(ఆదిలేనివాడు. జన్మ లేనివాడు, కారణము లేనివాడు - జన్మస్థానము లేనివాడు.)
“యో మామ జనునాదించవేత్తి లోక మహేశ్వరం |”.
(నా జన్మ దేవతులకుగాని, మహర్షులకుగాని తెలియదు. లోకమునకు ఈశ్వరుడనైన నన్ను జన్మలేనివానిగా, ఆది - కారణము - జన్మస్థానము - లేనివాడిగా ఎవరు తెలుసుకొందురో - -.)
(పరమార్థ దృష్టిలో సమస్త ప్రపంచమునకు ‘యోని’ - జన్మస్థానము కానివాడు- ఎందుచేతననగా : -
“మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే స చరాచరం” (శ్రీమద్భగవద్గీత- 9 - 10)
(భగవంతుడు తన చైతన్యశక్తితో - చిచ్ఛక్తితో - ప్రకృతిలో ప్రవేశించియున్నందున అతనిసత్తాస్ఫూర్తి చేత ప్రకృతి చరాచరరూపమైన సర్వజగత్తును సృష్టించుచున్నది. అందుచేత యదార్థముగా చూచినయడల భగవంతుడు ప్రపంచమునకు కారణముకాదు - యోనికాదు, జన్మస్థానముకాదు - అందుచేత “అ యోనిః” - యోని అయినవాడుకాడు - భగవంతుడు బీజము నిచ్చువాడు - బీజప్రదుడు - ప్రాణమునిచ్చువాడు - “బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థసనాతనం |” – (శ్రీమద్భగవద్గీత - 7 - 10)
(సమస్తభూతములకు - మొట్టమొదటి బీజము నేను.)
“మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం ద ధామ్యహం |
సంభవః సర్వభూతానాం తతో భవతిభారతి ||” (శ్రీమద్భగవద్గీత- 14 - 3)
(త్రిగుణాత్మికయగు ప్రకృతి - మహద్బ్రహ్మ - నా యోని. అందులో నేను నా బీజము నుంచి గర్భమును ధరింపచేయుదును – సమస్త భూతములు దాని వలన – దానిలో నుండి - పుట్టుచున్నవి. )
“సర్వ యోనిషి కౌంతేయ, మూర్తయః సంభవంతియాః |
తాసాం బ్రహ్మ మహద్బ్రహ్మ మహద్యోని రహం బీజః ప్రదః పితా ||“. (శ్రీమద్భగవద్గీత- 14 - 4)
(అనేక యోనులయందు అనేకరూపములు - మూర్తులు - పుట్టుచున్నవి. వాటికి అన్నింటికి మహద్బ్రహ్మ - ప్రకృతి - మహద్యోని - మూల యోని. ఆదియోని.వాటికి నేను బీజము నిచ్చువాడను, అందుచత వాటి అన్నింటికి తండ్రి - లోకపితా, ప్రకృతి లోకమాత -) -
“జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” - (జగత్తునకు తలిదండ్రు లైన పార్వతీపరమేశ్వరలు గుఱించి నమస్కరించుచున్నాను.)
(ādilēnivāḍu. janma lēnivāḍu, kāraṇamu lēnivāḍu - janmasthānamu lēnivāḍu.)
“yō māma janunādiṃcavētti lōka mahēśvaraṃ |”.
(nā janma dēvatulakugāni, maharṣulakugāni teliyadu. lōkamunaku īśvaruḍanaina nannu janmalēnivānigā, ādi - kāraṇamu - janmasthānamu - lēnivāḍigā evaru telusukoṃdurō - -.)
(paramārtha dṛṣṭilō samasta prapaṃcamunaku ‘yōni’ - janmasthānamu kānivāḍu- eṃducētananagā : -
“mayādhyakṣēṇa prakṛtiḥ sūyatē sa carācaraṃ” (śrīmadbhagavadgīta- 9 - 10)
(bhagavaṃtuḍu tana caitanyaśaktitō - cicchaktitō - prakṛtilō pravēśiṃciyunnaṃduna atanisattāsphūrti cēta prakṛti carācararūpamaina sarvajagattunu sṛṣṭiṃcucunnadi. aṃducēta yadārthamugā cūcinayaḍala bhagavaṃtuḍu prapaṃcamunaku kāraṇamukādu - yōnikādu, janmasthānamukādu - aṃducēta “a yōniḥ” - yōni ayinavāḍukāḍu - bhagavaṃtuḍu bījamu niccuvāḍu - bījapraduḍu - prāṇamuniccuvāḍu - “bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārthasanātanaṃ |” – (śrīmadbhagavadgīta - 7 - 10)
(samastabhūtamulaku - moṭṭamodaṭi bījamu nēnu.)
“mamayōnirmahadbrahma tasmin garbhaṃ da dhāmyahaṃ |
saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavatibhārati ||” (śrīmadbhagavadgīta- 14 - 3)
(triguṇātmikayagu prakṛti - mahadbrahma - nā yōni. aṃdulō nēnu nā bījamu nuṃci garbhamunu dhariṃpacēyudunu – samasta bhūtamulu dāni valana – dānilō nuṃḍi - puṭṭucunnavi. )
“sarva yōniṣi kauṃtēya, mūrtayaḥ saṃbhavaṃtiyāḥ |
tāsāṃ brahma mahadbrahma mahadyōni rahaṃ bījaḥ pradaḥ pitā ||“. (śrīmadbhagavadgīta- 14 - 4)
(anēka yōnulayaṃdu anēkarūpamulu - mūrtulu - puṭṭucunnavi. vāṭiki anniṃṭiki mahadbrahma - prakṛti - mahadyōni - mūla yōni. ādiyōni.vāṭiki nēnu bījamu niccuvāḍanu, aṃducata vāṭi anniṃṭiki taṃḍri - lōkapitā, prakṛti lōkamāta -) -
“jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau” - (jagattunaku talidaṃḍru laina pārvatīparamēśvaralu guṟiṃci namaskariṃcucunnānu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.