← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిముక్తః avimuktaḥ

Original — తెలుగు
  1. కామాది భర్బద్ధ జీవః

(కామము మొదలగువాటిచేత బంధింపబడినవారు - అందుచేత ముక్తిని పొందనివారు).

  1. అవిముక్తే అవిద్యోపాధి కల్పితావచ్ఛేదే జీవాత్మని ప్రతిష్టితః.

(అవిద్యచేత - మాయచేత కల్పింపబడిన - మాయాకార్యమైన ఉపాధిలోనున్న జీవాత్మ).

  1. “నవిముక్తం శివాఖ్యం యద విముక్తం తతో విదుః”

(పశువులవలె పాశబద్ధులై ముక్తులైనవారివలెకాకయుండు శివుడే అవిముక్తుడు).

  1. విరుద్ధత్వేన ముక్తాః విముక్తాః, పశవః, తేభ్యోవ్యతిరిక్తః అవుముక్తః, పశుపతిః.

(పాశములచేత కట్టబడిన పశువులు, పశువులవలెనున్న అజ్ఞానులు పాశములనుండి విడువబడినవారు, ముక్తులు - వారికంటె వేరైనవాడు - అవిముక్తుడు - శివుడు).

  1. కాశీ క్షేత్రము.

  2. భ్రూమధ్యమందున్న జ్యోతిర్లింగము - “జ్యోతిర్లింగం భృవోర్మధ్యే నిత్యం ధ్యాయేత్ సదాయతిః”. (కనుబొమల మధ్యనున్న జ్యోతిర్లింగమును యతి అయినవాడు ఎల్లపుడు ధ్యానించవలెను).

  3. “అధి హైనం అత్రిః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం -” “య ఏషో అనంతో అవ్యక్త పరిపూర్ణానందైకచిదాత్మా, తం కథమహం విజ్ఞానీ యామీతి”- సహోవాచ యాజ్ఞ వల్క్యః - “సో అవిముక్త ఉపాస్యో య ఏష (అ) నంతో (అ) వ్యక్తాత్మా సో విముక్తే ప్రతిష్టితః” “సో (అ) విముక్తం కస్మిన్ ప్రతిష్టితః” ఇతి. “కరణాయాం నాస్యాంచ మధ్యే ప్రతిష్టిత” ఇతి - “కావై వారణా, కాచనాసీతి జన్మాంతర కృతాన్ సర్వాన్ దోషాన్ వాయతీతి తేన వరణా భవతీతి. సర్వానింద్రియకృతాన్ పాపాన్ నాశయతీతి తేన నాశో భవతీతి”. “క తమచ్యాస్య స్థానంచభవతీతి”. “భృవోర్ఘ్రాణస్య యస్సధిః స ఏషద్వౌర్లోకస్య పరస్యచ సంధిర్భవతీ త్యేత ద్వై సంధిం సంధ్యాంబ్రహ్మవిద ఉపాసతే”

(రామతాపిన్యుపనిషత్)

పై ఉపనిషద్వాక్యములకు ఈ క్రిందవిధముగా వ్యాఖ్యానము చేయబడినది : -

“య ఏషో అనంతో (అ) పరిచ్ఛిన్నః అతో (అ) వ్యక్తః దుర్విజ్ఞేయస్తం కథం జానీయా మీత్యత్రేః ప్రశ్నా యాజ్ఞవల్కస్య ఉత్తరం -”. “స ఈశ్వరో (అ) విముక్తే కామాదిభిర్బద్ధౌ జీవే భేదకల్పనయా ప్రతిష్టిత ఉపాస్యః”.

“సవరణయాం నాస్యాం చ మధ్యే ప్రతిష్టితః సర్వాణీంద్రియ కృతానిపాపాని వారయతి సావరణా. సర్వాణీంద్రియ కృతాని పాపాని నాశయతిచేతి సా నా శీతి వారణాశీతి. కతమచ్చ అస్యస్థానం భవతీతి. భృవోర్ఘ్రాణస్యచ యస్సంధిః స ఏష ద్యూలోకస్య పరస్యచ సంధిర్భవాతీతి |”.

(యాజ్ఞవల్క్యుని అత్రి ఈ విధముగా అడిగెను – “అనంతుడు - దేశకాలవస్తువులచేత పరిమితి లేనివాడు -. పైకికనబడక అన్నింటిలో అంతర్గతుడైనవాడున్నూ, అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండి, ఆనందము, చైతన్యశక్తిరూపముగా గలిగి, తెలుసుకొనుటకు వీలుగానివాడు అయిన పరమాత్మను ఎట్లు తెలుసుకొనగలను?” అని - ఆ ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు ఈ ప్రకారముగా సమాధానము చెప్పెను : -

ఆ అనంతుడు అవ్యక్తాత్మా యైన ఈశ్వరుడు అవిముక్తమందు ఉపాసించతగినవాడు. అతను అవిక్తమందు ప్రతిష్టింపబడియున్నాడు. అవిముక్తమందు అనగా కామములు మొదలగు పాశములచేత బద్ధుడైన జీవునియందు భేదకల్పనవలన - ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అను భేదకల్పనచేత ప్రతిష్టింపబడి ఉపాసింపబడుచున్నాడు. ఈ అవిముక్తుడు ఎందులో ప్రతిష్టింపబడియున్నాడు అను ప్రశ్నకు తిరిగి యాజ్ఞవల్క్యుని సమాధానము ఈ విధముగా నున్నది : - వరణ, నాళిక అను ఈ రెండింటిమధ్యను ప్రతిష్టింపబడియున్నాడు. వరణ అనగా ఏమిటి ? నాసిక ఏమిటి అను ప్రశ్నకు సమాధానము - అనేక జన్మములలో సర్వేంద్రియములతోను చేసినపాపములను వారించునది, పోగొట్టునది; అందుచేత వరణా, సమస్తమైన ఇంద్రియములచేతను చేసిన పాపములను నాశము చేయునది గనుక నాశికయనబడును. దీని స్థానమెక్కడ అను ప్రశ్నకు సమాధానము - కనుబొమలు, ముక్కు, ఇవి కలియుసంధి. ఈ రెండును కలిసిన సంధ్యనే సంధ్యాసమయమున బ్రహ్మవేత్తలు. - బ్రహ్మజ్ఞానము కలవారు ఉపాసించెదరు).

  1. వరణాయాం నాస్యాంశ్చమధ్యే ప్రతిష్టః ఇత్యుక్త్వా నాసాభృ సంధిః ప్రతీయతే. స ఏష ప్రసిద్ధః - బ్రహ్మకపాల స్థానీయ ద్యులోకస్య చుబుకవసాన స్థానీయస్య చ పరస్య చ భూలోకస్యాపిసంధిః తం సంధిం బ్రహ్మవిదః ఉపాసతే –

“జ్యోతిర్లింగం భృవోర్మధ్యే నిత్యం ధ్యాయే త్సదా ఊయిః |”

ఇతి శ్రుతేః.

(వారణా నాసికల మధ్యమందు ప్రతిష్టింపబడియున్నాడు అని చెప్పుటవలన నాసికకు కనుబొమలకు సంధి అయినచోట అని చెప్పబడినది. బ్రహ్మస్థానమైన కపాలము ధ్యులోకము - భూలోకమునకు సంధియని ప్రసిద్ధికెక్కినది. ఆ సంధిని బ్రహ్మవేత్తలు ఉపాసింతురు. కనుబొమల మధ్యనున్న జ్యోతిర్లింగమును యతి అయినవాడు ఎల్లపుడు ధ్యానించవలెను అని శ్రుతి చెప్పుచున్నది).

  1. “మధ్యమాధి కారిణాం కాశీక్షేత్రమేవ అవిముక్తమితి ప్రకటయిత్వా, తత్రయే కళేబరం త్యజంతి తే పరమేశ్వరోపదిష్ట రామతారక జ్ఞానతః కృత కృత్యాః భవంతి”. (రామతాపిన్యుపనిషత్)

(ఉత్తమాధికారులకు కనుబొమలకు నాసికకు మధ్య సంధిని అవిముక్తముగా ధ్యానింపవలెనని చెప్పబడినది. మధ్యమాధికారులకు అట్టి ధ్యానము కుదరదు కనుక కాశీక్షేత్రమే అవిముక్తమని చెప్పబడినది. అచ్చట ఎవరు మరణింతురో వారు మరణించుటకు ముందు వారికి కాశీ విశ్వనాధుడు రామతారక మంత్రోపదేశము చేయును. ఈ మంత్రోపదేశము వలన వారు కృతకృత్యులగుదురు)

  1. అత్రి అవిముక్తరూపే కురుక్షేత్రే బ్రహ్మేతి విజ్ఞాతే తద్విజ్ఞానానురోధేన జంతోః ప్రాణిమాత్రస్య ప్రాణేషు ఉత్క్రను మాణేషు రుద్రః పరమేశ్వరః సంసార తారకం బ్రహ్మ సచ్చిదానంద లక్షణం వ్యాచష్టే, కధియతి.యేన “తత్వమసి”, అహం బ్రహ్మస్మి ఇత్యుపదేశేన అసౌ జీవః అమృతో భూత్వా స్వాతిరిక్త భ్రమతః మోక్షోభవతి. స్వాతిరిక్త అపహ్నవ సిద్ధ నిష్ప్రతియోగిక బ్రహ్మ మాత్రతయా అవ శిష్యతే. యస్మా దేవం తస్మాత్ బ్రహ్మ మాత్రజ్ఞానోత్పత్తేః ప్రాక్ అవిముక్తం భ్రూమధ్యగత జ్యోతిర్లింగమేవ నిషేదేత. జ్యోతిర్లింగమస్త ఇత్యను సంధానం కుర్యాత్.

(అవిముక్తరూపమయిన కురుక్షేత్రమందు బ్రహ్మకలడు అని విజ్ఞానము కలిగినచో ఆ విజ్ఞానమువలన ప్రాణు లకు మరణకాలమందు పరమేశ్వరుడు సంసారమును - అనగా, జననమరణరూపమైన ప్రవాహమును పాటింప చేయునది, తరింప చేయునది తారకము. అది సచ్ఛిదానంద లక్షణముగల పరబ్రహ్మ దానిని భోధించును - “తత్వమసి” (ఆ పరబ్రహ్మ నీవే అయితివి). అని,, “అహం బ్రహ్మస్మి” (నేను బ్రహ్మనయితిని) అని ఉపదేశించును - ఈ ఉపదేశముచేత ఆ జీవుడు అమృతుడై - చావులేనివాడై - తను పరమాత్మకాడు అనుభ్రమనుండి విడువబడినవాడై బ్రహ్మమాత్రముగానే యుండును. బ్రహ్మమాత్రముగానే యున్నాను అను జ్ఞానము కలుగకముందే అవిముక్తమగు కనుబొమల మధ్యనున్న జ్యోతిర్లింగమును అనుసంధానము చేయవలెను -).

“అవిముక్తం కురుక్షేత్రం దేవానాం” ఇతి వాక్యతః |

అన్యత్ బ్రహ్మ సదనాఖ్యం ముక్తి క్షేత్రముదాహృతం |

యత్ర పాణపరిత్యాగాత్ జంతుమాత్రస్యా మోక్షణం |

సంసార బంధితః ప్రోక్తం శ్రుతౌ తత్కాశికాభిధిం |

ప్రాణప్రయాణ సమయే శ్రీరుద్రస్తార కంపదం |

వ్యాచష్టే బ్రహ్మతే నాసౌ మోక్షం ప్రాప్నోతి భోధతః ||. (గీతాభావప్రకాశము - 1 - 93 to 96)

(వేదములో కర్మకాండలో దేవ యజ్ఞమని పేరుగలది - “అవిముక్తం కురుక్షేత్రం దైవానాం” అని పేరుగలబ్రహ్మసదనము చెప్పబడినది. దానిని అవిమిక్త క్షేత్రమని యందురు. అక్కడ చనిపోయినయడల సంసారబంధమునుండి విముక్తుడగును అని శ్రుతిలో చెప్పబడినది. అదియే కాశీక్షేత్రమని దానిని అందురు - అక్కద ప్రాణములు పోవు సమయమందు జీవులకు శ్రీరుద్రుడు తారకమంత్రమును ఉపదేశించును. ఆ బోధవలన కలిగిన జ్ఞానమువలన జీవుడు మోక్షమును పొందును).

  1. తారకత్వేన య ఉక్తః సో అవిముక్తః ప్రత్యగ భదేన ఉపాస్యః సో అవిముక్తే సోపాధికేశ్వరే ప్రతిష్టితఃతస్య నిరావృతత్వాత్ తస్మిన్ అవ్యక్తో అనంతాత్మా ఉపలభ్యతే.

(సంసారసముద్రమును తరింప చేయువాడు - దాటింప చేయువాడు - తారకుడు. అతనే అవిముక్తుడు, ప్రత్యగాత్మకంటె వేరుకానివాడు అని ఉపాసించతగినవాడు - ఉపాధితో కూడియున్న ఈశ్వరుడే అవిముక్తుడు. అతని పైకి వ్యక్తముగాకయుండినను అనంతాత్ముడు - అన్నింటిలోను ఆత్మగా తానే అయి ఉన్నవాడు. అందుచేత ఒక్కొక్కచోట కనబడుచుండును).

Transliteration
  1. kāmādi bharbaddha jīvaḥ

(kāmamu modalaguvāṭicēta baṃdhiṃpabaḍinavāru - aṃducēta muktini poṃdanivāru).

  1. avimuktē avidyōpādhi kalpitāvacchēdē jīvātmani pratiṣṭitaḥ.

(avidyacēta - māyacēta kalpiṃpabaḍina - māyākāryamaina upādhilōnunna jīvātma).

  1. “navimuktaṃ śivākhyaṃ yada vimuktaṃ tatō viduḥ”

(paśuvulavale pāśabaddhulai muktulainavārivalekākayuṃḍu śivuḍē avimuktuḍu).

  1. viruddhatvēna muktāḥ vimuktāḥ, paśavaḥ, tēbhyōvyatiriktaḥ avumuktaḥ, paśupatiḥ.

(pāśamulacēta kaṭṭabaḍina paśuvulu, paśuvulavalenunna ajñānulu pāśamulanuṃḍi viḍuvabaḍinavāru, muktulu - vārikaṃṭe vērainavāḍu - avimuktuḍu - śivuḍu).

  1. kāśī kṣētramu.

  2. bhrūmadhyamaṃdunna jyōtirliṃgamu - “jyōtirliṃgaṃ bhṛvōrmadhyē nityaṃ dhyāyēt sadāyatiḥ”. (kanubomala madhyanunna jyōtirliṃgamunu yati ayinavāḍu ellapuḍu dhyāniṃcavalenu).

  3. “adhi hainaṃ atriḥ papraccha yājñavalkyaṃ -” “ya ēṣō anaṃtō avyakta paripūrṇānaṃdaikacidātmā, taṃ kathamahaṃ vijñānī yāmīti”- sahōvāca yājña valkyaḥ - “sō avimukta upāsyō ya ēṣa (a) naṃtō (a) vyaktātmā sō vimuktē pratiṣṭitaḥ” “sō (a) vimuktaṃ kasmin pratiṣṭitaḥ” iti. “karaṇāyāṃ nāsyāṃca madhyē pratiṣṭita” iti - “kāvai vāraṇā, kācanāsīti janmāṃtara kṛtān sarvān dōṣān vāyatīti tēna varaṇā bhavatīti. sarvāniṃdriyakṛtān pāpān nāśayatīti tēna nāśō bhavatīti”. “ka tamacyāsya sthānaṃcabhavatīti”. “bhṛvōrghrāṇasya yassadhiḥ sa ēṣadvaurlōkasya parasyaca saṃdhirbhavatī tyēta dvai saṃdhiṃ saṃdhyāṃbrahmavida upāsatē”

(rāmatāpinyupaniṣat)

pai upaniṣadvākyamulaku ī kriṃdavidhamugā vyākhyānamu cēyabaḍinadi : -

“ya ēṣō anaṃtō (a) paricchinnaḥ atō (a) vyaktaḥ durvijñēyastaṃ kathaṃ jānīyā mītyatrēḥ praśnā yājñavalkasya uttaraṃ -”. “sa īśvarō (a) vimuktē kāmādibhirbaddhau jīvē bhēdakalpanayā pratiṣṭita upāsyaḥ”.

“savaraṇayāṃ nāsyāṃ ca madhyē pratiṣṭitaḥ sarvāṇīṃdriya kṛtānipāpāni vārayati sāvaraṇā. sarvāṇīṃdriya kṛtāni pāpāni nāśayaticēti sā nā śīti vāraṇāśīti. katamacca asyasthānaṃ bhavatīti. bhṛvōrghrāṇasyaca yassaṃdhiḥ sa ēṣa dyūlōkasya parasyaca saṃdhirbhavātīti |”.

(yājñavalkyuni atri ī vidhamugā aḍigenu – “anaṃtuḍu - dēśakālavastuvulacēta parimiti lēnivāḍu -. paikikanabaḍaka anniṃṭilō aṃtargatuḍainavāḍunnū, anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍi, ānaṃdamu, caitanyaśaktirūpamugā galigi, telusukonuṭaku vīlugānivāḍu ayina paramātmanu eṭlu telusukonagalanu?” ani - ā praśnaku yājñavalkyuḍu ī prakāramugā samādhānamu ceppenu : -

ā anaṃtuḍu avyaktātmā yaina īśvaruḍu avimuktamaṃdu upāsiṃcataginavāḍu. atanu aviktamaṃdu pratiṣṭiṃpabaḍiyunnāḍu. avimuktamaṃdu anagā kāmamulu modalagu pāśamulacēta baddhuḍaina jīvuniyaṃdu bhēdakalpanavalana - īśvaruḍu vēru, jīvuḍu vēru anu bhēdakalpanacēta pratiṣṭiṃpabaḍi upāsiṃpabaḍucunnāḍu. ī avimuktuḍu eṃdulō pratiṣṭiṃpabaḍiyunnāḍu anu praśnaku tirigi yājñavalkyuni samādhānamu ī vidhamugā nunnadi : - varaṇa, nāḷika anu ī reṃḍiṃṭimadhyanu pratiṣṭiṃpabaḍiyunnāḍu. varaṇa anagā ēmiṭi ? nāsika ēmiṭi anu praśnaku samādhānamu - anēka janmamulalō sarvēṃdriyamulatōnu cēsinapāpamulanu vāriṃcunadi, pōgoṭṭunadi; aṃducēta varaṇā, samastamaina iṃdriyamulacētanu cēsina pāpamulanu nāśamu cēyunadi ganuka nāśikayanabaḍunu. dīni sthānamekkaḍa anu praśnaku samādhānamu - kanubomalu, mukku, ivi kaliyusaṃdhi. ī reṃḍunu kalisina saṃdhyanē saṃdhyāsamayamuna brahmavēttalu. - brahmajñānamu kalavāru upāsiṃcedaru).

  1. varaṇāyāṃ nāsyāṃścamadhyē pratiṣṭaḥ ityuktvā nāsābhṛ saṃdhiḥ pratīyatē. sa ēṣa prasiddhaḥ - brahmakapāla sthānīya dyulōkasya cubukavasāna sthānīyasya ca parasya ca bhūlōkasyāpisaṃdhiḥ taṃ saṃdhiṃ brahmavidaḥ upāsatē –

“jyōtirliṃgaṃ bhṛvōrmadhyē nityaṃ dhyāyē tsadā ūyiḥ |”

iti śrutēḥ.

(vāraṇā nāsikala madhyamaṃdu pratiṣṭiṃpabaḍiyunnāḍu ani ceppuṭavalana nāsikaku kanubomalaku saṃdhi ayinacōṭa ani ceppabaḍinadi. brahmasthānamaina kapālamu dhyulōkamu - bhūlōkamunaku saṃdhiyani prasiddhikekkinadi. ā saṃdhini brahmavēttalu upāsiṃturu. kanubomala madhyanunna jyōtirliṃgamunu yati ayinavāḍu ellapuḍu dhyāniṃcavalenu ani śruti ceppucunnadi).

  1. “madhyamādhi kāriṇāṃ kāśīkṣētramēva avimuktamiti prakaṭayitvā, tatrayē kaḷēbaraṃ tyajaṃti tē paramēśvarōpadiṣṭa rāmatāraka jñānataḥ kṛta kṛtyāḥ bhavaṃti”. (rāmatāpinyupaniṣat)

(uttamādhikārulaku kanubomalaku nāsikaku madhya saṃdhini avimuktamugā dhyāniṃpavalenani ceppabaḍinadi. madhyamādhikārulaku aṭṭi dhyānamu kudaradu kanuka kāśīkṣētramē avimuktamani ceppabaḍinadi. accaṭa evaru maraṇiṃturō vāru maraṇiṃcuṭaku muṃdu vāriki kāśī viśvanādhuḍu rāmatāraka maṃtrōpadēśamu cēyunu. ī maṃtrōpadēśamu valana vāru kṛtakṛtyulaguduru)

  1. atri avimuktarūpē kurukṣētrē brahmēti vijñātē tadvijñānānurōdhēna jaṃtōḥ prāṇimātrasya prāṇēṣu utkranu māṇēṣu rudraḥ paramēśvaraḥ saṃsāra tārakaṃ brahma saccidānaṃda lakṣaṇaṃ vyācaṣṭē, kadhiyati.yēna “tatvamasi”, ahaṃ brahmasmi ityupadēśēna asau jīvaḥ amṛtō bhūtvā svātirikta bhramataḥ mōkṣōbhavati. svātirikta apahnava siddha niṣpratiyōgika brahma mātratayā ava śiṣyatē. yasmā dēvaṃ tasmāt brahma mātrajñānōtpattēḥ prāk avimuktaṃ bhrūmadhyagata jyōtirliṃgamēva niṣēdēta. jyōtirliṃgamasta ityanu saṃdhānaṃ kuryāt.

(avimuktarūpamayina kurukṣētramaṃdu brahmakalaḍu ani vijñānamu kaliginacō ā vijñānamuvalana prāṇu laku maraṇakālamaṃdu paramēśvaruḍu saṃsāramunu - anagā, jananamaraṇarūpamaina pravāhamunu pāṭiṃpa cēyunadi, tariṃpa cēyunadi tārakamu. adi sacchidānaṃda lakṣaṇamugala parabrahma dānini bhōdhiṃcunu - “tatvamasi” (ā parabrahma nīvē ayitivi). ani,, “ahaṃ brahmasmi” (nēnu brahmanayitini) ani upadēśiṃcunu - ī upadēśamucēta ā jīvuḍu amṛtuḍai - cāvulēnivāḍai - tanu paramātmakāḍu anubhramanuṃḍi viḍuvabaḍinavāḍai brahmamātramugānē yuṃḍunu. brahmamātramugānē yunnānu anu jñānamu kalugakamuṃdē avimuktamagu kanubomala madhyanunna jyōtirliṃgamunu anusaṃdhānamu cēyavalenu -).

“avimuktaṃ kurukṣētraṃ dēvānāṃ” iti vākyataḥ |

anyat brahma sadanākhyaṃ mukti kṣētramudāhṛtaṃ |

yatra pāṇaparityāgāt jaṃtumātrasyā mōkṣaṇaṃ |

saṃsāra baṃdhitaḥ prōktaṃ śrutau tatkāśikābhidhiṃ |

prāṇaprayāṇa samayē śrīrudrastāra kaṃpadaṃ |

vyācaṣṭē brahmatē nāsau mōkṣaṃ prāpnōti bhōdhataḥ ||. (gītābhāvaprakāśamu - 1 - 93 to 96)

(vēdamulō karmakāṃḍalō dēva yajñamani pērugaladi - “avimuktaṃ kurukṣētraṃ daivānāṃ” ani pērugalabrahmasadanamu ceppabaḍinadi. dānini avimikta kṣētramani yaṃduru. akkaḍa canipōyinayaḍala saṃsārabaṃdhamunuṃḍi vimuktuḍagunu ani śrutilō ceppabaḍinadi. adiyē kāśīkṣētramani dānini aṃduru - akkada prāṇamulu pōvu samayamaṃdu jīvulaku śrīrudruḍu tārakamaṃtramunu upadēśiṃcunu. ā bōdhavalana kaligina jñānamuvalana jīvuḍu mōkṣamunu poṃdunu).

  1. tārakatvēna ya uktaḥ sō avimuktaḥ pratyaga bhadēna upāsyaḥ sō avimuktē sōpādhikēśvarē pratiṣṭitaḥtasya nirāvṛtatvāt tasmin avyaktō anaṃtātmā upalabhyatē.

(saṃsārasamudramunu tariṃpa cēyuvāḍu - dāṭiṃpa cēyuvāḍu - tārakuḍu. atanē avimuktuḍu, pratyagātmakaṃṭe vērukānivāḍu ani upāsiṃcataginavāḍu - upādhitō kūḍiyunna īśvaruḍē avimuktuḍu. atani paiki vyaktamugākayuṃḍinanu anaṃtātmuḍu - anniṃṭilōnu ātmagā tānē ayi unnavāḍu. aṃducēta okkokkacōṭa kanabaḍucuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.