← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యక్తోపాసన avyaktōpāsana

Original — తెలుగు

“యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |

సర్వత్రగమచింత్యం చ, కూటస్థమచలంధ్రువం |

సం నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః |

తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః |

క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం |

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 12 - 3, 4, 5)

(అవ్యక్తమనగా వ్యక్తముకానిది, కంటికి కనబడనిది. పరమాత్మ అవ్యక్తము - అసలు ;ఏకపోవుటచేత కనబడకపోవుటకాదు. “అతి సూక్ష్మత్వాత్ అవ్యక్తం” - (మిక్కిలి చిన్నదగుటవలన అవ్యక్తము - ఎంత చిన్నది అనగా “అణోరణేఏయాన్” (అణువుకన్న అణువు). సృష్టిలో ఉన్న వస్తువులన్నింటిలోను పరమాణువు చిన్నది - పరమాణువులోకూడ పరమాత్మ ప్రవేశించియున్నందున దానికంటె చిన్నది. అంత చిన్న వస్తువును చూచుటకు మనకంటికి శక్తి చాలదు. పరమాత్మ అక్షరుడు, నాశము లేనివాడు, మూడుకాలములందు ఉండువాడు. ఇట్టివాడు అని నిర్దేశించి చెప్పుటకు వీలులేనివాడు, సృష్టిలోనున్న సమస్త వస్తువులలో ప్రవేశించియున్నవాడు. ఎట్టి వాడో అని ఆలోచించి చెప్పుటకుకూడ వీలులేనివాడు. కూటమువలె సర్వకాలములందు, సర్వ వస్తువులందు ఒకే రీతిగ ఉండువాడు. అన్ని వస్తువులు తానే అయినవాడు. స్థిరముగా నిత్యము ఉండువాడు. ఇటువంటి లక్షణములుగలవాడు ఎట్లుండునో తెలియని పరమాత్మను ఇంద్రియములను జయించి, సమస్త వస్తువులలోను భగవంతుడు ఉండుటవలన, అన్నివస్తువలయడల ఇది గొప్పది ఇది నీచమైనది యను విచక్షణలేక ఒకే విధమైన దృష్టి కలిగియుండి, సమస్త భూతములకు హితమునే కోరువాడు. అట్టి పరమాత్మను ఉపాసించిన పరమాత్మనే చేరగలడు - ముక్తిని పొందగలడు - కాని ఇట్టి అవ్యక్త పరబ్రహ్మను ఉపాసించుట - అనగా, నిరాకార, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మను ఉపాసించుట - చాల కష్టమైన పని. అట్టివారు చాల కష్టములు పడవలసియుండును.

అట్టివారు యోగాభ్యాసము చేసి, ఎండనక, వాన యనక, ద్వంద్వములను సహించియుండవలయును. ఇది ఆయాసకరమైన పద్ధతి, మోక్షపద్ధతి. ఇటువంటి కష్టములతోకూడియున్న అవ్యక్తోపాసనకాక మోక్షమునకు మార్గము కలదు. అది సులభమైనది, అదియే భక్తిమార్గము - ఈ సులభమైన భక్తిమార్గమును బట్టి చూచిన అవ్యక్తో పాసన కష్టతరమైనది).(చూడుము - ‘ఉపాసన’, ‘నిర్గుణ బ్రహ్మోపాసన’).

  1. అవ్యక్తోపాసన ద్వారకో మత్ప్రాప్తిమార్గః - దుఃఖం అవాస్యతే - అతిసయేన ఉపాసనం - సర్వేంద్రియాతి నియమన, సర్వ సమబుద్ధి, సర్వభూతేరతత్వాతి సుష్ట్వాచార సమ్యగ్విష్ణు భక్త్యాది సాధన సందర్భం ఋతే న అవ్యక్తా పరోక్షం, తద్రుతేచ న విష్ణుప్రసాదః, సత్య పి తస్మిన్ న సమ్యగ్భగవదుపాసనం ఋతే వర్తేచ తం మోక్షః - వినా అవ్యక్తోపాసనం భవత్యేవ భగవదుపాసనకానాం మోక్షః - ఇతి క్లేశిష్టో అయం మార్గః.

(అవ్యక్తోపాసన ద్వారా భగవంతుని చేరు మార్గము - భగవంతుడు ప్రాప్తించుమార్గము - సమస్తమైన ఇంద్రియములను తన వశములోనుంచుకొనుట, అన్నింటియందు సమమైన బుద్ధి కలిగి యుండుట, సర్వభూతములందు రతి కలిగియుండుట, సుష్టుల ఆచారము - మొదలగునవి గాఢమైన విష్ణుభక్తి మొదలగు సాధనములు లేనిదే అవ్యక్తోపాసన కుదరదు - అవి లేనిదే శ్రీమహావిష్ణువు ప్రసన్నుడుకాడు, విష్ణువు ప్రసాదము కలిగినను భగవదుపాసనలేనిదే మోక్షములేదు - అందుచేత ఈ అవ్యక్తోపాసన కష్టతరమైనది).

Transliteration

“yē tvakṣaramanirdēśyamavyaktaṃ paryupāsatē |

sarvatragamaciṃtyaṃ ca, kūṭasthamacalaṃdhruvaṃ |

saṃ niyamyēṃdriya grāmaṃ sarvatra samabuddhayaḥ |

tē prāpnuvaṃti māmēva sarvabhūtahitē ratāḥ |

klēśō adhikatarastēṣāṃ avyaktāsakta cētasāṃ |

avyaktā hi gatirduḥkhaṃ dēhavadbhiravāpyatē ||“. (śrīmadbhagavadgīta - 12 - 3, 4, 5)

(avyaktamanagā vyaktamukānidi, kaṃṭiki kanabaḍanidi. paramātma avyaktamu - asalu ;ēkapōvuṭacēta kanabaḍakapōvuṭakādu. “ati sūkṣmatvāt avyaktaṃ” - (mikkili cinnadaguṭavalana avyaktamu - eṃta cinnadi anagā “aṇōraṇēēyān” (aṇuvukanna aṇuvu). sṛṣṭilō unna vastuvulanniṃṭilōnu paramāṇuvu cinnadi - paramāṇuvulōkūḍa paramātma pravēśiṃciyunnaṃduna dānikaṃṭe cinnadi. aṃta cinna vastuvunu cūcuṭaku manakaṃṭiki śakti cāladu. paramātma akṣaruḍu, nāśamu lēnivāḍu, mūḍukālamulaṃdu uṃḍuvāḍu. iṭṭivāḍu ani nirdēśiṃci ceppuṭaku vīlulēnivāḍu, sṛṣṭilōnunna samasta vastuvulalō pravēśiṃciyunnavāḍu. eṭṭi vāḍō ani ālōciṃci ceppuṭakukūḍa vīlulēnivāḍu. kūṭamuvale sarvakālamulaṃdu, sarva vastuvulaṃdu okē rītiga uṃḍuvāḍu. anni vastuvulu tānē ayinavāḍu. sthiramugā nityamu uṃḍuvāḍu. iṭuvaṃṭi lakṣaṇamulugalavāḍu eṭluṃḍunō teliyani paramātmanu iṃdriyamulanu jayiṃci, samasta vastuvulalōnu bhagavaṃtuḍu uṃḍuṭavalana, annivastuvalayaḍala idi goppadi idi nīcamainadi yanu vicakṣaṇalēka okē vidhamaina dṛṣṭi kaligiyuṃḍi, samasta bhūtamulaku hitamunē kōruvāḍu. aṭṭi paramātmanu upāsiṃcina paramātmanē cēragalaḍu - muktini poṃdagalaḍu - kāni iṭṭi avyakta parabrahmanu upāsiṃcuṭa - anagā, nirākāra, nirguṇa, nirviśēṣa parabrahmanu upāsiṃcuṭa - cāla kaṣṭamaina pani. aṭṭivāru cāla kaṣṭamulu paḍavalasiyuṃḍunu.

aṭṭivāru yōgābhyāsamu cēsi, eṃḍanaka, vāna yanaka, dvaṃdvamulanu sahiṃciyuṃḍavalayunu. idi āyāsakaramaina paddhati, mōkṣapaddhati. iṭuvaṃṭi kaṣṭamulatōkūḍiyunna avyaktōpāsanakāka mōkṣamunaku mārgamu kaladu. adi sulabhamainadi, adiyē bhaktimārgamu - ī sulabhamaina bhaktimārgamunu baṭṭi cūcina avyaktō pāsana kaṣṭataramainadi).(cūḍumu - ‘upāsana’, ‘nirguṇa brahmōpāsana’).

  1. avyaktōpāsana dvārakō matprāptimārgaḥ - duḥkhaṃ avāsyatē - atisayēna upāsanaṃ - sarvēṃdriyāti niyamana, sarva samabuddhi, sarvabhūtēratatvāti suṣṭvācāra samyagviṣṇu bhaktyādi sādhana saṃdarbhaṃ ṛtē na avyaktā parōkṣaṃ, tadrutēca na viṣṇuprasādaḥ, satya pi tasmin na samyagbhagavadupāsanaṃ ṛtē vartēca taṃ mōkṣaḥ - vinā avyaktōpāsanaṃ bhavatyēva bhagavadupāsanakānāṃ mōkṣaḥ - iti klēśiṣṭō ayaṃ mārgaḥ.

(avyaktōpāsana dvārā bhagavaṃtuni cēru mārgamu - bhagavaṃtuḍu prāptiṃcumārgamu - samastamaina iṃdriyamulanu tana vaśamulōnuṃcukonuṭa, anniṃṭiyaṃdu samamaina buddhi kaligi yuṃḍuṭa, sarvabhūtamulaṃdu rati kaligiyuṃḍuṭa, suṣṭula ācāramu - modalagunavi gāḍhamaina viṣṇubhakti modalagu sādhanamulu lēnidē avyaktōpāsana kudaradu - avi lēnidē śrīmahāviṣṇuvu prasannuḍukāḍu, viṣṇuvu prasādamu kaliginanu bhagavadupāsanalēnidē mōkṣamulēdu - aṃducēta ī avyaktōpāsana kaṣṭataramainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.