← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆధారాధేయ సంబంధము ādhārādhēya saṃbaṃdhamu

Original — తెలుగు
  1. ఒకదానిపై నుంచతగినది, అధేయము; అదియుండుటకు స్థానమైనది ఆధారము - ఈ రెండిటికినీ కలసంబంధము ఆధారాధేయసంబంధము - భూమిమీద మనుషులు నిలుచున్నారు గనుక భూమీఅధారము, మనుషులు ఆధేయము -.

  2. శక్తికిని ఆశక్తిగలవస్తువునకుగల సంబంధము - ప్రపంచమునకు భగవంతుడు ఆధారము, ప్రపంచము ఆధేయము –

“మత్స్థాని సర్వభూతాని” (శ్రీమద్భగవద్గీత - 9 - 4)

(భూతములన్నియు నాయందున్నవి - వాటికి నేను ఆధారము).

  1. “ఆధారాధేయ భావం శ్రీభగవానాహ సర్వగః |

దృష్టాంతేన ప్రభోదార్థమత్య సంశ్లిష్టయో రపి |

యథాసంగ స్వభావోపి మహాంశ్చ పరిమాణతః |

ఈ దృశోపి న వై వ్యోమ్నాసహ సంసృజ్యతేకథా |

తధైవా సంగ చిద్రూపస్వభావే మ యి సర్వగే |

సంశ్లేషమంతరేణైవ సర్వగాని మహాంత్యపి |

ఆకాసాదీని భూతాని స్థితానీత్యవధారయ ||“. (గీతాభావప్రకాశము - 9 - 47 to 57)

(స్వభావముచేత దేనిని అంటనిదైనను, చంచలస్వభావము గలదైనను, చాలా పెద్దది అయినను వాయువు ఆకాశమును అంటకుండ ఉన్నది. ఆ ప్రకారముగానే అసంగుడు - దేనిని అంటనివాడు - వ్యాపించియున్నవాడు చిద్రూపుడు అయిన భగవంతునిలో ఆకాశము మొదలగు భూతములన్నియు అంటకుండగనే ఉన్నవి. భగవంతుడు ఆధారము ఆకాశము మొదలగు భూతములు అధేయములు, దేనిని అంటని భగవంతుని ఆధారముగా చేసుకొనియున్నవి. అవి ఉండుటకు ఆధారమగు వస్తువు భగవంతుడు - అధేయమునకు కలుగు మార్పులు ఆధారమునకు కలుగవు - అధేయములైన ఆకాశము మొదలగు భూతములకు కలుగు మార్పులు వాటి ఆధారమునకు కలుగవు).

Transliteration
  1. okadānipai nuṃcataginadi, adhēyamu; adiyuṃḍuṭaku sthānamainadi ādhāramu - ī reṃḍiṭikinī kalasaṃbaṃdhamu ādhārādhēyasaṃbaṃdhamu - bhūmimīda manuṣulu nilucunnāru ganuka bhūmīadhāramu, manuṣulu ādhēyamu -.

  2. śaktikini āśaktigalavastuvunakugala saṃbaṃdhamu - prapaṃcamunaku bhagavaṃtuḍu ādhāramu, prapaṃcamu ādhēyamu –

“matsthāni sarvabhūtāni” (śrīmadbhagavadgīta - 9 - 4)

(bhūtamulanniyu nāyaṃdunnavi - vāṭiki nēnu ādhāramu).

  1. “ādhārādhēya bhāvaṃ śrībhagavānāha sarvagaḥ |

dṛṣṭāṃtēna prabhōdārthamatya saṃśliṣṭayō rapi |

yathāsaṃga svabhāvōpi mahāṃśca parimāṇataḥ |

ī dṛśōpi na vai vyōmnāsaha saṃsṛjyatēkathā |

tadhaivā saṃga cidrūpasvabhāvē ma yi sarvagē |

saṃślēṣamaṃtarēṇaiva sarvagāni mahāṃtyapi |

ākāsādīni bhūtāni sthitānītyavadhāraya ||“. (gītābhāvaprakāśamu - 9 - 47 to 57)

(svabhāvamucēta dēnini aṃṭanidainanu, caṃcalasvabhāvamu galadainanu, cālā peddadi ayinanu vāyuvu ākāśamunu aṃṭakuṃḍa unnadi. ā prakāramugānē asaṃguḍu - dēnini aṃṭanivāḍu - vyāpiṃciyunnavāḍu cidrūpuḍu ayina bhagavaṃtunilō ākāśamu modalagu bhūtamulanniyu aṃṭakuṃḍaganē unnavi. bhagavaṃtuḍu ādhāramu ākāśamu modalagu bhūtamulu adhēyamulu, dēnini aṃṭani bhagavaṃtuni ādhāramugā cēsukoniyunnavi. avi uṃḍuṭaku ādhāramagu vastuvu bhagavaṃtuḍu - adhēyamunaku kalugu mārpulu ādhāramunaku kalugavu - adhēyamulaina ākāśamu modalagu bhūtamulaku kalugu mārpulu vāṭi ādhāramunaku kalugavu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.