(ఆరు నెలలకాలము - ఉత్తరా యణము, దక్షిణా యనము అను రెండు అయనములు కలిసిన కాలము - 12 నెలలు - ఒక సంవత్సరము.)
(సంవత్సరము అను పేరుగల కాలరూపుడైన ప్రజాపతియొక్క దక్షిణమార్గము, ఉత్తరమార్గము అను పేరుగలవి. సూర్యుడు సంచారముచేయు మార్గమునకు ఆథారమైనవి రెండు అయనములు - మార్గములుగలవు. ఇష్టాపూర్తము మొదలగు కర్మలు చేసిన పురుషులు చంద్రునకు సంబంధించిన లోకమును పొందుచున్నారు. వారే తిరిగి భూలోకమునకు వచ్చుచున్నారు - అనగా, మరల జన్మ ఎత్తుచున్నారు. ఆత్మోపాసకులు ఉత్తరాయణమార్గము ద్వారా వెళ్ళినవారు తిరిగి రారు.)
(ప్రజాపతి యొక్కమార్గములు రెండు - దక్షిణమార్గము, ఉత్తరమార్గము. అవి అ యనములని ప్రసిద్ధిగాంచినవి. ఒక్కొక్కటి ఆరుమాసములకాలము గలవి. ఈ దక్షిణాయన ఉత్తరాయణమార్గముల మీదుగా సూర్యుడు సంచరించును. జ్యేష్టమాసము మొదలుకొని దక్షిణాయనము, మార్గశిరమాసము మొదలుకొని ఉత్తరాయణము.)
గమనము; మార్గము - ఉత్తరాయణము, దక్షిణాయనము - సూర్యుడు సంచరించుమార్గము - వీటినే అర్చిరాదిమార్గము, ధూమాది మార్గమనిన్నీ;- లేక దేవయానము, పితృయానము అనిన్నీ అందురు.
పరమపదం (మోక్షము.)
(ఆత్మజ్ఞానము కలవాడు సంసారమువలన కలుగు శోకమును తరించును. మోక్షము కొఱకు మఱియొక మార్గములేదు, కనబడదు, తెలియదు) - “జ్ఞానాదేవతు కైవల్యం” (బ్రహ్మజ్ఞానము వలననే కైవల్యము - మోక్షము కలుగును - అని ఉన్నది కనుక)
(ఆ ఆత్మను ఈప్రకారముగా -మంత్రపుష్పములో చెప్పబడినరీతిగా తెలుసుకొనినవాడు ఇక్కడ ఈ లోకములో చావులేనివాడగును - జీవన్ముక్తుడగును మోక్షముకొఱకు ఇంకొకమార్గముకనబడలేదు - లేదు - తెలియదు.)
భగవత్ప్రాప్తి. (భగవంతుని చెందుట, అతనిలో లీనమగుట - అతనిలో ఐక్యమగుట.)
ఆశ్రయః -
(తనలోనుండి పుట్టిన సమస్తవస్తువులు తనకు ఆశయముగా - నివసించు స్థానముగా - గలవాడుభగవంతుడు - అందుచేతనే నారాయణుడు అని చెప్పబడుచున్నాడు - నరుడు అనగా నశించనివాడు. నరుడు లోనుండి పుట్టినవన్నియు నారములు - ప్రపంచములోని వస్తువులన్నియు నారములు. అవే అయనం - నివాసస్థలముగా గలవాడు కనుక నారాయణుడు - అయనమనగా మోక్షము అనికూడ అర్థము. తనలోనుండి పుట్టిన సమస్త వస్తువులకు మోక్షస్థానము -లయస్థానమైనవాడు భగవంతుడే) - (చూడుము - ‘నారాయణుడు’)
“వ. --- ఉత్పత్తి స్థితి లయంబు లెందు నగుచు బ్రకాశింపబడు నది యాశ్రయం బనంబడు. - - -”
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 10 - 268)
(āru nelalakālamu - uttarā yaṇamu, dakṣiṇā yanamu anu reṃḍu ayanamulu kalisina kālamu - 12 nelalu - oka saṃvatsaramu.)
(saṃvatsaramu anu pērugala kālarūpuḍaina prajāpatiyokka dakṣiṇamārgamu, uttaramārgamu anu pērugalavi. sūryuḍu saṃcāramucēyu mārgamunaku āthāramainavi reṃḍu ayanamulu - mārgamulugalavu. iṣṭāpūrtamu modalagu karmalu cēsina puruṣulu caṃdrunaku saṃbaṃdhiṃcina lōkamunu poṃducunnāru. vārē tirigi bhūlōkamunaku vaccucunnāru - anagā, marala janma ettucunnāru. ātmōpāsakulu uttarāyaṇamārgamu dvārā veḷḷinavāru tirigi rāru.)
(prajāpati yokkamārgamulu reṃḍu - dakṣiṇamārgamu, uttaramārgamu. avi a yanamulani prasiddhigāṃcinavi. okkokkaṭi ārumāsamulakālamu galavi. ī dakṣiṇāyana uttarāyaṇamārgamula mīdugā sūryuḍu saṃcariṃcunu. jyēṣṭamāsamu modalukoni dakṣiṇāyanamu, mārgaśiramāsamu modalukoni uttarāyaṇamu.)
gamanamu; mārgamu - uttarāyaṇamu, dakṣiṇāyanamu - sūryuḍu saṃcariṃcumārgamu - vīṭinē arcirādimārgamu, dhūmādi mārgamaninnī;- lēka dēvayānamu, pitṛyānamu aninnī aṃduru.
paramapadaṃ (mōkṣamu.)
(ātmajñānamu kalavāḍu saṃsāramuvalana kalugu śōkamunu tariṃcunu. mōkṣamu koṟaku maṟiyoka mārgamulēdu, kanabaḍadu, teliyadu) - “jñānādēvatu kaivalyaṃ” (brahmajñānamu valananē kaivalyamu - mōkṣamu kalugunu - ani unnadi kanuka)
(ā ātmanu īprakāramugā -maṃtrapuṣpamulō ceppabaḍinarītigā telusukoninavāḍu ikkaḍa ī lōkamulō cāvulēnivāḍagunu - jīvanmuktuḍagunu mōkṣamukoṟaku iṃkokamārgamukanabaḍalēdu - lēdu - teliyadu.)
bhagavatprāpti. (bhagavaṃtuni ceṃduṭa, atanilō līnamaguṭa - atanilō aikyamaguṭa.)
āśrayaḥ -
(tanalōnuṃḍi puṭṭina samastavastuvulu tanaku āśayamugā - nivasiṃcu sthānamugā - galavāḍubhagavaṃtuḍu - aṃducētanē nārāyaṇuḍu ani ceppabaḍucunnāḍu - naruḍu anagā naśiṃcanivāḍu. naruḍu lōnuṃḍi puṭṭinavanniyu nāramulu - prapaṃcamulōni vastuvulanniyu nāramulu. avē ayanaṃ - nivāsasthalamugā galavāḍu kanuka nārāyaṇuḍu - ayanamanagā mōkṣamu anikūḍa arthamu. tanalōnuṃḍi puṭṭina samasta vastuvulaku mōkṣasthānamu -layasthānamainavāḍu bhagavaṃtuḍē) - (cūḍumu - ‘nārāyaṇuḍu’)
“va. --- utpatti sthiti layaṃbu leṃdu nagucu brakāśiṃpabaḍu nadi yāśrayaṃ banaṃbaḍu. - - -”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 10 - 268)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.