḍā jīvuḍu sthūladēhamunu poṃdinavāḍai puṭṭunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.