← Back to అ · Booklets 1–10 (digitized file 1)

ఆవ్యక్తం āvyaktaṃ

Original — తెలుగు
  1. నవ్యక్తం అవ్యక్తం, అవ్యాకృతం, ఈశ్వరశక్తిః; “మమమాయా దురత్యయా” ఇత్యుక్తః; బుద్ధి కారణం ప్రకృతిః.

(వ్యక్తముకానిది; స్పష్టముకానిది; స్పష్టముగా కనబడనిది, స్పష్టముగా తెలుసుకొనుటకు వీలులేనిది; కార్యరూపముగా మారని స్థితిలోనున్నది; మాయ; భగవంతుని శక్తి; ప్రకృతి; బుద్ధికి కారణమైనది; ప్రథానము - “తరింప శక్యముకానిదగు నామాయ” అని ప్రకృతి అయిన తన శక్తిని గుఱించి శ్రీకృష్ణభగవానుడుశ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు). నామరూపములుగల వస్తువులుగా మారని స్థితిలో ఉన్నది.)

  1. నవ్యజ్యతే ఇత్యవ్యక్తం ప్రత్యక్షాద్యగోచరం, యతః “న చక్షుషా గృహ్యతే, నాపిహి చా” ఇత్యాది శ్రుతిరాహ. (ప్రత్యక్షముగా కనబడనిది, ప్రత్యక్ష ప్రమాణము మొదలగువాటిచే గోచరింపనిది; తెలియబడనిది - “కంటికి కనబడనిది, వాక్కులచే చెప్పుటకు వీలులేనిది” అని శ్రుతి చెప్పుచున్నది).

  2. నవ్యజ్యతే ఇంద్రియైః ఇతి అవ్యక్తం, అతీంద్రియం ఇత్యర్థః.

(ఇంద్రియములకు గోచరముకానిది; ఇంద్రియ శక్తికి, ఇంద్రియములవృత్తికి మించినది అని అర్థము)

  1. “సర్వకరణా విషయత్వాత్ నవ్యజ్యతే ఇత్యవ్యక్తం”. (శ్రీశంకరః)

(ఇంద్రియములు అన్నింటికి విషయముకానిది, గోచరముకానిది,ఏ ఇంద్రియము చేతను తెలుసుకొనుటకువీలులేనిది).

  1. సర్వకరణాగోచరం, నిరాకారం, ఇంద్రియైః న వ్యజ్యతే ఇత్యవ్యక్తం, అకరణ గోచరం, నకేనాపి ప్రమాణేన వ్యజ్యతే యత్ హి కరణ గోచరంతత్ వ్యక్తం; ఇదం తద్విపరీతం.

(ఏ ఇంద్రియమునకును గోచరముకానిది; ఆకారములేనిది; ఇంద్రియములచేత తెలియబడదుకనుక అవ్యక్తము. ఏ ప్రమాణము చేతనైనను తెలుసుకొనుటకు వీలులేనిది).

  1. యోహి ఇంద్రియగోచరో భవతి స ప్రత్యక్షత్వాత్ వ్యక్తః ఇత్యుచ్యతే. అయంతు రూపా విహీనత్వాత్ న తథా - అనింద్రియగోచరం - నతు అసత్వాదిత్యర్థః.

(ఏది ఇంద్రియములకు గోచరమగునో అది కంటికి కనబడుటవలన ప్రత్యక్షప్రమాణముద్వారా తెలుసుకొనుటకు వీలగుటవలన వ్యక్తము - స్పష్తమైఅనది. ఇది - మాయ, ప్రకృతి - రూపము మొదలగునవి లేకపోవుటచేత వ్యక్తమైఅనదికాదు, అందుచేత అవ్యక్తము) - (సత్వము లేకపోవుటచేత కాదు).

  1. ఆకార విశేషరహితత్వాత్ అవ్యక్తం, అస్ఫుటం -

(ఆకారము అను విశేషములు లేకుండుటవలన అవ్యక్తము - స్ఫుటముకానిది - స్పష్టముగా ఉండనిది).

  1. యదవిజ్ఞేయం తదవ్యక్తం. (తెలుసుకొనుటకు వీలులేనిది అవ్యక్తము).

  2. ఇంద్రియ వృత్తిభిః అనభివ్యక్తం, అత ఏవ ప్రసుప్తం.

(ఇంద్రియ వృత్తులచే గోచరించనిది, వ్యక్తము కానిది - అందుచేత ప్రసుప్త్యవస్థలో నున్నవి).

  1. అవ్యక్తత్వాత్ అశబ్దగోచరం; వాఙ్మనసా తీతం. (అవ్యక్తమగుట వలన శబ్దప్రమాణము చేత తెలియబడనిది)

శబ్దాది విషయా భావాత్ అవ్యక్తం - (శబ్దము మొదలగు విషయములు లేనిది కనుక అవ్యక్తం).

  1. సూక్ష్మం, పరమ దుర్జ్ఞేయం. (చాల చిన్నది, తెలుసుకొనుటకు మిక్కిలి కష్టమైనది).

  2. అప్రకాశం (కంటికి కనబడనిది - అతి సూక్ష్మమగుటవలన).

  3. అవ్యాకృతం; మాయా; ప్రథానమీశ్వర శక్తిః. (కార్యరూపముగా మారని స్థితిలో ఉన్న ప్రకృతి;మాయ).

  4. మహదాది తత్వము - (మహత్తత్త్వము మొదలగు తత్వములు -).

  5. అస్పష్టా; నామరూపరహితా ఇత్యర్థః

(స్పష్టముగా నిర్దిష్టముగా ఉండనిది - వస్తువులు నామరూపములులేని స్థితిలోనున్న ప్రకృతి). ప్రళయానంతరము, అంతకుముందు నామరూపములతో ఉన్న వస్తువులన్నియు నామరూపములులేక తనలో కలిసిపోయిన ప్రకృతియొక్క స్థితి).

  1. కారణో దేహః, యస్మిన్ జగద్బీజరూపం స్థితం, యస్మాచ్చ లింగదేహోద్భవః తదవ్యక్తం.

(కారణదేహము, దీనిలో జగత్తు పుట్టుటకు మూలమైన బీజము - విత్తనము - సూక్ష్మరూపములోనున్నది. దీనినుండియే లింగదేహము పుట్టుచున్నది. అదియే అవ్యక్తము - బీజములోపల, దానిలోనుండి ముందు పుట్టబోవు వృక్షము, సూక్ష్మరూపములో ఉన్నట్లు, తత్వములన్నియు దీనిలోనుండి పుట్టబోవు సకలపదార్థములుదీనిలో అస్పష్టరూపములో కలది).

  1. సర్వస్య జగతః బీజభూతం, అవ్యాకృతనామరూప సత్తత్వం, సర్వ కార్యకారణ శక్తి సమాహర రూపం, అవ్యక్తం, అవ్యాకృతాకాశాది నామవాచ్యం పరమాత్మని ఓత ప్రోత భావేన, సమాశ్రితం - వటకటికా యామివ వటవృక్ష శక్తిః.

(సమస్త జగత్తు పుట్టుటకు బీజము - కారణము - అయినటువంటిన్నీ, వ్యాకృతముకాని - కార్యస్వరూపమును పొందని - నామరూప జగత్తుయొక్క సత్తాస్ఫూర్తి గలిగియున్నదిన్నీ, తనలోనుండి పుట్టు సమస్త కారణకార్యవర్గముయొక్క శక్తి రూపమైనటువంటిదిన్నీ, అగునది అవ్యక్తము. ఆకాశము మొదలగు తత్వములు సూక్ష్మరూపములో తనలోగలిగియున్నదిన్నీ, బట్టలోని దారములు నిలువుగాను, అడ్డుగాను వ్యాపించియున్నట్లు ఓత ప్రోతమువలె భగవంతుని, ఎప్పుడూ, ఏ వస్తువులోనైనను, విడువక ఆశ్రయించుకొని ఉన్నదిప్రకృతి, లేక, అవ్యక్తము).

(మర్రి విత్తనములో పెద్ద మఱ్ఱిచెట్టువలె అవబోయే శక్తి సూక్ష్మరూపములో ఇమిడియున్నట్లు, ముందు తనలోనుండి పుట్టబోయే ప్రపంచమును - ప్రపంచ వస్తువులను - సూక్ష్మరూపములో తనయందు కలిగియున్నది అవ్యక్తము).

  1. సర్వస్య ప్రపంచస్య కారణమవ్యక్తం.

(సమస్త ప్రపంచము - దానిలోనున్న అన్ని వస్తువులతో - పుట్టుటకు కారణమైనది అవ్యక్తము).

  1. “ఈయమేవ నామరూప విభిన్నం జగత్ప్రాగవస్థాయాం పరిత్యక్త వ్యాకృత నామరూపం బీజ శక్త్యవస్థం, అవ్యక్త శబ్దయోగ్యం దర్శయతి”. (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 - 4 - 2)

(అనేకమైన నామరూపములుగల, అనేకమైన వస్తువులు గలిగియున్న ఇప్పటి ఈ ప్రపంచము, పుట్టకముందు నామరూపములు లేక, అనేక వస్తువులుగా మారక యున్నవాటిని తర్వాత సృష్టి ప్రారంభసమయమందు మరలసృష్టించే శక్తిగల బీజరూపము - విత్తనము రూపముగానున్నది - ఆ స్థితిలో ఉన్నది అవ్యక్తమని చెప్పబడినది. ఆ అవ్యక్తములో కనబడని రూపములో ఉండినవే ఇప్పుడు అనేకనామరూపములుగల ప్రపంచముగా నున్నది).

  1. స్థూల శరీరారంభకం భూత సూక్ష్మం కారణం అవ్యక్తం.

(సృష్టి క్రమములో స్థూల శరీరము కలుగుటకుముందుండు స్థితి. సమస్త భూతములు సూక్ష్మ శరీరములో సమష్టిగానుండు స్థితి. అవన్నియు పుట్టుటకు కారణమైనది అవ్యక్తము).

  1. బీజరూపా శక్తిః, సంసారః, తదవస్థః.

(అన్నింటికీ కారణమై బీజరూపముననుండు సంసారము - కారణావస్థలోనుండు సంసారము) - (చూడుము – ‘సంసారము’)

  1. అచేతన ప్రకృతిరూపః, అస్ఫుటం.

(చేతనత్వము లేని ప్రకృతిరూపము - స్పష్టముగా ఉండనిది. (ప్రకృతి జడము -

“నికృష్టేయం ప్రకృతిర్మలినా (అ) నృతా |

సంసారబంధరూపత్వాత్ పరార్థత్వా జ్జడత్వతః ||“. (గీతాభావ ప్రకాశము - 7 - 34)

(అపరాప్రకృతి మలినమైనది, అసత్యమైనది, ఎందుచేతననగా, సంసారములో బంధించునది, జడస్వభావముకలది). ఈ జడప్రకృతితో భగవంతుడుతన చిచ్ఛక్తితో కలిసిన ప్రకృతి చైతన్యవంతమై సృష్టి చేయగలుగుచున్నది - ఇదియే ప్రకృతి పురుష సం యోగము - సృష్టికారణము. (Matter is inert. It does not move or do anything unless activated by an external force) Creation is going on due to the combination of matter and Energy.

  1. కారణం (కార్యప్రపంచమునకు కారణమైనది).

“మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరా చరం” (శ్రీమద్భగవద్గీత- 9 - 10)

(నా చిచ్ఛక్తిని అండగా తీసుకొని ఈ ప్రకృతి చరాచరరూపమైన జగత్తును సృష్టించుచున్నది).

“అవ్యక్తాధ్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్తసంజ్ఞికే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 18)

(ఇక్కడ అవ్యక్తమనగా చతుర్ముఖ బ్రహ్మ అని అర్థము - అవ్యక్తమని చెప్పబడు చతుర్ముఖబ్రహ్మకు పగలు సహస్ర యుగములు, రాత్రి సహస్రయుగములు - అతని పగటికాలములో సృష్టిరూపములో పుట్టవలసినవన్నియు, అంతకుముందు అవ్యక్తముగా - కనబడకుండా సూక్ష్మరూపములో - ఉన్నవన్నియు వ్యక్తమగును - కనబడునట్లు అగుచున్నవి - జన్మ నొందుటకు ప్రారంభమగుచున్నవి. ఇదియే సృష్టి ప్రారంభము. ఇవన్నియు అయనిరాత్రికాలములో అతనిలోనే (అవ్యక్తములోనే) లీనమగుచున్నవి. నామరూపములు వదలి ప్రకృతిలో కలిసిపోవుచున్నవి.

“భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |

రాత్ర్యాగమే (అ) వశః పార్థ, ప్రభవత్యహరాగమే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 19)

(పూర్వ కల్పములో చరాచరరూపమైఅన యే భూతములు ఉండెడివో అవే మరల మరల చతుర్ముఖబ్రహ్మ (అవ్యక్తము) యొక్క పగటికాలమందు పుట్టి, రాత్రి కాలమందు అవ్యక్తమందే లీనమగుచున్నవి. భగవత్సహాయముతో ఈ ప్రకారముగా అవ్యక్తము చతుర్ముఖబ్రహ్మ అను పేరుగల ప్రకృతి సృష్టి కలిగించుచు, ప్రళయమును కూడా కలిగించుచున్నది. ఈ ప్రకారముగా సృష్టి, సృష్టి తర్వాత ప్రళయము, ప్రళయము తర్వాత సృష్టి, సృష్టి తర్వాత మళ్ళీ ప్రళయము - జరుగుచునేయుండును. ఇది ప్రవాహరూపముగా ఎప్పుడూ ఆగియుండనిది. ప్రళయమునకు సృష్టికిని, సృష్టికిని ప్రళయమునకును మధ్య వ్యవధియుండదు. అందుచేతనే దీనిని ప్రవాహరూపంలో నిత్యమని చెప్పియుండిరి - ఇదియే సంసారమని చెప్పబడినది - “సమ్యక్ సరతి ఇతి సంసారః”-

(బాగుగా జరుగునది, నిర్ణీతమైన ప్రకృతి ప్రవర్తకము (Natural Law) జరుగుచున్నది - అడ్డులేనిది).

ఊగుచున్న ఊయల క్రిందకు మీదకు పోవునట్లు - It is a continuous process.

“సత్యలోకంబునందునుండు బ్రహ్మకు జతుర్యుగ సహస్రములేగ దివమొక్కటియగు, రాత్రియును నిట్లచనధాత నిద్రవో జగములడంగు, మేల్కొనిచూడ మరల లోకములు పుట్టు - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 -)

(ఈ కల్పంబునందుండు దేవాసురాదులు ప్రతి మన్వంతరంబందును నిట్లు నామరూపంబులచే నిర్దేశింపబడుదురు)

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

  1. “ప్రజాపతేః స్వపతః స్వప్నావస్తహా” (శ్రీశంకరః)

(చతుర్ముఖబ్రహ్మయొక్క - ప్రకృతియొక్క - స్వప్నావస్థ - రాత్రివేళ - సృష్టి జరగనివేళ అని అర్థము).

“స్వప్నావస్తహా విధేరస్య ప్రోక్తే హా వ్యక్తి శబ్దతః |

విధోః ప్రబోధసమయే స్వపావస్థాత్మనా స్తతః |

శరీరవిషయాద్యాత్మ వ్యక్తయో భోగ భూమియః |

వ్యవహార క్షమత్వేన ప్రభవాత్యహరాగమే |

స్వాపకాలే విధే రాత్ర్యాగమే తత్త్రైవ కారణే |

అవ్యక్తే సంజ్ఞికే సర్వాలీయంతే వ్యక్త యస్సదా ||“. (గీతాభావప్రకాశము - 8 - 106 to 109)

(ప్రళయకాలమందు అవ్యక్తములో కలిసి లీనమైపోయినవి, చతుర్ముఖ బ్రహ్మ యొక్క పగలు ప్రారంభమైనపుడు, శరీరములు విషయములు సూక్ష్మరూపములోనున్నవి, స్థూలరూపమును పొంది వ్యవహరించుటకు సమర్థత కలిగియున్నవై వ్యక్తమై పైకి సృష్టించబడినట్లు, వచ్చుచున్నవి).

  1. కార్య దేహాది వర్జితం.

(దేహము మొదలగు కార్యవస్తువులు లేనిది - దీనిలో ఉనందంతా కారణరూపమేకనుక).

  1. “అవ్యక్తావస్థా విశేషం చతుర్ముఖ దేహః” (శ్రీరామానుజః)

(వ్యక్తముగాని అవస్థ - స్థితి - లో నున్నదే చతుర్ముఖబ్రహ్మయొక్క దేహము).

  1. గుణత్రయ వైషమ్యస్య అనంతర పూర్వావస్థా, గుణ సామ్యం, గుణసామ్యలక్షణం అవ్యక్తం.

(సత్వరజస్తమోగుణములు వేరు వేరుగాకముందు ఉన్న అవస్థ. ఈ త్రిగుణములు సమానముగా కలిసియున్నస్థితి - ఈ త్రిగుణములు వేరు వేరుగాకముందు, వేరై మరల ఆఖరున సమానముగా కలిసియుండుస్థితి).

(ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు అను మూడు శక్తులు ఏకమై యుండునప్పటి శక్తి)

  1. మహదాది తత్వం. (మహత్తత్వము మొదలగు తత్వములరూపము తానే అయినది).

  2. భూతాని ప్రలీయంతే యస్మిన్ తదవ్యక్తం.

(ప్రళయకాలమందు భూతములన్నియు దేనిలో లీమగునో - లయమైపోవునో, కలిసిపోవునో - అది అవ్యక్తము.

“సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం |” (శ్రీమద్భగవద్గీత - 9 - 7)

(అర్జునా ! సమస్త భూతములు నా ప్రకృతిలోనే కలిసిపోవుచున్నవి).

“ధృతి భూని కాలచోదితము, నవ్యక్తంబు, బ్రకృతియుననుపేళ్ళబరగు మాయ |

వలన మహత్తత్వమెలమిబుట్టించె - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 201)

(అవ్యక్తము, ప్రకృతి, మాయ అనునవి ఒకటే. ఇది కాలచోదితము - కాలక్రమేణ మార్పు చెందునది. దీనిలో భగవంతుడు తన చిచ్ఛక్తితో ప్రవేశించి దానిని చైతన్యవంతముగా చేయగా దానిలోనుండి మహత్తత్త్వవము పుట్టెను).

“క. క్రమమున ద్రిగుణము నవ్య

క్తము, నిత్యము, సదసదాత్మకము మఱియ బ్రధా

నముననగా బ్రకృతి విశే

షములదియు విశిష్టమనిరి సద్విదులెలమిన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 887)

  1. - అక్షరం; అవినాశి.(క్షీణించనిది; నాశము లేనిది).

  2. “సర్వ భూతానాం కారణమకారణం, సత్వరజస్తమో లక్షణమష్ట రూపమఖిలస్య జగత్సంభవహేతు రవ్యక్తం నామ. తదేకం బహూనాం క్షేత్రజ్ఞానా మధిష్ఠానం, సముద్రమిదౌ దకానాం”.

(సర్వభూతములకు కారణమైనది అవ్యక్తము - అవ్యక్తము మట్టుకు కారణములేనిది; అది దేనిలోనుండియు పుట్టలేదు. ఎల్లపుడు భగవంతుని ఆశ్రయించుకొని యుండునది. అందుచేత భగవంతునివలె అవ్యక్తముకూడ అనాదియే. సత్వరజస్తమములను త్రిగుణములు లక్షణముగా గలది ; ఎనిమిదిరూపములు కలది –

“భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 4)

(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచబూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది విధములుగా ప్రకృతి - అనగా అవ్యక్తము - ఉన్నది. సమస్త జగత్తునకు ఇదియే కారణము –

“మాయాధ్యక్షేణప్రకృతిః సూయతే స చరాచరం |” (శ్రీమద్భగవద్గీత - 9 - 10)

(నేను అధ్యక్షుడుగానుందును - సర్వమును వీక్షించుచుందును (Superintendent ).

“మయాదృఙాత్మ రూపేణాధ్యక్షేణ విక్రియాత్మనా నియంత్రా ప్రకృతిర్మాయా భాసకేనాప భాసితా |

సత్వాధిభిర నిర్వాచ్యోత్పాదయత్యఖిలం. జగత్ |” (గీతాభావప్రకాశము - 9 - 71 to 72)

నేను నియంతను - అన్నింటిని నా ఆజ్ఞచేనడచునట్లు చేయువాడను. నావల్ల - నా చిచ్ఛక్తిచేత శక్తివంతముగా చేయబడిన అనిర్వాచ్యమైన నామాయ - ప్రకృతి సమస్త జగత్తును కనుచున్నది. పుట్టించుచున్నది).జలములన్నింటికి సముద్రము అధిష్ఠానమైనట్లు సకల క్షేత్రజ్ఞులకు - జీవులకు, జీవాత్మలకు అధిష్ఠానమైనది).

  1. “మహతః పరమవ్యక్త మవ్యక్తాత్పురుషః పరః |” (కఠోపనిషత్తు - 1 - 3 - 4)

(అవ్యక్తమునుండి మహత్తత్త్వము పుట్టినది; కనుక మహత్తత్త్వముకన్న అవ్యక్తము సూక్ష్మము, ఉత్కృష్టము. అవ్యక్తముకన్న పురుషుడు - భగవంతుడు ఉత్కృష్టమైఅనవాడు, సూక్ష్ముడు).

  1. “పరమేశ్వరాధీనా త్వియమస్మాభిః ప్రాగవస్థా జగతో (అ) భ్యుపగమ్యతే, సస్వతంత్రా - - - నహితయా వినా పరమేశ్వరస్య స్రష్టృత్వం సిద్ధ్యతి, శక్తి రహితస్య తస్య ప్రవృత్త్యనుప పత్తేః” (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 - 4 - 3)

(పరమేశ్వరుని ఆధీనములో ఉన్న ఈ అవ్యక్తము ప్రపంచకము పుట్టుకముందునుండు అవస్థయని మా అభిప్రాయము. అది స్వతంత్రమైనది కాదు - అవిలేనిదీ పరమేశ్వరుడు సృష్టిచేయుట సిద్ధించదు - స్వతః శక్తిలేనిదానికి ప్రవృత్తి లేకుండుటచేత).

  1. ప్రాకృత ప్రలయే గ్రస్త సమస్త వ్యస్త ప్రపంచా స్వప్రతిష్టే నిష్కలే లీనా యావత్ప్రాణి కర్మ పరిపాకం వర్తతే. ప్రాణి కర్మభిశ్చ తస్యాం మాయా యాం విలీనేరేవ క్రమేణప్రాప్త పరిపాకైః స్వఫలదానాయ ప్రమేశ్వరస్య సిసృక్ష్మాత్మికా మాయా వృత్తిర్జన్యతే. సైషామాయావస్థా ఈక్షణ, కామ, తపో,విచికీర్షాది శబ్దైఃఅభిధీయతే. సా అవస్థా విచికీర్ష శబ్దేన ప్రపంచసారే వర్ణితః –

” విచికీర్షుర్ఘనీ భూతా క్వచిదభ్యేతి చిందుతాం” ఇతి.

అపరిపక్వ కర్మా విభాగాత్ ఘనీభావః తదర్థ వ్యాపారో విచికీర్షాపరిపక్వ కర్మాకార పరిణత మాయా విశిష్టం బిందుః. తది దమ విభాగావస్థ మవ్యక్తముచ్యతే. అత ఏవ తస్య ఉత్పత్తిః స్మర్యతే - “తస్మాదవ్యక్తముత్పన్నం త్రిగుణం, ద్విజసత్తమ” ఇతి స ఏవ జగదం కురాకారః అధ్యాత్మం చ ఆధారా దానాదిభిః వ్యజ్యమానః కుండల్యాది శబ్దై రుచ్యతే. (దీని అర్థమునకు - చూడుము - ‘ఓంకారము’).

Transliteration
  1. navyaktaṃ avyaktaṃ, avyākṛtaṃ, īśvaraśaktiḥ; “mamamāyā duratyayā” ityuktaḥ; buddhi kāraṇaṃ prakṛtiḥ.

(vyaktamukānidi; spaṣṭamukānidi; spaṣṭamugā kanabaḍanidi, spaṣṭamugā telusukonuṭaku vīlulēnidi; kāryarūpamugā mārani sthitilōnunnadi; māya; bhagavaṃtuni śakti; prakṛti; buddhiki kāraṇamainadi; prathānamu - “tariṃpa śakyamukānidagu nāmāya” ani prakṛti ayina tana śaktini guṟiṃci śrīkṛṣṇabhagavānuḍuśrīmadbhagavadgītalō ceppiyunnāḍu). nāmarūpamulugala vastuvulugā mārani sthitilō unnadi.)

  1. navyajyatē ityavyaktaṃ pratyakṣādyagōcaraṃ, yataḥ “na cakṣuṣā gṛhyatē, nāpihi cā” ityādi śrutirāha. (pratyakṣamugā kanabaḍanidi, pratyakṣa pramāṇamu modalaguvāṭicē gōcariṃpanidi; teliyabaḍanidi - “kaṃṭiki kanabaḍanidi, vākkulacē ceppuṭaku vīlulēnidi” ani śruti ceppucunnadi).

  2. navyajyatē iṃdriyaiḥ iti avyaktaṃ, atīṃdriyaṃ ityarthaḥ.

(iṃdriyamulaku gōcaramukānidi; iṃdriya śaktiki, iṃdriyamulavṛttiki miṃcinadi ani arthamu)

  1. “sarvakaraṇā viṣayatvāt navyajyatē ityavyaktaṃ”. (śrīśaṃkaraḥ)

(iṃdriyamulu anniṃṭiki viṣayamukānidi, gōcaramukānidi,ē iṃdriyamu cētanu telusukonuṭakuvīlulēnidi).

  1. sarvakaraṇāgōcaraṃ, nirākāraṃ, iṃdriyaiḥ na vyajyatē ityavyaktaṃ, akaraṇa gōcaraṃ, nakēnāpi pramāṇēna vyajyatē yat hi karaṇa gōcaraṃtat vyaktaṃ; idaṃ tadviparītaṃ.

(ē iṃdriyamunakunu gōcaramukānidi; ākāramulēnidi; iṃdriyamulacēta teliyabaḍadukanuka avyaktamu. ē pramāṇamu cētanainanu telusukonuṭaku vīlulēnidi).

  1. yōhi iṃdriyagōcarō bhavati sa pratyakṣatvāt vyaktaḥ ityucyatē. ayaṃtu rūpā vihīnatvāt na tathā - aniṃdriyagōcaraṃ - natu asatvādityarthaḥ.

(ēdi iṃdriyamulaku gōcaramagunō adi kaṃṭiki kanabaḍuṭavalana pratyakṣapramāṇamudvārā telusukonuṭaku vīlaguṭavalana vyaktamu - spaṣtamaianadi. idi - māya, prakṛti - rūpamu modalagunavi lēkapōvuṭacēta vyaktamaianadikādu, aṃducēta avyaktamu) - (satvamu lēkapōvuṭacēta kādu).

  1. ākāra viśēṣarahitatvāt avyaktaṃ, asphuṭaṃ -

(ākāramu anu viśēṣamulu lēkuṃḍuṭavalana avyaktamu - sphuṭamukānidi - spaṣṭamugā uṃḍanidi).

  1. yadavijñēyaṃ tadavyaktaṃ. (telusukonuṭaku vīlulēnidi avyaktamu).

  2. iṃdriya vṛttibhiḥ anabhivyaktaṃ, ata ēva prasuptaṃ.

(iṃdriya vṛttulacē gōcariṃcanidi, vyaktamu kānidi - aṃducēta prasuptyavasthalō nunnavi).

  1. avyaktatvāt aśabdagōcaraṃ; vāṅmanasā tītaṃ. (avyaktamaguṭa valana śabdapramāṇamu cēta teliyabaḍanidi)

śabdādi viṣayā bhāvāt avyaktaṃ - (śabdamu modalagu viṣayamulu lēnidi kanuka avyaktaṃ).

  1. sūkṣmaṃ, parama durjñēyaṃ. (cāla cinnadi, telusukonuṭaku mikkili kaṣṭamainadi).

  2. aprakāśaṃ (kaṃṭiki kanabaḍanidi - ati sūkṣmamaguṭavalana).

  3. avyākṛtaṃ; māyā; prathānamīśvara śaktiḥ. (kāryarūpamugā mārani sthitilō unna prakṛti;māya).

  4. mahadādi tatvamu - (mahattattvamu modalagu tatvamulu -).

  5. aspaṣṭā; nāmarūparahitā ityarthaḥ

(spaṣṭamugā nirdiṣṭamugā uṃḍanidi - vastuvulu nāmarūpamululēni sthitilōnunna prakṛti). praḷayānaṃtaramu, aṃtakumuṃdu nāmarūpamulatō unna vastuvulanniyu nāmarūpamululēka tanalō kalisipōyina prakṛtiyokka sthiti).

  1. kāraṇō dēhaḥ, yasmin jagadbījarūpaṃ sthitaṃ, yasmācca liṃgadēhōdbhavaḥ tadavyaktaṃ.

(kāraṇadēhamu, dīnilō jagattu puṭṭuṭaku mūlamaina bījamu - vittanamu - sūkṣmarūpamulōnunnadi. dīninuṃḍiyē liṃgadēhamu puṭṭucunnadi. adiyē avyaktamu - bījamulōpala, dānilōnuṃḍi muṃdu puṭṭabōvu vṛkṣamu, sūkṣmarūpamulō unnaṭlu, tatvamulanniyu dīnilōnuṃḍi puṭṭabōvu sakalapadārthamuludīnilō aspaṣṭarūpamulō kaladi).

  1. sarvasya jagataḥ bījabhūtaṃ, avyākṛtanāmarūpa sattatvaṃ, sarva kāryakāraṇa śakti samāhara rūpaṃ, avyaktaṃ, avyākṛtākāśādi nāmavācyaṃ paramātmani ōta prōta bhāvēna, samāśritaṃ - vaṭakaṭikā yāmiva vaṭavṛkṣa śaktiḥ.

(samasta jagattu puṭṭuṭaku bījamu - kāraṇamu - ayinaṭuvaṃṭinnī, vyākṛtamukāni - kāryasvarūpamunu poṃdani - nāmarūpa jagattuyokka sattāsphūrti galigiyunnadinnī, tanalōnuṃḍi puṭṭu samasta kāraṇakāryavargamuyokka śakti rūpamainaṭuvaṃṭidinnī, agunadi avyaktamu. ākāśamu modalagu tatvamulu sūkṣmarūpamulō tanalōgaligiyunnadinnī, baṭṭalōni dāramulu niluvugānu, aḍḍugānu vyāpiṃciyunnaṭlu ōta prōtamuvale bhagavaṃtuni, eppuḍū, ē vastuvulōnainanu, viḍuvaka āśrayiṃcukoni unnadiprakṛti, lēka, avyaktamu).

(marri vittanamulō pedda maṟṟiceṭṭuvale avabōyē śakti sūkṣmarūpamulō imiḍiyunnaṭlu, muṃdu tanalōnuṃḍi puṭṭabōyē prapaṃcamunu - prapaṃca vastuvulanu - sūkṣmarūpamulō tanayaṃdu kaligiyunnadi avyaktamu).

  1. sarvasya prapaṃcasya kāraṇamavyaktaṃ.

(samasta prapaṃcamu - dānilōnunna anni vastuvulatō - puṭṭuṭaku kāraṇamainadi avyaktamu).

  1. “īyamēva nāmarūpa vibhinnaṃ jagatprāgavasthāyāṃ parityakta vyākṛta nāmarūpaṃ bīja śaktyavasthaṃ, avyakta śabdayōgyaṃ darśayati”. (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 - 4 - 2)

(anēkamaina nāmarūpamulugala, anēkamaina vastuvulu galigiyunna ippaṭi ī prapaṃcamu, puṭṭakamuṃdu nāmarūpamulu lēka, anēka vastuvulugā māraka yunnavāṭini tarvāta sṛṣṭi prāraṃbhasamayamaṃdu maralasṛṣṭiṃcē śaktigala bījarūpamu - vittanamu rūpamugānunnadi - ā sthitilō unnadi avyaktamani ceppabaḍinadi. ā avyaktamulō kanabaḍani rūpamulō uṃḍinavē ippuḍu anēkanāmarūpamulugala prapaṃcamugā nunnadi).

  1. sthūla śarīrāraṃbhakaṃ bhūta sūkṣmaṃ kāraṇaṃ avyaktaṃ.

(sṛṣṭi kramamulō sthūla śarīramu kaluguṭakumuṃduṃḍu sthiti. samasta bhūtamulu sūkṣma śarīramulō samaṣṭigānuṃḍu sthiti. avanniyu puṭṭuṭaku kāraṇamainadi avyaktamu).

  1. bījarūpā śaktiḥ, saṃsāraḥ, tadavasthaḥ.

(anniṃṭikī kāraṇamai bījarūpamunanuṃḍu saṃsāramu - kāraṇāvasthalōnuṃḍu saṃsāramu) - (cūḍumu – ‘saṃsāramu’)

  1. acētana prakṛtirūpaḥ, asphuṭaṃ.

(cētanatvamu lēni prakṛtirūpamu - spaṣṭamugā uṃḍanidi. (prakṛti jaḍamu -

“nikṛṣṭēyaṃ prakṛtirmalinā (a) nṛtā |

saṃsārabaṃdharūpatvāt parārthatvā jjaḍatvataḥ ||“. (gītābhāva prakāśamu - 7 - 34)

(aparāprakṛti malinamainadi, asatyamainadi, eṃducētananagā, saṃsāramulō baṃdhiṃcunadi, jaḍasvabhāvamukaladi). ī jaḍaprakṛtitō bhagavaṃtuḍutana cicchaktitō kalisina prakṛti caitanyavaṃtamai sṛṣṭi cēyagalugucunnadi - idiyē prakṛti puruṣa saṃ yōgamu - sṛṣṭikāraṇamu. (Matter is inert. It does not move or do anything unless activated by an external force) Creation is going on due to the combination of matter and Energy.

  1. kāraṇaṃ (kāryaprapaṃcamunaku kāraṇamainadi).

“mayādhyakṣēṇa prakṛtiḥ sūyatē sacarā caraṃ” (śrīmadbhagavadgīta- 9 - 10)

(nā cicchaktini aṃḍagā tīsukoni ī prakṛti carācararūpamaina jagattunu sṛṣṭiṃcucunnadi).

“avyaktādhvyaktayaḥ sarvāḥ prabhavaṃtyaharāgamē |

rātryāgamē pralīyaṃtē tatraivā vyaktasaṃjñikē ||“. (śrīmadbhagavadgīta - 8 - 18)

(ikkaḍa avyaktamanagā caturmukha brahma ani arthamu - avyaktamani ceppabaḍu caturmukhabrahmaku pagalu sahasra yugamulu, rātri sahasrayugamulu - atani pagaṭikālamulō sṛṣṭirūpamulō puṭṭavalasinavanniyu, aṃtakumuṃdu avyaktamugā - kanabaḍakuṃḍā sūkṣmarūpamulō - unnavanniyu vyaktamagunu - kanabaḍunaṭlu agucunnavi - janma noṃduṭaku prāraṃbhamagucunnavi. idiyē sṛṣṭi prāraṃbhamu. ivanniyu ayanirātrikālamulō atanilōnē (avyaktamulōnē) līnamagucunnavi. nāmarūpamulu vadali prakṛtilō kalisipōvucunnavi.

“bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē |

rātryāgamē (a) vaśaḥ pārtha, prabhavatyaharāgamē ||“. (śrīmadbhagavadgīta - 8 - 19)

(pūrva kalpamulō carācararūpamaiana yē bhūtamulu uṃḍeḍivō avē marala marala caturmukhabrahma (avyaktamu) yokka pagaṭikālamaṃdu puṭṭi, rātri kālamaṃdu avyaktamaṃdē līnamagucunnavi. bhagavatsahāyamutō ī prakāramugā avyaktamu caturmukhabrahma anu pērugala prakṛti sṛṣṭi kaligiṃcucu, praḷayamunu kūḍā kaligiṃcucunnadi. ī prakāramugā sṛṣṭi, sṛṣṭi tarvāta praḷayamu, praḷayamu tarvāta sṛṣṭi, sṛṣṭi tarvāta maḷḷī praḷayamu - jarugucunēyuṃḍunu. idi pravāharūpamugā eppuḍū āgiyuṃḍanidi. praḷayamunaku sṛṣṭikini, sṛṣṭikini praḷayamunakunu madhya vyavadhiyuṃḍadu. aṃducētanē dīnini pravāharūpaṃlō nityamani ceppiyuṃḍiri - idiyē saṃsāramani ceppabaḍinadi - “samyak sarati iti saṃsāraḥ”-

(bāgugā jarugunadi, nirṇītamaina prakṛti pravartakamu (Natural Law) jarugucunnadi - aḍḍulēnidi).

ūgucunna ūyala kriṃdaku mīdaku pōvunaṭlu - It is a continuous process.

“satyalōkaṃbunaṃdunuṃḍu brahmaku jaturyuga sahasramulēga divamokkaṭiyagu, rātriyunu niṭlacanadhāta nidravō jagamulaḍaṃgu, mēlkonicūḍa marala lōkamulu puṭṭu - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 -)

(ī kalpaṃbunaṃduṃḍu dēvāsurādulu prati manvaṃtaraṃbaṃdunu niṭlu nāmarūpaṃbulacē nirdēśiṃpabaḍuduru)

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

  1. “prajāpatēḥ svapataḥ svapnāvastahā” (śrīśaṃkaraḥ)

(caturmukhabrahmayokka - prakṛtiyokka - svapnāvastha - rātrivēḷa - sṛṣṭi jaraganivēḷa ani arthamu).

“svapnāvastahā vidhērasya prōktē hā vyakti śabdataḥ |

vidhōḥ prabōdhasamayē svapāvasthātmanā stataḥ |

śarīraviṣayādyātma vyaktayō bhōga bhūmiyaḥ |

vyavahāra kṣamatvēna prabhavātyaharāgamē |

svāpakālē vidhē rātryāgamē tattraiva kāraṇē |

avyaktē saṃjñikē sarvālīyaṃtē vyakta yassadā ||“. (gītābhāvaprakāśamu - 8 - 106 to 109)

(praḷayakālamaṃdu avyaktamulō kalisi līnamaipōyinavi, caturmukha brahma yokka pagalu prāraṃbhamainapuḍu, śarīramulu viṣayamulu sūkṣmarūpamulōnunnavi, sthūlarūpamunu poṃdi vyavahariṃcuṭaku samarthata kaligiyunnavai vyaktamai paiki sṛṣṭiṃcabaḍinaṭlu, vaccucunnavi).

  1. kārya dēhādi varjitaṃ.

(dēhamu modalagu kāryavastuvulu lēnidi - dīnilō unaṃdaṃtā kāraṇarūpamēkanuka).

  1. “avyaktāvasthā viśēṣaṃ caturmukha dēhaḥ” (śrīrāmānujaḥ)

(vyaktamugāni avastha - sthiti - lō nunnadē caturmukhabrahmayokka dēhamu).

  1. guṇatraya vaiṣamyasya anaṃtara pūrvāvasthā, guṇa sāmyaṃ, guṇasāmyalakṣaṇaṃ avyaktaṃ.

(satvarajastamōguṇamulu vēru vērugākamuṃdu unna avastha. ī triguṇamulu samānamugā kalisiyunnasthiti - ī triguṇamulu vēru vērugākamuṃdu, vērai marala ākharuna samānamugā kalisiyuṃḍusthiti).

(icchā, jñāna, kriyalu anu mūḍu śaktulu ēkamai yuṃḍunappaṭi śakti)

  1. mahadādi tatvaṃ. (mahattatvamu modalagu tatvamularūpamu tānē ayinadi).

  2. bhūtāni pralīyaṃtē yasmin tadavyaktaṃ.

(praḷayakālamaṃdu bhūtamulanniyu dēnilō līmagunō - layamaipōvunō, kalisipōvunō - adi avyaktamu.

“sarva bhūtāni kauṃtēya prakṛtiṃ yāṃti māmikāṃ |” (śrīmadbhagavadgīta - 9 - 7)

(arjunā ! samasta bhūtamulu nā prakṛtilōnē kalisipōvucunnavi).

“dhṛti bhūni kālacōditamu, navyaktaṃbu, brakṛtiyunanupēḷḷabaragu māya |

valana mahattatvamelamibuṭṭiṃce - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 201)

(avyaktamu, prakṛti, māya anunavi okaṭē. idi kālacōditamu - kālakramēṇa mārpu ceṃdunadi. dīnilō bhagavaṃtuḍu tana cicchaktitō pravēśiṃci dānini caitanyavaṃtamugā cēyagā dānilōnuṃḍi mahattattvavamu puṭṭenu).

“ka. kramamuna driguṇamu navya

ktamu, nityamu, sadasadātmakamu maṟiya bradhā

namunanagā brakṛti viśē

ṣamuladiyu viśiṣṭamaniri sadvidulelamin “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 887)

  1. - akṣaraṃ; avināśi.(kṣīṇiṃcanidi; nāśamu lēnidi).

  2. “sarva bhūtānāṃ kāraṇamakāraṇaṃ, satvarajastamō lakṣaṇamaṣṭa rūpamakhilasya jagatsaṃbhavahētu ravyaktaṃ nāma. tadēkaṃ bahūnāṃ kṣētrajñānā madhiṣṭhānaṃ, samudramidau dakānāṃ”.

(sarvabhūtamulaku kāraṇamainadi avyaktamu - avyaktamu maṭṭuku kāraṇamulēnidi; adi dēnilōnuṃḍiyu puṭṭalēdu. ellapuḍu bhagavaṃtuni āśrayiṃcukoni yuṃḍunadi. aṃducēta bhagavaṃtunivale avyaktamukūḍa anādiyē. satvarajastamamulanu triguṇamulu lakṣaṇamugā galadi ; enimidirūpamulu kaladi –

“bhūmirāpō analō vāyuḥ khaṃ manō buddhirēva ca |

ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛtiraṣṭathā ||“. (śrīmadbhagavadgīta - 7 - 4)

(bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu anu paṃcabūtamulu, manassu, buddhi, ahaṃkāramu anu enimidi vidhamulugā prakṛti - anagā avyaktamu - unnadi. samasta jagattunaku idiyē kāraṇamu –

“māyādhyakṣēṇaprakṛtiḥ sūyatē sa carācaraṃ |” (śrīmadbhagavadgīta - 9 - 10)

(nēnu adhyakṣuḍugānuṃdunu - sarvamunu vīkṣiṃcucuṃdunu (Superintendent ).

“mayādṛṅātma rūpēṇādhyakṣēṇa vikriyātmanā niyaṃtrā prakṛtirmāyā bhāsakēnāpa bhāsitā |

satvādhibhira nirvācyōtpādayatyakhilaṃ. jagat |” (gītābhāvaprakāśamu - 9 - 71 to 72)

nēnu niyaṃtanu - anniṃṭini nā ājñacēnaḍacunaṭlu cēyuvāḍanu. nāvalla - nā cicchakticēta śaktivaṃtamugā cēyabaḍina anirvācyamaina nāmāya - prakṛti samasta jagattunu kanucunnadi. puṭṭiṃcucunnadi).jalamulanniṃṭiki samudramu adhiṣṭhānamainaṭlu sakala kṣētrajñulaku - jīvulaku, jīvātmalaku adhiṣṭhānamainadi).

  1. “mahataḥ paramavyakta mavyaktātpuruṣaḥ paraḥ |” (kaṭhōpaniṣattu - 1 - 3 - 4)

(avyaktamunuṃḍi mahattattvamu puṭṭinadi; kanuka mahattattvamukanna avyaktamu sūkṣmamu, utkṛṣṭamu. avyaktamukanna puruṣuḍu - bhagavaṃtuḍu utkṛṣṭamaianavāḍu, sūkṣmuḍu).

  1. “paramēśvarādhīnā tviyamasmābhiḥ prāgavasthā jagatō (a) bhyupagamyatē, sasvataṃtrā - - - nahitayā vinā paramēśvarasya sraṣṭṛtvaṃ siddhyati, śakti rahitasya tasya pravṛttyanupa pattēḥ” (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 - 4 - 3)

(paramēśvaruni ādhīnamulō unna ī avyaktamu prapaṃcakamu puṭṭukamuṃdunuṃḍu avasthayani mā abhiprāyamu. adi svataṃtramainadi kādu - avilēnidī paramēśvaruḍu sṛṣṭicēyuṭa siddhiṃcadu - svataḥ śaktilēnidāniki pravṛtti lēkuṃḍuṭacēta).

  1. prākṛta pralayē grasta samasta vyasta prapaṃcā svapratiṣṭē niṣkalē līnā yāvatprāṇi karma paripākaṃ vartatē. prāṇi karmabhiśca tasyāṃ māyā yāṃ vilīnērēva kramēṇaprāpta paripākaiḥ svaphaladānāya pramēśvarasya sisṛkṣmātmikā māyā vṛttirjanyatē. saiṣāmāyāvasthā īkṣaṇa, kāma, tapō,vicikīrṣādi śabdaiḥabhidhīyatē. sā avasthā vicikīrṣa śabdēna prapaṃcasārē varṇitaḥ –

” vicikīrṣurghanī bhūtā kvacidabhyēti ciṃdutāṃ” iti.

aparipakva karmā vibhāgāt ghanībhāvaḥ tadartha vyāpārō vicikīrṣāparipakva karmākāra pariṇata māyā viśiṣṭaṃ biṃduḥ. tadi dama vibhāgāvastha mavyaktamucyatē. ata ēva tasya utpattiḥ smaryatē - “tasmādavyaktamutpannaṃ triguṇaṃ, dvijasattama” iti sa ēva jagadaṃ kurākāraḥ adhyātmaṃ ca ādhārā dānādibhiḥ vyajyamānaḥ kuṃḍalyādi śabdai rucyatē. (dīni arthamunaku - cūḍumu - ‘ōṃkāramu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.