← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యక్తః avyaktaḥ

Original — తెలుగు
  1. “వ్యక్తం స్థూల శరీరం, ప్రత్యక్షగమ్యం; తదన్యః అయం ప్రత్యగాత్మా”. (నీలకంఠవ్యాఖ్యా)

(వ్యక్తమైఅనది స్థూల శరీరము - కంటికి కనబడునది. ఆత్మ అటువంటిదికాదు - ప్రత్యగాత్మ; జీవాత్మరూపంలో ఉన్న పరమాత్మ).

  1. “అవ్యక్తోయ మచింత్యో (అ) యం” (శ్రీమద్భగవద్గీత - 2- 25)

“ఇంద్రియై ర్వ్యజ్యతే స్థూలదేహాదిర్వ్యక్తముచ్యతే |

ఆత్మా రూపాది హీనత్వాన్నాయం ప్రత్యక్షగోచరః ||” (గీతాభావప్రకాశము - 2 - 302)

(ఇంద్రియములకు గోచరించు స్థూలదేహము మొదలగునవి బ్యక్తము అని చెప్పబడును. రూపము మొదలగునవి లేనందున ఆత్మ ప్రత్యక్షగోచరముకాదు - ఇంద్రియములకు గోచరముకాదు).

    1. “తదవ్యక్తమానాహి” (బ్రహ్మసూత్రములు - 3 - 2 - 23)

(బ్రహ్మ ఉన్నయడల ఎందుకు కనబడడు? అను ప్రశ్నకు సమాధానముగా ఇది చెప్పబడినది. అది బ్రహ్మము, వ్యక్తము అనిచెప్పబడినది - అనగా ఇంద్రియగోచరముకాదు, దీనినిగుఱించి శ్రుతి ఈ విధముగాచెప్పుచున్నది –

“న చక్షుషా గృహ్యతే, నా పివాచా, నాన్యైర్దేవైః, తపసా, కర్మణా వా” (ముండకోపనిషత్ - 3 - 18)

(ఈ ఆత్మ కంటితో చూచుటకు వీలుకానిది, వాక్కుచే ఇటువంటివాడు అని చెప్పుటకు వీలుకానివాడు, తపస్సుచేతగాని, ఎటువంటి కర్మచేగాని తెలుసుకొనుటకు వీలుకానివాడు). ఇట్లైన ఎవరికీ కనబడడా యనగా –

“అపిసం రాధనే ప్రత్యక్షాను మానాభ్యాం” (బ్రహ్మసూత్రములు - 3 - 2 - 24)

బ్రహ్మస్వరూపము సాధారణముగా అవ్యక్తమైనను యోగసమాధిలోనున్న యోగీశ్వరులు దీనిని చూచెదరు - అని శ్రుతి, స్మృతులు చెప్పుచున్నవి –

పరాంభిఖాని వ్యతృణస్స్వయంభూః, తస్మాత్ పరాంచీ పస్యతి నాంతరాత్మ |

కశ్చిద్ధీరః, ప్రత్యగాత్మా న మైక్షదావృత్త చక్షురమృతత్వమిచ్చన్. || (కఠోపనిషత్ - 4 - 1)

(ఇంద్రియములు బాహ్య విషయములనే చూడగలవు. లోపలనున్న అంతరాత్మను చూడలేవు. ఎవరో ఒక ధీరుడు - మోక్షమును కోరుచున్న బ్రహ్మజ్ఞాని ఇంద్రియములను తన స్వాధీనములో ఉంచుకొని లోపలకు మరల్చుకొనినవాడై పరమాత్మను చూచెను - అని శ్రుతి చెప్పుచున్నది.

యం వినిద్రా, జితస్వా స్సంతుష్టాస్సం యతేంద్రియాః |

జ్యోతిః పశ్యంతి యుం జానాస్తస్మై యోగాత్మనే సమః ||. (మహాభారతము - 12 - 47 - 54)

(యోగులు అయినవారు, నిద్రను జయించినవారు, ప్రాణాయామము మొదలగువాటిచేత వాయువును జయించినవారు దేనియందును ఆశలేక సంతుష్టు లైనవారు పరమాత్మను చూతురు - అని శ్రుతి చెప్పుచున్నది).

  1. రూపాద్య భావాదవ్యక్త మింద్రియాగ్రాహ్యం, సత్వసత్వాదిత్యర్థః - అన్యైర్దే నైరుంద్రియాం తరైర్న గృహ్యతే ఇత్యన్వయం - అపి చైనం పరమాత్మానాం సందాధనే సమాధ్యవస్థాయాం కృతార్థాః పశ్యం తీతి ప్రత్యక్షాను మానాభ్యాం శ్రుతి స్మృతిభ్యాం – “కశ్చిద్దీరః ప్రత్యగాత్మాన మైక్ష దావృత్త చక్షురమృతత్వ మిచ్ఛన్”. ఇత్యాదికా శ్రుతిః. (భగవంతుడు రూపములేనివాడగుటచేతను ఇంద్రియములచేత గ్రహించుటకు వీలుకానివాడగుటచేతను అవ్యక్తుడు - అంతేగాని యదార్థముగా లేకపోవుటవలనకాదు - (అతి సూక్ష్మత్వాత్ అవ్యక్తం - మిక్కిలి చిన్నది అగుటచేత అవ్యక్తము). కర్మణా విశుద్ధచిత్తో జ్ఞానాఖ్య నిష్కామకర్మయోగముచేత మనశ్శుద్ధికలవారు, అత్యంత సత్వగుణము గలిగియుండుటచేత బ్రహ్మజ్ఞానము గలవారై పరమాత్మను చూతురు).

  2. అనింద్రియగ్రాహ్యం సర్వదృశ్య సాక్షిత్వాత్, ఆహహ్యేవం శ్రుతిః - “న చక్షుషా గృహ్యతే, నాపినాచా, నాస్యర్దేవై స్తపసా, కర్మణా వా స ఏతమేతి, సే త్యాత్మా అగ్రాహ్యోసహి గృహ్యతే, యత్త దద్రేశ్య, మగ్రాహ్యం, యదాహ్యై వేష ఏ తస్మిన్నదృశ్యే (అ) నాత్మే, (అ) నిరుక్తే, (అ) నిలయనే, (అ) భయం ప్రతిష్టాం విందతే” త్యాది శ్రుతిః. స్మృతిరపి - “అవ్యక్తోయమం చింత్యోయ మవికార్యోయమచ్యుత” ఇత్యేవమాద్యాః. (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 3 - 2 - 23)

“ఇంద్రియైః న గృహ్యతే అపి తు సం రాధనేన. (శాస్త్ర సంస్కృత మనసా ఇత్యర్థః) యోగీ (ధీరః) కృతార్థః (మోక్షార్థీ), ఆవృత్తచక్షుః (నిరుద్ధేంద్రియః), శుద్ధచేతని, ప్రత్యగాత్మానం ప్రత్యక్షానుమానాభ్యాం (శ్రుతిస్మృతిభ్యాం) పశ్యతి”.

(ఇంద్రియములచేత గ్రహించతగినవాడు - కాని, సం రాధనముచేత - సమారాధనచేత - అనగా, శాస్త్రము చదువుటవలన సంస్కృతమైన మనస్సుతో - ధీరుడు - యోగియగువాడు, కృతార్ధుడు - అనగా, మోక్షమును కోరువాడు, ఇంద్రియములను తనవశములో నుంచుకొనినవాడు, చిత్త శుద్ధిగలవాడు ప్రత్యగాత్మను ప్రత్యక్షానుమానములద్వారా - అనగా, శ్రుతి స్మృతులద్వారా - చూచును). (చూడుము- 3 - 1 to 3)

  1. “చక్షురాద్య విషయః -”. (శ్రీధరీయ వ్యాఖ్యా)

(కన్ను మొదలగు ఇంద్రియములకు విషయముకానివాడు. కంటికి కనబడునది కంటికి విషయము, చెవికి వినబడునది శబ్దము చెవికి విచ్యము. ఈ ప్రకారముగా ఏ ఇంద్రియమునకునైనను విషయముకానిది ఆత్మ; - ఏ ఇంద్రియముచేత నైనను గ్రహించుటకు వీలుకానిది - అందుచేత అవ్యక్తము).

  1. భేదనాది వస్తూని యైః ప్రమాణైః వ్యజ్యతే, తైః అయమాత్మా నవ్యజ్యతే ఇత్యవ్యక్తః.

(వస్తువులుఏ ఏ ప్రమాణములచేత తెలియబడుచున్నవో ఆ ప్రమాణములచేత ఈ ఆత్మ తెలియబడనేరదు. అందుచేత అవ్యక్తుడు).

  1. ప్రమాణాం తరాణా మగోచరః - అనేన ప్రత్యక్షాది ప్రమాణగోచర రాగద్వేషాది హేయగుణ యుక్త ప్రాకృత వైలక్షణ్యముక్తం.

(ఏ ప్రమాణములచేతను తెలుసుకొనుటకు వీలుకానివాడు - ఇట్లు చెప్పుటవలన ప్రత్యక్షప్రమాణము మొదలగు ప్రమాణములచేత తెలుసుకొనుటకు వీలగు రాగద్వేషములు మొదలగు హేయ గుణములతో కూడియున్న ప్రకృతికి సంబంధించినవాటికంటె విలక్షణమైనవాడు - వేరు లక్షణములు గలవాడు).

  1. కేన చిత్ప్రమాణేన నవ్యజ్యతే ఇత్యవ్యక్తః, స్వ సంవేద్య స్వాసాధారణాకారః ఇత్యర్థః.

(ఏ ప్రమాణముచేతను తెలియబడువాడుకాడు - అసాధారణ ఆకారము కలిగియున్నవాడు కనుక).

  1. “సర్వకారణా విషయత్వాత్ నవ్యజ్యతే ఇతి అవ్యక్తః అయం ఆత్మా”. (శ్రీశంకరః)

(సమస్త కారణములకు విషయముకానిది - అందుచేత ఆత్మ అవ్యక్తము).

  1. శబ్దాద్య శేష విశేష శూన్యం. (శబ్దము మొదలగు విశేషములేవియు లేనివాడు).

  2. సర్వ కరణాకరత్వాత్ నవ్యజ్యతే ఇత్యవ్యక్తః. (ఇంద్రియములన్నింటికి ఆకరమైనది, అందుచేత అవ్యక్తము).

  3. అహంకారమమకారాధిభిః వ్యజ్యతే ఇతి వ్యక్తం.

(అహంకారము, మమకారము - ‘నేను, నాది’ అనువాటిచే తెలియబడునది వ్యక్తము - ఆత్మ అటువంటిదికాదు. అందుచేత అవ్యక్తము).

  1. అప్రకాశః. (ప్రకాశముగా పైకి కనబడనివాడు).

అదర్శనం - (దర్శించుటకు వీలుకానివాడు - చూచుటకు వీలు కానివాడు).

“నాహం ప్రకాశస్సర్వస్య యోగమాయా సమావృతః |

మూఢోయం నాభిజానాతి లోకో మామజ మవ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 25)

“స్వేనరూపేణ సర్వస్య ప్రకట్ న భవామ్యహం |

కింతు కేషాంచి దే వైవంసర్చస్య ప్రకట్ న భావామ్యహం |

కింతు లేషాం చి దేవైవం మద్భక్తానాం భవామ్యహం |

కథం లోకస్య సర్వస్య న ప్రకాశయ తీర్యతౌ ||

యోగో మమైవ సంకల్పో మాయా తద్వశవర్తినీ |

అభక్తోయం జనోమాం న జానం త్విత్థం మహేశ్వరం |

స్వరూపేణేతి సంకల్పానుసారి ణ్యైవ మాయయా |

జ్ఞానగోచరతా యోగ్యః సత్యపి జ్ఞానకారిణే |

కృతో (అ) తః ప్రాఙ్మయా ప్రోక్తం పరం భావమితీహవై ||“. (గీతాభావప్రకాశము - 7 - 170 to 173)

(నా స్వరూపముతో - నా అసలు రూపము, యథార్థరూపముతో, నిజరూపముతో నేను అందరికి ప్రకటముకాను - కంటికి కనబడను, ఉన్నప్పటికీ కనబడను - కాని భక్తులకు కొందఱికిమాత్రము కనబడుదును - లోకమంతటికీ, లోకులందఱికీ నేను కనబడకుండుటకు కారణమేమనగా - యోగమనగా నా సంకల్పము - మాయ నా సంకల్పము యొక్క ఆధీనములో నుండును. ఈ రీతిగా మాయతోకూడియున్న మహేశ్వరుడనైన నన్ను భక్తుడుకానివాడు తెలుసుకొనలేడు - అనగా, మాయతో కూడకయున్న నాస్వరూపమును - నాస్వరూపమును, చూడలేడు. త్రిగుణములయొక్క కూడిక యోగము - అదియే మాయ - సత్వరజస్తమోగుణములు మూడును సమానపాళ్ళలో కలిసియుండుటే మాయ, వాటి సామ్యావస్థ. ఈ మాయచేత నేను కప్పబడియున్నాను అని లోకములో అభిప్రాయము. ఇది భాష్యకారుల అభిప్రాయమునుబట్టి లోకములోని జనుల అభిప్రాయమైనది. భక్తులుకానివారికి నేను కనబడకపోవుటకు కారణము మా సంకల్పమే. అందుచేత, నా మాయచేత కప్పబడిన జ్ఞానము కలిగియుండుటచేత నా భక్తుడు కానివాడు నన్ను తెలుసుకొనలేడు. మూఢుడు అయినవాడు మాయచేత కప్పబడినజ్ఞానము కలిగియుండుటచేత విపరీత దృష్టికలవాడై నన్ను మానవమాత్రుడుగా తలచుచున్నాడు).

ఏష సర్వేషం భూతేషు గూఢాత్మా న ప్రకాశతే |

దృశ్యతే త్వ గ్ర్యాబుద్ధ్వా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||.

(ఈ ఆత్మ అన్ని భూతములందు గూఢముగా (లోపల నున్నట్టు పైకి కనబడకుండా) ఉన్నాడు. పైకి ప్రకాశింపబడు - అనగాఉన్నట్టు కనబడడు - కనుక అవ్యక్తుడు సూక్ష్మాతిసూక్ష్మమైన వస్తువులను చూచుటకు శక్తికలిగిన కుశాగ్రబుద్ధిగలవారికి వ్యక్తుడగును, కనబడును).

  1. “అవిజ్ఞేయం హితత్సోమ్య తేజో, యదవిజ్ఞేయం తదవ్యక్తం” (అవ్యక్తోపనిషత్)

(ఆత్మ తెలుసుకొనుటకు వీలుకానిది - అవిజ్ఞేయము - ఏది అవిజ్ఞేయమో (తెలుసుకొనుటకు వీలులేనిదో - అది అవ్యక్తము).

  1. “యద్యప్యనేక మూర్తిత్వమస్య తథా వ్యయమీ దృశః ఏవేతి న వ్యజ్యతే ఇతి అవ్యక్తః” (శ్రీ శంకరః)

(ఆత్మకు అనేకరూపములు పురాణములలో చెప్పబడియున్నవి. కాని ఇతను ఇటువంటివాడే అనినట్లు కనబడడు - అందుచేత అవ్యక్తుడు).

“న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః |

స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 16)

(దేవతులుగాని, రాక్షసులుగాని నీ వ్యక్తిత్వమును నీవు ఎలాంటివాడవో, నీ భగవత్తత్వమును, తెలియలేరు - నిన్ను నీవే తెలుసుకొందువు - “అత్మానమాత్మనావేత్సి, సృజస్యాత్మానామాత్మనా” - (కుమారసంభవము)

(అందుచేత భగవంతుడు అవ్యక్తుడు).

  1. “అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు”

(గుహ చీకటిగా ఉండును - అందులో ఏ వస్తువున్నను కనబడదు. ప్రపంచములోనున్న భూతములన్నింటిలోపల - గుహవలెనున్న వాటిలో ఈ ఆత్మ సంచరించుచున్నాడు - చీకటిగానున్న గుహవలెనున్నదానిలో ఉన్నాడుకనుక కనబడడు. అందుచేత అవ్యక్తుడు).

“పరస్తస్మాత్తు భావో (అ) న్యో (అ) ద్యక్తో (అ) వ్యక్తాత్ సనాతనః |

యః నసర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి |

అవ్యక్తో (అ) క్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం |

యం ప్రాప్య న నివర్తంతే తద్దామ పరమం మమ |

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |

యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదం తతం ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 20 to 22)

“తస్మాచ్చరాచర స్థూల జగద్ధేతోర్విధేః పరః |

వ్యతిరిక్తో (అ) ధవా శ్రేష్టో హేతు భూతో విధేరపి |

నతస్య ప్రతిమాస్తీతి శ్రుత్యాత్యంత విలక్షణః |

అవ్యక్త ఇంద్రియాతీతో రూపస్పర్శాది వర్జితః |

అధ్యస్తేషుచ సర్వేషనుగతో (అ) క్షరః |

నిత్యోయ ఈ దృశోభావో నశ్యత్యస్యఖిలేషు చ |

భూతేషుఇ జాయమానేషు న నశ్యతి, నజాయతే |

స్రష్టు ర్హిరణ్యగర్భస్య కార్యాస్యాత్రాభిమానినః |

తదుత్పత్తివినా శాభ్యాం యుక్తేస్తో నాశజన్మని |

అధిష్టానస్య సత్యస్యా వ్యక్తస్యాకృత్రిమస్యచ |

పరమేశ్వరస్య విష్ణోర్నాన్తి జన్మాది విక్రియా |

యోభావ ఇహ చావ్యక్త ఇత్యక్షర ఈరితః |

తముత్పత్తి విశ్రాంతిం తం ప్రాహుః పరమాం గతం |

శ్రుతయః స్మృత యశ్చైవ పురుషాన్నపరం త్వితి |

యం భావం ప్రాప్య భుం యోనో నివర్తంతే (అ)త్ర జన్మనే |

తత్స్వరూపం పరం విష్ణోర్మమ సర్వోత్తమోత్తమం |

అతో హమేవ వేదాంతగమ్యోస్మి పరమాగతిః ||“. (గీతాభావప్రకాశము - 8 - 120 to 128)

(చరాచరరూపమైన స్థూలప్రపంచమునకు కారణమైన చతుర్ముఖ బ్రహ్మ, లేక, హిరణ్యగర్భుడు అవ్యక్తమని చెప్పబడుచున్నాడు - ఆ అవ్యక్తమునకు కారణమైనటువంటిన్నీ, అతనికంటె ఉత్కృష్టమైనటువంటిన్నీ, రూపస్పర్శములు మొదలగు విషయములు లేనటువంటిన్నీ, సమస్త భూతములందు అధ్యస్తుడై ఉన్నటువంటిన్నీ, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిన్నీ - అవ్యక్తముకంటె సూక్ష్మమైనటువంటిన్నీ - ఇంకొకడు అవ్యక్తమను పేరుతో ఉన్నాడు. సమస్త భూతములు నశించినప్పటికీ నశించనివాడు - మిగిలియుండువాడు - (శేషుడు) (శేషించియుండువాడు) - సర్వమునకు అధిష్టానమైనవాడు, శాశ్వతముగా నుండువాడు. అవ్యక్తుడు, పరమేశ్వరుడు, అయిన విష్ణువునకు జన్మము మొదలగు మార్పులు కలుగనేరవు. అవ్యక్తుడని, అక్షరుడని చెప్పబడినది. జన్మ మరణములు లేనిది. అదియే పరమగతి, పరమపదము, పరం ధామము. అక్కడికి వెళ్ళినవారు తిరిగిరారు - తిరిగి జన్మించరు. దానిని పురుషుడందురు, దానికన్న, ఆ పురుషునికన్న - పరమపురుషుడు, లేక పురుషోత్తముడుకన్న - ఉత్కృష్టమైన పదము - అనగా, పొందతగినది - మరిలేదు అని శ్రుతులు, స్మృతులు చెప్పుచున్నవి. అదియే సర్వోత్తమమైన నా పదము, నాస్థానము - పరంధామమనినను, పరంధాముడు అనినను నేనే - ఒకటే. అందుచేత ఉపనిషత్తులు నన్నే పరమగతిగా చెప్పుచున్నవి).

  1. “మ యా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా” - (ఈశ్వరగీతాయాం)

(ఈ జగత్తు అంతయు కనబడనటువంటి రూపముగల - అవ్యక్తరూపములో - నాచే ఆవరించబడినది - నిలువుగా అడ్డముగా నేసిన దారములతో బట్ట నిండియున్నట్లు వ్యక్తముగాని రూపములో నేను ఈ ప్రపంచకము నంతటిని వ్యాపించియున్నాను).

  1. అవ్యక్తాఖ్యం ఆత్మా.(అవ్యక్తమని చెప్పబడు ఆత్మ).

  2. భావివటవృక్ష శక్తి మద్వటబీజం స్వ శక్త్యా న స ద్వితీయం కధ్యతే. తద్వత్ బ్రహ్మాపి న మాయా శక్త్యా స ద్వితీయం సత్వాది రూపేణ నిరూపమాణే వ్యక్తిరస్య నాస్తి ఇత్యవ్యక్తం.

(ముందుకాబోయే వటవృక్షము - (మర్రిచెట్టు) యొక్క శక్తి వటబీజములో - మర్రివిత్తనములో - ఉండుటవలన ఆ శక్తి తనలోనే కలిగియుండుటవలన వటవృక్షము తనలోనుండిపుట్టి పెద్దదగుటకు ఇతరసహాయము లేకనే ఆశక్తి తనలోనే కలిగియుండుటవలన, ఆ వటబీజము సద్వితీయముకాదు - అద్వితీయము - ఆ చెట్టును పుట్టించు టకు మరియొకబీజముకాని, ఇంకే వస్తువుగాని అవసరములేకనే చేయుచున్నది. అట్లే బ్రహ్మ తన మాయా శక్తిని తనలోనే కలిగియుండుటవలన ప్రపంచసృష్టికికావలసిన సత్వము మొదలగునవి కలిగి యుండి, తనతో సరిసమానమైన, తనతో పోల్చతగిన మఱియొక్కవ్యక్తి లేనివాడు - అందుచేత బ్రహ్మ అవ్యక్తము).

Transliteration
  1. “vyaktaṃ sthūla śarīraṃ, pratyakṣagamyaṃ; tadanyaḥ ayaṃ pratyagātmā”. (nīlakaṃṭhavyākhyā)

(vyaktamaianadi sthūla śarīramu - kaṃṭiki kanabaḍunadi. ātma aṭuvaṃṭidikādu - pratyagātma; jīvātmarūpaṃlō unna paramātma).

  1. “avyaktōya maciṃtyō (a) yaṃ” (śrīmadbhagavadgīta - 2- 25)

“iṃdriyai rvyajyatē sthūladēhādirvyaktamucyatē |

ātmā rūpādi hīnatvānnāyaṃ pratyakṣagōcaraḥ ||” (gītābhāvaprakāśamu - 2 - 302)

(iṃdriyamulaku gōcariṃcu sthūladēhamu modalagunavi byaktamu ani ceppabaḍunu. rūpamu modalagunavi lēnaṃduna ātma pratyakṣagōcaramukādu - iṃdriyamulaku gōcaramukādu).

    1. “tadavyaktamānāhi” (brahmasūtramulu - 3 - 2 - 23)

(brahma unnayaḍala eṃduku kanabaḍaḍu? anu praśnaku samādhānamugā idi ceppabaḍinadi. adi brahmamu, vyaktamu aniceppabaḍinadi - anagā iṃdriyagōcaramukādu, dīniniguṟiṃci śruti ī vidhamugāceppucunnadi –

“na cakṣuṣā gṛhyatē, nā pivācā, nānyairdēvaiḥ, tapasā, karmaṇā vā” (muṃḍakōpaniṣat - 3 - 18)

(ī ātma kaṃṭitō cūcuṭaku vīlukānidi, vākkucē iṭuvaṃṭivāḍu ani ceppuṭaku vīlukānivāḍu, tapassucētagāni, eṭuvaṃṭi karmacēgāni telusukonuṭaku vīlukānivāḍu). iṭlaina evarikī kanabaḍaḍā yanagā –

“apisaṃ rādhanē pratyakṣānu mānābhyāṃ” (brahmasūtramulu - 3 - 2 - 24)

brahmasvarūpamu sādhāraṇamugā avyaktamainanu yōgasamādhilōnunna yōgīśvarulu dīnini cūcedaru - ani śruti, smṛtulu ceppucunnavi –

parāṃbhikhāni vyatṛṇassvayaṃbhūḥ, tasmāt parāṃcī pasyati nāṃtarātma |

kaściddhīraḥ, pratyagātmā na maikṣadāvṛtta cakṣuramṛtatvamiccan. || (kaṭhōpaniṣat - 4 - 1)

(iṃdriyamulu bāhya viṣayamulanē cūḍagalavu. lōpalanunna aṃtarātmanu cūḍalēvu. evarō oka dhīruḍu - mōkṣamunu kōrucunna brahmajñāni iṃdriyamulanu tana svādhīnamulō uṃcukoni lōpalaku maralcukoninavāḍai paramātmanu cūcenu - ani śruti ceppucunnadi.

yaṃ vinidrā, jitasvā ssaṃtuṣṭāssaṃ yatēṃdriyāḥ |

jyōtiḥ paśyaṃti yuṃ jānāstasmai yōgātmanē samaḥ ||. (mahābhāratamu - 12 - 47 - 54)

(yōgulu ayinavāru, nidranu jayiṃcinavāru, prāṇāyāmamu modalaguvāṭicēta vāyuvunu jayiṃcinavāru dēniyaṃdunu āśalēka saṃtuṣṭu lainavāru paramātmanu cūturu - ani śruti ceppucunnadi).

  1. rūpādya bhāvādavyakta miṃdriyāgrāhyaṃ, satvasatvādityarthaḥ - anyairdē nairuṃdriyāṃ tarairna gṛhyatē ityanvayaṃ - api cainaṃ paramātmānāṃ saṃdādhanē samādhyavasthāyāṃ kṛtārthāḥ paśyaṃ tīti pratyakṣānu mānābhyāṃ śruti smṛtibhyāṃ – “kaściddīraḥ pratyagātmāna maikṣa dāvṛtta cakṣuramṛtatva micchan”. ityādikā śrutiḥ. (bhagavaṃtuḍu rūpamulēnivāḍaguṭacētanu iṃdriyamulacēta grahiṃcuṭaku vīlukānivāḍaguṭacētanu avyaktuḍu - aṃtēgāni yadārthamugā lēkapōvuṭavalanakādu - (ati sūkṣmatvāt avyaktaṃ - mikkili cinnadi aguṭacēta avyaktamu). karmaṇā viśuddhacittō jñānākhya niṣkāmakarmayōgamucēta manaśśuddhikalavāru, atyaṃta satvaguṇamu galigiyuṃḍuṭacēta brahmajñānamu galavārai paramātmanu cūturu).

  2. aniṃdriyagrāhyaṃ sarvadṛśya sākṣitvāt, āhahyēvaṃ śrutiḥ - “na cakṣuṣā gṛhyatē, nāpinācā, nāsyardēvai stapasā, karmaṇā vā sa ētamēti, sē tyātmā agrāhyōsahi gṛhyatē, yatta dadrēśya, magrāhyaṃ, yadāhyai vēṣa ē tasminnadṛśyē (a) nātmē, (a) niruktē, (a) nilayanē, (a) bhayaṃ pratiṣṭāṃ viṃdatē” tyādi śrutiḥ. smṛtirapi - “avyaktōyamaṃ ciṃtyōya mavikāryōyamacyuta” ityēvamādyāḥ. (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 3 - 2 - 23)

“iṃdriyaiḥ na gṛhyatē api tu saṃ rādhanēna. (śāstra saṃskṛta manasā ityarthaḥ) yōgī (dhīraḥ) kṛtārthaḥ (mōkṣārthī), āvṛttacakṣuḥ (niruddhēṃdriyaḥ), śuddhacētani, pratyagātmānaṃ pratyakṣānumānābhyāṃ (śrutismṛtibhyāṃ) paśyati”.

(iṃdriyamulacēta grahiṃcataginavāḍu - kāni, saṃ rādhanamucēta - samārādhanacēta - anagā, śāstramu caduvuṭavalana saṃskṛtamaina manassutō - dhīruḍu - yōgiyaguvāḍu, kṛtārdhuḍu - anagā, mōkṣamunu kōruvāḍu, iṃdriyamulanu tanavaśamulō nuṃcukoninavāḍu, citta śuddhigalavāḍu pratyagātmanu pratyakṣānumānamuladvārā - anagā, śruti smṛtuladvārā - cūcunu). (cūḍumu- 3 - 1 to 3)

  1. “cakṣurādya viṣayaḥ -”. (śrīdharīya vyākhyā)

(kannu modalagu iṃdriyamulaku viṣayamukānivāḍu. kaṃṭiki kanabaḍunadi kaṃṭiki viṣayamu, ceviki vinabaḍunadi śabdamu ceviki vicyamu. ī prakāramugā ē iṃdriyamunakunainanu viṣayamukānidi ātma; - ē iṃdriyamucēta nainanu grahiṃcuṭaku vīlukānidi - aṃducēta avyaktamu).

  1. bhēdanādi vastūni yaiḥ pramāṇaiḥ vyajyatē, taiḥ ayamātmā navyajyatē ityavyaktaḥ.

(vastuvuluē ē pramāṇamulacēta teliyabaḍucunnavō ā pramāṇamulacēta ī ātma teliyabaḍanēradu. aṃducēta avyaktuḍu).

  1. pramāṇāṃ tarāṇā magōcaraḥ - anēna pratyakṣādi pramāṇagōcara rāgadvēṣādi hēyaguṇa yukta prākṛta vailakṣaṇyamuktaṃ.

(ē pramāṇamulacētanu telusukonuṭaku vīlukānivāḍu - iṭlu ceppuṭavalana pratyakṣapramāṇamu modalagu pramāṇamulacēta telusukonuṭaku vīlagu rāgadvēṣamulu modalagu hēya guṇamulatō kūḍiyunna prakṛtiki saṃbaṃdhiṃcinavāṭikaṃṭe vilakṣaṇamainavāḍu - vēru lakṣaṇamulu galavāḍu).

  1. kēna citpramāṇēna navyajyatē ityavyaktaḥ, sva saṃvēdya svāsādhāraṇākāraḥ ityarthaḥ.

(ē pramāṇamucētanu teliyabaḍuvāḍukāḍu - asādhāraṇa ākāramu kaligiyunnavāḍu kanuka).

  1. “sarvakāraṇā viṣayatvāt navyajyatē iti avyaktaḥ ayaṃ ātmā”. (śrīśaṃkaraḥ)

(samasta kāraṇamulaku viṣayamukānidi - aṃducēta ātma avyaktamu).

  1. śabdādya śēṣa viśēṣa śūnyaṃ. (śabdamu modalagu viśēṣamulēviyu lēnivāḍu).

  2. sarva karaṇākaratvāt navyajyatē ityavyaktaḥ. (iṃdriyamulanniṃṭiki ākaramainadi, aṃducēta avyaktamu).

  3. ahaṃkāramamakārādhibhiḥ vyajyatē iti vyaktaṃ.

(ahaṃkāramu, mamakāramu - ‘nēnu, nādi’ anuvāṭicē teliyabaḍunadi vyaktamu - ātma aṭuvaṃṭidikādu. aṃducēta avyaktamu).

  1. aprakāśaḥ. (prakāśamugā paiki kanabaḍanivāḍu).

adarśanaṃ - (darśiṃcuṭaku vīlukānivāḍu - cūcuṭaku vīlu kānivāḍu).

“nāhaṃ prakāśassarvasya yōgamāyā samāvṛtaḥ |

mūḍhōyaṃ nābhijānāti lōkō māmaja mavyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 25)

“svēnarūpēṇa sarvasya prakaṭ na bhavāmyahaṃ |

kiṃtu kēṣāṃci dē vaivaṃsarcasya prakaṭ na bhāvāmyahaṃ |

kiṃtu lēṣāṃ ci dēvaivaṃ madbhaktānāṃ bhavāmyahaṃ |

kathaṃ lōkasya sarvasya na prakāśaya tīryatau ||

yōgō mamaiva saṃkalpō māyā tadvaśavartinī |

abhaktōyaṃ janōmāṃ na jānaṃ tvitthaṃ mahēśvaraṃ |

svarūpēṇēti saṃkalpānusāri ṇyaiva māyayā |

jñānagōcaratā yōgyaḥ satyapi jñānakāriṇē |

kṛtō (a) taḥ prāṅmayā prōktaṃ paraṃ bhāvamitīhavai ||“. (gītābhāvaprakāśamu - 7 - 170 to 173)

(nā svarūpamutō - nā asalu rūpamu, yathārtharūpamutō, nijarūpamutō nēnu aṃdariki prakaṭamukānu - kaṃṭiki kanabaḍanu, unnappaṭikī kanabaḍanu - kāni bhaktulaku koṃdaṟikimātramu kanabaḍudunu - lōkamaṃtaṭikī, lōkulaṃdaṟikī nēnu kanabaḍakuṃḍuṭaku kāraṇamēmanagā - yōgamanagā nā saṃkalpamu - māya nā saṃkalpamu yokka ādhīnamulō nuṃḍunu. ī rītigā māyatōkūḍiyunna mahēśvaruḍanaina nannu bhaktuḍukānivāḍu telusukonalēḍu - anagā, māyatō kūḍakayunna nāsvarūpamunu - nāsvarūpamunu, cūḍalēḍu. triguṇamulayokka kūḍika yōgamu - adiyē māya - satvarajastamōguṇamulu mūḍunu samānapāḷḷalō kalisiyuṃḍuṭē māya, vāṭi sāmyāvastha. ī māyacēta nēnu kappabaḍiyunnānu ani lōkamulō abhiprāyamu. idi bhāṣyakārula abhiprāyamunubaṭṭi lōkamulōni janula abhiprāyamainadi. bhaktulukānivāriki nēnu kanabaḍakapōvuṭaku kāraṇamu mā saṃkalpamē. aṃducēta, nā māyacēta kappabaḍina jñānamu kaligiyuṃḍuṭacēta nā bhaktuḍu kānivāḍu nannu telusukonalēḍu. mūḍhuḍu ayinavāḍu māyacēta kappabaḍinajñānamu kaligiyuṃḍuṭacēta viparīta dṛṣṭikalavāḍai nannu mānavamātruḍugā talacucunnāḍu).

ēṣa sarvēṣaṃ bhūtēṣu gūḍhātmā na prakāśatē |

dṛśyatē tva gryābuddhvā sūkṣmayā sūkṣma darśibhiḥ ||.

(ī ātma anni bhūtamulaṃdu gūḍhamugā (lōpala nunnaṭṭu paiki kanabaḍakuṃḍā) unnāḍu. paiki prakāśiṃpabaḍu - anagāunnaṭṭu kanabaḍaḍu - kanuka avyaktuḍu sūkṣmātisūkṣmamaina vastuvulanu cūcuṭaku śaktikaligina kuśāgrabuddhigalavāriki vyaktuḍagunu, kanabaḍunu).

  1. “avijñēyaṃ hitatsōmya tējō, yadavijñēyaṃ tadavyaktaṃ” (avyaktōpaniṣat)

(ātma telusukonuṭaku vīlukānidi - avijñēyamu - ēdi avijñēyamō (telusukonuṭaku vīlulēnidō - adi avyaktamu).

  1. “yadyapyanēka mūrtitvamasya tathā vyayamī dṛśaḥ ēvēti na vyajyatē iti avyaktaḥ” (śrī śaṃkaraḥ)

(ātmaku anēkarūpamulu purāṇamulalō ceppabaḍiyunnavi. kāni itanu iṭuvaṃṭivāḍē aninaṭlu kanabaḍaḍu - aṃducēta avyaktuḍu).

“na hi tē bhagavan vyaktiṃ vidurdēvā na dānavāḥ |

svayamēvātmanātmānaṃ vēttha tvaṃ puruṣōttama ||“. (śrīmadbhagavadgīta - 10 - 16)

(dēvatulugāni, rākṣasulugāni nī vyaktitvamunu nīvu elāṃṭivāḍavō, nī bhagavattatvamunu, teliyalēru - ninnu nīvē telusukoṃduvu - “atmānamātmanāvētsi, sṛjasyātmānāmātmanā” - (kumārasaṃbhavamu)

(aṃducēta bhagavaṃtuḍu avyaktuḍu).

  1. “aṃtaścarati bhūtēṣu guhāyāṃ viśvamūrtiṣu”

(guha cīkaṭigā uṃḍunu - aṃdulō ē vastuvunnanu kanabaḍadu. prapaṃcamulōnunna bhūtamulanniṃṭilōpala - guhavalenunna vāṭilō ī ātma saṃcariṃcucunnāḍu - cīkaṭigānunna guhavalenunnadānilō unnāḍukanuka kanabaḍaḍu. aṃducēta avyaktuḍu).

“parastasmāttu bhāvō (a) nyō (a) dyaktō (a) vyaktāt sanātanaḥ |

yaḥ nasarvēṣu bhūtēṣu naśyatsu navinaśyati |

avyaktō (a) kṣara ityuktaḥ tamāhuḥ paramāṃgatiṃ |

yaṃ prāpya na nivartaṃtē taddāma paramaṃ mama |

puruṣaḥ sa paraḥ pārtha bhaktyā labhyastvananyayā |

yasyāṃtaḥ sthāni bhūtāni yēna sarvamidaṃ tataṃ ||“. (śrīmadbhagavadgīta - 8 - 20 to 22)

“tasmāccarācara sthūla jagaddhētōrvidhēḥ paraḥ |

vyatiriktō (a) dhavā śrēṣṭō hētu bhūtō vidhērapi |

natasya pratimāstīti śrutyātyaṃta vilakṣaṇaḥ |

avyakta iṃdriyātītō rūpasparśādi varjitaḥ |

adhyastēṣuca sarvēṣanugatō (a) kṣaraḥ |

nityōya ī dṛśōbhāvō naśyatyasyakhilēṣu ca |

bhūtēṣui jāyamānēṣu na naśyati, najāyatē |

sraṣṭu rhiraṇyagarbhasya kāryāsyātrābhimāninaḥ |

tadutpattivinā śābhyāṃ yuktēstō nāśajanmani |

adhiṣṭānasya satyasyā vyaktasyākṛtrimasyaca |

paramēśvarasya viṣṇōrnānti janmādi vikriyā |

yōbhāva iha cāvyakta ityakṣara īritaḥ |

tamutpatti viśrāṃtiṃ taṃ prāhuḥ paramāṃ gataṃ |

śrutayaḥ smṛta yaścaiva puruṣānnaparaṃ tviti |

yaṃ bhāvaṃ prāpya bhuṃ yōnō nivartaṃtē (a)tra janmanē |

tatsvarūpaṃ paraṃ viṣṇōrmama sarvōttamōttamaṃ |

atō hamēva vēdāṃtagamyōsmi paramāgatiḥ ||“. (gītābhāvaprakāśamu - 8 - 120 to 128)

(carācararūpamaina sthūlaprapaṃcamunaku kāraṇamaina caturmukha brahma, lēka, hiraṇyagarbhuḍu avyaktamani ceppabaḍucunnāḍu - ā avyaktamunaku kāraṇamainaṭuvaṃṭinnī, atanikaṃṭe utkṛṣṭamainaṭuvaṃṭinnī, rūpasparśamulu modalagu viṣayamulu lēnaṭuvaṃṭinnī, samasta bhūtamulaṃdu adhyastuḍai unnaṭuvaṃṭinnī, sūkṣmāti sūkṣmamainaṭuvaṃṭinnī - avyaktamukaṃṭe sūkṣmamainaṭuvaṃṭinnī - iṃkokaḍu avyaktamanu pērutō unnāḍu. samasta bhūtamulu naśiṃcinappaṭikī naśiṃcanivāḍu - migiliyuṃḍuvāḍu - (śēṣuḍu) (śēṣiṃciyuṃḍuvāḍu) - sarvamunaku adhiṣṭānamainavāḍu, śāśvatamugā nuṃḍuvāḍu. avyaktuḍu, paramēśvaruḍu, ayina viṣṇuvunaku janmamu modalagu mārpulu kaluganēravu. avyaktuḍani, akṣaruḍani ceppabaḍinadi. janma maraṇamulu lēnidi. adiyē paramagati, paramapadamu, paraṃ dhāmamu. akkaḍiki veḷḷinavāru tirigirāru - tirigi janmiṃcaru. dānini puruṣuḍaṃduru, dānikanna, ā puruṣunikanna - paramapuruṣuḍu, lēka puruṣōttamuḍukanna - utkṛṣṭamaina padamu - anagā, poṃdataginadi - marilēdu ani śrutulu, smṛtulu ceppucunnavi. adiyē sarvōttamamaina nā padamu, nāsthānamu - paraṃdhāmamaninanu, paraṃdhāmuḍu aninanu nēnē - okaṭē. aṃducēta upaniṣattulu nannē paramagatigā ceppucunnavi).

  1. “ma yā tatamidaṃ sarvaṃ jagadavyakta mūrtinā” - (īśvaragītāyāṃ)

(ī jagattu aṃtayu kanabaḍanaṭuvaṃṭi rūpamugala - avyaktarūpamulō - nācē āvariṃcabaḍinadi - niluvugā aḍḍamugā nēsina dāramulatō baṭṭa niṃḍiyunnaṭlu vyaktamugāni rūpamulō nēnu ī prapaṃcakamu naṃtaṭini vyāpiṃciyunnānu).

  1. avyaktākhyaṃ ātmā.(avyaktamani ceppabaḍu ātma).

  2. bhāvivaṭavṛkṣa śakti madvaṭabījaṃ sva śaktyā na sa dvitīyaṃ kadhyatē. tadvat brahmāpi na māyā śaktyā sa dvitīyaṃ satvādi rūpēṇa nirūpamāṇē vyaktirasya nāsti ityavyaktaṃ.

(muṃdukābōyē vaṭavṛkṣamu - (marriceṭṭu) yokka śakti vaṭabījamulō - marrivittanamulō - uṃḍuṭavalana ā śakti tanalōnē kaligiyuṃḍuṭavalana vaṭavṛkṣamu tanalōnuṃḍipuṭṭi peddadaguṭaku itarasahāyamu lēkanē āśakti tanalōnē kaligiyuṃḍuṭavalana, ā vaṭabījamu sadvitīyamukādu - advitīyamu - ā ceṭṭunu puṭṭiṃcu ṭaku mariyokabījamukāni, iṃkē vastuvugāni avasaramulēkanē cēyucunnadi. aṭlē brahma tana māyā śaktini tanalōnē kaligiyuṃḍuṭavalana prapaṃcasṛṣṭikikāvalasina satvamu modalagunavi kaligi yuṃḍi, tanatō sarisamānamaina, tanatō pōlcatagina maṟiyokkavyakti lēnivāḍu - aṃducēta brahma avyaktamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.