← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యయం avyayaṃ

Original — తెలుగు
  1. నాశరహితం. (నాశము లేనిది).

  2. “సంసార వృక్షః అశ్వత్థం, అసంగహేతు భూతాత్, అసమ్యక్ జ్ఞానో దయాత్ ప్రవాహరూపేణ, అచ్ఛేద్యత్వేన అవ్యయత్వం”

(శ్రీరామానుజః)

(సమ్యక్ జ్ఞానము లేకపోవుటవలన ప్రవాహరూపముగలదగుటచేత తెగనిది - ఎడతెగని ప్రవాహమగుటచేత - ఈ సంసారమును - సృష్టి, స్థితి రూపమైన ప్రపంచము - జన్మ, స్థితి. మరణములుగల జీవుల జీవయాత్ర - అవ్యయమైనది).

  1. “సంసారః మాయాః అనాదికాల ప్రవృత్తత్వాత్ సో (అ)యం సంసార వృక్షః అవ్యయః; అనాద్యనంత దేహాది సంతానాశ్రయః”

(శ్రీశంకరః)

(మాయామూలముగా అనాదికాలమునుండి ఉన్నదగుటచేత ఈ సంసారవృక్షము అవ్యయము - తరుగులేనిది, క్షీణించనిది, అంతములేనిది. ఆది - మొదలు - లేదు కనుక అంతములేనిది - అంతము తెలియనిది - అందుచేత అవ్యయము).

  1. న ప్రవాహ వ్యయః - పూర్వ బ్రహ్మకాలే యధా స్థితిః తధా సర్వత్రాపి ఇత్య వ్యయతా.

(ఈ ప్రవాహ రూపమైన సంసారమునకు - సృష్టి, స్థితి, లయములకు - వ్యయమన్నదిలేదు; తగ్గుట, క్షీణించి నశించిపోవుట లేదు - పూర్వకల్పమందు ఏ ప్రకారముగానుండెనో ఈ కల్పమునందుకూడ ఆ ప్రకారముగానే జరుగుచుండును - అందుచేత అవ్యయత్వము. “ధాతా యథా పూర్వమకల్పయత్ - దివంచ, పృధ్వించాంతరిక్షం”.

(పూర్వకల్పములో వలెనే చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని చేసెను - (దేవలోకము, భూమి, ఆకాశము మొదలగువాటిని పూర్వపుసృష్టిలోవలెనే ఈ సృష్టిలోకూడ చేసెను - ఇచ్చట కొన్ని వస్తువులే చెప్పినను అన్నింటినీ చెప్పినట్లే భావించవలెను).

“ఊర్ధ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం |

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 1)

(సంసారమనునది అశ్వత్థవృక్షమువంటిది; క్షణభంగురము, రేపటివరకు ఉండునది నమ్మకము చాలనిది. కాని, పుట్టుట, చనిపోవుట, మఱలమఱలపుట్టుట మఱలమఱలచనిపోవుట - ఈ ప్రకారముగా ఇది యొక ప్రవాహము - ఇది ఎప్పటికీ అంతములేనిది, ఈ ప్రవాహము ఇప్పటితో అంతమవుతుందని,మఱిచావుపుట్టుకలు ఉండవు అనునది లేదు –

“పునరపిజననం, పునరపిమరణం, పునరపి జననీజఠరే శయనం| ఇవ సంసారే - - - ||”. (భజగోవిందం)

అందుచేత ఏ జన్మకాజన్మ అంతమైపోయినప్పటికీ తిరిగి జన్మలు కలుగుచుండడమువల్ల ఇది ప్రవాహరూపములో ఎప్పటికినీ ఉండవలసినదే. అందుచేత ప్రవాహరూపములో ఇది అంతములేనిది, తరగనిది, అందుచేత అవ్యయము).

  1. (ఈ అశ్వత్ధరూపముతో పోల్చబడిన ఈ సంసారమును అవ్యయమనిరి - దాని వేళ్ళు మీదని ఉన్నవి - భగవంతుడు, ఈ సృష్టి.స్థితి,లయములను కలుగచేయువాడు - ఈ సంసారము అను వృక్షమునకు కొమ్మలు క్రిందకు పెరిగినవి - అదియే మహత్తత్వము మొదలగునవి, దాని ఆకులు చంధస్సులు - అనగా భగవంతునిలోనుండిపుట్టి క్రిందకు లోకములలో అనేకరూపములుగా వ్యాపించినవి) (చూడు,ము - ‘అశ్వత్ధము’. ‘సంసారము’).

  2. ఈ జననమరణరూపమైన సంసారము ప్రాణులకేకాక నక్షత్ర, గ్రహ, తారా చంద్రులకు, ఇతరవస్తువులకు కూడ వర్తించును - “ఆ బ్రహ్మ భువనా ల్లోకాః పునరావర్తినో అర్జున |”. (శ్రీమద్భగవద్గీత - 8 - 16)

(బ్రహ్మలోకము మొదలు అన్నిలోకములు - లోకములలో ఉన్న వస్తువులన్నియు - తిరిగి పుట్టవలసినవే).

  1. “న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న సం ప్రతిస్టా |”. (శ్రీమద్భగవద్గీత - 15 - 3)

ఈ అశ్వత్ధరూపముతో పోల్చబడిన సంసారమునకు - సృష్టికీఅదికాని అంతముకాని లేదు. అంతములేదుకనుక అవ్యయము - రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, మరల రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, ఏ రెండింటికైనను మధ్యను వ్యవధిలేకయే వచ్చినట్లు ఈ సంసారము అవ్యయము - (చూడుము - ‘సంసారము’, ‘సృష్టి’).

Transliteration
  1. nāśarahitaṃ. (nāśamu lēnidi).

  2. “saṃsāra vṛkṣaḥ aśvatthaṃ, asaṃgahētu bhūtāt, asamyak jñānō dayāt pravāharūpēṇa, acchēdyatvēna avyayatvaṃ”

(śrīrāmānujaḥ)

(samyak jñānamu lēkapōvuṭavalana pravāharūpamugaladaguṭacēta teganidi - eḍategani pravāhamaguṭacēta - ī saṃsāramunu - sṛṣṭi, sthiti rūpamaina prapaṃcamu - janma, sthiti. maraṇamulugala jīvula jīvayātra - avyayamainadi).

  1. “saṃsāraḥ māyāḥ anādikāla pravṛttatvāt sō (a)yaṃ saṃsāra vṛkṣaḥ avyayaḥ; anādyanaṃta dēhādi saṃtānāśrayaḥ”

(śrīśaṃkaraḥ)

(māyāmūlamugā anādikālamunuṃḍi unnadaguṭacēta ī saṃsāravṛkṣamu avyayamu - tarugulēnidi, kṣīṇiṃcanidi, aṃtamulēnidi. ādi - modalu - lēdu kanuka aṃtamulēnidi - aṃtamu teliyanidi - aṃducēta avyayamu).

  1. na pravāha vyayaḥ - pūrva brahmakālē yadhā sthitiḥ tadhā sarvatrāpi itya vyayatā.

(ī pravāha rūpamaina saṃsāramunaku - sṛṣṭi, sthiti, layamulaku - vyayamannadilēdu; tagguṭa, kṣīṇiṃci naśiṃcipōvuṭa lēdu - pūrvakalpamaṃdu ē prakāramugānuṃḍenō ī kalpamunaṃdukūḍa ā prakāramugānē jarugucuṃḍunu - aṃducēta avyayatvamu. “dhātā yathā pūrvamakalpayat - divaṃca, pṛdhviṃcāṃtarikṣaṃ”.

(pūrvakalpamulō valenē caturmukha brahma sṛṣṭini cēsenu - (dēvalōkamu, bhūmi, ākāśamu modalaguvāṭini pūrvapusṛṣṭilōvalenē ī sṛṣṭilōkūḍa cēsenu - iccaṭa konni vastuvulē ceppinanu anniṃṭinī ceppinaṭlē bhāviṃcavalenu).

“ūrdhvamūlamadhaśśākhamaśvatthaṃ prāhuravyayaṃ |

chaṃdāṃsi yasya parṇāni yastaṃ vēda sa vēdavit ||“. (śrīmadbhagavadgīta - 15 - 1)

(saṃsāramanunadi aśvatthavṛkṣamuvaṃṭidi; kṣaṇabhaṃguramu, rēpaṭivaraku uṃḍunadi nammakamu cālanidi. kāni, puṭṭuṭa, canipōvuṭa, maṟalamaṟalapuṭṭuṭa maṟalamaṟalacanipōvuṭa - ī prakāramugā idi yoka pravāhamu - idi eppaṭikī aṃtamulēnidi, ī pravāhamu ippaṭitō aṃtamavutuṃdani,maṟicāvupuṭṭukalu uṃḍavu anunadi lēdu –

“punarapijananaṃ, punarapimaraṇaṃ, punarapi jananījaṭharē śayanaṃ| iva saṃsārē - - - ||”. (bhajagōviṃdaṃ)

aṃducēta ē janmakājanma aṃtamaipōyinappaṭikī tirigi janmalu kalugucuṃḍaḍamuvalla idi pravāharūpamulō eppaṭikinī uṃḍavalasinadē. aṃducēta pravāharūpamulō idi aṃtamulēnidi, taraganidi, aṃducēta avyayamu).

  1. (ī aśvatdharūpamutō pōlcabaḍina ī saṃsāramunu avyayamaniri - dāni vēḷḷu mīdani unnavi - bhagavaṃtuḍu, ī sṛṣṭi.sthiti,layamulanu kalugacēyuvāḍu - ī saṃsāramu anu vṛkṣamunaku kommalu kriṃdaku periginavi - adiyē mahattatvamu modalagunavi, dāni ākulu caṃdhassulu - anagā bhagavaṃtunilōnuṃḍipuṭṭi kriṃdaku lōkamulalō anēkarūpamulugā vyāpiṃcinavi) (cūḍu,mu - ‘aśvatdhamu’. ‘saṃsāramu’).

  2. ī jananamaraṇarūpamaina saṃsāramu prāṇulakēkāka nakṣatra, graha, tārā caṃdrulaku, itaravastuvulaku kūḍa vartiṃcunu - “ā brahma bhuvanā llōkāḥ punarāvartinō arjuna |”. (śrīmadbhagavadgīta - 8 - 16)

(brahmalōkamu modalu annilōkamulu - lōkamulalō unna vastuvulanniyu - tirigi puṭṭavalasinavē).

  1. “na rūpamasyēha tadōpalabhyatē nāṃtō na cādirna saṃ pratisṭā |”. (śrīmadbhagavadgīta - 15 - 3)

ī aśvatdharūpamutō pōlcabaḍina saṃsāramunaku - sṛṣṭikīadikāni aṃtamukāni lēdu. aṃtamulēdukanuka avyayamu - rātri tarvāta pagalu, pagalu tarvāta rātri, marala rātri tarvāta pagalu, pagalu tarvāta rātri, ē reṃḍiṃṭikainanu madhyanu vyavadhilēkayē vaccinaṭlu ī saṃsāramu avyayamu - (cūḍumu - ‘saṃsāramu’, ‘sṛṣṭi’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.