← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిద్య avidya

Original — తెలుగు
  1. దేహాదిషు అనాత్మసు “అహమస్మి” ఇత్యాత్మ బుద్ధిరవిద్యా.

(ఆత్మకానటువంటి దేహము మొదలగువాటియందు 'ఇవి నేనే' అను ఆత్మ బుద్ధి అవిద్య.)

  1. “శ్లో||. శ్రూయతాం చాప్య విద్యాయాః స్వరూపం కులనందన |

అనాత్మన్యాత్మబుద్ధిర్యా--” (పరాశరః)

  1. “శ్లో||. అనాత్మన్యాత్మ బుద్ధిర్యా అస్వే స్వమితి యామతిః |

అవిద్యాతరుసంభూతిబీజమేతద్ద్విధాస్థితం||“. (విష్ణుపురాణము)

(ఆత్మకాని వస్తువులందు ఆత్మ బుద్ధియు, తనదికానిదానియందు, తనది యను బుద్ధియు - ఈ రెండును అవిద్య యను చెట్టు పుట్టుటకు విత్తనము వంటిది. వీటివలన అవిద్య కలుగును, లేక ఇవియే అవిద్య అనబడును.)

  1. అనాత్మనిదేహే అహం ఇతి భ్రమః, అస్వే దేహపోషకాధారకాదౌ వస్తుని స్వం ఇతి సంసార ఫలకం కామ్యకర్మ విద్యా;సా ఏవ తరుః, తత్సంభూతేర్బీజం ద్విధాస్థితం - ' అహం, మమ ' ఇతి.

(ఆత్మకాని దేహమందు 'అహం (నేను)' అని భ్రమ,తన స్వంతముకాని దేహపోషకాధారములందు 'నాది' అనుకొనుట, సంసారమను ఫలమును కలిగించు కర్మ అవిద్య; అదియే చెట్టు, ఆ చెట్టునుండి పుట్టిన బీజములు. బీజములు- విత్తనములు - రెండు, 'అహం' (నేను), 'మమ' (నాది) అనునవి.)

  1. “ఆ. ఆత్మకాని మేన నాత్మ బుద్ధియును, న

స్వంబునందు మిగుల స్వత్వ మతియు

నవనివర, యవిద్యయను మహాతరువును

త్పత్తికీ ద్వయంబు విత్తు మొదలు “. (ఆముక్తమాల్యద - 3)

(తనుగాని దేహమందు 'తాను' అను అజ్ఞానమును, తనదికాని గృహము మొదలగువాటియందు తనది అనెడి బుద్ధియును - ఈ రెండును అజ్ఞానము - అవిద్య - అను మహావృక్షమునకు నాదియైన బీజము.)

  1. స్వరూపాజ్ఞానం; అజ్ఞానం -.

(జ్ఞానము లేకపోవుట, విద్య లేకపోవుట; తన నిజస్వరూపమును - “అహం బ్రహ్మాస్మి” అను వివేకముతోతానే పరబ్రహ్మ అని తన నిజరూపమును - తెలియని అజ్ఞానము. పరబ్రహ్మను తెలుసుకొనుటకు సాధనమగు విద్య లేకుండుట.)

  1. అజ్ఞానాస్య థా జ్ఞాన తత్కారణ కర్మాదిరూపా.

(అజ్ఞానము, అన్యథాజ్ఞానము, వీటికి కారణమైన కర్మయే కారణముగా గలది అవిద్య.)

  1. అనాద్య నిర్వచనీయమజ్ఞానం.

(ఎప్పుడు ప్రారంభమైనదో, ఎటువంటిదో తెలిసి చెప్పుటకు వీలుగాని అజ్ఞానము.)

  1. పరమానంద స్వరూపా జ్ఞానం.

(భగవంతుడు పరమానందస్వరూపుడు, మోక్షరూపుడు - అట్టి పరమానందము యొక్క స్వరూపమును తెలియని అజ్ఞానము.)

  1. “శోకమోహాది కారణం |

మమాహ మిత్య విద్యాఖ్యం మిధ్యాజ్ఞానం, నచేతరత్ ||” (గీతాభావప్రకాశము - 1 - 44, 45)

  1. భేదభ్రాంతి రూపం జ్ఞానం.

(జీవుడు, పరబ్రహ్మవేరని, పరబ్రహ్మ, ప్రపంచమువేరని వీటికి, ఒకదానికి, ఒకదానికి భేదమున్నదని తలచు జ్ఞానము.)

  1. విద్యా నాశ్యత్వాత్ అవిద్యా ఇతి మాయా వర్ణ్యతే.

(విద్యను, బ్రహ్మ జ్ఞానమును, నశింపచేయునది కనుక మాయయే అవిద్యయని చెప్పబడుచున్నది.)

  1. విద్యా నివర్త త్వాచ్చ అసౌ అవిద్యాత్వం.

(విద్యను – బ్రహ్మజ్ఞానమును - నివర్తింపచేయునది, లేకుండ చేయునది కనుక అవిద్యయని చెప్పబడుచున్నది. విద్యను కప్పిపుచ్చునదిగాన మాయయే అవిద్యయని చెప్పబడుచున్నది.)

  1. భగవధ్యాన తిరోధానకరీ.(భగవంతుని గుఱించి ధ్యానము లేకుండ చేయునది.)

  2. అవిద్య యనగా విపరీత కల్పన.

  3. కామకర్మాత్మికా. (కోరికతో పనులు చేయుటయే అవిద్య.)

  4. “మమకర్మ”, “అహం కర్తా”, “అముష్యే ఫలాయ ఇదంకర్మ కరిష్యామి” ఇతి ఇయం అవిద్యా, అనాదికాల ప్రవృత్తా. (శ్రీశంకరః)

(“ఇదినాపని ; దీనికి నేను కర్తను; ఈ లోకములోనే ఫలము పొందుటకు నేను ఈ కర్మ చేయుచున్నాను” అని అనుకొనుట అవిద్య. అనాదికాలమునుండి - అనగా, ఇది ఎప్పుడు పుట్టినదో తెలియనికాలముతో సరిగా ప్రవర్తించునది.)

  1. విద్యకు విరోధి అవిద్య - కావున విద్యకంటె వేరగు కర్మయే అవిద్య.

  2. సంసారమునకు లోబడునట్లు చేయుమాయ; క్షణికములగు పదార్థములందు అది నిత్యముగానుండునవి యను భ్రాంతి.

  3. మిధ్యయగు జగత్తును సత్యమని తోపించు శక్తి -

  4. “అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి రవిద్యా” (పతంజలి - యోగసూత్రములు)

(నిత్యముగాని వస్తువును నిత్యముగానుండునదిగాను, శుచికానిదానిని, శుచియైనదానినిగను, దుఃఖమును సుఖముగాను, అనాత్మవస్తువులను ఆత్మగాను తెలుసుకొనుట, అనేకమలములతో కూడి అశుచిగానున్న శరీరమునుశుచియైనదిగను అనుకొనుట. భూమి, ఆకాశముమొదలగునవి ఎప్పటికైనా నశించవలసినవే - వాటిని శాశ్వతములనుకొనుట - సృష్టిలోని సమస్తవస్తువులు భయావహములే- “సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవా భయం” (భర్తృహరి - సుభాషితం.). ఇట్లు చెప్పబడియుండుటచేత ఇటువంటివాటివలన సుఖములేకపోయినను వాటిని సుఖమినిచ్చువాటిగనే చూచుట. ఆత్మగానివస్తువులందు ఆత్మయని అభిప్రాయము కలిగియుండుట.)

  1. “అవ్యక్తాది విశేషాంతం అవిద్యా లక్షణం స్మృతం” (మనువు)

(అవ్యక్తము - ప్రకృతి,మాయ - మొదలు స్థూలదేహము వరకు గల ఇది అంతయు అవిద్యయే స్వరూపముగా గలది.).

  1. వస్తు దృష్ట్యా యా అవిద్యమానా సా అవిద్యా, తత్కార్యం అనంతకోటి బ్రహ్మాండ జాతం.

(కనబడు మిగిలిన వస్తువులవలెకాక, కనబడక ఉండునది. దానికార్యమే. అది పుట్టించినదే అనంతకోటి బ్రహ్మాండములలోనుండి పుట్టిన ఈ సమస్త ప్రపంచము.)

  1. బ్రహ్మాతి రేకేణ కాలత్రయే (అ)పియా అవిద్యమానా సే యమవిద్యా.

(బ్రహ్మ లేనిదే మూడుకాలములందు కనబడనిది.)

  1. “క్షరత్వ విద్యా” (శ్వేతాశ్వతరోపనిషత్.) (నశించునది అవిద్య)

  2. “యద్యత్ క్ష రణహేతుః తత్ తత్ అవిద్యైవ, స్వర్గాది నిత్యఫల హేతుః కర్మా విద్యా”.

(ఏది క్షీణించి నశించుదానికి కారణమగునో అది అంతయు అవిద్యయే. క్షణికములగు పదార్థములందు నిత్యత్వభ్రాంతి కలుగుటావిద్య.)

  1. “నహ్యస్త్యవిద్యా మనసో(అ)తిరిక్తా మనోహ్య విద్యా భవబంధకేతుః |

తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితే(అ)స్మిన్ వినష్టే సకలం విజృంభితా ||“. (వివేకచూడామణి - 169)

(మనసుకంటె వేరైన అవిద్యలేదు. మనసే అవిద్యా, జన్మము కలుగునట్లు బంధింపచేయునది. అవిద్య నష్టమైనయడల అన్నియు విజృంభించును.)

  1. మలిన స్వరూపిణీ.(మాలిన్యము స్వరూపముగాగలది - దోషములతో కూడినది.)

  2. సత్వరజస్తమోగుణములు మూడు సమానముగా ఉన్నస్థితిలో ఉన్న మాయ ప్రకృతి. దుష్కర్మలవలనతమస్సుపాలు హెచ్చుగా ఉండి, సత్వగుణమును కప్పిపుచ్చినపుడు అవిద్య యనిపించుకొనును, సత్కర్మల బలమువలన సాత్వికగుణముపాలు హెచ్చుగా నున్నపుడు విద్యయనిపించుకొనును.

  3. అశుద్ధసత్వము; మలినసత్వగుణము; రజస్తమోగుణములతో కలిసిన సత్వగుణము.

  4. “ఆవరణమనేది వివేకించినను నిశ్చయించనివ్వదు కనుక అవిద్యయనిపించుకొనును”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 7)

  5. “వ. --- శమదమాది గుణరహితుండును, మద్భక్తి విరహితుండును నగుట యవిద్య యనందగు ---”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)

  1. “సీ. తామిశ్రమును నంథతామిశ్రమును, దమమును, మోహమును, మాహామోహనంబు

నను పంచమహారూపాత్మకమైన యవిద్య బుట్టించి - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 20 - 720)

(పురాణములలో తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రమూని అయిదువిధములుగ అవిద్య చెప్పబడినది.)

  1. స్వరూప తిరోధాన వివిధ విచిత్ర విక్షేపకరీ, సద సద నీర్వచనీయా, అనాద్యవిద్యా. సాతు న సత్ భ్రాంతి బాధయోరయోగాత్, నాప్యసతీ స్థితి బాధ యోర యోగాత్. అతిః కోటి ద్వయ వినిర్ముక్తా అయమ విద్యా ఇతి తత్వవిదః.

(స్వ స్వరూపమును - జీవునియొక్క పరమాత్మ స్వరూపమును - కప్పి పుచ్చి, అనేక విధములుగా విక్షేపము కలుగచేయునదిన్నీ, సత్తు అనిగాని, అసత్ అనిగాని, ఉన్నదనిగాని, లేనిదనిగాని, లేక, బ్రహ్మవలె శాశ్వతమైనదనిగాని, అశాశ్వతమైనదనిగాని, చెప్పుటకు వీలులేనిదిన్నీ, ఎప్పుడు మొదలైనదో తెలియనిదిన్నీ, అయినటువంటిది అవిద్య).

  1. “ఉ. పుట్టువులేని నీకభవ, పుట్టుట క్రీడయకాక పుట్టుటే

యెట్టనుడున్ భవాది దశలెల్లను జీవులయందవిద్య దా

జుట్టుచునుండుగాని నిను జుట్టినదిం బలె బొంతనుండియున్

జుట్టగలేదు, దత్క్రియల జొక్కని యొక్కటి గంటి మీశ్వరా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 99)

(అవిద్య జీవులకు జన్మము మొదలగు దశలను - షడ్వికారములను - కలిగించుచుండు. నీ దగ్గర ఉండి యున్నను, నీకు ఈ దశలను కలిగించుదానివలె నుండును గాని, అట్లు చేయలేదు - నీవు అవిద్యను మించినవాడవు - దాని వశములో లేనివాడవు).

  1. విచారే క్రియమాణే స్వరూప సత్తా భావాద్యా న విద్యతే సా అవిద్యా - సాద్వి ప్రకారా - మూలా విద్యా, తూలా విద్యా చ : - శుద్ధ చిన్మాత్మవారికా మూలా విద్యా, ఘటాద్యుపహిత చైతన్య వారికా తులా విద్యా - మూల విద్యాతు కార్య కారణ భేదేన ద్వివిధా ఆవరణ విక్షేప శక్తి సహితా, అనాది భావ రూపా కారాణా విద్యా. వస్తునఃఅన్య ధా ప్రతీతి రేవ కార్యా విద్యా.

(అవిద్యయిక్క నిజానిజములేమిటని విచారణ చేసిన కనబడనిది, ఆంతకుముందు ఉన్నట్లు తోచునది అవిద్య. ఈ అవిద్య రెండు విధములు : - మూలావిద్యా, తూలావిద్యా అని. ఘటము మొదలగు వస్తువులుఅను ఉపాధి చైతన్యమును ఆచ్ఛాదించునది - మరుగు పరుచునది, అగపడకుండ చేయునది - తూలా విద్యా. శుద్ధ చైతన్యమును అచ్ఛాదించునది మూలా విద్య. మూలా విద్య కార్యము, కారణము అను రెండురూపములు కలది. ఆవరణశక్తి, విక్షేపశక్తి అను రెండు శక్తులు గలది, అనాది భావరూపమైనది కారణావిద్య. ఒక వస్తువు ఇంకొక వస్తువువలె కనబడుట కార్యావిద్య. ఇది వెండికాదు ముత్యపు చిప్ప అని ఆప్త వాక్యములచే తూలావిద్య నశించును. శాస్త్ర విచారము వలన “అహం బ్రహ్మాస్మి”అనితెలిసికొనినచో మూలావిద్య నశించును, మూలావిద్య నశించిన తోడనే ముక్తి కలుగును.

  1. విద్యకు రెండు శక్తులు గలవు - ఆవరణ శక్తి, విక్షేప శక్తి. చీకటిలో ముత్తెపుచిప్పను చూచి వెండి యని అను కొనును, త్రాడును చూచి పాము అనుకొనును. ముత్యపు చిప్పయని, త్రాడు అని తెలియకపోవుట అజ్ఞానము - ముత్యపు చిప్పను, త్రాడును కనబడకుండ కప్పిపుచ్చుట ఆవరణ శక్తి. ముత్యపు చిప్పలోని వెండిని, త్రాడులోని పామును చూచుట విక్షేప శక్తి.

  2. అవివేకమునకు అవిద్య కారణము -

  3. అవిద్య ఎట్లు పోవుననగా : -

    1. యధా తుషార కణికా భాస్కరా లోకనాత్ క్షణాత్ |

నశ్యత్యేవ మవిద్యేయం రాఘవాత్మావలోకనాత్ ||“. (యోగవాశిష్టము - 114 - 2)

(ఓ రామా, సూర్యకాంతిచే మంచు బిందువు ఒక్క క్షణములో నశించిపోవునట్లు ఆత్మావలోకనముచే అవిద్య క్షణములో నశించును).

  1. “శమదమాది గుణరహితుండును, మద్భక్తివిరహితుండును నగుట అవిద్య యనందగు”.

  2. అవిద్యా నివృత్తి రేవ మోక్షః. సకల విశేష ప్రత్యనీక బ్రహ్మ విజ్ఞానా దేవ అవిద్యా నివృత్తిః.

(అవిద్య నివృత్తి యగుటయే - లేకుండుటయే - మోక్షము - ఏ విధమైన విశేషములు లేని నిర్విశేషబ్రహ్మ జ్ఞానమువల్లనే అవిద్య నివృత్తియగును).

  1. “తదావరణ విక్షేపశక్తి మద్భంధకారణం |

అవిద్యాఖ్యమనిర్వాచ్యం జ్ఞానేనా జ్ఞానమాత్మనః |

గురూపదిష్ట వేదాంతవాక్య జన్యేన భా స్వతా |

అఖండ సచ్చిదానంద వస్త్వైక్య విషయేణచ |

బాధితం సదధిష్ఠాన చిన్మాత్రత్వేన బోధితం |

రజ్వా మహిస్రగాదీవ రజ్జు జ్ఞానేన బాధితం ||“. (గీతాభావప్రకాశము - 5 - 134 to 136)

(ఆవరణవిక్షేపశక్తులు గలిగినటువంటిన్నీ, బంధమునకు కారణమైనటువంటిన్నీ, ఇటువంటిది అని నిర్ణయించుటకు వీలు లేనటువంటిదిన్నీ అయిన అవిద్య అను పేరుగల అజ్ఞానము గురువుచేత ఉపదేశింపబడిన వేదాంతవాక్యములచేత పొందబడిన “పరమాత్మ ఒక్కడే, అంతా పరబ్రహ్మమే” అను బ్రహ్మజ్ఞానము కలుగుటచేత పోవును. చీకటిలో త్రాడును చూచి అది పాము, లేక పూలమాల అనుకొనుట అజ్ఞానము - అది పాముకాదు, పూలమాలకాదు, త్రాడే అని తెలుసుకొనుటజ్ఞానము - ఈ జ్ఞానము కలుగగానే. ఈ జ్ఞానము కలుగగానే పాము లేక పూలమాల అను అజ్ఞానము తొలగిపోవును, ఆ ప్రకారముగానే పైన చెప్పిన అవిద్య అను అజ్ఞానము జ్ఞానము కలుగగనే తొలగిపోవును.

  1. “నిధి ధ్యానన శూన్యస్య నాస్త్య విద్యా పరిక్షయః |” (గీతాభావప్రకాశము - 2 - 627)
  1. విద్యాంచా విద్యాంచ యస్తద్వేదో భయం త తః |

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా (అ)మృతమశ్నుతే ||“. (ఈశానాస్యోపనిషత్)

(విద్యను, అవిద్యను తెలుసుకొనినవాడు విద్యవలన మృత్యువును దాటి, విద్యవలన - బ్రహ్మజ్ఞానమువలన అమృతమును - చావులేని స్థితిని, మోక్షమును పొందును).

(“విద్యాంచా విద్యాంచ - - -” ఇతి శ్రుత్యా కర్మణా పాపనివృత్తి జ్ఞానేన ముక్త్యభిధానచ్చ ఇతి).

(విద్యను, అవిద్యను తెలుసుకొనినవాని సంగతి శ్రుతి చెప్పటవలన కర్మవలన పాప నివృత్తియు, జ్ఞానమువలన ముక్తి కలుగును అని అర్థము).

  1. అవిద్య తొలగిపోయిన సమస్త దుఃఖనివృత్తి యగును.
Transliteration
  1. dēhādiṣu anātmasu “ahamasmi” ityātma buddhiravidyā.

(ātmakānaṭuvaṃṭi dēhamu modalaguvāṭiyaṃdu 'ivi nēnē' anu ātma buddhi avidya.)

  1. “ślō||. śrūyatāṃ cāpya vidyāyāḥ svarūpaṃ kulanaṃdana |

anātmanyātmabuddhiryā--” (parāśaraḥ)

  1. “ślō||. anātmanyātma buddhiryā asvē svamiti yāmatiḥ |

avidyātarusaṃbhūtibījamētaddvidhāsthitaṃ||“. (viṣṇupurāṇamu)

(ātmakāni vastuvulaṃdu ātma buddhiyu, tanadikānidāniyaṃdu, tanadi yanu buddhiyu - ī reṃḍunu avidya yanu ceṭṭu puṭṭuṭaku vittanamu vaṃṭidi. vīṭivalana avidya kalugunu, lēka iviyē avidya anabaḍunu.)

  1. anātmanidēhē ahaṃ iti bhramaḥ, asvē dēhapōṣakādhārakādau vastuni svaṃ iti saṃsāra phalakaṃ kāmyakarma vidyā;sā ēva taruḥ, tatsaṃbhūtērbījaṃ dvidhāsthitaṃ - ' ahaṃ, mama ' iti.

(ātmakāni dēhamaṃdu 'ahaṃ (nēnu)' ani bhrama,tana svaṃtamukāni dēhapōṣakādhāramulaṃdu 'nādi' anukonuṭa, saṃsāramanu phalamunu kaligiṃcu karma avidya; adiyē ceṭṭu, ā ceṭṭunuṃḍi puṭṭina bījamulu. bījamulu- vittanamulu - reṃḍu, 'ahaṃ' (nēnu), 'mama' (nādi) anunavi.)

  1. “ā. ātmakāni mēna nātma buddhiyunu, na

svaṃbunaṃdu migula svatva matiyu

navanivara, yavidyayanu mahātaruvunu

tpattikī dvayaṃbu vittu modalu “. (āmuktamālyada - 3)

(tanugāni dēhamaṃdu 'tānu' anu ajñānamunu, tanadikāni gṛhamu modalaguvāṭiyaṃdu tanadi aneḍi buddhiyunu - ī reṃḍunu ajñānamu - avidya - anu mahāvṛkṣamunaku nādiyaina bījamu.)

  1. svarūpājñānaṃ; ajñānaṃ -.

(jñānamu lēkapōvuṭa, vidya lēkapōvuṭa; tana nijasvarūpamunu - “ahaṃ brahmāsmi” anu vivēkamutōtānē parabrahma ani tana nijarūpamunu - teliyani ajñānamu. parabrahmanu telusukonuṭaku sādhanamagu vidya lēkuṃḍuṭa.)

  1. ajñānāsya thā jñāna tatkāraṇa karmādirūpā.

(ajñānamu, anyathājñānamu, vīṭiki kāraṇamaina karmayē kāraṇamugā galadi avidya.)

  1. anādya nirvacanīyamajñānaṃ.

(eppuḍu prāraṃbhamainadō, eṭuvaṃṭidō telisi ceppuṭaku vīlugāni ajñānamu.)

  1. paramānaṃda svarūpā jñānaṃ.

(bhagavaṃtuḍu paramānaṃdasvarūpuḍu, mōkṣarūpuḍu - aṭṭi paramānaṃdamu yokka svarūpamunu teliyani ajñānamu.)

  1. “śōkamōhādi kāraṇaṃ |

mamāha mitya vidyākhyaṃ midhyājñānaṃ, nacētarat ||” (gītābhāvaprakāśamu - 1 - 44, 45)

  1. bhēdabhrāṃti rūpaṃ jñānaṃ.

(jīvuḍu, parabrahmavērani, parabrahma, prapaṃcamuvērani vīṭiki, okadāniki, okadāniki bhēdamunnadani talacu jñānamu.)

  1. vidyā nāśyatvāt avidyā iti māyā varṇyatē.

(vidyanu, brahma jñānamunu, naśiṃpacēyunadi kanuka māyayē avidyayani ceppabaḍucunnadi.)

  1. vidyā nivarta tvācca asau avidyātvaṃ.

(vidyanu – brahmajñānamunu - nivartiṃpacēyunadi, lēkuṃḍa cēyunadi kanuka avidyayani ceppabaḍucunnadi. vidyanu kappipuccunadigāna māyayē avidyayani ceppabaḍucunnadi.)

  1. bhagavadhyāna tirōdhānakarī.(bhagavaṃtuni guṟiṃci dhyānamu lēkuṃḍa cēyunadi.)

  2. avidya yanagā viparīta kalpana.

  3. kāmakarmātmikā. (kōrikatō panulu cēyuṭayē avidya.)

  4. “mamakarma”, “ahaṃ kartā”, “amuṣyē phalāya idaṃkarma kariṣyāmi” iti iyaṃ avidyā, anādikāla pravṛttā. (śrīśaṃkaraḥ)

(“idināpani ; dīniki nēnu kartanu; ī lōkamulōnē phalamu poṃduṭaku nēnu ī karma cēyucunnānu” ani anukonuṭa avidya. anādikālamunuṃḍi - anagā, idi eppuḍu puṭṭinadō teliyanikālamutō sarigā pravartiṃcunadi.)

  1. vidyaku virōdhi avidya - kāvuna vidyakaṃṭe vēragu karmayē avidya.

  2. saṃsāramunaku lōbaḍunaṭlu cēyumāya; kṣaṇikamulagu padārthamulaṃdu adi nityamugānuṃḍunavi yanu bhrāṃti.

  3. midhyayagu jagattunu satyamani tōpiṃcu śakti -

  4. “anityāśuci duḥkhānātmasu nitya śuci sukhātmakhyāti ravidyā” (pataṃjali - yōgasūtramulu)

(nityamugāni vastuvunu nityamugānuṃḍunadigānu, śucikānidānini, śuciyainadāniniganu, duḥkhamunu sukhamugānu, anātmavastuvulanu ātmagānu telusukonuṭa, anēkamalamulatō kūḍi aśucigānunna śarīramunuśuciyainadiganu anukonuṭa. bhūmi, ākāśamumodalagunavi eppaṭikainā naśiṃcavalasinavē - vāṭini śāśvatamulanukonuṭa - sṛṣṭilōni samastavastuvulu bhayāvahamulē- “sarvaṃ vastu bhayānvitaṃ bhuvi nṛṇāṃ, vairāgyamēvā bhayaṃ” (bhartṛhari - subhāṣitaṃ.). iṭlu ceppabaḍiyuṃḍuṭacēta iṭuvaṃṭivāṭivalana sukhamulēkapōyinanu vāṭini sukhaminiccuvāṭiganē cūcuṭa. ātmagānivastuvulaṃdu ātmayani abhiprāyamu kaligiyuṃḍuṭa.)

  1. “avyaktādi viśēṣāṃtaṃ avidyā lakṣaṇaṃ smṛtaṃ” (manuvu)

(avyaktamu - prakṛti,māya - modalu sthūladēhamu varaku gala idi aṃtayu avidyayē svarūpamugā galadi.).

  1. vastu dṛṣṭyā yā avidyamānā sā avidyā, tatkāryaṃ anaṃtakōṭi brahmāṃḍa jātaṃ.

(kanabaḍu migilina vastuvulavalekāka, kanabaḍaka uṃḍunadi. dānikāryamē. adi puṭṭiṃcinadē anaṃtakōṭi brahmāṃḍamulalōnuṃḍi puṭṭina ī samasta prapaṃcamu.)

  1. brahmāti rēkēṇa kālatrayē (a)piyā avidyamānā sē yamavidyā.

(brahma lēnidē mūḍukālamulaṃdu kanabaḍanidi.)

  1. “kṣaratva vidyā” (śvētāśvatarōpaniṣat.) (naśiṃcunadi avidya)

  2. “yadyat kṣa raṇahētuḥ tat tat avidyaiva, svargādi nityaphala hētuḥ karmā vidyā”.

(ēdi kṣīṇiṃci naśiṃcudāniki kāraṇamagunō adi aṃtayu avidyayē. kṣaṇikamulagu padārthamulaṃdu nityatvabhrāṃti kaluguṭāvidya.)

  1. “nahyastyavidyā manasō(a)tiriktā manōhya vidyā bhavabaṃdhakētuḥ |

tasmin vinaṣṭē sakalaṃ vinaṣṭaṃ vijṛṃbhitē(a)smin vinaṣṭē sakalaṃ vijṛṃbhitā ||“. (vivēkacūḍāmaṇi - 169)

(manasukaṃṭe vēraina avidyalēdu. manasē avidyā, janmamu kalugunaṭlu baṃdhiṃpacēyunadi. avidya naṣṭamainayaḍala anniyu vijṛṃbhiṃcunu.)

  1. malina svarūpiṇī.(mālinyamu svarūpamugāgaladi - dōṣamulatō kūḍinadi.)

  2. satvarajastamōguṇamulu mūḍu samānamugā unnasthitilō unna māya prakṛti. duṣkarmalavalanatamassupālu heccugā uṃḍi, satvaguṇamunu kappipuccinapuḍu avidya yanipiṃcukonunu, satkarmala balamuvalana sātvikaguṇamupālu heccugā nunnapuḍu vidyayanipiṃcukonunu.

  3. aśuddhasatvamu; malinasatvaguṇamu; rajastamōguṇamulatō kalisina satvaguṇamu.

  4. “āvaraṇamanēdi vivēkiṃcinanu niścayiṃcanivvadu kanuka avidyayanipiṃcukonunu”. (brahmavidyāsudhārṇavamu - 7)

  5. “va. --- śamadamādi guṇarahituṃḍunu, madbhakti virahituṃḍunu naguṭa yavidya yanaṃdagu ---”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)

  1. “sī. tāmiśramunu naṃthatāmiśramunu, damamunu, mōhamunu, māhāmōhanaṃbu

nanu paṃcamahārūpātmakamaina yavidya buṭṭiṃci - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 20 - 720)

(purāṇamulalō tamassu, mōhamu, mahāmōhamu, tāmiśramu, aṃdhatāmiśramūni ayiduvidhamuluga avidya ceppabaḍinadi.)

  1. svarūpa tirōdhāna vividha vicitra vikṣēpakarī, sada sada nīrvacanīyā, anādyavidyā. sātu na sat bhrāṃti bādhayōrayōgāt, nāpyasatī sthiti bādha yōra yōgāt. atiḥ kōṭi dvaya vinirmuktā ayama vidyā iti tatvavidaḥ.

(sva svarūpamunu - jīvuniyokka paramātma svarūpamunu - kappi pucci, anēka vidhamulugā vikṣēpamu kalugacēyunadinnī, sattu anigāni, asat anigāni, unnadanigāni, lēnidanigāni, lēka, brahmavale śāśvatamainadanigāni, aśāśvatamainadanigāni, ceppuṭaku vīlulēnidinnī, eppuḍu modalainadō teliyanidinnī, ayinaṭuvaṃṭidi avidya).

  1. “u. puṭṭuvulēni nīkabhava, puṭṭuṭa krīḍayakāka puṭṭuṭē

yeṭṭanuḍun bhavādi daśalellanu jīvulayaṃdavidya dā

juṭṭucunuṃḍugāni ninu juṭṭinadiṃ bale boṃtanuṃḍiyun

juṭṭagalēdu, datkriyala jokkani yokkaṭi gaṃṭi mīśvarā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 99)

(avidya jīvulaku janmamu modalagu daśalanu - ṣaḍvikāramulanu - kaligiṃcucuṃḍu. nī daggara uṃḍi yunnanu, nīku ī daśalanu kaligiṃcudānivale nuṃḍunu gāni, aṭlu cēyalēdu - nīvu avidyanu miṃcinavāḍavu - dāni vaśamulō lēnivāḍavu).

  1. vicārē kriyamāṇē svarūpa sattā bhāvādyā na vidyatē sā avidyā - sādvi prakārā - mūlā vidyā, tūlā vidyā ca : - śuddha cinmātmavārikā mūlā vidyā, ghaṭādyupahita caitanya vārikā tulā vidyā - mūla vidyātu kārya kāraṇa bhēdēna dvividhā āvaraṇa vikṣēpa śakti sahitā, anādi bhāva rūpā kārāṇā vidyā. vastunaḥanya dhā pratīti rēva kāryā vidyā.

(avidyayikka nijānijamulēmiṭani vicāraṇa cēsina kanabaḍanidi, āṃtakumuṃdu unnaṭlu tōcunadi avidya. ī avidya reṃḍu vidhamulu : - mūlāvidyā, tūlāvidyā ani. ghaṭamu modalagu vastuvuluanu upādhi caitanyamunu ācchādiṃcunadi - marugu parucunadi, agapaḍakuṃḍa cēyunadi - tūlā vidyā. śuddha caitanyamunu acchādiṃcunadi mūlā vidya. mūlā vidya kāryamu, kāraṇamu anu reṃḍurūpamulu kaladi. āvaraṇaśakti, vikṣēpaśakti anu reṃḍu śaktulu galadi, anādi bhāvarūpamainadi kāraṇāvidya. oka vastuvu iṃkoka vastuvuvale kanabaḍuṭa kāryāvidya. idi veṃḍikādu mutyapu cippa ani āpta vākyamulacē tūlāvidya naśiṃcunu. śāstra vicāramu valana “ahaṃ brahmāsmi”anitelisikoninacō mūlāvidya naśiṃcunu, mūlāvidya naśiṃcina tōḍanē mukti kalugunu.

  1. vidyaku reṃḍu śaktulu galavu - āvaraṇa śakti, vikṣēpa śakti. cīkaṭilō muttepucippanu cūci veṃḍi yani anu konunu, trāḍunu cūci pāmu anukonunu. mutyapu cippayani, trāḍu ani teliyakapōvuṭa ajñānamu - mutyapu cippanu, trāḍunu kanabaḍakuṃḍa kappipuccuṭa āvaraṇa śakti. mutyapu cippalōni veṃḍini, trāḍulōni pāmunu cūcuṭa vikṣēpa śakti.

  2. avivēkamunaku avidya kāraṇamu -

  3. avidya eṭlu pōvunanagā : -

    1. yadhā tuṣāra kaṇikā bhāskarā lōkanāt kṣaṇāt |

naśyatyēva mavidyēyaṃ rāghavātmāvalōkanāt ||“. (yōgavāśiṣṭamu - 114 - 2)

(ō rāmā, sūryakāṃticē maṃcu biṃduvu okka kṣaṇamulō naśiṃcipōvunaṭlu ātmāvalōkanamucē avidya kṣaṇamulō naśiṃcunu).

  1. “śamadamādi guṇarahituṃḍunu, madbhaktivirahituṃḍunu naguṭa avidya yanaṃdagu”.

  2. avidyā nivṛtti rēva mōkṣaḥ. sakala viśēṣa pratyanīka brahma vijñānā dēva avidyā nivṛttiḥ.

(avidya nivṛtti yaguṭayē - lēkuṃḍuṭayē - mōkṣamu - ē vidhamaina viśēṣamulu lēni nirviśēṣabrahma jñānamuvallanē avidya nivṛttiyagunu).

  1. “tadāvaraṇa vikṣēpaśakti madbhaṃdhakāraṇaṃ |

avidyākhyamanirvācyaṃ jñānēnā jñānamātmanaḥ |

gurūpadiṣṭa vēdāṃtavākya janyēna bhā svatā |

akhaṃḍa saccidānaṃda vastvaikya viṣayēṇaca |

bādhitaṃ sadadhiṣṭhāna cinmātratvēna bōdhitaṃ |

rajvā mahisragādīva rajju jñānēna bādhitaṃ ||“. (gītābhāvaprakāśamu - 5 - 134 to 136)

(āvaraṇavikṣēpaśaktulu galiginaṭuvaṃṭinnī, baṃdhamunaku kāraṇamainaṭuvaṃṭinnī, iṭuvaṃṭidi ani nirṇayiṃcuṭaku vīlu lēnaṭuvaṃṭidinnī ayina avidya anu pērugala ajñānamu guruvucēta upadēśiṃpabaḍina vēdāṃtavākyamulacēta poṃdabaḍina “paramātma okkaḍē, aṃtā parabrahmamē” anu brahmajñānamu kaluguṭacēta pōvunu. cīkaṭilō trāḍunu cūci adi pāmu, lēka pūlamāla anukonuṭa ajñānamu - adi pāmukādu, pūlamālakādu, trāḍē ani telusukonuṭajñānamu - ī jñānamu kalugagānē. ī jñānamu kalugagānē pāmu lēka pūlamāla anu ajñānamu tolagipōvunu, ā prakāramugānē paina ceppina avidya anu ajñānamu jñānamu kalugaganē tolagipōvunu.

  1. “nidhi dhyānana śūnyasya nāstya vidyā parikṣayaḥ |” (gītābhāvaprakāśamu - 2 - 627)
  1. vidyāṃcā vidyāṃca yastadvēdō bhayaṃ ta taḥ |

avidyayā mṛtyuṃ tīrtvā vidyayā (a)mṛtamaśnutē ||“. (īśānāsyōpaniṣat)

(vidyanu, avidyanu telusukoninavāḍu vidyavalana mṛtyuvunu dāṭi, vidyavalana - brahmajñānamuvalana amṛtamunu - cāvulēni sthitini, mōkṣamunu poṃdunu).

(“vidyāṃcā vidyāṃca - - -” iti śrutyā karmaṇā pāpanivṛtti jñānēna muktyabhidhānacca iti).

(vidyanu, avidyanu telusukoninavāni saṃgati śruti ceppaṭavalana karmavalana pāpa nivṛttiyu, jñānamuvalana mukti kalugunu ani arthamu).

  1. avidya tolagipōyina samasta duḥkhanivṛtti yagunu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.