(చిత్తైకాగ్ర్యము లేనివాడు, మనో నిగ్రహములేనివాడు.)
(మనస్సులో ఏవిధమైన కోరికలు లేకుండునట్లుచేసుకొనలేనివాడు, మనో నిగ్రహము లేనివాడు.)
యోగయుక్తుడు కానివాడు, సమాహితమైన చిత్తము లేనివాడు.
“ఆత్మ వ్యతిరిక్తఫలేషు చపలః; ఆత్మావలోకన విముఖః.” (శ్రీరామానుజః)
(పరమాత్మయందు మనోనిలకడలేక ఆత్మగానివస్తువులందు - అనాత్మవస్తువులందు మనస్సుకలవాడు.)
(శాస్త్రములలో ఈ కర్మలు చేయవలసినవి అని విధించబడిన కర్మలను చేయుటకు అధికారికానివాడు.) -
శాస్త్రీయ కర్మా యోగ్యః.
బహిర్ముఖః. (మనసులో పరమాత్మ గుఱించి ధ్యానము చేయక బాహ్యవిషయములందు ఆసక్తికలవాడు - మనస్సును బహిర్ముఖముగా చేయువాడు.)
ఇంద్రియనిగ్రహము లేనివాడు.
“యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం |
అయుక్తః కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 5 - 12)
“శృణు ఈశా యైవ కర్మాణి సైతాని చ ఫలాయమే |
ఇత్యభిప్రాయవాన్ యుక్తః, త్యక్త్వా కర్మ ఫలం సుధీః |
కుర్వన్ కార్మాణి మోక్షాఖ్యాం శాంతి మాప్నోతి నైష్ఠికీం |
జాతాసా నైష్ఠికీ శాంతిః మోక్షరూప సతామి యాత్ |
యస్త్వయుక్త్వోస్తి పూర్వ స్మాత్ విపరీతః సకామతః |
పృవృత్యా మేఫలా యేదం కరోదీంతి ఫలేప్సుకః |
కర్మ భిర్నితరాం బంధం సంసారాఖ్యం ప్రయాత్నసౌ |
దేహాభిమాన సామ్యేపి కృతం భగవదర్పణం |
కర్మ శ్రౌతం తదా స్మార్తం లౌకికం చ ముముక్షుభిః |
చిత్త శుద్ధ్యాత్మ వైరాగ్య జ్ఞానద్వారా విముక్తి దం |
తదేవకామకారేణ కృతం సత్ఫలకామిభిః |
ధృఢబంధాయ మూఢానాం భవతీత్యాశయో హరేః ||” (గీతాభావప్రకాశము - 5 - 89 to 95)
(ఈ కర్మలన్నింటినీ నేను భగవంతునికొఱకే చేయుచున్నాను, నాకు వీటివలనఫలముకలుగుటకు కాదు- అను అభిప్రాయముకలవాడు యుక్తుడు - అట్లుకర్మఫలాపేక్షలేని బుద్ధిమంతుడగువాడు కర్మలుచేయుచున్నను, మోక్షము అను పేరుగల నైష్ఠిక శాంతిని పొందును. వివేకముతోకూడిన సన్యాస - కర్మఫలసన్యాస - జ్ఞాననిష్ఠాక్రమమువలన కలిగిన శాంతి నైష్ఠికశాంతి - అది మోక్షరూపము, అనగా, అదియే మోక్షము. పైన చెప్పినట్లు నిష్కామకర్మయోగము చేసినయుక్తుడుకంటె వేరైనవాడు (విపరీతమైనవాడు) కోరికలుగల నడవడిచేత ఈ కర్మలను నేను వాటి ఫలములను పొందవలెనను కోరిక తో చేయుచున్నాను - అను అభిప్రాయముతో కర్మలుచేయువాడు సంసారమను బంధమును పొందును – సంసారములో పడి, పుట్టుచు, చనిపోవుచు మోక్షము పొందలేకయుండును, ఒకేకర్మ కొందఱికి మోక్షము నిచ్చునదియు, మఱికొందఱికి సంసారములో పడవేసి బంధము కలుగచేయుట ఎందుచేతననగా - శ్రౌతకర్మకాని, స్మార్తకర్మగాని, లౌకికకర్మగాని ముముక్షువులు భగవదర్పణగా చేసినయడల. యుక్తులైనందున, నిష్కామకర్మయోగులైనందువలన, చిత్తశుద్ధికలుగుట ద్వారా వైరాగ్య జ్ఞానము కలిగియుండుట చేత సంసారమునుండి విముక్తులగుదురు, ఆ కర్మలే కోరికలు గలిగిచేయుటవలన మూఢులకు గట్టి బంధమునకు కారణములగుచు, మరల మరల సంసారములో పడవేసి - బంధించి - త్రిప్పుచుండును. ఆ కర్మలఫలమనుభవించుటకు మరలమరల జన్మములను పొందునట్లు చేయును.)
న చాభావయతః శాంతిః, అశాంతస్యకుతః సుఖం ||” (శ్రీమద్భగవద్గీత- 2 - 66)
“పుంసోహ్యజిత చిత్తస్య బుద్ధిర్వేదాంత వాక్యజా |
నోత్పద్యతే (అ) స్య తద్బుద్ధిరభాలే నాస్యేవభావనా ||“.
నిధి ధ్యాసన రూపాయా శాంతిహర్తుః స్థిరాత్మకా |
నిధి ధ్యాసన శూన్యస్య నాస్త్య విద్యా వరిక్షయః |
సాక్షాత్కారః పరాత్మైక్య తత్వస్యానంద కారణం |
తత్సాక్షాత్కార శూన్యస్య మోక్షానందః కుతో భవేత్ || (గీతాభావప్రకాశము - 2 - 626 to 629)
(యుక్తుడుకానివానికి - అనగా, నిష్కామకర్మయోగము చేయనివానికి - వేదాంత వాక్యములవలన కలుగు జ్ఞానము - ఉపనిషత్తులవలన కలుగు బ్రహ్మజ్ఞానము కలుగకుండుటచేత నిధిధ్యాసనరూపమైన శాంతికి కారణమైనదిన్నీ - శాంతిని కలుగచేయునదిన్నీ - అగు భావన కలుగును. నిధిధ్యాసనరూపమగు భావనలేనివానికి అవిద్య నశింపదు. ఈ అవిద్య నశింపకపోయిన పరమాత్మ ఒకటే అను తత్వజ్ఞానమువలన కలుగు ఆనందమునకు కారణమైనది పరమాత్మ సాక్షాత్కారము కలుగదు. అట్టి సాక్షాత్కారములేని వానికి మోక్షానందమెట్లు కలుగును - కలుగదు అని అర్థము.)
(cittaikāgryamu lēnivāḍu, manō nigrahamulēnivāḍu.)
(manassulō ēvidhamaina kōrikalu lēkuṃḍunaṭlucēsukonalēnivāḍu, manō nigrahamu lēnivāḍu.)
yōgayuktuḍu kānivāḍu, samāhitamaina cittamu lēnivāḍu.
“ātma vyatiriktaphalēṣu capalaḥ; ātmāvalōkana vimukhaḥ.” (śrīrāmānujaḥ)
(paramātmayaṃdu manōnilakaḍalēka ātmagānivastuvulaṃdu - anātmavastuvulaṃdu manassukalavāḍu.)
(śāstramulalō ī karmalu cēyavalasinavi ani vidhiṃcabaḍina karmalanu cēyuṭaku adhikārikānivāḍu.) -
śāstrīya karmā yōgyaḥ.
bahirmukhaḥ. (manasulō paramātma guṟiṃci dhyānamu cēyaka bāhyaviṣayamulaṃdu āsaktikalavāḍu - manassunu bahirmukhamugā cēyuvāḍu.)
iṃdriyanigrahamu lēnivāḍu.
“yuktaḥ karmaphalaṃ tyaktvā śāṃtimāpnōti naiṣṭhikīṃ |
ayuktaḥ kāmakārēṇa phalēsaktō nibadhyatē ||” (śrīmadbhagavadgīta - 5 - 12)
“śṛṇu īśā yaiva karmāṇi saitāni ca phalāyamē |
ityabhiprāyavān yuktaḥ, tyaktvā karma phalaṃ sudhīḥ |
kurvan kārmāṇi mōkṣākhyāṃ śāṃti māpnōti naiṣṭhikīṃ |
jātāsā naiṣṭhikī śāṃtiḥ mōkṣarūpa satāmi yāt |
yastvayuktvōsti pūrva smāt viparītaḥ sakāmataḥ |
pṛvṛtyā mēphalā yēdaṃ karōdīṃti phalēpsukaḥ |
karma bhirnitarāṃ baṃdhaṃ saṃsārākhyaṃ prayātnasau |
dēhābhimāna sāmyēpi kṛtaṃ bhagavadarpaṇaṃ |
karma śrautaṃ tadā smārtaṃ laukikaṃ ca mumukṣubhiḥ |
citta śuddhyātma vairāgya jñānadvārā vimukti daṃ |
tadēvakāmakārēṇa kṛtaṃ satphalakāmibhiḥ |
dhṛḍhabaṃdhāya mūḍhānāṃ bhavatītyāśayō harēḥ ||” (gītābhāvaprakāśamu - 5 - 89 to 95)
(ī karmalanniṃṭinī nēnu bhagavaṃtunikoṟakē cēyucunnānu, nāku vīṭivalanaphalamukaluguṭaku kādu- anu abhiprāyamukalavāḍu yuktuḍu - aṭlukarmaphalāpēkṣalēni buddhimaṃtuḍaguvāḍu karmalucēyucunnanu, mōkṣamu anu pērugala naiṣṭhika śāṃtini poṃdunu. vivēkamutōkūḍina sanyāsa - karmaphalasanyāsa - jñānaniṣṭhākramamuvalana kaligina śāṃti naiṣṭhikaśāṃti - adi mōkṣarūpamu, anagā, adiyē mōkṣamu. paina ceppinaṭlu niṣkāmakarmayōgamu cēsinayuktuḍukaṃṭe vērainavāḍu (viparītamainavāḍu) kōrikalugala naḍavaḍicēta ī karmalanu nēnu vāṭi phalamulanu poṃdavalenanu kōrika tō cēyucunnānu - anu abhiprāyamutō karmalucēyuvāḍu saṃsāramanu baṃdhamunu poṃdunu – saṃsāramulō paḍi, puṭṭucu, canipōvucu mōkṣamu poṃdalēkayuṃḍunu, okēkarma koṃdaṟiki mōkṣamu niccunadiyu, maṟikoṃdaṟiki saṃsāramulō paḍavēsi baṃdhamu kalugacēyuṭa eṃducētananagā - śrautakarmakāni, smārtakarmagāni, laukikakarmagāni mumukṣuvulu bhagavadarpaṇagā cēsinayaḍala. yuktulainaṃduna, niṣkāmakarmayōgulainaṃduvalana, cittaśuddhikaluguṭa dvārā vairāgya jñānamu kaligiyuṃḍuṭa cēta saṃsāramunuṃḍi vimuktulaguduru, ā karmalē kōrikalu galigicēyuṭavalana mūḍhulaku gaṭṭi baṃdhamunaku kāraṇamulagucu, marala marala saṃsāramulō paḍavēsi - baṃdhiṃci - trippucuṃḍunu. ā karmalaphalamanubhaviṃcuṭaku maralamarala janmamulanu poṃdunaṭlu cēyunu.)
na cābhāvayataḥ śāṃtiḥ, aśāṃtasyakutaḥ sukhaṃ ||” (śrīmadbhagavadgīta- 2 - 66)
“puṃsōhyajita cittasya buddhirvēdāṃta vākyajā |
nōtpadyatē (a) sya tadbuddhirabhālē nāsyēvabhāvanā ||“.
nidhi dhyāsana rūpāyā śāṃtihartuḥ sthirātmakā |
nidhi dhyāsana śūnyasya nāstya vidyā varikṣayaḥ |
sākṣātkāraḥ parātmaikya tatvasyānaṃda kāraṇaṃ |
tatsākṣātkāra śūnyasya mōkṣānaṃdaḥ kutō bhavēt || (gītābhāvaprakāśamu - 2 - 626 to 629)
(yuktuḍukānivāniki - anagā, niṣkāmakarmayōgamu cēyanivāniki - vēdāṃta vākyamulavalana kalugu jñānamu - upaniṣattulavalana kalugu brahmajñānamu kalugakuṃḍuṭacēta nidhidhyāsanarūpamaina śāṃtiki kāraṇamainadinnī - śāṃtini kalugacēyunadinnī - agu bhāvana kalugunu. nidhidhyāsanarūpamagu bhāvanalēnivāniki avidya naśiṃpadu. ī avidya naśiṃpakapōyina paramātma okaṭē anu tatvajñānamuvalana kalugu ānaṃdamunaku kāraṇamainadi paramātma sākṣātkāramu kalugadu. aṭṭi sākṣātkāramulēni vāniki mōkṣānaṃdameṭlu kalugunu - kalugadu ani arthamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.