వినాశశూన్యం.(నాశము లేనిది).
వినాశహేత్వ భావాత్ అవినాశీ. (వినాశకారణము లేకపోవుటవలన అవినాశి).
వినాశనం శీలం అస్య ఇతివినాశీ, నవినాశీ అవినాశీ, వినాశశబ్దేన విక్రియా ఉచ్యతే, అవిక్రియః ఇత్యర్థః.
(నశించు స్వభావము కలది వినాశి; వినాశికానిది అవినాశి. వినాశమనగా ఇక్కడ విక్రియ, మార్పు అని అర్థము - చెప్పబడినది. అందుచేత అవినాశియనగా అవిక్రియుడు, వికారములు - షడ్భావ వికారములు లేనివాడు).
(నశించు స్వభావము లేనివాడు).
(నశించు స్వభావము కలది, అనగా కనబడకుండా ఉండునది, వినాశి యనబడును. చీకటిలో త్రాడును చూచి పాము అనుకొని, అది త్రాడు అని తెలిసినతర్వాత పాము కనబడకుండా పోయినట్లు, పాము అను భ్రాంతి పోయినట్లు. స్థూలశరీరము, సూక్ష్మశరీరము, కారణశరీరము అను మూడు విధముల ఉపాధి కంటె వేరైనది అవినాశి).
(శ్రీ మధుసూదనవ్యాఖ్యా)
(నశించు స్వభావములేనిది అవినాశి, వికారములు లేనిది, అవ్యయుడగుటయే దీనికి కారణము. అవ్యయము అనగా అవయవములుగాని, గుణములుగాని వ్యయమైనవాడు కాడు, క్షీణించువాడుకాడు. అవయవములుగాని, గుణములుగాని క్షీణించుట నాశమునే సూచించును. ఈ రెండు విధముల క్షీణించుట లేనివానికి వినాశము కలుగదు).
(ఆత్మ ఈ ప్రపంచమంతటను వ్యాపించియున్నది, నాశములేనిది అని ఎఱుంగుము. దీనిని ఎవరైనను నాశముచేయుటకు శక్తిగలవారు కారు. ఆత్మ సన్మాత్రము, మూడుకాలములందు, ఎల్లపుడు ఉండునది. అది దేని చేతను నశింప చేయబడదు -
(శస్త్రములు, అగ్ని, జలము, వాయువు, ఇవి లోకములో అన్నింటిని నాశము చేయగల శక్తిగలవైనను ఈ ఆత్మను నశింపచేయలేవు. ఎందుచేతననగా వీటిలోపల అంతరాత్మగానుండి వాటిని వాటి వాటి పనులను చేయుటకు తన సత్తాస్ఫూర్తినిచ్చునదే ఆత్మ. ఆత్మ వాటి లోపలలేనిదే అవి ఏమియు చేయలేవు. వాటికి వాటి శక్తి ఆత్మవలననే కలిగినది. అందుచేత అవి ఆత్మను నశింపచేయలేవు. అందుచేత ఆత్మ అవినాశి).
(జననమరణములు లేనటువంటిదానినిగాను, సర్వకాలములందు ఉండుదానినిగాను అందుచేతనే అవినాశి - నాశము లేనిదానినిగను ఆత్మను ఎవడు తెలుసుకొనునో - -)
(ఆత్మ నశించు స్వభావముకలదికాదు - దానికి ఉపచయము అపచయము లేవు. దేనికైనా త్రిగుణములు మొదలగువాటియొక్క అపచయమువల్లనే వినాశము కనబడుచున్నది. కస్తూరి మొదలగునవి వాటిగుణము నశించగానే అవికూడ నశించుచున్నవి - హరించిపోవుచున్నవి. అవయవములు ఉన్నవి అవయవములు నశించగానే అవి కూడా నశించును. బట్టకి అవయవములు ధారములు. దారములు నశించగానే బట్ట నశించును. వస్తువుల యొక్క ధర్మము నశించగానే వస్తువులు నశించును. బంగారముతో చేయబడిన ఆభరణములు బంగారము నశించగానే నశించును. ఈ విధమైన నాశము ఆత్మకి లేదు. ఆత్మ నిర్గుణము (గుణములు లేనిది), నిష్కలము (అవయవములు లేనిది), అందుచేత నాశములేనిది. ఆత్మకి జన్మ లేదు, అందుచేత నాశము లేనిది, నిత్యమైనది - ఎల్లపుడు ఉండునది, ఏ విధమైన మార్పులు - విక్రియములు - లేనిది). (చూడుము - 6).
(ఆత్మ ఎప్పుడైనను పుట్టినదికాదు, చనిపోవునదికాదు).
(ప్రపంచములో నాశము రెండు విధములు - నిరవశేషనాశము, సావశేషనాశము - దేహము కొంచెమైనను మిగులకుండునట్లు దహించబడుట నిరవశేషనాశము. దేహము ఉన్నను కొన్ని అవయవములు నష్టమైనపుడు సావశేషనాశము - కొంత శేషము గలది - కొంత మిగిలియుండునది. ఈ రెండు విధములగు నాశము ఆత్మకు లేనందున ఆత్మ అవినాశి).
(షడ్భావవికారములను ఆరు విధముల వికారములలో ఆఖరిదియగు నాశము లేనిది).
vināśaśūnyaṃ.(nāśamu lēnidi).
vināśahētva bhāvāt avināśī. (vināśakāraṇamu lēkapōvuṭavalana avināśi).
vināśanaṃ śīlaṃ asya itivināśī, navināśī avināśī, vināśaśabdēna vikriyā ucyatē, avikriyaḥ ityarthaḥ.
(naśiṃcu svabhāvamu kaladi vināśi; vināśikānidi avināśi. vināśamanagā ikkaḍa vikriya, mārpu ani arthamu - ceppabaḍinadi. aṃducēta avināśiyanagā avikriyuḍu, vikāramulu - ṣaḍbhāva vikāramulu lēnivāḍu).
(naśiṃcu svabhāvamu lēnivāḍu).
(naśiṃcu svabhāvamu kaladi, anagā kanabaḍakuṃḍā uṃḍunadi, vināśi yanabaḍunu. cīkaṭilō trāḍunu cūci pāmu anukoni, adi trāḍu ani telisinatarvāta pāmu kanabaḍakuṃḍā pōyinaṭlu, pāmu anu bhrāṃti pōyinaṭlu. sthūlaśarīramu, sūkṣmaśarīramu, kāraṇaśarīramu anu mūḍu vidhamula upādhi kaṃṭe vērainadi avināśi).
(śrī madhusūdanavyākhyā)
(naśiṃcu svabhāvamulēnidi avināśi, vikāramulu lēnidi, avyayuḍaguṭayē dīniki kāraṇamu. avyayamu anagā avayavamulugāni, guṇamulugāni vyayamainavāḍu kāḍu, kṣīṇiṃcuvāḍukāḍu. avayavamulugāni, guṇamulugāni kṣīṇiṃcuṭa nāśamunē sūciṃcunu. ī reṃḍu vidhamula kṣīṇiṃcuṭa lēnivāniki vināśamu kalugadu).
(ātma ī prapaṃcamaṃtaṭanu vyāpiṃciyunnadi, nāśamulēnidi ani eṟuṃgumu. dīnini evarainanu nāśamucēyuṭaku śaktigalavāru kāru. ātma sanmātramu, mūḍukālamulaṃdu, ellapuḍu uṃḍunadi. adi dēni cētanu naśiṃpa cēyabaḍadu -
(śastramulu, agni, jalamu, vāyuvu, ivi lōkamulō anniṃṭini nāśamu cēyagala śaktigalavainanu ī ātmanu naśiṃpacēyalēvu. eṃducētananagā vīṭilōpala aṃtarātmagānuṃḍi vāṭini vāṭi vāṭi panulanu cēyuṭaku tana sattāsphūrtiniccunadē ātma. ātma vāṭi lōpalalēnidē avi ēmiyu cēyalēvu. vāṭiki vāṭi śakti ātmavalananē kaliginadi. aṃducēta avi ātmanu naśiṃpacēyalēvu. aṃducēta ātma avināśi).
(jananamaraṇamulu lēnaṭuvaṃṭidāninigānu, sarvakālamulaṃdu uṃḍudāninigānu aṃducētanē avināśi - nāśamu lēnidāniniganu ātmanu evaḍu telusukonunō - -)
(ātma naśiṃcu svabhāvamukaladikādu - dāniki upacayamu apacayamu lēvu. dēnikainā triguṇamulu modalaguvāṭiyokka apacayamuvallanē vināśamu kanabaḍucunnadi. kastūri modalagunavi vāṭiguṇamu naśiṃcagānē avikūḍa naśiṃcucunnavi - hariṃcipōvucunnavi. avayavamulu unnavi avayavamulu naśiṃcagānē avi kūḍā naśiṃcunu. baṭṭaki avayavamulu dhāramulu. dāramulu naśiṃcagānē baṭṭa naśiṃcunu. vastuvula yokka dharmamu naśiṃcagānē vastuvulu naśiṃcunu. baṃgāramutō cēyabaḍina ābharaṇamulu baṃgāramu naśiṃcagānē naśiṃcunu. ī vidhamaina nāśamu ātmaki lēdu. ātma nirguṇamu (guṇamulu lēnidi), niṣkalamu (avayavamulu lēnidi), aṃducēta nāśamulēnidi. ātmaki janma lēdu, aṃducēta nāśamu lēnidi, nityamainadi - ellapuḍu uṃḍunadi, ē vidhamaina mārpulu - vikriyamulu - lēnidi). (cūḍumu - 6).
(ātma eppuḍainanu puṭṭinadikādu, canipōvunadikādu).
(prapaṃcamulō nāśamu reṃḍu vidhamulu - niravaśēṣanāśamu, sāvaśēṣanāśamu - dēhamu koṃcemainanu migulakuṃḍunaṭlu dahiṃcabaḍuṭa niravaśēṣanāśamu. dēhamu unnanu konni avayavamulu naṣṭamainapuḍu sāvaśēṣanāśamu - koṃta śēṣamu galadi - koṃta migiliyuṃḍunadi. ī reṃḍu vidhamulagu nāśamu ātmaku lēnaṃduna ātma avināśi).
(ṣaḍbhāvavikāramulanu āru vidhamula vikāramulalō ākharidiyagu nāśamu lēnidi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.