← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యాకృతం avyākṛtaṃ

Original — తెలుగు
  1. అకృతం, అనాది ఇత్యావత్. (కార్యముకానిది, ఆదిలేనిది, పుట్టుకలేనిది అన్నమాట).

  2. సమష్టి కారణ దేహాభిమానీ.

(సృష్టిలోనున్న వస్తువులయొక్క సమష్టిరూపములోనుండు దేహమును అభిమానించియుండునది. దేహములు సమష్టి స్థితిలోనుండు రూపము - వేరు వేరుగా కాక అన్నియు కలిసియుండు స్థితి).

  1. కార్యోపాధి శూన్యం. (కార్యవస్తువూపాధిగా లేనిది).

  2. అకార్యం(కార్యవస్తువు కానిది).

  3. అవయవములు లేనిది; వికారములు లేనిది. అవ్యక్తరూపములోనుండి తనలోనున్న జగత్తును అనేకరూపములగునట్లు మారని స్థితిలోనున్నది. (ప్రకృతి)

  4. అవ్యాకృతమనగా విస్తరింపనది - సృష్టిలోనివస్తువులుగా వ్యాపించుటకుముందు ఉన్న ప్రకృతిస్థితి. భగవంతుని చైతన్యశక్తితో కలిసి విస్తరించినస్థితి వ్యాకృతము.

  5. జగతః బీజభూతం అవ్యాకృతనామరూప సర్వకారణ శక్తి అమాహారరూపం, అవ్యాకృతాకాశాది నామవాచ్యం, పరమాత్మని ఓత ప్రోత భావేన సమాశ్రితం,, వటకణి కాయామివ వటవృక్ష శక్తిః.

(సమస్త జగత్తు పుట్టుటకు బీజము - కారణము - అయినటువంటిన్నీ, వ్యాకృతముకాని - కార్యరూపముపొందని - నామరూప జగత్తుయొక్క సత్తాస్ఫూర్తి గలిగియున్నదిన్నీ, తనలోనుండి ఉత్పన్నమగు సమస్త కారణ కార్యవర్గము సూక్ష్మరూపములో ఉండునదిన్నీ అయినది మాయ - అవ్యాకృతము - ఆకాశము మొదలగు తత్వములు.తనలో సూక్ష్మరూపములో కలిగియున్నదిన్నీ, బట్టలోని దారములు ‘ఓత ప్రోతము’ వలె - అడ్డుగాను నిలువుగాను - వ్యాపించియున్నట్లు భగవంతుని ఆశ్రయించియున్న మాయ లేక ప్రకృతి అవ్యాకృతము).

Transliteration
  1. akṛtaṃ, anādi ityāvat. (kāryamukānidi, ādilēnidi, puṭṭukalēnidi annamāṭa).

  2. samaṣṭi kāraṇa dēhābhimānī.

(sṛṣṭilōnunna vastuvulayokka samaṣṭirūpamulōnuṃḍu dēhamunu abhimāniṃciyuṃḍunadi. dēhamulu samaṣṭi sthitilōnuṃḍu rūpamu - vēru vērugā kāka anniyu kalisiyuṃḍu sthiti).

  1. kāryōpādhi śūnyaṃ. (kāryavastuvūpādhigā lēnidi).

  2. akāryaṃ(kāryavastuvu kānidi).

  3. avayavamulu lēnidi; vikāramulu lēnidi. avyaktarūpamulōnuṃḍi tanalōnunna jagattunu anēkarūpamulagunaṭlu mārani sthitilōnunnadi. (prakṛti)

  4. avyākṛtamanagā vistariṃpanadi - sṛṣṭilōnivastuvulugā vyāpiṃcuṭakumuṃdu unna prakṛtisthiti. bhagavaṃtuni caitanyaśaktitō kalisi vistariṃcinasthiti vyākṛtamu.

  5. jagataḥ bījabhūtaṃ avyākṛtanāmarūpa sarvakāraṇa śakti amāhārarūpaṃ, avyākṛtākāśādi nāmavācyaṃ, paramātmani ōta prōta bhāvēna samāśritaṃ,, vaṭakaṇi kāyāmiva vaṭavṛkṣa śaktiḥ.

(samasta jagattu puṭṭuṭaku bījamu - kāraṇamu - ayinaṭuvaṃṭinnī, vyākṛtamukāni - kāryarūpamupoṃdani - nāmarūpa jagattuyokka sattāsphūrti galigiyunnadinnī, tanalōnuṃḍi utpannamagu samasta kāraṇa kāryavargamu sūkṣmarūpamulō uṃḍunadinnī ayinadi māya - avyākṛtamu - ākāśamu modalagu tatvamulu.tanalō sūkṣmarūpamulō kaligiyunnadinnī, baṭṭalōni dāramulu ‘ōta prōtamu’ vale - aḍḍugānu niluvugānu - vyāpiṃciyunnaṭlu bhagavaṃtuni āśrayiṃciyunna māya lēka prakṛti avyākṛtamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.