← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యయపదం avyayapadaṃ

Original — తెలుగు
  1. నాశరహితమగు పదము, స్థానము, మోక్షము.

  2. అనవిచ్ఛన్న జ్ఞానాకారం ఆత్మానం యథావస్థితం పరిశుద్ధాత్మనః అసి పరమాత్మవత్ ప్రాప్యత్వాత్ పరత్వం.

(విచ్ఛిన్నముకాని - అపరిమితమైన - జ్ఞానమే ఆకారముగాగల ఆత్మ యథాతథాముగా ఉన్నస్థితి - పరిశుద్ధమైన మనస్సు - చిత్తశుద్ధిగలవానికి పరమాత్మను పొందునట్లుగనే భావించుటవల్ల పరమపదం - ఉత్కృష్టమైన పదము - స్థానము - వైకుంఠము, మోక్షస్థానము).

“సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |

మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పదమ వ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 56)

(సమస్త కర్మలను - చేయుచున్నప్పటికీ నన్నే ఆశ్రయించుకొనియున్నవాడు - నాభక్తుడైనవాడు - నా అనుగ్రహమువలన శాశ్వతమైన అవ్యయపదమైన వైకుంఠమును - మోక్షమును - పొందును). (భగవంతుడు అవ్యయుడు - కనుక అతని పదము - స్థానము - అవ్యయపదము - ఆ పదము తానేకనుక అది అవ్యయపదము).

(వైకుంఠుడే వైకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు).

“క. హరిసేవా ప్రియ వ్రతు

డరయగ కైవల్య పదవినందుట యరుదే

ధర జండాలుండైనను

హరినామస్మరణ జెందు నవ్యయపదమున్.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 23)

అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ దృఢేన చిత్త్వా |

తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా స నివర్తం తి భూయః |

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ |

నిర్మాణ మోహా జిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |

ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంగైర్గచ్ఛంత్య మూఢాః పదమ వ్యయం తత్ |

న తద్భాసయతే సూర్యో, న శశాంకో న పావకః |

యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ || (శ్రీమద్భగవద్గీత - 15 - 3 to 6)

(బాగా వేళ్ళునాటుకొనియున్న అశ్వత్థవృక్షమను పేరుగల ఈ సంసారమును, దేనియందును ఆసక్తి వదలుకొని యుండుట అను కత్తిచేత నఱికివేసి, మరల జన్మము పొందవలసిన అవసరము లేనటువంటి ఆ విష్ణువుయొక్క పరమపదమును గుఱించి అన్వేషింపవలయును - ప్రయత్నింపవలయును. ఎవనినుండి ఈ ప్రవాహరూపమైన సంసారము పుట్టినదో అట్టి ఆదిపురుషుని పొందవలెను - అభిమాన మోహములేనివారు, విషయములందాసక్తి వలన కలుగు దోషములు లేనివారు, అధ్యాత్మచింతనమునందే ఎల్లపుడునుండువారు, కోరికలు లేనివారును, ద్వంద్వములు - అనగా, శీతోష్ణములు, సుఖ దుఃఖములు మొదలగువాటిని లక్ష్యము చేయనివారును, అయిన జ్ఞానులు అవ్యయమైన ఆ విష్ణుపదమును - వైకుంఠమును, వైకుంఠుని - పొందుదురు - (వైకుంఠమే వైకుంఠుడు, వైకుంఠుడే వైకుంఠము). ఆ పరమపదమును సూర్యుని కిరణములు ప్రకాశింపచేయలేవు, చంద్రుడు ప్రకాశింప చేయలేవు, అగ్ని ప్రకాశింపచేయలేదు - ఆపదము జ్యోతిస్వరూపము - “జ్యోతిషామ పి తజ్జోతాః” (తేజోరూపములైనవాటికి తేజస్సు నిచ్చునది).

తేజోమయము - “యదాదిత్య గతం తేజః” - యచ్చంద్రమసిః - - - తత్తేజో విద్ధి మామకం –

(శ్రీ మద్భగవద్గీత- 15- 12) (ముండకోపనిషత్ - 2 - 210)

ఆ పదమును చేరినవారు తిరిగిరారు, తిరిగి జన్మింపరు. ఆ పరమపదము - ఆ మోక్షస్థానము, ఆ వైకుంఠము నాదే, అది నేనే).

Transliteration
  1. nāśarahitamagu padamu, sthānamu, mōkṣamu.

  2. anavicchanna jñānākāraṃ ātmānaṃ yathāvasthitaṃ pariśuddhātmanaḥ asi paramātmavat prāpyatvāt paratvaṃ.

(vicchinnamukāni - aparimitamaina - jñānamē ākāramugāgala ātma yathātathāmugā unnasthiti - pariśuddhamaina manassu - cittaśuddhigalavāniki paramātmanu poṃdunaṭluganē bhāviṃcuṭavalla paramapadaṃ - utkṛṣṭamaina padamu - sthānamu - vaikuṃṭhamu, mōkṣasthānamu).

“sarvakarmāṇyapi sadā kurvāṇō madvyapāśrayaḥ |

matprasādā davāpnōti śāśvataṃ padama vyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 56)

(samasta karmalanu - cēyucunnappaṭikī nannē āśrayiṃcukoniyunnavāḍu - nābhaktuḍainavāḍu - nā anugrahamuvalana śāśvatamaina avyayapadamaina vaikuṃṭhamunu - mōkṣamunu - poṃdunu). (bhagavaṃtuḍu avyayuḍu - kanuka atani padamu - sthānamu - avyayapadamu - ā padamu tānēkanuka adi avyayapadamu).

(vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu).

“ka. harisēvā priya vratu

ḍarayaga kaivalya padavinaṃduṭa yarudē

dhara jaṃḍāluṃḍainanu

harināmasmaraṇa jeṃdu navyayapadamun.” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 23)

aśvatthamēnaṃ suvirūḍhamūlamasaṃgaśastrēṇa dṛḍhēna cittvā |

tataḥ padaṃ tatparimārgitavyaṃ yasmin gatā sa nivartaṃ ti bhūyaḥ |

tamēva cādyaṃ puruṣaṃ prapadyē yataḥ pravṛttiḥ prasṛtā purāṇī |

nirmāṇa mōhā jita saṃgadōṣāḥ adhyātmanityā vinivṛttakāmāḥ |

dvaṃdvairvimuktāḥ sukhaduḥkha saṃgairgacchaṃtya mūḍhāḥ padama vyayaṃ tat |

na tadbhāsayatē sūryō, na śaśāṃkō na pāvakaḥ |

yadgatvā na nivartaṃtē taddhāma paramaṃ mama || (śrīmadbhagavadgīta - 15 - 3 to 6)

(bāgā vēḷḷunāṭukoniyunna aśvatthavṛkṣamanu pērugala ī saṃsāramunu, dēniyaṃdunu āsakti vadalukoni yuṃḍuṭa anu katticēta naṟikivēsi, marala janmamu poṃdavalasina avasaramu lēnaṭuvaṃṭi ā viṣṇuvuyokka paramapadamunu guṟiṃci anvēṣiṃpavalayunu - prayatniṃpavalayunu. evaninuṃḍi ī pravāharūpamaina saṃsāramu puṭṭinadō aṭṭi ādipuruṣuni poṃdavalenu - abhimāna mōhamulēnivāru, viṣayamulaṃdāsakti valana kalugu dōṣamulu lēnivāru, adhyātmaciṃtanamunaṃdē ellapuḍunuṃḍuvāru, kōrikalu lēnivārunu, dvaṃdvamulu - anagā, śītōṣṇamulu, sukha duḥkhamulu modalaguvāṭini lakṣyamu cēyanivārunu, ayina jñānulu avyayamaina ā viṣṇupadamunu - vaikuṃṭhamunu, vaikuṃṭhuni - poṃduduru - (vaikuṃṭhamē vaikuṃṭhuḍu, vaikuṃṭhuḍē vaikuṃṭhamu). ā paramapadamunu sūryuni kiraṇamulu prakāśiṃpacēyalēvu, caṃdruḍu prakāśiṃpa cēyalēvu, agni prakāśiṃpacēyalēdu - āpadamu jyōtisvarūpamu - “jyōtiṣāma pi tajjōtāḥ” (tējōrūpamulainavāṭiki tējassu niccunadi).

tējōmayamu - “yadāditya gataṃ tējaḥ” - yaccaṃdramasiḥ - - - tattējō viddhi māmakaṃ –

(śrī madbhagavadgīta- 15- 12) (muṃḍakōpaniṣat - 2 - 210)

ā padamunu cērinavāru tirigirāru, tirigi janmiṃparu. ā paramapadamu - ā mōkṣasthānamu, ā vaikuṃṭhamu nādē, adi nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.