(సమస్త భూతములకు - జన్మగల సమస్త వస్తువులకు - అవి పుట్టుటకు కారణము నేనే - మొట్ట మొదటి బీజము - విత్తనము - కారణము). (నాలో నుండి యే ఇవి అన్నియు, ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. ఇప్పుడు సృష్టిలోనున్న సమస్తవస్తువులలో నా సత్తా స్ఫూర్తిని - చిచ్ఛక్తిని - బీజములలో నుంచుచు, ఇట్లు ప్రతికల్పమునందును చేయుచున్నప్పటికీ తరగని చిచ్ఛక్తి ) - (బీజరూపములోనున్న చైతన్య శక్తి కలవాడను. అందుచేత నేను అవ్యయబీజమును. విత్తనమునుండి చెట్టు, చెట్టునుండి విత్తనము పుట్టుచూ, అందులో నా శక్తిని పరంపరగా అందచేయుచు, అనంతముగా వృద్ధి పొందుచున్నను - తరగని చిచ్ఛక్తిగలవాడను. అందుచేత అవ్యయ బీజమును).
(శ్రీకృష్ణభగవానుడు తనవిభూతులను చెప్పుచూ ఈ ప్రపంచమునకుతానే అవ్యయబీజమని చెప్పియున్నాడు).
(సృష్టి మొదటిలో నొకదానిని (ప్రకృతిని) పుట్టించి, దానిలో తానుండి, దానినుండి మఱికొన్నిటిని పుట్టించుచు, వాటి అన్నింటి లోను - ప్రతిదానిలోను, తాను బీజరూపములోనుండి, మఱికొన్ని వస్తువులను పుట్టించుచున్నాడు - ఇట్లు వేలకొలది వస్తువులను పుట్టించుచున్నాను. తన బీజ శక్తి తరగనిది - అందుచేత అవ్యయబీజము అయినవాడు).
(samasta bhūtamulaku - janmagala samasta vastuvulaku - avi puṭṭuṭaku kāraṇamu nēnē - moṭṭa modaṭi bījamu - vittanamu - kāraṇamu). (nālō nuṃḍi yē ivi anniyu, okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. ippuḍu sṛṣṭilōnunna samastavastuvulalō nā sattā sphūrtini - cicchaktini - bījamulalō nuṃcucu, iṭlu pratikalpamunaṃdunu cēyucunnappaṭikī taragani cicchakti ) - (bījarūpamulōnunna caitanya śakti kalavāḍanu. aṃducēta nēnu avyayabījamunu. vittanamunuṃḍi ceṭṭu, ceṭṭunuṃḍi vittanamu puṭṭucū, aṃdulō nā śaktini paraṃparagā aṃdacēyucu, anaṃtamugā vṛddhi poṃducunnanu - taragani cicchaktigalavāḍanu. aṃducēta avyaya bījamunu).
(śrīkṛṣṇabhagavānuḍu tanavibhūtulanu ceppucū ī prapaṃcamunakutānē avyayabījamani ceppiyunnāḍu).
(sṛṣṭi modaṭilō nokadānini (prakṛtini) puṭṭiṃci, dānilō tānuṃḍi, dāninuṃḍi maṟikonniṭini puṭṭiṃcucu, vāṭi anniṃṭi lōnu - pratidānilōnu, tānu bījarūpamulōnuṃḍi, maṟikonni vastuvulanu puṭṭiṃcucunnāḍu - iṭlu vēlakoladi vastuvulanu puṭṭiṃcucunnānu. tana bīja śakti taraganidi - aṃducēta avyayabījamu ayinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.