(చతుర్ముఖ బ్రహ్మ, హిరణ్యగర్భుడు, అను పేర్లుగలది అవ్యక్తము లేక ప్రకృతి. దానికన్న పరుడు, ఉత్కృష్టమైనవాడు, సూక్ష్మమైనవాడు, దానికి పైదగు తత్వము అయినవాడు, పరమాత్మ. సర్వకారణమైన అవ్యక్తముకన్న, మహత్తత్త్వముకన్న సూక్ష్మతరము, ఉత్కృష్టమైనవాడు పైతత్వమైనవాడు, ప్రపంచమంతటిలోను పూర్తిగా నిండియుడుటవలన పురుషుడైనవాడు, సమస్తభూతములు నశించినప్పటికీ తాను నశించనివాడు).
(అవ్యక్తమనగా జగత్తు అంతటికీ విత్తనము అయినది, నామరూపములతో వ్యాపించు సత్తా కలిగియున్నది, సమస్తమైన కారణకార్యముల శక్తి సమాహార రూపమైనది, ఆకాశము మొదలగువాటి రూపములో వ్యాపించని స్థితిలో నున్నది, బట్టలోని పొడుగు, పేకవలె పరబ్రహ్మను ఆశ్రయించియున్నది, (వటవృక్షముయొక్క శక్తి దాని విత్తనములో ఇమిడియున్నట్లు - అట్టి అవ్యక్తముకంటె ఉత్కృష్టమైనది, అన్నింటికి కారణమైనదగుటవలన, అన్నింటికంటె సూక్ష్మమైనది, ప్రత్యగాత్మ అయినది పరబ్రహ్మ, ప్రపంచమంతటిలోను పూర్తిగా నిండియుండుటవలన పురుషుడు అని చెప్పబడుచున్నాడు). (చూడుము - అవ్యక్తం).
(caturmukha brahma, hiraṇyagarbhuḍu, anu pērlugaladi avyaktamu lēka prakṛti. dānikanna paruḍu, utkṛṣṭamainavāḍu, sūkṣmamainavāḍu, dāniki paidagu tatvamu ayinavāḍu, paramātma. sarvakāraṇamaina avyaktamukanna, mahattattvamukanna sūkṣmataramu, utkṛṣṭamainavāḍu paitatvamainavāḍu, prapaṃcamaṃtaṭilōnu pūrtigā niṃḍiyuḍuṭavalana puruṣuḍainavāḍu, samastabhūtamulu naśiṃcinappaṭikī tānu naśiṃcanivāḍu).
(avyaktamanagā jagattu aṃtaṭikī vittanamu ayinadi, nāmarūpamulatō vyāpiṃcu sattā kaligiyunnadi, samastamaina kāraṇakāryamula śakti samāhāra rūpamainadi, ākāśamu modalaguvāṭi rūpamulō vyāpiṃcani sthitilō nunnadi, baṭṭalōni poḍugu, pēkavale parabrahmanu āśrayiṃciyunnadi, (vaṭavṛkṣamuyokka śakti dāni vittanamulō imiḍiyunnaṭlu - aṭṭi avyaktamukaṃṭe utkṛṣṭamainadi, anniṃṭiki kāraṇamainadaguṭavalana, anniṃṭikaṃṭe sūkṣmamainadi, pratyagātma ayinadi parabrahma, prapaṃcamaṃtaṭilōnu pūrtigā niṃḍiyuṃḍuṭavalana puruṣuḍu ani ceppabaḍucunnāḍu). (cūḍumu - avyaktaṃ).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.