అవినా = న + వినా - లేకుండునట్లుగాని సంబంధము - ఎల్లపుడు విడువక కలిసియే యుండుట.
మట్టితో కుండ చేయబడును. కుండలోనున్నదంతయు మట్టియే. కుండనుండి మట్టిని విడదీయలేము - మట్టిని విడిచి కుండ ఉండదు - ఈ రెండింటికినీ గల బంధము -
అగ్ని ఉండిననే పొగ ఉండును. ఈ రెండింటికీ గల సంబంధము అవినాభావసంబంధము - ఇది ప్రత్యక్షముగాను, పరోక్షముగాను మనకు కనబడును. ఏదో ఒక వస్తువు అడ్డు ఉన్నపుడు అగ్ని కనబడకపోయినను దానినుండి మీదకివచ్చు పొగ కనబడును - దానిని బట్టి అక్కడ అగ్ని ఉన్నదని చెప్పవచ్చును - ఇట్లు అగ్నికి పొగకి గల సంబంధము అవినాభావసంబంధము.
ప్రకృతిలోని అణు అణువులోను భగవంతుడు = తన శక్తి రూపములో) ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పియున్నాడు - ప్రతి పదార్థములోను అనేక అణువులు కలిసియున్నవి, అనగా సృష్టిలోనిఏ పదార్థములోనైనను ప్రకృతి అంశ, భగవంతుని అంశ (చిచ్ఛక్తి రూపములో) ఉన్నది. (matter and energy). ఈ ప్రకృతి అంశను, భగవదంశను ఏ పదార్థములోనైనను, అందులోని ఏ అణువులోనైనను విడదీయుట సాధ్యముకాదు. అర్థనారీశ్వర రూపములోని ఈశ్వరుని, పార్వతిని విడదీయుట శక్యముకాదు. అట్లే ప్రకృతిలోని ప్రతిపదార్థములోనున్న ప్రకృతి అంశను, భగదవంశను విడదీయలేము. ఇదియే ప్రకృతి పురుషసంబంధము. ఇదియే ఆ ఇద్దరకుగల అవినాభావసంబంధము. ఆధునిక శాస్త్రజ్ఞులు Matter అని చెప్పినదేమన పూర్వులు చెప్పిన ప్రకృతి, వారు చెప్పిన Energy యే భగవంతుని చిచ్ఛక్తి - భగన్వంతుని చిఛక్తి లేక చిచ్ఛక్తి రూపములో ఉన్న భగవంతుడు, లేనిది ప్రకృతిలో అణుమాత్రము లేదు - “ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువులేదు, వంశపావన వింటే” (శ్రీమదాంధ్రమహాభాగవతము ---)
(Thee is not even the smallest particle of matter which does not contain ENERGY).
పార్వతీ పరమేశ్వరుల అవినాభావసంబంధమువలెనే లక్ష్మీనారాయణులకుకూడ చెప్పబడినది. శ్రీమహాలక్ల్ష్మి విష్ణువక్షస్థలమందు ఎల్లపుడు ఉన్నదని పురాణములు చెప్పుచున్నవి - విష్ణువునకు శ్రీమహాలక్ష్మి నిత్యానపాయిని - ఎప్పుడునూ వదలియుండనిది. ఈ ప్రకృతి పురుష సంబంధమే - పార్వతీ పరమేశ్వర సంబంధమే, సృష్టికి కారణము - “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” - (Creation is the result of the combination of matter and Energy) - పార్వతీ పరమేశ్వరులు, లేక, లక్ష్మీనారాయణులు, సీతారాములు అని ముందు ప్రకృతి స్వరూపిణిని చెప్పి తర్వాత భగవంతుని చెప్పుచున్నారు - ఈ సాంప్రదాయముననుసరించియే కాబోలు ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా Matter చెప్పి తర్వాత ENERGYని చెప్పియున్నారు. ఈ అవినాభావసంబంధము సృష్టి అంతటిలోను కనబడుచున్నది. ఇది లేనియడల సృష్టి ఏనాడో ఆగిపోయి ఉండును).
avinā = na + vinā - lēkuṃḍunaṭlugāni saṃbaṃdhamu - ellapuḍu viḍuvaka kalisiyē yuṃḍuṭa.
maṭṭitō kuṃḍa cēyabaḍunu. kuṃḍalōnunnadaṃtayu maṭṭiyē. kuṃḍanuṃḍi maṭṭini viḍadīyalēmu - maṭṭini viḍici kuṃḍa uṃḍadu - ī reṃḍiṃṭikinī gala baṃdhamu -
agni uṃḍinanē poga uṃḍunu. ī reṃḍiṃṭikī gala saṃbaṃdhamu avinābhāvasaṃbaṃdhamu - idi pratyakṣamugānu, parōkṣamugānu manaku kanabaḍunu. ēdō oka vastuvu aḍḍu unnapuḍu agni kanabaḍakapōyinanu dāninuṃḍi mīdakivaccu poga kanabaḍunu - dānini baṭṭi akkaḍa agni unnadani ceppavaccunu - iṭlu agniki pogaki gala saṃbaṃdhamu avinābhāvasaṃbaṃdhamu.
prakṛtilōni aṇu aṇuvulōnu bhagavaṃtuḍu = tana śakti rūpamulō) unnāḍani prahlāduḍu ceppiyunnāḍu - prati padārthamulōnu anēka aṇuvulu kalisiyunnavi, anagā sṛṣṭilōniē padārthamulōnainanu prakṛti aṃśa, bhagavaṃtuni aṃśa (cicchakti rūpamulō) unnadi. (matter and energy). ī prakṛti aṃśanu, bhagavadaṃśanu ē padārthamulōnainanu, aṃdulōni ē aṇuvulōnainanu viḍadīyuṭa sādhyamukādu. arthanārīśvara rūpamulōni īśvaruni, pārvatini viḍadīyuṭa śakyamukādu. aṭlē prakṛtilōni pratipadārthamulōnunna prakṛti aṃśanu, bhagadavaṃśanu viḍadīyalēmu. idiyē prakṛti puruṣasaṃbaṃdhamu. idiyē ā iddarakugala avinābhāvasaṃbaṃdhamu. ādhunika śāstrajñulu Matter ani ceppinadēmana pūrvulu ceppina prakṛti, vāru ceppina Energy yē bhagavaṃtuni cicchakti - bhaganvaṃtuni cichakti lēka cicchakti rūpamulō unna bhagavaṃtuḍu, lēnidi prakṛtilō aṇumātramu lēdu - “ā harimayamugāni dravyamu paramāṇuvulēdu, vaṃśapāvana viṃṭē” (śrīmadāṃdhramahābhāgavatamu ---)
(Thee is not even the smallest particle of matter which does not contain ENERGY).
pārvatī paramēśvarula avinābhāvasaṃbaṃdhamuvalenē lakṣmīnārāyaṇulakukūḍa ceppabaḍinadi. śrīmahālaklṣmi viṣṇuvakṣasthalamaṃdu ellapuḍu unnadani purāṇamulu ceppucunnavi - viṣṇuvunaku śrīmahālakṣmi nityānapāyini - eppuḍunū vadaliyuṃḍanidi. ī prakṛti puruṣa saṃbaṃdhamē - pārvatī paramēśvara saṃbaṃdhamē, sṛṣṭiki kāraṇamu - “jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau” - (Creation is the result of the combination of matter and Energy) - pārvatī paramēśvarulu, lēka, lakṣmīnārāyaṇulu, sītārāmulu ani muṃdu prakṛti svarūpiṇini ceppi tarvāta bhagavaṃtuni ceppucunnāru - ī sāṃpradāyamunanusariṃciyē kābōlu ādhunika śāstrajñulu kūḍā Matter ceppi tarvāta ENERGYni ceppiyunnāru. ī avinābhāvasaṃbaṃdhamu sṛṣṭi aṃtaṭilōnu kanabaḍucunnadi. idi lēniyaḍala sṛṣṭi ēnāḍō āgipōyi uṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.