(కారణానికి కారణము. ఈ సృష్టిలోని ప్రతివస్తువు ఇంకొక వస్తువులోనుండి పుట్టినదే. ముందు వస్తువుతర్వాత వస్తువునకు కారణము. ఆ కారణవస్తువునకు దాని ముందు వస్తువు కారణము. ఈ ప్రకారముగా ఒకదానికొకటి కారణము - ఒకకారణమునకు ఇంకొకటి కారణము - ఇట్లు వెనుకకు వెనుకకు వెళ్ళగా మొట్ట మొదట పుట్టిన వస్తువునకు కారణము భగవంతుడు - అంతవరకు ఉన్నకారణములన్నింటికి కారణమయినవాడు, అందుచేత కారణ కారణము, మూలకారణము, ఆదికారణము - ఆదిబీజము).
(ఆది అనగా ప్రకృతి - ప్రథమం కృతం - బీజము అనగా పురుషుడు - ఈ రెండునూ తానే అయినవాడు. ప్రకృతి పురుషుడు తానే అయినవాడు.
ప్రకృతి పురుష సం యోగము వలననే సృష్టి జరుగుచున్నది.
“అహం బీజ ప్రదః పితా” (గీత - 14 - 4)
సృష్టిప్రారంభములోనే కాక. తర్వాత ఇప్పటివరకు ఇప్పటివరకు పుట్టిన ప్రతివస్తువునకు యోని ప్రకృతి, బీజము పరమ పురుషుడు - ప్రతి వస్తువులోను ప్రకృతి అంశ, భగవదంశ ఉన్నది - అందుచేత అన్ని వస్తువులకు మొదటి బీజము పరమాత్మయే).
(kāraṇāniki kāraṇamu. ī sṛṣṭilōni prativastuvu iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadē. muṃdu vastuvutarvāta vastuvunaku kāraṇamu. ā kāraṇavastuvunaku dāni muṃdu vastuvu kāraṇamu. ī prakāramugā okadānikokaṭi kāraṇamu - okakāraṇamunaku iṃkokaṭi kāraṇamu - iṭlu venukaku venukaku veḷḷagā moṭṭa modaṭa puṭṭina vastuvunaku kāraṇamu bhagavaṃtuḍu - aṃtavaraku unnakāraṇamulanniṃṭiki kāraṇamayinavāḍu, aṃducēta kāraṇa kāraṇamu, mūlakāraṇamu, ādikāraṇamu - ādibījamu).
(ādi anagā prakṛti - prathamaṃ kṛtaṃ - bījamu anagā puruṣuḍu - ī reṃḍunū tānē ayinavāḍu. prakṛti puruṣuḍu tānē ayinavāḍu.
prakṛti puruṣa saṃ yōgamu valananē sṛṣṭi jarugucunnadi.
“ahaṃ bīja pradaḥ pitā” (gīta - 14 - 4)
sṛṣṭiprāraṃbhamulōnē kāka. tarvāta ippaṭivaraku ippaṭivaraku puṭṭina prativastuvunaku yōni prakṛti, bījamu parama puruṣuḍu - prati vastuvulōnu prakṛti aṃśa, bhagavadaṃśa unnadi - aṃducēta anni vastuvulaku modaṭi bījamu paramātmayē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.