← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అయజ్ఞము ayajñamu

Original — తెలుగు
  1. దైవము నుద్దేశించి, ఫలమునాశించక ద్రవ్యము మొదలగువాటిని యిచ్చుట యజ్ణమనబడుచున్నది, శ్రేయస్సాధకమైన వైదికకర్మ యజ్ఞము. యజ్ఞములు అనేక విధములుగా నున్నవి –

“ద్రవ్య యజ్ఞాస్తసో యజ్ఞాయోగయజ్ఞా స్తథాపరే |

స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః |

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే (అ) పానం తథాపరే |

ప్రాణాపానగతీ రుద్ధ్వా పాణాయామ పరాయణాః |

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |

సర్వే (అ) ప్యేతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాః |

యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం |

నాయం లోకో (అ) స్య యజ్ఞస్య కుతో అన్యః కురు సత్తమ ||.” (శ్రీమద్భగవద్గీత - 4 – 25 to 31)

(పైన చెప్పిన యజ్ఞములు కర్మ రూపములు - యజ్ఞములోని అంగములన్నియు పరబ్రహ్మమే అని భావించియీ యజ్ఞములు చేసి, యజ్ఞము చేయగా మిగిలినదానిని భుజించువారు పరబ్రహ్మమును పొందుదురు. ఈ యజ్ఞరూపమైన కర్మ చేయనివాడికి స్వల్ప సుఖమును కలుగచేయు ఈ లోకములేదు, సరేకదా, ఇతరలోకములెక్కడివి. ఇట్టియజ్ఞములు చేయనివాడు - అ యజ్ఞుడు.)

  1. ద్రవ్య యజ్ఞ ప్రభృతి ప్రాణాయామ పర్యం తానాం కర్మయోగభేదానాం యజ్ఞానాం ఏకోపి యజ్ఞః యస్య నాస్తి సః అ యజ్ఞః - తస్య అ యం లోకః నాస్తి, కుతః అన్యోలోకః, విశిష్ట సాధన సాధ్యః.

(శ్రీమద్భగవద్గీతలో 4 వ అధ్యాయములో ద్రవ్య యజ్ఞములు మొదలు ప్రాణాయామ యజ్ఞము వరకు చెప్ప బడిన యజ్ఞములు కర్మయోగములో భేదములు. వీటిలో ఏ ఒక్క యజ్ఞమైనను చేయనివాడు అ యజ్ఞుడు.వానికి ఈ లోకము - మనుష్యలోకము - లేదు, పై లోకములెక్కడివి ? అట్టివానికి ఈ లోకములోని సుఖము ఎక్కడిది ? ఇతరలోకములందు సుఖములు విశిష్టమైన - ప్రత్యేకమైన - గొప్ప సాధనములద్వారా సాధించగలుగునవి ఇట్టివానికి - అ యజ్ఞునకు - లభ్యముకావు.)

  1. మహా యజ్ఞాది పూర్వక నిత్య నైమిత్తిక కర్మ రహితస్య అయం ప్రాకృతం లోకః నాస్తి, ప్రాకృతలోక సంబంధి ధర్మార్థకామాఖ్యః పురుషార్థః న సిద్ధ్యతి, కుతః ఇతః అన్యోమోక్షాఖ్యః పురుషార్థః ?

(మహా యజ్ఞములు మొదలగు నిత్య నైమిత్తిక కర్మలను చేయనివానికి ఈ ప్రాకృత లోకమే లేదు - అనగా, ఈ ప్రాకృత లోకమునకు సంబంధించిన ధర్మార్థకామములను మూడువిధములగు పురుషార్థములు సిద్ధింపవు. ఈమూడింటికంటె ఇతరమైనది, ముఖ్యమైనది అయిన మోక్షము అను పరమపురుషార్థమువానికెక్కడిది ? లేదు అన్నమాట.)

Transliteration
  1. daivamu nuddēśiṃci, phalamunāśiṃcaka dravyamu modalaguvāṭini yiccuṭa yajṇamanabaḍucunnadi, śrēyassādhakamaina vaidikakarma yajñamu. yajñamulu anēka vidhamulugā nunnavi –

“dravya yajñāstasō yajñāyōgayajñā stathāparē |

svādhyāya jñāna yajñāśca yatayaḥ saṃśitavratāḥ |

apānē juhvati prāṇaṃ prāṇē (a) pānaṃ tathāparē |

prāṇāpānagatī ruddhvā pāṇāyāma parāyaṇāḥ |

aparē niyatāhārāḥ prāṇān prāṇēṣu juhvati |

sarvē (a) pyētē yajñavidō yajña kṣapita kalmaṣāḥ |

yajña śiṣṭāmṛta bhujō yāṃti brahma sanātanaṃ |

nāyaṃ lōkō (a) sya yajñasya kutō anyaḥ kuru sattama ||.” (śrīmadbhagavadgīta - 4 – 25 to 31)

(paina ceppina yajñamulu karma rūpamulu - yajñamulōni aṃgamulanniyu parabrahmamē ani bhāviṃciyī yajñamulu cēsi, yajñamu cēyagā migilinadānini bhujiṃcuvāru parabrahmamunu poṃduduru. ī yajñarūpamaina karma cēyanivāḍiki svalpa sukhamunu kalugacēyu ī lōkamulēdu, sarēkadā, itaralōkamulekkaḍivi. iṭṭiyajñamulu cēyanivāḍu - a yajñuḍu.)

  1. dravya yajña prabhṛti prāṇāyāma paryaṃ tānāṃ karmayōgabhēdānāṃ yajñānāṃ ēkōpi yajñaḥ yasya nāsti saḥ a yajñaḥ - tasya a yaṃ lōkaḥ nāsti, kutaḥ anyōlōkaḥ, viśiṣṭa sādhana sādhyaḥ.

(śrīmadbhagavadgītalō 4 va adhyāyamulō dravya yajñamulu modalu prāṇāyāma yajñamu varaku ceppa baḍina yajñamulu karmayōgamulō bhēdamulu. vīṭilō ē okka yajñamainanu cēyanivāḍu a yajñuḍu.vāniki ī lōkamu - manuṣyalōkamu - lēdu, pai lōkamulekkaḍivi ? aṭṭivāniki ī lōkamulōni sukhamu ekkaḍidi ? itaralōkamulaṃdu sukhamulu viśiṣṭamaina - pratyēkamaina - goppa sādhanamuladvārā sādhiṃcagalugunavi iṭṭivāniki - a yajñunaku - labhyamukāvu.)

  1. mahā yajñādi pūrvaka nitya naimittika karma rahitasya ayaṃ prākṛtaṃ lōkaḥ nāsti, prākṛtalōka saṃbaṃdhi dharmārthakāmākhyaḥ puruṣārthaḥ na siddhyati, kutaḥ itaḥ anyōmōkṣākhyaḥ puruṣārthaḥ ?

(mahā yajñamulu modalagu nitya naimittika karmalanu cēyanivāniki ī prākṛta lōkamē lēdu - anagā, ī prākṛta lōkamunaku saṃbaṃdhiṃcina dharmārthakāmamulanu mūḍuvidhamulagu puruṣārthamulu siddhiṃpavu. īmūḍiṃṭikaṃṭe itaramainadi, mukhyamainadi ayina mōkṣamu anu paramapuruṣārthamuvānikekkaḍidi ? lēdu annamāṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.