← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యభిచారీ avyabhicārī

Original — తెలుగు
  1. నవ్యభిచరతి, నస్ఖలతి ఇత్యవ్యభిచారీ, సత్యం.

(వ్యభిచారము లేనిది; నియమము దాటకుండునది; సత్యమైనది - ఎల్లపుడూ ఒకే రూపముతో, ఒకే స్థితిలో నుండునది).

  1. సదేకరూపత్వాత్ అవ్యభిచారీ. (సన్మాత్రమే యగుటవలన - ఎల్లపుడు ఉండునదగుటవలన అవ్యభిచారి).

  2. ఏది సర్వకాలములందును, సర్వ దేశములందును, సర్వ వస్తువులందును ఉన్నదో అది అవ్యభిచారీ -

ఆత్మ సర్వ శరీరములందును సర్వాత్మగా, ఒకే ఆత్మగా యుండుటవలన, త్రికాలములందును భాధింపబడకయుండుటవలనను - అనగా, శాశ్వతముగానుండుటవలననూ అవ్యభిచారి.

  1. యదధిక దేశకాలవర్తి, తదవ్యభిచారీ ఇత్యుచ్యతే - యథా ఘటస్య ఉత్పత్తివినాశయోః ప్రా గూర్థ్వంచ విద్యమానత్వాత్ ఏకత్వాచ్చ ఆకాశః ఘటాద్విభిన్నో అవ్యభిచారీచ; తధా స్థూలదేహస్య జననమరణయోః దేహాత్ భిన్నో అవ్యభిచారీచ|.

(ఏది అనేక స్థలములందుండునో అది అవ్యభిచారి అని చెప్పబడును - కుండ పుట్టకముందు, బ్రద్దలయినతర్వాతకూడ ఆకాశము ఉంటున్నది. ఘటములోనున్న ఆకాశము, పైనున్న ఆకాశము ఒకటే - కుండపుట్టి, బ్రద్దలగుటవలన కుండకన్న వేరైన ఆకాశము ఘటమువలె మార్పు లేకుండనున్నది. అందుచేత ఆకాశము అవ్యభిచారి. ఆ ప్రకారముగానే దేహము పుట్టకముందు, మరణించినతర్వాత ఆత్మ ఉండుటవలన, దేహముతో పుట్టుట, దేహముతోనే మరణించకుండుటవలన, ఒకటే యగుటవలన ఆత్మ అవ్యభిచారి).

  1. అవస్థాత్రయే (అ)ప్యనుస్యూతః -

(మూడు అవస్థలందును - జాగ్రత్, స్వప్న, సుషుప్తులందును వదలక పూర్తిగావ్యాపించియుండునది).

Transliteration
  1. navyabhicarati, naskhalati ityavyabhicārī, satyaṃ.

(vyabhicāramu lēnidi; niyamamu dāṭakuṃḍunadi; satyamainadi - ellapuḍū okē rūpamutō, okē sthitilō nuṃḍunadi).

  1. sadēkarūpatvāt avyabhicārī. (sanmātramē yaguṭavalana - ellapuḍu uṃḍunadaguṭavalana avyabhicāri).

  2. ēdi sarvakālamulaṃdunu, sarva dēśamulaṃdunu, sarva vastuvulaṃdunu unnadō adi avyabhicārī -

ātma sarva śarīramulaṃdunu sarvātmagā, okē ātmagā yuṃḍuṭavalana, trikālamulaṃdunu bhādhiṃpabaḍakayuṃḍuṭavalananu - anagā, śāśvatamugānuṃḍuṭavalananū avyabhicāri.

  1. yadadhika dēśakālavarti, tadavyabhicārī ityucyatē - yathā ghaṭasya utpattivināśayōḥ prā gūrthvaṃca vidyamānatvāt ēkatvācca ākāśaḥ ghaṭādvibhinnō avyabhicārīca; tadhā sthūladēhasya jananamaraṇayōḥ dēhāt bhinnō avyabhicārīca|.

(ēdi anēka sthalamulaṃduṃḍunō adi avyabhicāri ani ceppabaḍunu - kuṃḍa puṭṭakamuṃdu, braddalayinatarvātakūḍa ākāśamu uṃṭunnadi. ghaṭamulōnunna ākāśamu, painunna ākāśamu okaṭē - kuṃḍapuṭṭi, braddalaguṭavalana kuṃḍakanna vēraina ākāśamu ghaṭamuvale mārpu lēkuṃḍanunnadi. aṃducēta ākāśamu avyabhicāri. ā prakāramugānē dēhamu puṭṭakamuṃdu, maraṇiṃcinatarvāta ātma uṃḍuṭavalana, dēhamutō puṭṭuṭa, dēhamutōnē maraṇiṃcakuṃḍuṭavalana, okaṭē yaguṭavalana ātma avyabhicāri).

  1. avasthātrayē (a)pyanusyūtaḥ -

(mūḍu avasthalaṃdunu - jāgrat, svapna, suṣuptulaṃdunu vadalaka pūrtigāvyāpiṃciyuṃḍunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.