← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అయమాత్మాబ్రహ్మా ayamātmābrahmā

Original — తెలుగు
  1. ఉపనిషత్తులలో వేదాంతసారమును సంగ్రహముగా బోధించు నాలుగు మహా వాక్యములలో ఒకటి.

  2. ఇదం అధర్వవేదయ మాండూక్యోపనిషద్గతం మహావాక్యం.

(ఈ మహావాక్యము మాండూక్యోపనిషత్తులోనిది.)

  1. అయం బ్రహ్మాది స్తంబాంత ప్రాణినాం ‘అహమహం’ ఇతినిత్యా పరోక్షతయా భాసమాన ఆత్మైవ బ్రహ్మఇతి వాక్యార్థః.

(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబము వరకు గల సమస్త ప్రాణులలోను ‘నేను, నేను’ అని తనదగ్గరే, తనలోనే – దూరముగా కాక - స్ఫురించు ఆత్మయే - జీవాత్మయే - పరమాత్మ, పరబ్రహ్మ.)

(ఈ వాక్యములో ఆత్మ అని చెప్పబడినవాడు జీవుడు. బ్రహ్మ అను మాటచే చెప్పబడినవాడు పరబ్రహ్మ. “అయం ఆత్మా” అనుటవల్ల ఎక్కడోగాక, ప్రతిదేహమందు సన్నిహితముగానున్న ఆత్మయే పరమాత్మ, పరబ్రహ్మ అని తెలియపఱచడమైనది.)

  1. “స్వయంప్రకాశ పరోక్షత్వమయ మత్యుక్తితోమతం |

అహంకారాది దేహాంతాత్ప్రత్యగాత్మేతి గీయతే ||“.

(స్వర్గాదులవలె ఎక్కడోపరోక్షముగాకాక, ఘటము మొదలగువాటివలె దృశ్యపదార్థముగాకాక, ఉండునది ఆత్మ అని ‘అయమాత్మా’ అనుమాటలోని ఆత్మకు అర్థము - ఆత్మ అనుమాటకు అనేక అర్థములున్నవి - “ఆత్మా బ్రహ్మ, మనో, జీవ, శరీర, ధృతి, బుద్ధిషు”. అందుచేత ఈ వాక్యములోని ‘ఆత్మ’ అనుమాటకు అర్థము అహంకారము మొదలు దేహమువరకు గల పదార్థములకన్న వేరైనది, వాటి అన్నింటికీ సాక్షి అయినది అగు ఆత్మ - జీవాత్మ అని అర్థము - ఈ ప్రకారముగానే బ్రహ్మ అను మాటకు కూడ అనేక అర్థములు ఉన్నవి - బ్రాహ్మణుడని, వేదమనికూడ అర్థము ఉన్నది. ఈ మహావాక్యములోని బ్రహ్మ అను మాటకు పరబ్రహ్మ అనియే అర్థము. -

“దృశ్యమాసస్య సర్వస్య జగతస్తత్వమీర్యతే |

బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం ||“.

(ఈ కనబడుచున్న సమస్త ప్రపంచముయొక్క - తత్వమే బ్రహ్మ అనుమాటచేత చెప్పబడుచున్నది. ఆ బ్రహ్మ స్వయం ప్రకాశము.) ఈ శ్లోకములోచెప్పబడిన పరబ్రహ్మయే ఈమహావాక్యములో చెప్పబడిన బ్రహ్మ.)

  1. ఈ మహావాక్యము జీవబ్రహ్మలకు, జీవాత్మకు పరమాత్మకు - ఐక్యము, అభేదము చెప్పుచున్నది.

  2. “అయమాత్మా బ్రహ్మ” ఇత్యాది వాక్యం జ్ఞానోత్పత్తౌ కారణం.

(ఈ మహావాక్యము జ్ఞానోత్పత్తికి కారణము - జీవాత్మ పరమాత్మయే, అంతా పరమాత్మయే - ఈ జ్ఞానమును సూత్రప్రాయముగా వేదాంతసారము అయినదానిని చెప్పుచున్నది.)

Transliteration
  1. upaniṣattulalō vēdāṃtasāramunu saṃgrahamugā bōdhiṃcu nālugu mahā vākyamulalō okaṭi.

  2. idaṃ adharvavēdaya māṃḍūkyōpaniṣadgataṃ mahāvākyaṃ.

(ī mahāvākyamu māṃḍūkyōpaniṣattulōnidi.)

  1. ayaṃ brahmādi staṃbāṃta prāṇināṃ ‘ahamahaṃ’ itinityā parōkṣatayā bhāsamāna ātmaiva brahmaiti vākyārthaḥ.

(caturmukhabrahma modalu staṃbamu varaku gala samasta prāṇulalōnu ‘nēnu, nēnu’ ani tanadaggarē, tanalōnē – dūramugā kāka - sphuriṃcu ātmayē - jīvātmayē - paramātma, parabrahma.)

(ī vākyamulō ātma ani ceppabaḍinavāḍu jīvuḍu. brahma anu māṭacē ceppabaḍinavāḍu parabrahma. “ayaṃ ātmā” anuṭavalla ekkaḍōgāka, pratidēhamaṃdu sannihitamugānunna ātmayē paramātma, parabrahma ani teliyapaṟacaḍamainadi.)

  1. “svayaṃprakāśa parōkṣatvamaya matyuktitōmataṃ |

ahaṃkārādi dēhāṃtātpratyagātmēti gīyatē ||“.

(svargādulavale ekkaḍōparōkṣamugākāka, ghaṭamu modalaguvāṭivale dṛśyapadārthamugākāka, uṃḍunadi ātma ani ‘ayamātmā’ anumāṭalōni ātmaku arthamu - ātma anumāṭaku anēka arthamulunnavi - “ātmā brahma, manō, jīva, śarīra, dhṛti, buddhiṣu”. aṃducēta ī vākyamulōni ‘ātma’ anumāṭaku arthamu ahaṃkāramu modalu dēhamuvaraku gala padārthamulakanna vērainadi, vāṭi anniṃṭikī sākṣi ayinadi agu ātma - jīvātma ani arthamu - ī prakāramugānē brahma anu māṭaku kūḍa anēka arthamulu unnavi - brāhmaṇuḍani, vēdamanikūḍa arthamu unnadi. ī mahāvākyamulōni brahma anu māṭaku parabrahma aniyē arthamu. -

“dṛśyamāsasya sarvasya jagatastatvamīryatē |

brahmaśabdēna tadbrahma svaprakāśātma rūpakaṃ ||“.

(ī kanabaḍucunna samasta prapaṃcamuyokka - tatvamē brahma anumāṭacēta ceppabaḍucunnadi. ā brahma svayaṃ prakāśamu.) ī ślōkamulōceppabaḍina parabrahmayē īmahāvākyamulō ceppabaḍina brahma.)

  1. ī mahāvākyamu jīvabrahmalaku, jīvātmaku paramātmaku - aikyamu, abhēdamu ceppucunnadi.

  2. “ayamātmā brahma” ityādi vākyaṃ jñānōtpattau kāraṇaṃ.

(ī mahāvākyamu jñānōtpattiki kāraṇamu - jīvātma paramātmayē, aṃtā paramātmayē - ī jñānamunu sūtraprāyamugā vēdāṃtasāramu ayinadānini ceppucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.