విభజింపబడనిది; విభజింపబడక ఏకముగా నున్నది.
“ప్రతిదేహే వ్యోమవత్ ఏకం” (శ్రీశంకరః)
(ఆకాశము ఒకటే అయి ప్రతిదేహమందు ఏ ప్రకారముగా వేరు వేరుగా కనబడుచున్నదో, ఆ ప్రకారముగానే పరమాత్మ ఒక్కడే అయినను, విభక్తముగాక ఒక్కడే అయిననను ప్రతి దేహములోను ఉన్న జీవాత్మగా వేరు వేరుగా విభక్తమైనవాడుగ తోచును. సృష్టికి పూర్వము భగవంతుడు ఒక్కడే అవిభక్తుడు - విభక్తము కానివాడు, వేరు వేరు వస్తువులు శరీరములుగామారనివాడు. సృష్టి ప్రారంభించగానే ఆ సృష్టిలో సృష్టింపబడిన వస్తువులన్నీ తానే ఆయెను - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్”. (దానిని సృష్టించి దానిలోనే ప్రవే శించెను). “తదను ప్రవిశ్య సచ్చ త్యచ్చ అభవత్”. (దానిలో ప్రవేశించి తానే సత్, త్యత్ - సత్పదార్థము, అసత్పదార్థముగా ఆయెను). సృచ్టించిన వస్తువులు రూపముగా తానే వేరు వేరుగా నుండుటవలన తాను అప్పుడు విభక్తమైనట్లు -వేరువేరుగా విభజించబడినవాడువలె అనుపించును. “ఆత్మా వా అరే ఇదమేకమేవాగ్ర అసీత్” (ఇప్పుడు ఈ కనబడు ప్రపంచము అంతా, - ఈ ప్రపంచములోని వస్తువులన్నియు - సృష్టికిముందు (ఇవన్ని పుట్టకముందు) ఒకే ఆత్మగానే ఉండెను. అప్పుడు అవిభక్తముగా నుండెను.”ఏకో దేవ స్సర్వభూతేషు గూఢాత్మా” (ఒకే దైవము భూతములన్నింటియందు - పుట్టిన వస్తువులన్నింటియందు పైకి కనబడకుండాయున్నది. అనగా అప్పుడు విభక్తమైనట్లు అనిపించును. సృష్టి అంతా, సృష్టిలోని రూపములన్నీ భగవద్రూపములే. ఇవన్నీ కలిసి ఏకముగా అతని రూపమే (విశ్వరూపము) అయినందున భగవంతుడు అవిభక్తమే).
(దేవతలు, మనుష్యులు మొదలగు భూతములందు, అంతటా ఉన్న ఓక్కడే అయినవాడు. వీటి అన్నింటిలోను ఉన్న ఆత్మతత్వము - ఆత్మవస్తువు ఒకటే యగుటవలన అవిభక్తము).
స్వస్వరూపములో - ఆత్మయదార్థరూపములో - దేవతులు, మనుష్యులు, పశువులు, పక్షులు, చెట్లు, చేమలు అను విభాగము - విభజించియుండుట - లేదు, గనుక అవిభక్తము. ఇది సృష్టికిముందు ఉన్న ఆత్మస్థితి).
(సమస్త భూతములు పుట్టుటకు భగవంతుడే కారణము - “ఆది బీజం”. “బీజమవ్యయం”. అందుచేత బీజములన్నింటిలోను కారణరూపముగా భగవంతుడొక్కడే యున్నాడు, తనకారణ శక్తి అన్నింటిలోను ఒకే రీతిగానున్నది, విభజింపబడియుండలేదు; విభజించనడినట్లు కారణశక్తి సన్నగిల్లలేదు, క్షీణించలేదు; ప్రతికార్యవస్తువురూపముగా తానే విభజింపబడినట్లు తోచును).
(నదులు వాటి వాటి రూపములతో, పేర్లతోను - గంగా, గోదావరి, అను పేర్లతో ప్రవహిస్తూ సముద్రములో కలిసిపోయి వాటి నదుల రూపము, పేరు, లేక, లీనమై పోవుచున్నవి. అనేక పువ్వులనుండి కలిగిన రసము కలిసి ఒకటే తేనెగా అయిపోవుచున్నది. అనగా, వేరు వేరునదులుగా ఉన్నప్పుడు విభక్తమనిన్నీ, ఆ నదీజలములన్నీ కలిసి అవిభక్తమనిన్నీ చెప్పబడును. ఆ ప్రకారముగానే వేరు వేరు పువ్వుల రసముగా నున్నపుడు విభక్తమనిన్నీ, అన్ని పువ్వులరసము కలిసి తేనె అయినప్పుడు అవిభక్తమని చెప్పబడును. ఈ ప్రకారముగానే ప్రాణములుగల జీవులు వేరు వేరు జీవాత్మలుగా విభక్తమై యున్నట్లు అనుపించునవి భగవంతునిలోనే తుదకు లీనమై పోవును, అప్పుడు ఆత్మ ఒక్కటే అవిభక్తముగా నున్నదని చెప్పబడుచున్నది. ఆత్మ, జీవాత్మ అను విభక్తములేక అంతా ఒకే ఆత్మ అయి అవిభక్తమగును).
(జీవాత్మ జ్ఞానము కలిగినవాడై తన నామరూపములను వదలి పరాత్పరుడు అయిన పరమాత్మనుపొంది అతనితో అవిభక్తతను పొందును).
vibhajiṃpabaḍanidi; vibhajiṃpabaḍaka ēkamugā nunnadi.
“pratidēhē vyōmavat ēkaṃ” (śrīśaṃkaraḥ)
(ākāśamu okaṭē ayi pratidēhamaṃdu ē prakāramugā vēru vērugā kanabaḍucunnadō, ā prakāramugānē paramātma okkaḍē ayinanu, vibhaktamugāka okkaḍē ayinananu prati dēhamulōnu unna jīvātmagā vēru vērugā vibhaktamainavāḍuga tōcunu. sṛṣṭiki pūrvamu bhagavaṃtuḍu okkaḍē avibhaktuḍu - vibhaktamu kānivāḍu, vēru vēru vastuvulu śarīramulugāmāranivāḍu. sṛṣṭi prāraṃbhiṃcagānē ā sṛṣṭilō sṛṣṭiṃpabaḍina vastuvulannī tānē āyenu - “tat sṛṣṭvā tadēvānu prāviśat”. (dānini sṛṣṭiṃci dānilōnē pravē śiṃcenu). “tadanu praviśya sacca tyacca abhavat”. (dānilō pravēśiṃci tānē sat, tyat - satpadārthamu, asatpadārthamugā āyenu). sṛcṭiṃcina vastuvulu rūpamugā tānē vēru vērugā nuṃḍuṭavalana tānu appuḍu vibhaktamainaṭlu -vēruvērugā vibhajiṃcabaḍinavāḍuvale anupiṃcunu. “ātmā vā arē idamēkamēvāgra asīt” (ippuḍu ī kanabaḍu prapaṃcamu aṃtā, - ī prapaṃcamulōni vastuvulanniyu - sṛṣṭikimuṃdu (ivanni puṭṭakamuṃdu) okē ātmagānē uṃḍenu. appuḍu avibhaktamugā nuṃḍenu.”ēkō dēva ssarvabhūtēṣu gūḍhātmā” (okē daivamu bhūtamulanniṃṭiyaṃdu - puṭṭina vastuvulanniṃṭiyaṃdu paiki kanabaḍakuṃḍāyunnadi. anagā appuḍu vibhaktamainaṭlu anipiṃcunu. sṛṣṭi aṃtā, sṛṣṭilōni rūpamulannī bhagavadrūpamulē. ivannī kalisi ēkamugā atani rūpamē (viśvarūpamu) ayinaṃduna bhagavaṃtuḍu avibhaktamē).
(dēvatalu, manuṣyulu modalagu bhūtamulaṃdu, aṃtaṭā unna ōkkaḍē ayinavāḍu. vīṭi anniṃṭilōnu unna ātmatatvamu - ātmavastuvu okaṭē yaguṭavalana avibhaktamu).
svasvarūpamulō - ātmayadārtharūpamulō - dēvatulu, manuṣyulu, paśuvulu, pakṣulu, ceṭlu, cēmalu anu vibhāgamu - vibhajiṃciyuṃḍuṭa - lēdu, ganuka avibhaktamu. idi sṛṣṭikimuṃdu unna ātmasthiti).
(samasta bhūtamulu puṭṭuṭaku bhagavaṃtuḍē kāraṇamu - “ādi bījaṃ”. “bījamavyayaṃ”. aṃducēta bījamulanniṃṭilōnu kāraṇarūpamugā bhagavaṃtuḍokkaḍē yunnāḍu, tanakāraṇa śakti anniṃṭilōnu okē rītigānunnadi, vibhajiṃpabaḍiyuṃḍalēdu; vibhajiṃcanaḍinaṭlu kāraṇaśakti sannagillalēdu, kṣīṇiṃcalēdu; pratikāryavastuvurūpamugā tānē vibhajiṃpabaḍinaṭlu tōcunu).
(nadulu vāṭi vāṭi rūpamulatō, pērlatōnu - gaṃgā, gōdāvari, anu pērlatō pravahistū samudramulō kalisipōyi vāṭi nadula rūpamu, pēru, lēka, līnamai pōvucunnavi. anēka puvvulanuṃḍi kaligina rasamu kalisi okaṭē tēnegā ayipōvucunnadi. anagā, vēru vērunadulugā unnappuḍu vibhaktamaninnī, ā nadījalamulannī kalisi avibhaktamaninnī ceppabaḍunu. ā prakāramugānē vēru vēru puvvula rasamugā nunnapuḍu vibhaktamaninnī, anni puvvularasamu kalisi tēne ayinappuḍu avibhaktamani ceppabaḍunu. ī prakāramugānē prāṇamulugala jīvulu vēru vēru jīvātmalugā vibhaktamai yunnaṭlu anupiṃcunavi bhagavaṃtunilōnē tudaku līnamai pōvunu, appuḍu ātma okkaṭē avibhaktamugā nunnadani ceppabaḍucunnadi. ātma, jīvātma anu vibhaktamulēka aṃtā okē ātma ayi avibhaktamagunu).
(jīvātma jñānamu kaliginavāḍai tana nāmarūpamulanu vadali parātparuḍu ayina paramātmanupoṃdi atanitō avibhaktatanu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.