← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆచారము ācāramu

Original — తెలుగు
  1. ప్రవర్తనము; ఆచరణము; నడచుకొనుట.

  2. యధా శాస్త్రాచరణం; యధోక్తాచరణం. (శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆచరించుట).

  3. శ్రౌత, స్మార్త, కర్మానుష్ఠానం.

(శ్రుతిలోను, స్మృతులలోను - వేదములోను, పురాణములలోను చెప్పిన కర్మలననుసష్టించుట

  1. సత్కర్మానుష్ఠానం.

(సత్కర్మలను, మంచి పనులను - ధర్మముననుసరించి చేయు పనులను అనుష్ఠించుట - చేయుట).

  1. ధర్మ బుద్ధ్యనుష్ఠానం

(ధర్మబుద్ధిలో కర్మానుష్ఠానము చేయుట).

  1. స్నానాచమన సంధ్యా వందనాది శాస్త్ర విహిత వ్యవహారం -

(స్నానము, ఆచమనము, సంధ్యావందనము మొదల్గువాటిని, శాస్త్రములో చెప్పినవాటిని అచరణలో పెట్టుట, ఆచరించుట).

ఆచారో ద్వివిధః ప్రోక్తః శాస్త్రీయో లౌకికస్తథా |

ఉభావపి ప్రకర్తద్యౌ, న త్యాజ్యౌ శుభమిచ్చుతా |

గ్రామ ధర్మాః, జాతి ధర్మాః దేశ ధర్మాః కులోద్భవాః |

పరిగ్రాహ్యాః నృభిస్సర్వే - - - ||“. (దేవీ భాగవతం)

(ఆచారము అనునది రెండు విధములు : - శాస్త్రములో చెప్పబడినవి, లోకములో లోకులచే అనుష్ఠింపబడుచున్నది. శుభమును కోరువారు ఈ రెండింటిని పాటింపవలెను - గ్రామమునకు సంబంధించినవి, జాతికి సంబంధించినవి, దేశమునకు సంబంధించినవి, కులమునకు సంబంధించినవి - ఇవి అన్నింటిని పరిగ్రహించి ఆచరించవలసినదే).

“ఆచారః ప్రథమో ధర్మః ధర్మప్రభురీశ్వరః |

ఇత్యుక్తం సర్వ శాస్త్రేషు సదాచారఫలం మహత్ ||“. (దేవీభాగవతము)

(ధర్మములో మొదటిది ఆచారము - ఆచారము ధర్మమువలెనే ఆచరింపవలసినది. ధర్మములకు ప్రభువు భగవంతుడు. సమస్త శాస్త్రములు ఈ విషయమును చెప్పుచున్నవి. సదాచారముననుష్ఠించుటవలన కలుగు ఫలము చాలగొప్పది).

  1. “సదాచారేణ సిద్ధేచ్చ ఐహికాముష్మికం సుఖం |” (దేవీ భాగవతం)

(సదాచారము ననుష్ఠించుటవలన - ఇహలోక సుఖమున్నూ, పరలోక సుఖమున్నూ పొందవచ్చును).

  1. “శౌచాహార విహీనస్య సమస్తా నిష్ఫలాక్రియాః”

(శుచి శుభ్రతతోకూడిన ఆచారములేనివాని పనులు నిష్ఫలములు).

  1. “ఆచారవిహీనం న పునంతి వేదాః”

(ఆచారము లేనివానిని వేదములు కూడా పునీతునిగా చేయలేవు, - పవిత్రునిగా చేయలేవు - ఆచారము లేనివాడు అపవిత్రుడు, వానిని పవిత్రునిగా చేయుటకు వేదములో ఏ మార్గము చెప్పబడియుండలేదు).

“యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః |

స యత్ప్రమాణం కురుతేలోకస్తదనువర్తతే ||“. (శ్రీమద్భగవద్గీత- 3 - 21)

(శ్రేష్టుడైనవాడు దేనిని ఆచరించునో ఇతరులు దానినే చేయుదురు. శ్రేష్టుడు దేనిని ప్రమాణముగా చేసుకొని ఆచరించునో లోకులు దానినే ప్రమాణముగా తీసుకొని ఆచరించెదరు).

  1. ఒకరు మంచిదని చెప్పినదానికంటె, ఒకరు చేసి మంచిది అని చెప్పుట యందు ఎక్కువ నమ్మకము కలుగును. కనుక అది తెలిసినవారు దానినే ఆచరింతురు - (Do not do as I say, but do as I do).
Transliteration
  1. pravartanamu; ācaraṇamu; naḍacukonuṭa.

  2. yadhā śāstrācaraṇaṃ; yadhōktācaraṇaṃ. (śāstramulō ceppina prakāramu ācariṃcuṭa).

  3. śrauta, smārta, karmānuṣṭhānaṃ.

(śrutilōnu, smṛtulalōnu - vēdamulōnu, purāṇamulalōnu ceppina karmalananusaṣṭiṃcuṭa

  1. satkarmānuṣṭhānaṃ.

(satkarmalanu, maṃci panulanu - dharmamunanusariṃci cēyu panulanu anuṣṭhiṃcuṭa - cēyuṭa).

  1. dharma buddhyanuṣṭhānaṃ

(dharmabuddhilō karmānuṣṭhānamu cēyuṭa).

  1. snānācamana saṃdhyā vaṃdanādi śāstra vihita vyavahāraṃ -

(snānamu, ācamanamu, saṃdhyāvaṃdanamu modalguvāṭini, śāstramulō ceppinavāṭini acaraṇalō peṭṭuṭa, ācariṃcuṭa).

ācārō dvividhaḥ prōktaḥ śāstrīyō laukikastathā |

ubhāvapi prakartadyau, na tyājyau śubhamiccutā |

grāma dharmāḥ, jāti dharmāḥ dēśa dharmāḥ kulōdbhavāḥ |

parigrāhyāḥ nṛbhissarvē - - - ||“. (dēvī bhāgavataṃ)

(ācāramu anunadi reṃḍu vidhamulu : - śāstramulō ceppabaḍinavi, lōkamulō lōkulacē anuṣṭhiṃpabaḍucunnadi. śubhamunu kōruvāru ī reṃḍiṃṭini pāṭiṃpavalenu - grāmamunaku saṃbaṃdhiṃcinavi, jātiki saṃbaṃdhiṃcinavi, dēśamunaku saṃbaṃdhiṃcinavi, kulamunaku saṃbaṃdhiṃcinavi - ivi anniṃṭini parigrahiṃci ācariṃcavalasinadē).

“ācāraḥ prathamō dharmaḥ dharmaprabhurīśvaraḥ |

ityuktaṃ sarva śāstrēṣu sadācāraphalaṃ mahat ||“. (dēvībhāgavatamu)

(dharmamulō modaṭidi ācāramu - ācāramu dharmamuvalenē ācariṃpavalasinadi. dharmamulaku prabhuvu bhagavaṃtuḍu. samasta śāstramulu ī viṣayamunu ceppucunnavi. sadācāramunanuṣṭhiṃcuṭavalana kalugu phalamu cālagoppadi).

  1. “sadācārēṇa siddhēcca aihikāmuṣmikaṃ sukhaṃ |” (dēvī bhāgavataṃ)

(sadācāramu nanuṣṭhiṃcuṭavalana - ihalōka sukhamunnū, paralōka sukhamunnū poṃdavaccunu).

  1. “śaucāhāra vihīnasya samastā niṣphalākriyāḥ”

(śuci śubhratatōkūḍina ācāramulēnivāni panulu niṣphalamulu).

  1. “ācāravihīnaṃ na punaṃti vēdāḥ”

(ācāramu lēnivānini vēdamulu kūḍā punītunigā cēyalēvu, - pavitrunigā cēyalēvu - ācāramu lēnivāḍu apavitruḍu, vānini pavitrunigā cēyuṭaku vēdamulō ē mārgamu ceppabaḍiyuṃḍalēdu).

“yadyadācarati śrēṣṭaḥ tattadēvētarō janaḥ |

sa yatpramāṇaṃ kurutēlōkastadanuvartatē ||“. (śrīmadbhagavadgīta- 3 - 21)

(śrēṣṭuḍainavāḍu dēnini ācariṃcunō itarulu dāninē cēyuduru. śrēṣṭuḍu dēnini pramāṇamugā cēsukoni ācariṃcunō lōkulu dāninē pramāṇamugā tīsukoni ācariṃcedaru).

  1. okaru maṃcidani ceppinadānikaṃṭe, okaru cēsi maṃcidi ani ceppuṭa yaṃdu ekkuva nammakamu kalugunu. kanuka adi telisinavāru dāninē ācariṃturu - (Do not do as I say, but do as I do).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.